🌺🌺 *నిరంతరం స్తుతించబడుచున్న దేవుడు*🌺🌺
🌹Exodus 15:11 - *యెహోవా* , వేల్పులలో నీవంటివాడెవడు పరిశుద్ధతనుబట్టి నీవు మహానీయుడవు *స్తుతికీర్తనలనుబట్టి పూజ్యుడవు* అద్భుతములు చేయువాడవు నీవంటివాడెవడు.
☘1 Chronicles 29:10 - రాజైన దావీదుకూడను బహుగా సంతోషపడి, సమాజము పూర్ణముగా ఉండగా *యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను* మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా *యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు* .
🌻1 Chronicles 29:20 - ఈలాగు పలికిన తరువాత దావీదుఇప్పుడు మీ *దేవుడైన యెహోవాను స్తుతించుడని సమాజకులందరితో చెప్పగా* , వారందరును తమ పితరుల *దేవుడైన యెహోవాను స్తుతించి* యెహోవా సన్నిధిని రాజు ముందరను తలవంచి నమస్కారము చేసిరి.
🍀2 Chronicles 20:19 - కహాతీయుల సంతతివారును కోరహీయుల సంతతి వారునగు లేవీయులు నిలువబడి *గొప్ప శబ్దముతో ఇశ్రా యేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించిరి*
🌿Ezra 3:11 - వీరు వంతు చొప్పున కూడియెహోవా దయాళుడు, ఇశ్రాయేలీ యుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు *యెహోవాను స్తుతించిరి.* మరియు యెహోవా మందిరముయొక్క పునాది వేయబడుట చూచి, జనులంద రును **గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి* .
🌷Nehemiah 9:5 - అప్పుడు లేవీయులైన యేషూవ కద్మీయేలు బానీ హషబ్నెయా షేరేబ్యా హోదీయా షెబన్యా పెతహయా అనువారునిలువబడి, నిరంతరము మీకు *దేవుడైయున్న యెహోవాను స్తుతించుడని* చెప్పి ఈలాగు *స్తోత్రము చేసిరి* సకలాశీర్వచన స్తోత్రములకు మించిన *నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక* .
🌸Psalm 41:13 - ఇశ్రాయేలు *దేవుడైన యెహోవా శాశ్వతకాలమునుండి శాశ్వతకాలమువరకు స్తుతింప బడును గాక* . ఆమేన్. ఆమేన్.
🌼Psalm 72:18 on - *దేవుడైన యెహోవా ఇశ్రాయేలుయొక్క దేవుడు స్తుతింపబడును గాక* ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు.
🌳Psalm 134:1 - యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండువార లారా, *మీరందరు యెహోవాను సన్నుతించుడి* .
🌲Psalm 145:2 - *అనుదినము నేను నిన్ను స్తుతించెదను* నిత్యము నీ నామమును స్తుతించెదను.
🌾Psalm 146:1- *యెహోవాను స్తుతించుడి* . నా ప్రాణమా, యెహోవాను స్తుతింపుము
🌴Matthew 11:25 - ఆ సమయమున *యేసు* *చెప్పినదేమనగాతండ్రీ* , ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని *నిన్ను స్తుతించుచున్నాను* .
🍁Romans 1:25 - అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. *యుగముల వరకు ఆయన(యెహోవా) స్తోత్రార్హుడై యున్నాడు* , ఆమేన్.
🌺2 Corinthians 1:3 - కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్ర హించు దేవుడు, మన ప్రభువైన *యేసుక్రీస్తుతండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక* .
🎍2 Corinthians 11:31 - నేనబద్ధమాడుటలేదని *నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువగు యేసుయొక్క తండ్రియైన దేవుడు* ఎరుగును.
🥀Ephesians 1:3 - *మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక* . ఆయన క్రీస్తునందు పరలోకవిషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీ ర్వాదమును మనకనుగ్రహించెను.
🌱1 Peter 1:3 - *మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక* .
స్తుతి, స్తోత్రం,నిరంతరం పొందుకునే దేవుడు స్తుతిపాత్రుడు స్తోత్రర్హుడగు నా/మన తండ్రియగు యెహోవాయే.