Monday, 3 March 2025

చెబుతారు కానీ చేయరు

*వారు చెప్పుదురే గాని చేయరు. మత్తయి-23:3*
"""""""""""""""""""""""""""

💠 *చర్చ్ లో ఫోన్ వాడొద్దంటారుకాని*
-ఎన్నడు పాటించరు.

💠 *తల్లిదండ్రులను గౌరవించాలంటారుకాని*
    -వారినసలు పట్టించుకోరు.

💠 *ప్రతిదినం ప్రార్దించాలంటారుకాని*
    - వారెన్నడు ప్రార్దించరు

💠 *దొంగతనం చేయొద్దంటారుకాని*
    -దేవునిసొమ్ము,ప్రజల సొమ్ము దొంగిలిస్తారు

💠 *ప్రతిదినం బైబిల్ చదవాలంటారుకాని*
   -వారెన్నడు చదవరు

💠 *మారుమనస్సు పొందాలంటారుకాని*
   -వారికే మారుమనస్సుండదు.
 
💠 *వేషాదరణ కలిగి ఉండకూడదంటారుకానీ*     
   -వారే వేషదారులై వుంటారు

💠 *సేవకులను గౌరవించాలంటారుకాని*
   -సేవకులనందరిని విమర్శిస్తారు. 

💠 *డబ్బు,అదికారం కోసం ప్రాకులాడద్దంటారుకాని*
    -నిత్యం దానికోసమే ప్రాకులాడుతారు.

💠 *స్టైల్ చేయొద్దంటారుకాని*
   -స్టైల్ గా ఉండడానికే ప్రయాసపడుతారు.

💠 *కులం,వాస్తు,ముహూర్తంచూడొద్దంటారుకాని*
    -వాటి పిచ్చితోనే నిండివుంటారు.

💠 *అన్య ఆచారాలు పాటించొద్దంటారుకాని*
  -అన్ని వారే పాటిస్తారు.

💠 *ఉపవాసాలుండాలంటారుకాని*
  -వారెన్నడుండరు.

💠 *వ్యభిచారం చేయొద్దంటారుకాని*
   -మోహపుచూపులతోనే నిండివుంటారు.

💠 *ఆడంబరంగా జీవించవద్దంటారుకాని*
   -ఆడంబరాలతోనేజీవిస్తారు.
 
💠 *ఐఖ్యంగా వుండాలంటారుకాని*
   -ఐఖ్యతకు ఎన్నడు సహకరించరు.

💠 *సమయపాలన పాటించాలంటారు కాని*
    - వారెన్నడు పాటించరు.

💠 *అందరిని సమానంగా చూడాలంటారు కాని*
  -దనవంతులకే పెద్దపీఠ వేస్తారు.

💠 *అందరిని క్షమించాలంటారు కాని*
   - ఎవ్వరిని క్షమించరు

💠 *సాక్ష్యం కాపాడుకోవాలంటారు కాని*
   -వారికెక్కడ సాక్ష్యంవుండదు.

💠 *సువార్త ప్రకటించాలంటారు కాని*
   -అవకాశమున్న ప్రకటించరు.

💠 *అసూయ పడకూడదంటారు కాని*
    - ఇతరుల ఎదుగుదలను చూసి ఓర్వరు.

💠 *స్వార్దముండకూడదంటారు కాని*
   -లాభంలేకుండా ఏపని చేయరు.

💠 *మనుష్యుల పై రూపం చూడద్దంటారు కాని*
   -పై రూపాన్ని బట్టే విలువిస్తారు.

💠 *ఇతరులగురించి చెడుగా మాట్లాడద్దంటారు కాని*
    -అందరిని దూశిస్తారు.

💠 *సినిమాలు,సీరియల్లు చూడొద్దంటారు కాని*
   -ఒక్కరోజు మిస్ కాకుండా చూస్తారు.

💠 *గొడవలు పెట్టుకోవద్దంటారు కాని*
  -అంతటా,అందరితో గొడవలే.

💠 *వాట్సప్,ఫేస్ బుక్,నెట్ వాడొద్దంటారుకాని*
   -నిత్యం వాటిలోనే లీనమైవుంటారు.


ఇంకా..
*దశమభాగం,పరిశుద్దత,లోకాశలు,గర్వం,లంచం,నీతి,న్యాయం,ధర్మం.....* అనేక విషయాల గూర్చి భోదిస్తారుకాని ఏది పాటించరు.
         
    *ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా?*
         రోమా 2:21
   
*.... ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి, దానిని లోపరచుకొనుచున్నాను.*
         మొదటి కొరింథీ9:27

Thursday, 30 January 2025

శోధన

*శోధన*

*A. శోధన అంటే ఏంటి ?*
జ ) 1. పాపము చేసే విధంగా జరిగే ప్రేరణ 
2. దైవ నియమం నుండి తప్పించబడుటకు జరిగే ప్రేరణ 

*B. 1.) శోధన ఎలా వస్తుంది?*
జ ) దురాశ వలన

*B. 2)దురాశ కు కేంద్రం ఏమిటి?*
జ ) 1.శరీరాశ 
2. నేత్రాశ 
3. జీవపుడంభం 

*C. శోధన ఎందుకోసం అనుమతించబడుతుంది?*
జ ) విశ్వాసం పరీక్షించబడుటకు

*D. శోధనలో పడకుండా ఉండాలంటే?*
జ ) మెలకువగా ఉండి ప్రార్ధన చేయాలి

*E. శోధన లో నిలబడితే?*
జ ) 1.ధన్యుడవు
2. ఓర్పు వస్తుంది
3. పాపము లేనివానిగా ఉంటావు
4. జీవ కిరీటం 
5. దేవుని సహవాసం 

*F. శోధనలు వస్తుంటే ఏమి చేయాలి?*
జ ) 1. మహానందం అని ఎంచుకోవాలి 
2. తప్పించుకొను జ్ఞానం కొరకు దేవుని అడగాలి 

*G. శోధన కు లోనైతే?*
జ ) 1. మనస్సాక్షి దోషరోపణ 
2. శ్రమ 
3. వేదన 
4. భయం
5. పాపము 
6. దేవునికి దూరం
7. జీవం కోల్పోవడం 
8. తీర్పు 
9. మరణము 

*H. శోధన సహించి నిలిచిన నరుడు ఎవరు?*
జ ) యేసుక్రీస్తు మనవలేనే అన్ని విషయాల్లో శోధించబడినను పాపము లేని వాడిగా ఉండెను.

