💐💐 *దానియేలు* 💐
👉దానియేలు గ్రంధం దానియేలుచే రచింపబడింది
👉దానియేలు గ్రం�ధంలో రెండు సమాన భాగాలు ఉన్నాయి. మొదటి భాగం చరిత్ర, రెండో భాగం ప్రవచనాలు.
👉అతడు రాజనగరిలో ఉద్యోగిగా స్థిరపడ్డాడు
👉దానియేలు �ఎప్పుడు చనిపోయాడో గ్రంధం వివరించలేదు
👉70-75 సంవత్సరాలు ప్రవక్తగా కొనసాగాడు.
👉దానియేలు అంటే దేవుడు న్యాయాధిపతి
👉దానియేలు గ్రంధం దైవప్రేరణ వలన రాయబడిందనడానికి పట్టుకొమ్మలాంటిది
👉దానియేలు ప్రార్థనపరుడు
👉తను నమ్ముకున్న "నియమం" కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడిన విశేషమైన వ్యక్తి
👉ఇతర ప్రవక్తలందరికంటే దానియేలు జీవిత వివరాలు ఎక్కువగా బైబిల్ వ్రాయబడ్డాయ్
👉అతడు క్రీ.పూ. 605 సం''లో బబులోను చెరకు తీసుకోబడినప్పటి నుండి క్రీ.పూ 536 వరకు అనగా కోరేషు పరిపాలన మొదటి సంవత్సరం వరకు అతని జీవితాన్ని గూర్చి దానియేలు గ్రంధంలో ఉంది
👉నెబుకద్నెజరు, బెల్షస్సురు మరియు దర్యావేషు అనే ముగ్గురు రాజుల పాలనలో దానియేలు ఏ మాత్రం అవినీతికి చోటివ్వకుండా నీతిగా బ్రతికిన వాడు
👉చెడుతో రాజీపడకుండా నమ్మకంగా విధులు నిర్వర్తించేవాడు
👉అతని సమకాలికుడైన యెహెఙ్కేలు, దానియేలు యొక్క నీతిని, నీతిని స్థాపించిన నోవాహు మరియు యోబుతో పోల్చాడు.
🥦 *అధ్యాయాలు గూర్చి* 🥦
🌈 *అధ్యాయము -1*
యూదా క్షీణత, యెరూషలేము పతనం, దానియేలు బాబులోనుకు కొనిపోబడుట, అతని సమర్పణ
🌈 *అధ్యాయము-2*
బహుళ లోహాల ప్రతిమను గూర్చి నెబుకద్నెజరు కల, కలవరం
🌈 *అధ్యాయము-3*
విగ్రహానిక మ్రొక్కుట గూర్చి ఆజ్ఞ ఇవ్వబడుట, మండుచున్న అగ్ని గుండం
🌈 *అధ్యాయము-4*
బ్రహ్మాండమైన వృక్షము గూర్చిన నెబుకద్నెజరు కల.. దాని నెరవేర్పు
🌈 *అధ్యాయము-5*
బెల్షస్సురు యొక్క విందు, చేవ్రాత, బబులోను రాజ్య పతనం
🌈 *అధ్యాయము-6*
మాదీయుడైన దర్యావేషును పూజించాలన్న ఆజ్ఞ జారీ చేయబడుట, దానియేలు సింహాల గుహలో వేయబడుట
🌈 *అధ్యాయము-7*
నాలుగు రాజ్యాలకు సంబంధించిన దానియేలు దర్శనం
🌈 *అధ్యాయము-8*
గొర్రెపిల్ల, మేకపోతు మరియు చిన్న కొమ్ము గూర్చి
🌈 *అధ్యాయము-9*
70 వారముల గూర్చిన దానియేలు ప్రవచనం
🌈 *అధ్యాయము-10*
ప్రవచనపు దర్శనం.. దాని బయలుపాటు
🌈 *అధ్యాయము-11*
ఆయా దేశాలకు సంబంధించిన ప్రవచనాలు
🌈 *అధ్యాయము-12*
ఇశ్రాయేలీయులకు సంబంధించిన ప్రవచనాలు
🌺🌺 *ఉద్దేశ్యం* 🌺🌺
దానియేలు రాజ్యంలో ప్రవక్తగా స్థిరపడ్డాడు
🌿🌿 *చర్చనీయాంశం* 🌿🌿
మానవ రాజ్యలపై దేవుడు అధికారియై యున్నాడు
🦋🦋 *గమనిక* 🦋🦋
