"""""""""""""""""""""""""""
💠 *చర్చ్ లో ఫోన్ వాడొద్దంటారుకాని*
-ఎన్నడు పాటించరు.
💠 *తల్లిదండ్రులను గౌరవించాలంటారుకాని*
-వారినసలు పట్టించుకోరు.
💠 *ప్రతిదినం ప్రార్దించాలంటారుకాని*
- వారెన్నడు ప్రార్దించరు
💠 *దొంగతనం చేయొద్దంటారుకాని*
-దేవునిసొమ్ము,ప్రజల సొమ్ము దొంగిలిస్తారు
💠 *ప్రతిదినం బైబిల్ చదవాలంటారుకాని*
-వారెన్నడు చదవరు
💠 *మారుమనస్సు పొందాలంటారుకాని*
-వారికే మారుమనస్సుండదు.
💠 *వేషాదరణ కలిగి ఉండకూడదంటారుకానీ*
-వారే వేషదారులై వుంటారు
💠 *సేవకులను గౌరవించాలంటారుకాని*
-సేవకులనందరిని విమర్శిస్తారు.
💠 *డబ్బు,అదికారం కోసం ప్రాకులాడద్దంటారుకాని*
-నిత్యం దానికోసమే ప్రాకులాడుతారు.
💠 *స్టైల్ చేయొద్దంటారుకాని*
-స్టైల్ గా ఉండడానికే ప్రయాసపడుతారు.
💠 *కులం,వాస్తు,ముహూర్తంచూడొద్దంటారుకాని*
-వాటి పిచ్చితోనే నిండివుంటారు.
💠 *అన్య ఆచారాలు పాటించొద్దంటారుకాని*
-అన్ని వారే పాటిస్తారు.
💠 *ఉపవాసాలుండాలంటారుకాని*
-వారెన్నడుండరు.
💠 *వ్యభిచారం చేయొద్దంటారుకాని*
-మోహపుచూపులతోనే నిండివుంటారు.
💠 *ఆడంబరంగా జీవించవద్దంటారుకాని*
-ఆడంబరాలతోనేజీవిస్తారు.
💠 *ఐఖ్యంగా వుండాలంటారుకాని*
-ఐఖ్యతకు ఎన్నడు సహకరించరు.
💠 *సమయపాలన పాటించాలంటారు కాని*
- వారెన్నడు పాటించరు.
💠 *అందరిని సమానంగా చూడాలంటారు కాని*
-దనవంతులకే పెద్దపీఠ వేస్తారు.
💠 *అందరిని క్షమించాలంటారు కాని*
- ఎవ్వరిని క్షమించరు
💠 *సాక్ష్యం కాపాడుకోవాలంటారు కాని*
-వారికెక్కడ సాక్ష్యంవుండదు.
💠 *సువార్త ప్రకటించాలంటారు కాని*
-అవకాశమున్న ప్రకటించరు.
💠 *అసూయ పడకూడదంటారు కాని*
- ఇతరుల ఎదుగుదలను చూసి ఓర్వరు.
💠 *స్వార్దముండకూడదంటారు కాని*
-లాభంలేకుండా ఏపని చేయరు.
💠 *మనుష్యుల పై రూపం చూడద్దంటారు కాని*
-పై రూపాన్ని బట్టే విలువిస్తారు.
💠 *ఇతరులగురించి చెడుగా మాట్లాడద్దంటారు కాని*
-అందరిని దూశిస్తారు.
💠 *సినిమాలు,సీరియల్లు చూడొద్దంటారు కాని*
-ఒక్కరోజు మిస్ కాకుండా చూస్తారు.
💠 *గొడవలు పెట్టుకోవద్దంటారు కాని*
-అంతటా,అందరితో గొడవలే.
💠 *వాట్సప్,ఫేస్ బుక్,నెట్ వాడొద్దంటారుకాని*
-నిత్యం వాటిలోనే లీనమైవుంటారు.
ఇంకా..
*దశమభాగం,పరిశుద్దత,లోకాశలు,గర్వం,లంచం,నీతి,న్యాయం,ధర్మం.....* అనేక విషయాల గూర్చి భోదిస్తారుకాని ఏది పాటించరు.
*ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా?*
రోమా 2:21
*.... ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి, దానిని లోపరచుకొనుచున్నాను.*
మొదటి కొరింథీ9:27