—————
*వాక్య పరిశీలన కొరకు* 
యాకోబు 1: 1-15
1 యోహాను 2: 16
మార్క్ 14:38
హెబ్రీ 2:14
ఆది 3 : 1- 24 
రోమా 2 : 1- 15


Tuesday, 28 January 2025

Big bang theory

గ్యాస్ రూపంలో ఉన్న ఒక పెద్దగోళం 'దానంతట అదే' "బిగ్ బ్యాంగ్" అని అరుస్తూ భళ్లున పేలిందట!

అందులో నుంచి నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు 'వాటంతట అవే' చూడచక్కని ఆకారాల్లో బైటికొచ్చాయట!

సూర్యుడు, నక్షత్రాలు, భూమి, చంద్రుడు, ఇతర గ్రహాలు, ఉపగ్రహాలు.. ఇవన్నీ (క్రికెట్ కెప్టెన్ ఫీల్డర్లను నిలబెట్టినట్లు) 'వాటంతట అవే' తమ తమ స్థానాలకు perfect గా చేరుకున్నాయట! :)

ఆపై 'వాటంతట అవే' నియమిత కక్ష్యల్లో, నియమిత వేగంతో, ఆటబొమ్మకు కీ ఇచ్చి వదిలినట్టు తిరగసాగాయట!

భూమి సూర్యుడి చుట్టూ ఒక రౌండ్ తిరగడానికి కరెక్టుగా 365 రోజుల 5 గంటల సమయాన్ని 'తనంతట తానే' ఫిక్స్ చేసుకుందట. తనచుట్టూ తాను తిరగడానికి సుమారుga24 గంటలు ఫిక్స్ చేసుకుందట!

సముద్రాలు 'వాటంతట అవే' నీటిని తయారు చేసుకుని తమలో నింపుకున్నాయట. చేపలు, తిమింగలాలు 'వాటంతట అవే' సముద్రాల్లో పుట్టాయట!

భూమిపైన కోట్లాది రకాల చెట్లు, జంతువులు, పక్షులు 'వాటంతట అవే' అందంగా, రకరకాల ఆకారాల్లో, రకరకాల సైజుల్లో, రకరకాల అవయవాలతో 'తమంతట తామే' ఉద్భవించాయట. తమ సంతానాన్ని పెంచుకునే గర్భ వ్యవస్థలు కూడా 'తమంతట తామే' తయారయ్యాయట!

మనిషి అనే జీవరాశి కూడా ఒక అద్భుతమైన శరీరాన్ని 'తనంతట తానే' నిర్మించుకుని తలకాయ ఎక్కడుంటే బావుంటుందో, చేతులు, కాళ్లు, మిగతా అవయవాలు ఎక్కడుంటే పనిచేయడం సులభమవుతుందో 'వాటంతట అవే' డిసైడ్ చేసుకున్నాయట!

తలకాయలో మెదడు, కళ్లు, చెవులు, నోరు, ఆ నోట్లో దంతాలు, నాలుక ఎలా ఉంటే perfect design లో నిలబడతాయో 'వాటంతట అవే' స్థానాలు ఏర్పాటు చేసుకున్నాయట!

శరీరంలో గుండె 'దానంతట అదే' కొట్టుకోడం ప్రారంభమైందట. రక్తం 'దానంతట అదే' అవయవాలన్నిటికీ ప్రసరించడం మొదలైందట. కిడ్నీలు 'వాటంతట అవే' మలినాల్ని శుభ్రపర్చడం ప్రారంభించాయట. ఇలా మనిషి శరీరం 'దానంతట అదే' తయారై చక్కగా పనిచేయడం ప్రారంభించిందట!

పైన చెప్పిన Theory గురించి ఎవరికి ఎలాంటి అభిప్రాయం ఉందో తెలీదు గానీ.. 
నాకుమాత్రం "Most illogical and Unscientific theory" అనిపిస్తుంది. 

"హేతువాదం" అంటే, ఏదైనా ఒక విషయానికి సంబంధించిన హేతువు (మూలకారణం) ను కనుక్కోవడం. మరి విశ్వం ఆవిర్భావం వెనక హేతువు ఏంటి?

ఈ విశ్వంలోని వ్యవస్థ ఎలా ఉనికిలోకి వచ్చిందనే విషయాన్ని మనం Science ద్వారా కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నాం. Theories, analysis తయారు చేస్తున్నాం. ఇందులో ఒక్కోసారి U-turn తీసుకుంటున్నాం. చివరికి అనేక పరిశోధనల తర్వాత establish చేసిన విషయాలను సత్యమని నమ్ముతున్నాం.
Yes, Science అనేది మనిషి అభివృద్ధికి సంబంధించిన అతిముఖ్యమైన అంశం.

ఇక్కడ సైన్సులో నాకు సమాధానం దొరకని ప్రశ్నలు కొన్ని ఉన్నాయ్!
ఇదంతా ఎలా జరిగిందో మనం Science ద్వారా చెప్పగలుగుతున్నాం కానీ...