దానియేలు గ్రంధంలో మూడు విశేషాలు ఉన్నాయి
1. ధర్మశాస్త్రం కలువరి సిలువ దగ్గర కొట్టివేయబడుతుంది
2. AD 70లో యూదాజాతి కొట్టివేయబడుతుంది
3. దేవాలయం అంతం చేయబడుతుంది
💐💐 *దానియేలు*
*అవుట్ లైన్స్* 💐💐💐
🌺దానియేలు
సమర్పణ 1:1-21
A. దానియే�లు
పరిస్థితులు 1:1-7
B. దానియేలు
యొక్క నిష్ఠ 1:8-16
C. దానియేలు దయపొందినవాడగుట 1:1721
🌺నెబుకద్నెజరు కల, కలవరము 2:1-49
A. నెబుకద్నెజరు కల 2:1-6
B. దానియేలుకు బయలపర్చబడిన కల 2:7-23
C. కల తెలిపే భావం వివరించుట 2:24-45
D. దానియేలు హెచ్చింపబడుట 2:2:46-49
🌺మండుచున్న �గుండం 3:1-30
A. విశ్వాసపు పరీక్ష 3:1-12
B. విశ్వాసపు ప్రదర్శన 3:13-18
C. విశ్వాసము న్యాయమని నిరూపించబడింది 3:19-30
🌺బ్రహ్మండమైన వృక్ష ప్రదర్శన 4:1-37
A. నెబుకద్నెజరు వివరించిన వృక్ష దర్శనం 4:1-18
B. దానియేలు దర్శనభావం వివరించుట 4:19-27
C. దేవుడు ఆదర్శనమును నెరవేర్చుట 4:28-37
🌺బెల్షస్సరు యొక్క విందు 5:1-31
A. బెల్షస్సరు యొక్క హద్దుమీరిన ఇంద్రియానందం 5:1-4
B. గోడ మీద దేవుని చేవ్రాత 5:5-6
C. ఆవిందులో దానియేలు పాత్ర 5:7-29
D. బబులోను పతనము - బెల్షస్సరు హతుడగుట 5:30-31
🌺సింహపు గుహలో దానియేలు 6:1-28
A. దర్యవేషు పాలనలో దానియేలు అంతస్తు 6:1-3
B. దానియేలుకు విరోధమైన కుట్ర 6:4-9
C. యధావిధిగా దానియేలు ప్రార్థన 6:10-11
D. దానియేలు సింహపు గుహలో వేయబడుట 6:12-17
E. దానియేలు కాపాడబడి శత్రువులు శిక్షింపబడుట 6:18-28
🌺నాలుగు మృగాలకు సంబంధించిన దర్శనం 7:1-23
A. చరిత్రకు సంబంధించిన వాస్తవాలు 7:1-3
B. దర్శనము దాని వివరణ 7:4-28
🌺 పొట్టేలు, మేకపోతు, చిన్నకొమ్మ యొక్క దర్శనం 8:1-27
A. దర్శన వర్ణన 8:1-14
B. దర్శన వివరణ 8:15-27
1. పొట్టేలు(మాదీయ పారసీక)8:15-20
2. మేకపోతు (గ్రీకు సామ్రాజ్యము)8:21-222
3. చిన్నకొమ్ము (యాంటియోకస్ ఎఫిపినాస్) 8:23-25
4. దానియేలుపై దర్శన ప్రభావం8:26-27
🌺70 వారముల దానియేలు ప్రవచనం 9:1-27
A. చరిత్ర వాస్తవాలు 9:1-2
B. దానియేలు ప్రార్థన 9:3-19
C. ప్రవచన సారం 9:20-27
🌺ప్రవచనపు సంపూర్ణ దర్శనం 10:1-12:13
A. దానియేలు దర్శనం 10:1-9
B. దర్శనభావం దానియేలుకు బయలుపర్చబడుట
10:10-11:1
C.ఆయా దేశాలకు సంబంధించిన ప్రవచనాలు 11:2-45
1. పర్షియ(పారసీకం)11:2
2. గ్రీసు 11:3-4
3. ఐగుప్తు - ఆరాము 11:5-20
4. గ్రీకులో చిన్నకొమ్ము 11:21-35
5. రోము(డొమిషియన్) చర్యలు 11:36-45
D. ఇశ్రాయేలీయులకు సంబంధించిన ప్రవచనాలు12:1-13