*భూమ్యాకాశములను సృజించిన తండ్రియైన దేవుడు మాత్రమే సృష్టి కర్త* (God, the Father, The sole Creator of Heaven and Earth) అన్నట్టుగా అనేక లేఖనాలు వున్నవి వాటిలో కొన్ని.....
అపో. కా. 4:24 "వారు విని ఏక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొర్రపెట్టిరి - *నాథా, నీవు* ఆకాశమును, భూమిని, సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసినవాడవు."
అపో. కా. 7:48-50 మీరు నా కొరకు ఏలాటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది?
ఇవన్నియు *నా హస్తకృతములు కావా?* అని *ప్రభువు*(యెహోవా) చెప్పుచున్నాడు.
అని ప్రవక్త పలికిన ప్రకారము *సర్వోన్నతుడు* హస్తకృతాలయములలో నివసింపడు.
అపో. కా. 14:15 "అయ్యలారా, మీరెందుకీలాగు చేయుచున్నారు? మేము కూడ మీ స్వభావమువంటి స్వభావముగల మనుష్యులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి *ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో నుండు సమస్తమును సృజించిన జీవముగల దేవుని* వైపు తిరుగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము."
అపో. కా. 17:24-28 " *జగత్తును అందలి సమస్తమును, నిర్మించిన దేవుడు* *"తానే"* ఆకాశమునకును భూమికిని ప్రభువైయున్నందువలన హస్తకృతములైన ఆలయములో నివసింపడు."
*ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు* గనుక తనకు ఏదైనను కొదువ యున్నట్టు మనుష్యుల చేతులలో సేవింపబడువాడు కాడు.
"మరియు యావద్భూమి మీద కాపురముండుటకు ఆయన యొకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమోయని *తన్ను* వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును, వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను."
*ఆయన* మనలో ఎవరికిని దూరముగా ఉండువాడు కాడు.
" *మనమాయన* యందు బ్రతుకు చున్నాము, చలించు చున్నాము, ఉనికి కలిగియున్నాము. అటువలె *మన మాయన* సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు."
ప్రకటన 4:10-11 ఆ ఇరువది నలుగురు పెద్దలు సింహాసనము నందు ఆసీనుడైయుండువాని యెదుట సాగిలపడి- యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు-
*" ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి,* నీ చిత్తమును బట్టి అవి యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక *నీవే* మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి."
ప్రకటన 10:6 *"పరలోకమును అందులో ఉన్నవాటిని, భూమిని అందులో ఉన్నవాటిని, సముద్రమును అందులో ఉన్నవాటిని సృష్టించి, యుగయుగములు జీవించుచున్న వానితోడు* ఒట్టుపెట్టుకొని ఇక ఆలస్యముండదు గాని"
ప్రకటన 14:7 "అతడు- మీరు *దేవునికి భయపడి ఆయనను మహిమ పరచుడి; ఆయన తీర్పు తీర్చు ఘడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన ~వానికే~ నమస్కారము చేయుడి,* అని గొప్ప స్వరముతో చెప్పెను."
మార్కు 10:6 *సృష్ట్యాది నుండి (దేవుడు) వారిని పురుషుని గాను స్త్రీనిగాను కలుగజేసెను.*
మత్తయి 19:4, 6 ఆయన- *''సృజించినవాడు* ఆది నుండియు వారిని స్త్రీ గాను పురుషునిగాను సృజించెననియు,"
కాబట్టి వారికను ఇద్దరుగాకాక ఏక శరీరముగా నున్నారు. గనుక *దేవుడు* జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు'' అని చెప్పెను.
హెబ్రీ. 2:10 "ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవనివలన సమస్తమును కలుగుచున్నవో, *ఆయన* అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును."
