*మానవుడు దేవుని స్వరూపము, దేవుని పోలిక*
Gen 5:1: "ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు *ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను;*
Gen 9:6: "నరుని రక్తమును చిందించు వాని రక్తము నరునివలననే చిందింపబడును; ఏలయనగా *దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను.౹"*
1Cor 11:7: *పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై యున్నాడు* గనుక తలమీద ముసుకు వేసికొనకూడదు గాని స్త్రీ పురుషుని మహిమయై యున్నది.౹"
Jam 3:9: "దీనితో తండ్రియైన ప్రభువు ను స్తుతింతుము, దీనితోనే *దేవుని పోలికెగా పుట్టిన మనుష్యులను* శపింతుము.౹"
అయితే ఆదాము పాపం చేసి అవిధేయత చూపడం వలన దేవుని స్వరూపం కోల్పోయెను,
ఆదాము వరుసలోనే పాపం చేసి అందరూ అవిధేయత వలన దేవుని స్వరూపము కోల్పోయారు.....
(రోమా 5:19)
*అయితే యేసు క్రీస్తు సంపూర్ణ విధేయత చూపి దేవుని స్వరూపం కోల్పోకుండా నిలుపుకున్నవాడు కాబట్టి దేవుడు మానవులను తన స్వరూపంలోకి తిరిగి మార్చుకోవడానికి ఏసుక్రీస్తును మాదిరిగా ఉంచి ఆయనను అందరికి ప్రభువుగా నియమించెను.*
ఇప్పడు యేసుక్రీస్తును గూర్చిన సువార్త వలన, యేసును గూర్చి ఉన్నది ఉన్నట్టుగా బోధింపబడిన వారు తిరిగి దేవుని స్వరూపంలోకి దేవుని పొలికగా మార్చబడుటకు క్రీస్తునందున్న ఆశీర్వాదల సహకారంతో కొనసాగుతున్నాము సంపూర్ణులమవుటకు క్రీస్తులాగా!
(ఎఫెసీ 4:20-24
2 పేతురు 1 1-4)
మనము తిరిగి దేవుని స్వరూపము సాధించాల్సిందే,
క్రీస్తుతోకూడా శ్రమపడితే క్రీస్తు తోడి వారసత్వమే మనకు కూడా.
కుమారుడు తండ్రి పొలికలో, స్వరూపంలో ఉన్నంత మాత్రాన తండ్రి అవ్వడు.
యేసుక్రీస్తు దేవుని స్వరూపము గలవాడు కాబట్టి దేవుడు అని నిర్వచిస్తే.....
ఆదాము కూడా పాపము చేయకముందు దేవుని స్వరూపమే కాబట్టి ఆదాము కూడా దేవుడేనా?
🌹🌼🌼🤣🌻🌾🌿🌺🍀🌸🥀