"ఇదంతా ఎందుకు జరిగింది"...
"అసలెందుకు జరగాలి?", 
"ఒకవేళ జరిగినా ఇంతటి perfect design లో "ఎందుకు" జరగాలి?"
"ఇంత క్రమశిక్షణతో వ్యవస్థ "ఎందుకు" పనిచేయాలి?"
"ఈ System వెనక Designer & Governor ఎవరూ లేకుండానే, ఇవి ఇంత perfect గా Computer programing ఇచ్చినవాటిలా "ఎందుకు" పనిచేయాలి?" 

నా ప్రశ్న "How & What (ఎలా & ఏమిటి") అని కాదు... 
"Why (ఎందుకు)?"

రాజుకు స్తుతి పాడుట/నమస్కారం చేయుట

 *రాజుకు స్తుతి పాడుట/నమస్కారం చేయుట*

1 Samuel 18:8 - ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొనివారు దావీదునకు పదివేలకొలది అనియు, *నాకు* (సౌలు) వేలకొలది అనియు *స్తుతులు పాడిరే* ; రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసికొనగలడు అను కొనెను

2 Samuel 14:22 - తరువాత¸°వనుడగు అబ్షాలోమును రప్పింపుమని అతడు సెలవియ్యగా యోవాబు *సాష్టాంగ నమస్కారము చేసి రాజును స్తుతించి* రాజవగు నీవు నీ దాసుడనైన నా మనవి అంగీకరించినందున నా యేలిన వాడవగు నీవలన నేను అనుగ్రహము నొందితినని నాకు తెలిసెనని చెప్పి లేచి గెషూరునకు పోయి

2 Samuel 16:4 - అందుకు రాజు మెఫీబోషెతునకు కలిగినదంతయు నీదేయని సీబాతో చెప్పగా సీబానా యేలినవాడా రాజా, నీ దృష్టియందు నేను అనుగ్రహము పొందుదునుగాక, నేను *నీకు నమస్కారము చేయుచున్నాననెను* . 

2 Samuel 19:18 - రాజు ఎదుట నది దాటిరి; రాజు ఇంటివారిని అవతలకు దాటించుటకును రాజు దృష్టికి అనుకూలమైన దానిని చేయుటకును రేవుపడవను ఇవతలకు తెచ్చి యుండిరి. అంతట గెరా కుమారుడగు షిమీ వచ్చి రాజు యొర్దానునది దాటి పోగానే *అతనికి సాష్టాంగపడి*

1 Kings 1:16 - బత్షెబ వచ్చి *రాజు ఎదుట సాగిలపడి నమస్కారము చేయగా* రాజునీ కోరిక ఏమని అడిగి నందుకు ఆమె యీలాగు మనవి చేసెను

1 Kings 1:23 - (నాతాను ప్రవక్త) అతడు *రాజు సన్నిధికి వచ్చి నమస్కారము చేసి* *సాష్టాంగపడి* 

1 Samuel 25:23 - అబీగయీలు దావీదును కనుగొని, గార్దభముమీదనుండి త్వరగా దిగి *దావీదునకు సాష్టాంగ నమస్కారముచేసి* అతని పాదములు పట్టుకొని ఇట్లనెను

1 Samuel 24:8 - అప్పుడు దావీదు లేచి గుహలోనుండి బయలువెళ్లినా యేలినవాడా రాజా, అని సౌలు వెనుకనుండి కేక వేయగా సౌలు వెనుక చూచెను. *దావీదు నేల సాష్టాంగ పడి నమస్కారము చేసి* 

Luke 5:12 - ఆయన యొక పట్టణములో నున్నప్పుడు ఇదిగో కుష్ఠ రోగముతో నిండిన యొక మనుష్యుడుండెను. వాడు *యేసును చూచి, సాగిలపడి* ప్రభువా, నీ కిష్ట మైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనను వేడుకొనెను

Matthew 8:2 - ఇదిగో కుష్ఠరోగి వచ్చి *ఆయనకు మ్రొక్కి* ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను.

Matthew 15:25 - అయినను ఆమె వచ్చి *ఆయనకు మ్రొక్కి* ప్రభువా, నాకు సహాయము చేయుమని అడిగెను

Luke 17:16 - గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరచుచు, తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిం చుచు, *ఆయన పాదములయొద్ద సాగిలపడెను* ; వాడు సమరయుడు.

Luke 5:8 - సీమోను పేతురు అది చూచి, *యేసు మోకాళ్లయెదుట సాగిలపడి* ప్రభువా, నన్నువిడిచి పొమ్ము, నేను పాపాత్ముడ నని చెప్పెను

Mark 3:11 - అపవిత్రాత్మలు పట్టినవారు ఆయనను చూడ గానే *ఆయన యెదుట సాగిలపడి* నీవు దేవుని కుమారుడ వని చెప్పుచు కేకలువేసిరి.

Matthew 14:33 - అంతట దోనెలో నున్నవారు వచ్చినీవు నిజముగా *దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి.* 

1 Peter 2:17 - అందరిని సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, *రాజును సన్మానించుడి* .

Revelation 5:13 - అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై యున్నవానికిని *గొఱ్ఱపిల్లకును స్తోత్రమును* కలుగును గాక

Revelation 5:14 - ఆ నాలుగు జీవులుఆమేన్‌ అని చెప్పగా ఆ పెద్దలు *సాగిలపడి నమస్కారము చేసిరి* .

రాజుకు స్తుతి పాడుట,నమస్కారం చేయుట, మ్రొక్కుట ఇదంతా కూడా రాజును ఘనపరచుటే.

ఆరాధించడం కాదు అని గ్రహించండి

ఆరాధన చేయాలంటే యే నరుడు దేవుని ఆరాధించాల్సి వచ్చిన 
దేవుని ధర్మ శాస్త్రము ప్రకారం యాజకుడు మధ్య వర్తిగా ఉండాలి...