హెబ్రీ. 3:3 ప్రతి యిల్లును ఎవడైన ఒకనిచేత కట్టబడును; *సమస్తమును కట్టినవాడు దేవుడే.*
హెబ్రీ. 4:3-4 "కాగా జగత్పునాది వేయబడినప్పుడే *ఆయన* కార్యములన్నియు సంపూర్తియై యున్నను, ఈ విశ్రాంతిని గూర్చి - నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని *ఆయన* చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము."
మరియు - *దేవుడు ఏడవ దినమందు తన కార్యములన్నిటిని ముగించి విశ్రమించెను* అని ఏడవ దినమును గూర్చి ఆయన యొకచోట చెప్పియున్నాడు.
1 కొరింధీ. 8:6 "ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి ఉన్నను, మనకు *ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము.* మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు; ఆయన ద్వారా *(though him, not by him,ఆయన చేత అని లేదు)* సమస్తమును కలిగెను; మనము ఆయన ద్వారా కలిగిన వారము."
కొలస్సీ. 1:16 "ఏలయనగా, ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు (in him not by him, ఆయన చేత అని లేదు ఆయనయందు అని ఉంది) సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ( through him, not by him) ఆయననుబట్టియు సృజింప బడెను."
కీర్తనలు 8:3 *నీ చేతిపనియైన* నీ ఆకాశములను *నీవు కలుగజేసిన* చంద్రనక్షత్రములను నేను చూడగా
యెషయా 44:24 గర్భమునుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను *నేనొకడనే* ఆకాశమును విశాలపరచినవాడను *నేనే* భూమిని పరచినవాడను
Isaiah 44:24 Thus says the Lord, your Redeemer, And He who formed you from the womb: "I am the Lord, who makes all things, Who stretches out the heavens all *alone*, Who spreads abroad the earth by *Myself*;
ఆది.కాం. 1:26-27 దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారుసముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను.
*దేవుడు తన* స్వరూపమందు నరుని సృజించెను; *దేవుని స్వరూపమందు* వాని సృజించెను; స్త్రీనిగాను పురు షునిగాను వారిని సృజించెను.
*ఒకవేళ "మన" అనే పదం ముగ్గురు లేదా దేవుడు తన తోటి సృష్టికర్తలతో మాట్లాడితే గ్రంథ కర్త యైన మోషే దేవుడు తన స్వరూపమందు అనే పద ప్రయోగం కాకుండా వారి స్వరూపమందు వారి పోలిక చొప్పున నరుని చేసెను అని వాడవలసి ఉండాలి, అలా వాడలేదు ఎందుకని!* 1:27 వచనములో.
మన అని 1:26 లో ఆయన పరలోక సైన్యము అనుకోడానికి కూడా ఆస్కారముంది. ఎందుకంటే వారి యోచనలు కూడా దేవుడు తీసుకున్నట్టు ఉంది లేఖనములో
ఈ క్రింద వచనము చూడు
1 రాజులు 22:19-20 మీకాయా యిట్లనెనుయెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము; యెహోవా సింహాసనాసీనుడై యుండగా *పరలోకసైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమపార్శ్వమునను నిలిచి యుండుట నేను చూచితిని*
"అహాబు రామోత్గిలాదుమీదికి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించునని యెహోవా సెలవియ్యగా, ఒకడు ఈ విధముగాను మరియొకడు ఆ విధముగాను *యోచన* చెప్పుచుండిరి."
(ఈ సందర్భములో క్రీస్తు, పరిశుద్ధాత్మ లేరు ఎందుకని!)
ఆది.కాం. 9:6 నరుని రక్తమును చిందించు వాని రక్తము నరునివలననే చిందింప బడును; ఏలయనగా దేవుడు *తన* స్వరూపమందు నరుని చేసెను.
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
పై వచనములలో దేవుడొక్కడే సమస్తము చేసినట్టు ఉంది.
సృష్టి చేయడం తన ఒక్కడి వల్ల కాకుండా మరో సృష్టికర్తల సహాయ సహకారాలు తీసుకున్నట్లు ఈ లేఖనాలు తెలపడం లేదు.