🏉🏐🎾⚾🏈🏀⚽
*యేసుక్రీస్తు మరో దేవుడనే బోధ లేఖన ఆధారమైన దేనా?*
🙏🌸🌼🌺🌾🍄🌴🙏
🌱 _యేసుక్రీస్తుని దేవుడు అని నిరూపించి ఒప్పించే పని కానీ,_
_యేసుక్రీస్తు దేవుడు కాదు అని నిరూపించి ఒప్పించే పని కానీ నాడుఅపొస్తలులు తమ నెత్తి కెత్తుకెత్తుకోలేదు ఎందుకని?_
🌱 *వారు నిత్యుడగు అద్వితీయ సత్య దేవుడైన తండ్రిని, ఆయన సంకల్పాన్ని బాగుగా ఎరిగిన వారు.*
🌱 వారు యేసుని క్రీస్తుగాను, ప్రభువుగాను, దేవుని కుమారునిగాను, ప్రధానాయజకునిగాను వారి గ్రంధాలైన ధర్మశాస్త్రములోను, కీర్తనలలోను, ప్రవక్తల గ్రంధాలలోను వారికి వాగ్ధానం చేయబడిన మెస్సియను లేఖన ఆధారాలతో వివరించి, ఒప్పించి నిరూపించారు.
🌱 *ఆనాటి యూదులు యేసు దేవుడు కాదు అని వాదించినట్టు గాని తిరుగుబాటు చేసినట్టు గాని గ్రంధంలో ఎక్కడా కనబడదు కారణం*
🌱 యేసుక్రీస్తు తాను దేవుడిని అని ఎప్పుడు చెప్పుకోలేదు, అపొస్తలులు తమ బోధ ద్వారా యేసుని దేవుడని నిరూపించే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు, ఆ ఆలోచన కూడా చేయలేదు కారణం వారి పాత నిబంధన లేఖనాలలో యేసుని దేవుడని నిరూపించడానికి గాని ఒప్పించడానికి గాని వారిదగ్గర ఒక్క లేఖన ఆధారం కూడా లేదు.
🌱 *కాబట్టే యేసుక్రీస్తు దేవుడు అనే బోధ విషయమై చర్చ కానీ వాదనగాని, తర్కం గాని గ్రంధంలో ఎక్కడా కనపడదు.*
🌱 *మన దేవుడైన యహోవా అద్వితీయ దేవుడు అనే సత్యానికి భిన్నంగా ఆనాటి భక్తిగల ఏ యూదుడైన ఆలోచన చేసే సాహసం చేయలేదు.*
🌱 _లేఖనాలు గ్రహించని యూదులు యేసుక్రీస్తుని కాని అపొస్తలులు కానీ చంపడానికి వారికున్న వ్యతిరేకత యేసుని మెస్సియాగా అంగీకరించలేక పోవడమే గాని మరొకటి కాదు._
🌱 *కాబట్టి ప్రారంభ క్రైస్తవ దినములలో యేసు దేవుడు లేదా దేవుడు కాదు అనే సమస్యే తలెత్త లేదు.*
🌱 *అన్నిటికి చాలిన అద్వితీయ దేవుడు వారికుండగా* వారు మరో దేవుని సహాయం కోసం ఎదురు చూడలేదు గాని వారికి వాగ్ధానం చేయబడిన మెస్సియా దావీదు సంతానము నుండి వస్తాడని రాజ్యము స్థాపిస్తాడని వారి నిరీక్షణ, ఆ మెస్సియా యేసుక్రీస్తు అని నాటి అపొస్తలులు తమ బోధ ద్వారా లేఖనాలా వెలుగులో నిరూపిస్తూ సువార్త కొనసాగించారు.
🌱 లేఖనలను వక్రీకరించి ఇంకేదో అద్ది మరింత అద్భుతంగా చూపించి యేసు మరో దేవుడని, మరో సృష్టికర్త అని ఇంకేదో మర్మ మున్నట్టుగా శ్రోతలను, విశ్వాసులను బ్రమపెట్టే ఆరాటం ఉన్న నేటి బోధకులు తమ మాటల గారడితో, లేఖనాలకు వక్రభాష్యం చెపుతూ తమను అనుసరించే విధంగా మల్చుకుంటున్న ప్రతి వ్యక్తి గ్రంధముతో ఆటలాడుకుంటున్నాడు, దేవుడొక్కడే అనే గ్రంథ సత్యానికి తూట్లు పొడుస్తు సత్యాన్ని మూలలతో సహా ధ్వంసం చేయడానికి ఆరాట పడుతున్నాడు.
🌱 *కళ్ళున్న వారు లేఖనాలా వెలుగులోకి వచ్చి తమకు వినబడుతున్న ప్రతి బోధ సత్యమేన కాదా అని సత్య పరిశీలన చేసి గ్రంథము యొక్క ఉద్దేశాన్ని, ఒకే దేవుని గూర్చిన బోధను కాపాడాలని మా హృదయభిలాష.*
🐶🐱🐰🐹🐥🦆🐋🦈🐳🐬