దేవుని ఆరాధించుటకు యేసుక్రీస్తు అను మరి శ్రేష్ఠమైనా యాజకుడు మనకున్నాడు..

యేసుక్రీస్తు అనే ప్రధాన యాజకుని ఆరాధించమని ఎవరు ఎక్కడ బోధించలేదు 

ఆరాధనకు పాత్రుడు మాత్రమే ఆరాధన కోరుకుంటున్నాడు అయన తండ్రీ మాత్రమే అని యేసుక్రీస్తు స్వయంగా చెప్పాడు 
యేసుక్రీస్తు మాటలను నమ్మి పాటించాలి అంతే...

John 4:23: "అయితే యథార్థముగా ఆరా ధించువారు ఆత్మతోను సత్యముతోను *తండ్రిని ఆరాధించు కాలమువచ్చుచున్నది;* అది ఇప్పుడును వచ్చేయున్నది; *తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు;*

Wednesday, 15 January 2025

హెబ్రీ పత్రిక లో క్రీస్తు గూర్చి

*హెబ్రీ పత్రిక లో క్రీస్తు గూర్చి*


1) Hebrews 1:1–5,8. Hebrews 1:1-2 (NKJV) God, who at various times and in various ways spoke in time past to the fathers by the prophets, has in these last days spoken to us by His Son, whom He has appointed heir of all things, through whom also He made the worlds; 1) హెబ్రీ. 1:1-2 పూర్వకాలమందు నానాసమయములలోను నానావిధములు గాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. Christ was not speaking to the fathers in ages past (1:1-2) *క్రీస్తు పూర్వకాలమందు పితరులతో మాట్లాడలేదు*

 2) హెబ్రీ. 1:4 (TBO) "పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్టుడై, ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను." had to become superior to angels since he previously wasn’t (1:4) *దేవదూతలకంటే శ్రేష్ఠుడాయెను..... ఇంతకుముందు కాదు*

 3) gained an inheritance of something he didn’t have a right to previously (1:4) *ఉన్నత లోకంలో ప్రవేశం సంపాదించాడు.....ఇంతకు ముందు ఈ హక్కు లేనివాడై యుండెను.*

 4) will be a Son to God (1:5) *దేవుని కుమారుడాయెను.* 

5)హెబ్రీ. 1:3 (TBO) "ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వముయొక్క మూర్తిమంతమునై యుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, దేవుని కుమారుడు దూతలకంటె శ్రేష్టుడు" is a representation of God (interestingly, not God himself) (1:3) *దేవుని ప్రతిభింభం గా ( దేవుడుగా కాదు)* 

6) హెబ్రీ. 1:9 (TBO) "నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోడివారికంటే నిన్ను హెచ్చించునట్లుగా ఆనందతైలముతో అభిషేకించెను" Christ has a God (1:9) *ఆయనకు దేవుడుండెను*

5) has been anointed above his fellows (1:9) (God has no fellows) తోటి వారికంటే హెచ్చుగా ఉండుటకు అభిషేకించబడెను *( దేవునికి తోటివారు లేరు)* 

6) హెబ్రీ. 2:9 (TBO) "దేవుని కృపవలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించునట్లు, దూతలకంటె కొంచెము తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున, మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము." was made for a while lower than the angels (2:9) *దేవ దూతలకంటే కొంచెం తక్కువ వానిగా చేయబడెను*

 7) is NOW crowned with glory and honor because he died (2:9) (since he wasn’t crowned beforehand) మరణం పొందినందున ఇప్పుడు మహిమా ప్రభావాలతో కిరీటం ధరించిన వానిగా చూస్తున్నాము *( అంతకు ముందు వరకు కిరీటం ధరించలేదు)* 

8) హెబ్రీ. 2:10 (TBO) "ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవనివలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును." is the pioneer of mankind’s salvation (the first to receive salvation) (2:10) *క్రీస్తు మానవ జాతికి రక్షణకర్త అవ్వాలి అంటే మొదట తాను రక్షింపబడుటకు సంపూర్ణుడు అవ్వాలి.*

 9) calls mankind his BROTHERS (2:11) *మానవులను తన సహోదరులు అనెను* 

10) says that he will put his trust in God (2:13) *నేను ఆయనను నమ్ముకొని యుందును అని చెప్పెను* 

11) is made like his brothers in every single way (2:17) ప్రతి విషయంలో తన సహోదరులవంటి వాడుగా చేయబడెను 

12) was tempted (2:18) (God cannot be tempted) *తాను శోధించబడెను ( దేవుడు శోధింపబడడు*)

 13)హెబ్రీ. 3:4 (TBO) "ఇంటికంటె దానిని కట్టిన వాడెక్కువ ఘనత పొందినట్టు, ఈయన మోషేకంటె ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను." is now counted worthy of more glory than Moses (3:3) మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను *(సిలువ మరణము తరువాతమహిమకు అర్హునిగా ఎంచబడెను...అంతకు ముందు మరి?)*  


🙏🏼✍🏼🍀🌲🙏🏼✍🏼🌲🍀

Sunday, 17 November 2024

పరిణామ సిద్ధాంతం

🦍🚶🏾‍♂️🦍🚶🏾‍♂️🦍🚶🏾‍♂️🦍🚶🏾‍♂️🦍🚶🏽‍♂️
*_మనిషి పుట్టింది కోతికా లేక దేవునికా?? మనిషి పుట్టుకకు Darwin సిద్దాంతము సత్యమా??_*

