Friday, 26 April 2019

కృపావరములు నేడు ఉన్నాయా?

*నేటి కాలంలో కృపావరములు ఉన్నాయా..?*

కృపావరములు 9

*1 Corinthians(మొదటి కొరింథీయులకు) 12:1,4,8,9,10*

1.మరియు సహోదరులారా, *ఆత్మసంబంధమైన వరములను* గూర్చి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు.
4. *కృపా వరములు నానావిధములుగా ఉన్నవి* గాని ఆత్మ యొక్కడే.

ఏలాగనగా,
👉ఒకనికి ఆత్మ మూలముగా *బుద్ధి వాక్యమును*,
👉 మరియొకనికి ఆ ఆత్మననుసరించిన *జ్ఞానవాక్యమును*,
👉మరియొకనికి ఆ ఆత్మవలననే *విశ్వాసమును*,
👉 మరియొకనికి ఆ ఒక్క ఆత్మవలననే *స్వస్థపరచు వరములను*
👉మరియొకనికి *అద్భుత కార్యములను చేయు శక్తియు,*
👉మరియొకనికి *ప్రవచన వరమును,*
👉మరియొకనికి *ఆత్మల వివేచనయు*,
👉మరియొకనికి *నానావిధ భాషలును,*
👉మరి యొకనికి *భాషల అర్థము చెప్పు శక్తియు* అనుగ్రహింపబడియున్నవి.

ఈ 9 కృపావరములు పరిశుద్దాత్మ ఒక్కొక్కనికీ ఒక్కొక్కటి పంచి ఇచ్చాడు.

ఇవి పంచి ఇవ్వాలి అంటే అపోస్తలుల ద్వారా మాత్రమే పంపిణీ జరగాలి
అపొస్తలులు లేకుండా, అపోస్తలుల సహకారం లేకుండా, కృపావరముల పంపిణీ జరగదు
సంఘ ప్రారంభదినాల్లో పరిశుద్దాత్మ, అపోస్తలులు కలిసి పనిచేశారు.
అపొస్తలులు చేతులుంచి ప్రార్ధన చేసినవారిమీదకే కృపావరములు వచ్చాయి.
ఉత్తరాల ద్వారా కృపావరాలు రాలేదు
లేదా ఇతరమార్గాల ద్వారా కృపావరములు రాలేదు

చేతులుంచి ప్రార్ధన చేయడం అనేది అపొస్తలులు మాత్రమే పొందిన అధికారం
ఆ అధికారాన్ని డబ్బుతో కొనాలని విఫలయత్నం చేసినవాడు గారడీవాడైన సీమోను *అపో.8:17*

*అపో. 19:5*
పౌలు చేతులుంచిన వారిమీదకు కూడా పరిశుద్దాత్మ దిగివచ్చెను.

*ఈ కృపావరములు నేడు ఉన్నాయా..?*

ఇవి నేడు లేవు.
కృపావరములు తాత్కాలికంలు.
ఇపుడు నిలిచిపోయాయి.

*1కొరిం 13:8*
ప్రవచనములైననూ నిరర్దకములగును. భాషలైననూ నిలిచిపోవును, జ్ఞానమైననూ నిరర్దకమగును.
*పూర్ణమైనది వచ్చినపుడు పూర్ణము కానిది నిరర్ధకమగును*

ఏది పూర్ణమైనది..?

*యాకోబు 1:22*
స్వాతంత్ర్యమునిచ్చు *సంపూర్ణమైన నియమము*
అనగా క్రొత్తనిబంధన..
ఇది రచనలోకి వచ్చిన తర్వాత, గ్రంధం పరిపూర్ణంగా వ్రాయబడిన తరువాత,

పూర్ణము కానిది నిరర్ధకములైనవి అనగా కృపావరములు నిరర్దకములైపోయాయి. నిలిచిపోయాయి.

*Hebrews(హెబ్రీయులకు) 2:2,3,4*

ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన *వాక్యము స్థిరపరచబడినందున,*
ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొందియుండగా
ఇంత గొప్ప రక్షణను మనము నిర్ల క్ష్యముచేసినయెడల ఏలాగు తప్పించుకొందుము?
అట్టి రక్షణ ప్రభువు భోధించుటచేత ఆరంభమై,
4.దేవుడు తన చిత్తానుసారముగా సూచకక్రియలచేతను, మహత్కార్యముల చేతను, నానావిధములైన అద్భుతముల చేతను, వివిధము లైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుటచేతను, వారితో కూడ సాక్ష్యమిచ్చుచుండగా వినినవారిచేత *మనకు దృఢ పరచబడెను.*

దృఢపరచబడిన తరువాత ఇక కృపావరములు నిలచిపోయాయి. ఆగిపోయాయి.

నేడు కృపావరములు లేవు. అపోస్తలులు చేతులుంచుట వలన మాత్రమే వచ్చిన కృపావరములు వారి కాలం అంతరించిపోయిన తర్వాత, గ్రంధం వ్రాయడం పూర్తికాబడిన తరువాత ఆగిపోయినవి. కావున నేడు కృపావరములు లేవు

చెబుతారు కానీ చేయరు

*వారు చెప్పుదురే గాని చేయరు. మత్తయి-23:3* """"""""""""""""...