*భార్యతో ఎలా ప్రవర్తించాలి*
*(మంచి భర్తగా ఉండుటకు )*
🙏🏼💐👫🙏🏼💐👫🙏🏼💐👫🙏🏼💐
*1 . నీ భార్యతో మాట్లాడేటప్పుడు అరచి మాట్లాడవద్దు . ఆమె బాధపడుతుంది. సామెతలు 15 :1*
*_2 .నీ భార్యను గురించి ఇతరుల వద్ద చెడుగా మాట్లాడవద్దు. ఆది 2 :19_*
*3 .నీ భార్య తో పంచుకోవలసిన ప్రేమ లేదా ఆప్యాయత ను వేరొకరితో పంచుకోవద్దు. అది వ్యభిచారం అవుతుంది.మత్తయి 5:28*
*_4 . ఇతర స్తీలతో నీ భార్యను పోల్చవద్దు. ఆ ఇతర స్త్రీ నీకు సరిజోడైతే , దేవుడు ఆమెనే నీకు భార్యగా ఇచ్చేవాడు. 2 కోరింది 10 :12_*
*5 .నీ భార్యతో సాధు గుణం తో , మృదువుగా మసలుకో. ఆమె అన్ని త్యాగం చేసి నీతో జీవిస్తున్నది. నీవు కఠినం గా , చిరాకుగా ఉంటె ఆమె ఎంతో భాధ పడుతుంది. ఎఫెసీ 4 :2*
*_6 . నీ భార్యతో ఏది దాచిపెట్టవద్దు. మీరిరువురు ఏక శరీరులు. ఆమె నీ తోటి సహాయకురాలు. ఆమెకు తెలియని రహస్యం ఉండకూడదు. ఆది 2 :25_*
*7 . నీ భార్య శరీరం గురించి కించపరిచేలా మాట్లాడవద్దు. ఆమె నీ పిల్లలను కనుటకొరకు తన జీవితమును మరియు అందమును త్యాగం చేసినది. ఆమె ఒక ఆత్మ. కేవలం శరీరం కాదు.సామెతలు 18 :22*
*_8 . ఆమె శరీర అందమును బట్టి ఆమెను విలువగా ఎంచవద్దు. వృద్దాప్యం లో కూడా ఆమెతో సంతోషం గా గడుపు. ఎఫెసీ 5 : 29_*
*9 .బహిరంగం గా ఇతరుల ముందు నీ భార్యను తిట్టి అరవవద్దు. ఏదయినా సమస్య ఉంటె రహస్యం గా మీ గదిలో చర్చించు. మత్తయి 1 :19*
*_10 . ఎల్లపుడు నీ భార్యను మెచ్చుకొంటూ , కృతజ్ఞతలు చెప్పుము.నీ గురించి నీ పిల్లల గురించి , ఆమె ఎంతో జాగర్త వహించు చున్నది .1 థెస్స. 5 :18_*
*11 . స్త్రీలంతా ఒకేలా వంట చేయలేరు. నీ భార్య చేసిన వంట ను మెచ్చుకో. ఆమె రోజుకు మూడుసార్లు , సంవత్సారం అంత ప్రతి రోజు , జీవితాంతం వంట చేస్తూనే ఉంటుంది . సామెతలు 31 :14*
*_12 . నీ రక్త సంబందులను , నీ తోబుట్టువులను నీ భార్యతో పోల్చవద్దు. ఆమె నీలో సగభాగం. నీవుఅందరికన్నా నీ భార్యకు మొదటి స్తానం ఇవ్వాలి. ఆది 2 : 24_*
*13 . నీ భార్య యొక్క ఆధ్యాతిక జీవితం కొరకు ఎంతయినా ఖర్చు పెట్టు. ఆమె దేవునితో నడుచుటకు ఆమె కొరకు నీవు చేసే ఉన్నతమైన పని ఇదే . ఎఫెసీ 5 :26*
*_14 . నీ భార్యతో బైబిల్ ధ్యానం మరియు ప్రార్ధన లో సమయం గడుపు. యాకోబు 5 : 16_*
💐🙏🏼👫💐🙏🏼👫💐👫💐🙏🏼👫