1. ఈ పాఠం మన క్రైస్తవ విశ్వాసానికి చాల అవసరమైనదని చెప్పాలి.నేడు మనము ఉన్న ఈ శాస్త్ర ప్రపంచములలో శాస్త్రానికి ఉన్న బలము Bibleకి లేని పరిస్థితిగా ఉంది. ఎందుకంటే శాస్త్రాన్ని నమ్మే సంఖ్య ఎక్కువైనది గనుక. శాస్త్రము కంటే bible గొప్పదన్న విషయాలను సమాజానికి చెప్పేవారు లేకపోవటము వలన శాస్త్రము ఆకాశము అంత ఎత్తులో ఈ రోజు సమాజానికి కనపడుతుంది. ఎప్పటికైనా శాస్త్రము, BIBLE ముందు కిందకు దిగాల్సిందే. scientistsకు ఉండే బలము శాస్త్రము (science). ఈ శాస్త్రానికి (science)
పుట్టినిల్లు ప్రకృతి. *ఈ ప్రకృతిని శాస్త్రవేత్తలు చదివారు. అందులోనించి శాస్త్రాలను పుట్టించారు.* భూమి మీద ఉంటున్నారు కనుక భూమిని చదివి భూగోళ శాస్త్రము ( GEOGRAPHY) అను పేరు పెట్టారు, భుగర్బoని చదివి భుగర్బo శాస్త్రము(GEOLOGY) అను పేరు పెట్టారు. భూమి మీద ఉన్న చెట్లను చదివి వృక్ష శాస్త్రము( BOTONY) అను పేరు పెట్టారు.జంతువులను చదివి జంతు శాస్త్రము (ZOOLOGY),పక్షులు చదివి పక్షి శాస్త్రము(ORNITHOLOGY),పండ్లు చదివి పండ్ల శాస్త్రము (CORPOLOGY) పెట్టారు. 

2.కంటికి కనపడుతున్న వాటిని చదివారు. కనపడుతున్నాయి గనుక చదివారు. చదివి అర్థము చేసుకున్న దానికి పేరు పెట్టారు. *కంటికి కనపడే ఒక వస్తువు గురించి అలోచించి, వీళ్ళకు ఏమి అర్థము అయిందో ఆ subject ని ఒక subject గా పిలిచి దానికి ఒక పేరు పెట్టారు.* ఏ ప్రకృతి నుండి శాస్త్రము పుట్టిందో, ఆ ప్రకృతి పుట్టడానికి కారణము మన చేతిలో ఉన్న వాక్యమే. వాక్యము వలన ప్రపంచములు నిర్మాణo అయ్యాయి (హెబ్రీ 11:3). *_ప్రపంచములు (విశ్వము) దేవుని వాక్యము (మాట) వలన నిర్మాణo అయ్యాయి. కనుక వాక్యము వలన ప్రపంచము ఏర్పడితే ,ఏర్పడిన ఆ ప్రకృతిని బట్టి శాస్త్రము అను నామము పుట్టించారు మనుషులు._* శాస్త్రము ప్రకృతి మీద ఆధారపడింది. కానీ ప్రకృతి దేవుని మాట వలన కలిగింది.

3. *_మనిషి జన్మ వెనుక ఎవరు ఉన్నారు? దేవుడా? కోతినా??_*

శాస్త్రవేత్తగా పిలిచే Darwin ఒక సిద్దాంతమును సృష్టించి దాని పేరు Darwin theory అని పేరు పెట్టాడు. ఇందులో మనిషి కోతి నుండి పరిణామము (change) చెందాడు అని చెప్పాడు. *_నిజముగా darwin theory అటు శాస్త్రీయముగా and bible ప్రకారముగా తప్పుగా ఎంచబడింది._* ఇప్పుడు darwin అనగా ఎవరో, అతని చరిత్ర చూస్తే 19వ శతాబ్దము కాలములో యేసుక్రీస్తు వంశావళి అయిన యుదా గోత్రమునకు చెందినవాడు. ఇతను ఒక యుదుడు. ప్రపంచమునకు క్రొత్త విషయము తెలియజేయాలని ఆఫ్రికా కండానికి ప్రయాణించాడు. ఆఫ్రికాలో ఉన్నవారిని ,జంతువులను గమనించాడు. ఆఫ్రికా మనుషుల ఎముకలు, జంతువుల ఎముకలు సేకరించి పరిశోదించడం మొదలుపెట్టాడు. తన పరిశోదన ఫలితముగా మనిషి పుట్టుక వెనుక కోతి ఉంది అని ప్రకటించాడు. నిజముగా ఆఫ్రికాలో ఉన్న వాతావరణము పరిస్థితి వాళ్ళ మనుషుల మొహాలు, కోతుల (chimpanjee, gorilla) మొహాలు దగ్గర దగ్గరగా ఒక్కటిగా ఉండేది. *కనుక Darwin ఇలా అనుకున్నాడు. మొదట కోతిగా, తర్వాత నరకోతిగా, తర్వాత మనిషిగా మర్పుచెందాడని తలిచాడు.*

4. మనిషి వెనుక కోతి ఉంటె, మరి కోతి వెనుక ఎవరు ఉన్నారు? అని అడిగితే కోతి వెనుక కొన్ని జీవులు ఉన్నాయి అన్నాడు. ఆ జీవులు క్రమేనా change అవుతూ కోతి అయింది. ఆ కోతి కొంతకాలము పెరిగి పెరిగి ఆ ముందున్న రెండు కాళ్ళు కాస్త లేవటము మొదలయ్యి , వెనుక తోక ఊడిపోవడము మొదలు అయ్యి చివరిగా మనిషి ఇలా మరిపోయడని చెబుతున్నాడు..

