*స్త్రీలు - అలంకరణ*
స్త్రీల అలంకరణ మూడు రకములు గా గ్రంధం వివరించింది
*1. శరీర సంబంధమైన అలంకరణ/బాహ్య అలంకరణ*
*ప్రక 21:2*
భర్తకొరకు అలంకరించుకొనిన పెండ్లికుమార్తె వలే..
బాహ్య అలంకరణ అనేది తన భర్తకొరకై యుండాలి.
అది దేవునికి ఏమాత్రమూ అభ్యంతరకరము కాదు. పైగా దేవుడే దీనిని అంగీకరిస్తున్నాడు
*కీర్త 45:8-10*
ఈరాజు నీ ప్రభువు. నీ సౌందర్యమును కోరినవాడు
*భర్త - తన భార్య సౌందర్యమును కోరడం,*
*భార్య - తన భర్త కొరకు అలంకరించుకోవడం..* ఇది దేవుడు అంగీకరిస్తున్నాడు
ఇది దేవుడు కోరినది. తప్పుకాదు
ఇది ప్రతియింటిలో ఉండవలసిన అలంకరణ
ప్రతీ భార్య తన ఇంటిలో తన భర్తకొరకు అలంకరించుకోవలసిన అవసరత ఎంతైనా ఉన్నది
*2. సంఘంలో అలంకరణ - ఇది ఆత్మసంబంధమైన అలంకరణ - ఇది సత్క్రియలతో అలంకరించుకొనుట*
*1తిమో 2:9-10*
9.మరియు స్త్రీలును అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రముల చేతనేగాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక,
10.దైవభక్తిగలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా *సత్‌క్రియలచేత తమ్మును తాము అలంకరించుకొనవలెను.*
*ఇది సంఘంలో స్త్రీయొక్క అలంకరణ*
*3. అంతరంగ స్వభావంనకు సంబంధించిన అలంకరణ*
1 Peter(మొదటి పేతురు) 3:1,2,3,4,5
1.అటువలె స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి;
2.అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే, వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి, వాక్యము లేకుండనే తమ భార్యల నడవడివలన రాబట్టబడవచ్చును.
3.జడలు అల్లుకొనుటయు, బంగారునగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించు కొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక,
4. *సాధువైనట్టియు, మృదువైనట్టియు* నైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు *అంతరంగ స్వభావము(అంతరంగపురుషుడు) మీకు అలంకారముగా ఉండవలెను;* అది దేవుని దృష్టికి మిగుల విలువగలది.
5.అటువలె పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలును *తమ స్వపురుషులకు లోబడియుండుటచేత తమ్మును తాము అలంకరించుకొనిరి.*
ఇది బహిరంగ ప్రదేశాలలో స్త్రీ యొక్క అలంకరణ కు సంబంధించినది.
కాబట్టి ప్రతీ స్త్రీ తప్పక అలంకరించుకోవలెను.
ఎక్కడ ఏవిధంగా అలంకరించుకోవాలో ఆవిధమైన అలంకరణతో జీవనం కొవసాగించవలెను
ఇంటిలో భర్త కొరకు దేహ అలంకరణ,
సంఘంలో సత్క్రియలతో అలంకరణ,
సమాజంలో స్వభావంతో అలంకరణ
ఇది దేవుడు చెప్పిన, దేవుడు కోరుకొనిన విధానము