🤣చాలా విడ్డురముగా ఉంది కదూ.. *మరి సృష్టి ఎలా ఏర్పడినది?* అని అడిగితే ఒక వస్తువు ప్రేలడము వలన జరిగింది అని అంటున్నాడు. ప్రేలి అందులో నుంచి ముక్కలు ముక్కలుగా అంతట విస్తరించి కాలక్రమేనా ఒక్క ముక్క sunగా, ఒక ముక్క moonగా, ఒక ముక్క భూమిగా, ఒక ముక్క జీవిగా, ప్రారంభమైనదని చెబుతున్నాడు. ఇక్కడ అద్భుతమైన సంబ్రమాచర్యాలకు గురి చేసే, శాస్త్రానికి దిమ్మ తిరిగే ప్రశ్న ఏమంటే.. *_ప్రేలే వస్తువు ముందుగా ఎక్కడ నుంచి వచ్చింది? ఎవరు సృష్టించారు??_*🤔🤣

5. పరిణమము చెందుతూ మనిషి వచ్చాడే తప్ప మొదటిలో మనిషి లేడు అని ప్రకటించాడు. ఇప్పుడు కొంత సమయము వరకు పరిణామ సిద్దంతము correct అనుకుందాము. మొదటగా *పరినామము అనగా మార్పు.* అనగా మార్పు చెందుతూ ఉండాలి. కోతి మార్పు చెందుతూ చెందుతూ మనిషిగా మారాడు అని darwin అంటున్నాడు కదా! మరీ *__మనిషి కూడా మార్పు చెందుతూ చెందుతూ ఏదో ఒక రుపములోకి పరిణామము చెందాలిగా?? మనిషి ఎందుకు మనిషి దగ్గర ఆగిపోయాడు??కోతి మనిషిగా పరిణామము చెందితే, మనిషి ఏ విధముగానో పరిణామము చెందాలిగా??._* నిజముగా మనిషి ఏదో ఒక రూపముగా మారితే అప్పుడు కోతి నుంచి వచ్చాడని నమ్మొచ్చు. *_పరిణామము మనిషి దగ్గరకు రాగానే ఎందుకు ఆగిపోయింది??_* దీనికి సమాధానం శాస్త్రం వద్ద లేదు.ఇలాంటి వన్ని తప్పుడు సిద్దంతములు.

6. దీనిని పట్టుకుని హేతువాదులు.. మనుష్యులు పుట్టింది కోతి ద్వారా అయితే మరి దేవుడెక్కడా?? అని దేవుడు లేడు అంటున్నారు.

🎊 *_సృష్టి దానంతట అదే ఏర్పడినదని అంటున్నారు._*

👉మా ఇల్లు దానంతట అదే ఏర్పడింది అని అంటారా?
👉నా bike దానంతట అదే ఇంటి ముందుకు వచ్చిందని అంటారా??
👉ప్రేలుడు వల్ల ఏర్పడుతాయా లేక కలుగుతాయా??
👉ప్రేలుడు వల్ల ఉన్నవి పోతాయా? లేక లేనివి వస్తాయా??
👉మా ఇల్లు ప్రేలుడు ద్వార ఏర్పడింది అని అంటామా??
👉Hyderabad, Delhi, Mumbai లో జరిగిన ప్రేలుడు ద్వార ఉన్నవి పోయాయా లేక లేనివి కలిగాయా??

సృష్టి ప్రేలుడు వాళ్ళ కలిగిందని విశ్వసిస్తున్నారు. పిల్లి, పులి ఒకేలాగా ఉంటాయని పులి, పిల్లి నుంచి వచ్చిందని, కుక్క, నక్క ఒకేలా ఉంటాయని కుక్క నక్క నుంచి వచ్చిందని darwin అంటున్నాడు.

7. ఇప్పుడు bibleను అడిగితే..
A. (ఆది 1:11-)
దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము మొలిపించుగాక ....... ఇక్కడ తమ తమ జాతి ప్రకారము అంటున్నాడు.

*Ex*
mango seed వేస్తే futureలో mango tree వస్తుందని, అలానే చింతపిక్క ,భోప్పాయి seeds ఇలా ఏజాతి seed వేస్తే ఆ జాతి మొక్కలే వస్తాయని మనకు తెలుసు.

B. (ఆది 1:21-)
దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము..... ఇక్కడ కూడా వాటి వాటి జాతి ప్రకారము అని అంటున్నాడు. సముద్రములో చేప కడుపునా చేపగా,తిమింగలము కడుపునా తిమింగలము గా వస్తున్నాయి.

C. (ఆది 1:25-)
దేవుడు ఆయా జాతుల ప్రకారముగా పశువులను ,అడివి జంతువులను ,నేల మీద పరాకు ప్రతి పురుగును చేసెను. Bible లో చెప్పినట్లుగా ,ఉన్నట్లుగా జరుగుతుంది . అనగా ఏ జాతి నుంచి ఆ జాతివి ఏర్పడతాయి. *_కానీ ఒక జాతి నుంచి అన్ని జాతులు ఏర్పడలేదు._* (ఆది 2:19) దేవుడైన యెహోవ ప్రతి భుజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి, ఆదాము వాటికీ ఏ పేరు పెట్టునో అని అతని యొద్దకు వాటిని రాప్పించెను. (ఆది1:26-) మనిషి నిర్మాణము రాగనే ఒక ప్రత్యేకత. సృష్టిలో ఉన్నవి అన్ని తన మాట ద్వార నిర్మిస్తే మనిషిని మాత్రమూ మట్టితో శరీర ఆకారము చేసి తన ఆత్మను ఇచ్చాడు.

8. *_ఏది పరిణామము మరి???_*

ఎవరైనా కోతి పనులు చేస్తే.. వాడిని కోతి అని తిడితే.. కోపపడుతాడు. *_అయితే ఇప్పుడు ఉన్న మనుషులంతా కోతులేనా??_* మరీ మనం చూస్తున్న కోతులు కోతులుగానే ఉన్నాయి, మనము మనముగానే ఉన్నాముగా!? కోతులు మారడము లేదు, మనమూ మారడము లేదు. *_ఏది పరిణామము మరి???_* కోతి నుంచి వచ్చాను అని ఎవడు అంటాడో.. వాడి ఇంటిలో కోతిని కట్టేయాలి. *_ఎవరైనా కోతి అని పిలిస్తే , పేరు పెడితే, కోతిని తెచ్చి ఇంట్లో పెడితే ఇష్టపడతారా???_*

ప్రపంచములో సుమారు 280 దేశాలున్నాయి. ప్రతి దేశానికి ఒక జాతీయ జంతువు పక్షి ఉంటుంది. కానీ *_ఏ దేశమైన జాతీయ జంతువుగా కోతిని ఎందుకు పెట్టుకోలేదు???_* ఎవడైతే కోతి నుంచి వచ్చాము  అంటున్నాడో *_వాడికి Accident అయితే అత్యవసరముగా కోతి రక్తము తీసి ఎక్కించాలి. నిజముగా మనిషి కోతి నుండి వస్తే, ఆ కోతి రక్తము మనిషికి ఎక్కిస్తే మనిషి బ్రతుకుతాడా?????_* చచ్చిపోతాడు. అస్సలు కోతి మాంసము వేరు మనిషి మాంసము వేరు. (1 కొరంది 15:38-) మాంసమంతయు ఒక విధమైనది కాదు. మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు,చేప మాంసము వేరు.... కనుక *_మాంసము వేరు అయితే మనిషి కోతి నుండి ఎలా వస్తాడు???_* ఒకవేళ వస్తే.. కోతి మాంసము, మనిషి మాంసము వొకే విధంగా ఉండాలి కదా!?

9. *_మనిషి పుట్టుక వెనుక కోతి లేనప్పుడు, మనిషి పుట్టుక వెనుక ఎవరు ఉన్నారు??_*

(అపో 17:26-) యొకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి........ వకని నుండి అనగా మానవుని నుండి గానీ కోతి అని వ్రాయబడలేదు. గనుక మనుష్యులందరి వెనుక ఉన్నది మనిషి అని అర్థమైనది. అనగా కోతికి కోతి, పులికి పులి, కుక్కకు కుక్క, పిల్లికి పిల్లి, మనిషికి మనిషే పుడతాడు. ఒకని నుండి మనమంతా వచ్చాము. ఆ ఒక్క మనిషి ఆదాము. కనుక *మనమంతా ఆదాము నుండి వచ్చిన వారము.* మనము పుట్టుక ముందు ఆదాములో ఉన్నాము.

*ఉదా:-*
మధు పుట్టక ముందు.. మధు తన తండ్రి లో ఉన్నాడు. తన తండ్రి వాళ్ళ తండ్రి లో ఉన్నాడు. ఇలా వెనక్కి వెళ్లిపోతే...చివరకు *_అందరమూ ఆదాములో ఉన్నాము. మరి ఆదాము పుట్టక ముందు ఎవరిలో ఉన్నాడు??_*

నేను
నాన్న
తాత
ముత్తాత
అబ్రాహాము
ఇస్సాకు
యాకోబు
ఆదాము
????

10. *_ఆదాము ఎవరి కుమారుడు??_*

(లుకా 3:38)
*_ఆదాము దేవుని కుమారుడు._* మనము కూడా దేవుని కుమారులమే. ఆదాము మరియు మనము పుట్టక ముందు.. దేవునిలో ఉన్నవారము. అనగా *_మనిషి పుట్టింది దేవునికి,_* కానీ కోతికి కాదు.

🦍🚶🏾‍♂️🦍🚶🏾‍♂️🦍🚶🏾‍♂️🦍🚶🏾‍♂️🦍

Tuesday, 25 June 2024

పోగుచేయుట

పోగుచేయును అంటే, 
పైన మొత్తం అలంకార బాషా వాడిన యేసు ఇక్కడ
Matthew(మత్తయి సువార్త) 24:31

31.మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివరనుండి ఆ చివరవరకు నలుదిక్కులనుండి ఆయన *ఏర్పరచుకొనినవారిని పోగుచేతురు.* 

పాత నిబంధన కాలములో,
Numbers(సంఖ్యాకాండము) 10:1,2

1.యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెనునీవు *రెండు వెండి బూరలు చేయించుకొనుము* ; 
2.​నకిషిపనిగా వాటిని చేయింపవలెను. *అవి* *సమాజమును పిలుచుటకును సేనలను తర్లించుటకును నీకుండవలెను.* 



Leviticus(లేవీయకాండము) 25:9,10

9.ఏడవ నెల పది యవనాడు మీ స్వదేశమంతట శృంగనాదము చేయవలెను. ప్రాయశ్చిత్తార్థదినమున మీ దేశమంతట *ఆ శృంగనాదము చేయవలెను.* 
10.మీరు ఆ సంవత్సరమును, అనగా ఏబదియవ సంవత్స రమును పరిశుద్ధపరచి మీ దేశవాసులకందరికి విడుదల కలిగినదని చాటింపవలెను; *అది* *మీకు సునాదముగానుండును* ; అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను; ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను.

Isaiah(యెషయా గ్రంథము) 27:12,13

12.ఆ దినమున యూఫ్రటీసు నదీప్రవాహము మొదలు కొని ఐగుప్తునదివరకు యెహోవా తన ధాన్య మును త్రొక్కును. *ఇశ్రాయేలీయులారా, మీరు ఒకరినొకరు కలిసికొని కూర్చబడుదురు.* 
13. *ఆ దినమున పెద్ద బూర ఊదబడును* అష్షూరుదేశములో నశింప సిద్ధమైనవారును ఐగుప్తుదేశములో వెలివేయబడినవారును,వచ్చెదరు, యెరూషలేములోనున్న పరిశుద్ధపర్వతమున యెహో వాకు నమస్కారము చేయుదురు.

బూర ఊడటం అంటే gathering/సంకుర్చుట...యేషయా 27 లో ఇక్కడ చెదిరిన ఇజ్రాయెల్ ప్రజలను సమకూర్చటానికి ఉపయోగించబడింది..
ఇది ఎప్పుడు జరుగును???



Isaiah(యెషయా గ్రంథము) 27:9,10

9.కావున యాకోబు దోషమునకు ఈలాగున ప్రాయ శ్చిత్తము చేయబడును ఇదంతయు అతని పాపపరిహారమునకు కలుగు ఫలము. *ఛిన్నాభిన్నములుగా చేయబడు సున్నపురాళ్లవలె అతడు బలిపీఠపు రాళ్లన్నిటిని కొట్టునప్పుడు దేవతాస్తంభము సూర్యదేవతా ప్రతిమలు ఇకను మరల లేవవు.* 
10. *ప్రాకారముగల పట్టణము నిర్జనమై అడవివలె విడువ బడును విసర్జింపబడిన* నివాసస్థలముగా నుండును అక్కడదూడలు మేసి పండుకొని దాని చెట్లకొమ్మలను తినును. 

యెరూషలేము నాశనము ను సూచిస్తుంది.
1 కోరంతి 15 లో ఉదబడిన కడబూరా, Mat 25 లో బూర మ్రోగగానే, gathering/పొగుడుకోవడానికే జరగటం..
ఇవన్నీ చూస్తే
దేవుని బూర ఊదినప్పుడు, చెదరినా ఇశ్రాయేలు కూడగట్టబడతారని యెషయా చెప్పాడు. 
ఇది gathering of remanant/శేషము గురించి మునుపటి మెస్సియానిక్ వాగ్దానాన్ని సూచిస్తుంది.


Isaiah(యెషయా గ్రంథము) 11:11,12

11.ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులోనుండియు ఐగుప్తులోనుండియు పత్రోసులోనుండియు కూషులోనుండియు ఏలాములోనుండియు షీనారులోనుండియు హమాతులో నుండియు సముద్రద్వీపములలోనుండియు *విడిపించి రప్పించుటకు యెహోవా రెండవమారు తన చెయ్యి చాచును* 
12. *జనములను పిలుచుటకు* ఆయన యొక ధ్వజము నిలువ బెట్టును భ్రష్టులైపోయిన *ఇశ్రాయేలీయులను పోగుచేయును భూమియొక్క నాలుగు దిగంతములనుండి చెదరి పోయిన యూదా వారిని సమకూర్చును.* 
ఇది క్రీస్తు లో జరిగే కార్యము..
ఇది బూర ఊడినప్పుడు జరిగే restoration language.

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 15:51,52

51.ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను; మన మందరము నిద్రించము గాని నిమిషములో, ఒక రెప్పపాటున, *కడబూర మ్రోగగానే మనమందరము మార్పుపొందుదుము.* 
52. *బూర మ్రోగును* ; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పుపొందుదుము. 

ఇది restoration MAT 24:31.

Matthew(మత్తయి సువార్త) 24:31

31.మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివరనుండి *ఆ చివరవరకు నలుదిక్కులనుండి ఆయన ఏర్పరచుకొనినవారిని పోగుచేతురు.*

ఇది దానియల్ పునరుత్థానం మరియు జెరూసలేం నాశనం కు connect చేయబడింది..

 Daniel(దానియేలు) 12:1,2,7

1. *ఆ కాలమందు* నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు *మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని యీ కాలము వరకు ఎన్నటికిని కలుగనంత ఆపద కలుగును* ; అయితే *నీ జనులలో గ్రంథమునందు దాఖలైనవారెవరో వారు తప్పించుకొందురు.* 

2.మరియు *సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు; కొందరు నిత్యజీవము అనుభవించుటకును* , కొందరు నిందపాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. 

👆ఇది ఎప్పుడు జరుగును???

7.​నారబట్టలు వేసికొని యేటిపైన ఆడుచున్న ఆ మనుష్యుని మాటను నేను వింటిని; ఏమనగా, అతడు తన కుడిచేతిని ఎడమచేతిని ఆకాశము వైపుకెత్తి నిత్యజీవియగు వాని నామమున ఒట్టుపెట్టుకొని, ఒకకాలము కాలములు అర్ధకాలము *పరిశుద్ధజనము యొక్క బలమును కొట్టివేయుట ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగుననెను* . 

 *యూదుల/ఇజ్రాయెల్ ప్రజలు దేవుని పరిశుద్ధ ప్రజలు వారి బలము కొట్టివేయడం సమాప్తమైన తరువత.* 12 : 1-2, పునరుత్ధానం ఎప్పుడు జరుగును అంటే, 12: 7 *యూదుల బలము కొట్టివేయబడటం లో అన్ని నేరవీరుని దూత చెప్పటం జరిగింది.* 



Luke(లూకా సువార్త) 21:27,28,31

27.అప్పుడు మనుష్యకుమారుడు *ప్రభావముతోను మహా మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూతురు.* 
28.ఇవి జరుగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తికొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. 
31.అటువలె మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయెనని తెలిసికొనుడి. 

*ఆకాశ మేఘరూఢుడై రావడం లో* 
*వారి విమోచన కు link* *అయివుంది** .*
 *అలాగే దేవుని రాజ్యము కు link అయి ఉంది.***

చెబుతారు కానీ చేయరు

*వారు చెప్పుదురే గాని చేయరు. మత్తయి-23:3* """"""""""""""""...