Friday, 19 April 2019

రేకాబీయులు

*రేకాబీయులను గూర్చి ఎప్పుడైనా ఆలోచించే తీరిక దొరికిందా???*

యిర్మియా 35 వ అద్యాయము నుండి...

*రేకాబీయులు ఏ వంశానికి/ ఏ దేశానికి/ ఏ జాతికి చెందినవారు..?*

కానాను దేశానికి చెందినవారు.
కనానీయులు (1దిన 2:55)

*రేకాబీయుల జీవన శైలి/ జీవన విధానము*
వారి బ్రతుకుదినము లన్నిటనూ.. వారైనా...వారి సంతతి అయినా...

1. ద్రాక్షారసం త్రాగరు. (35:6)
2. ఇళ్ళు కట్టుకోరు. (35:7)
3. విత్తనాలు విత్తరు. (35:7)
4. ద్రాక్షాతోటలు నాటరు. (35:7)
5. గుడారాలలోనే నివశిస్తారు. (35:7)

*రేకాబీయుల సంతానంలో ఎవరెవరు తమ  తండ్రియైన యెహోనాదాబు ఆజ్ఞలు పాటిస్తారు..?*

1. రేకాబీయుల కుటుంభికులు అందరూ
2. వారి భార్యలు...
3. వారి కుమారులు...
4. వారి కుమార్తెలు...
5. వారి సంతతి వారు...
(యిర్మి 35:6-8)

*రేకాబు కుమారుడైన యెహోనాదాబు యొక్క ఆజ్ఞలను గైకొనుటలో వారు చూపిన వైఖరి*

1. ఆజ్ఞల విషయంలో స్దిరముగా.. (35:14)
2. ఆజ్ఞకు విధేయులుగా..  (35:14)
3. ఆజ్ఞలు నెరవేర్చేవారుగా.. (35:16)
4. విధులు గైకొనువారుగా.. (35:18)
5. సమస్తమూ అనుసరించువారుగా ఉన్నారు. (35:18)

రేకాబు అను ఒక మనుష్యుడు చెప్పిన మాటకే తమ తరాలు అన్నీ ఇంత విలువ ఇస్తుంటే.....

నేనిచ్చిన మాటకు మీరు ఎంత గౌరవం ఇవ్వాలి..? అనేది ఇశ్రాయేలు, యూదా వారివిషయమై దేవుని ఆవేదన. యెహోవా వాక్కు...మీరు శిక్షకు లోబడి, నామాటలను ఆలకింపరా ??....

👉నేను పెందలకడనే లేచి,
బహు శ్రద్దగా మీతో మాటలాడినా, మీరు వినకున్నారు. (35:14)
👉మీరు నామాట ఆలకించడం లేదు. (35:13)
👉నేను నా ప్రవక్తలను, నా సేవకులను పంపించి, ప్రకటిస్తున్నా మీరు చెవియొగ్గడంలేదు. (35:15)
👉పిలిచినా ప్రత్యుత్తరమీయడం లేదు. (35:17)

*ఆనాడు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మాటలకు వారు అంత విలువ ఇస్తుంటే..*

*ఈనాడు దేవునికి గాని, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క మాటలకు మనం విలువ ఇవ్వద్దా..?*

అతడు మీతో ఏమి చెప్పినను...అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను. ఆయన మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాసనమగునని (అపొస్త 3:22) లేఖనాలు ఘోషిస్తూ ఉంటే చెవికి ఎక్కడం లేదా....

*ఉదా* :-
భూమిమీద మీకొరకు ధనం కూర్చుకొనవద్దు అని మన ప్రభువైన యేసు క్రీస్తు చెప్పెను కదా..
(మత్త 6:19)
దీనిని యేసు ఆజ్ఞాపిస్తే..

¥◆ ఎందరు దానికి విధేయులుగా జీవిస్తున్నారు..?
¥◆ ఎందరు క్రీస్తు మాటలకు కట్టుబడి జీవిస్తున్నారు..?
¥◆ ఎందరు వీటిని ఇష్టపడుచున్నారు..?

ఇలాంటి ఉదాహరణలు అనేకము ఉన్నాయి...

ఆయనేదో ఆయన చెబుతాడులే....నేననుకున్నది మాత్రం నేను చేస్తాను. అనుకునేవారు ఆయనకు అవసరం లేదని గమనించు...తండ్రి చిత్తాన్ని జరిగించేవారే ఆయనకు అవసరం...
రేకాబీయుల వంటివారు ఆయనకు కావాలి. అందుకే సదాకాలము రేకాబీయులు నా సన్నిధిలో నిలుస్తారని యెహోవా సెలవిచ్చాడు. (యిర్మి35:19)

రేకాబీయులు ఒక ప్రత్యేక జనాంగం.
ఒక ప్రత్యేక జాతి.
వారి life style వేరు.
నవనాగరికతా ప్రపంచం, ఆధునిక భావాలు వారిని ప్రభావితం చేయలేకపోయాయి. గుడారాల్లో నివశించడానికి వారు సిగ్గుపడలేదు.

రేకాబీయులు వారి జాతియొక్క identity కాపాడుతూ, వారి పితరుడైన యెహోనాదాబు ఆజ్ఞలు తు.చ. తప్పకుండా పాటిస్తువుంటే...

క్రైస్తవులమైన మనము అంతకన్నా ఎంతో ప్రాముఖ్యమైన ప్రత్యేకించబడిన ఒక జనాగము కదా.....

1. దేవుని బీజానికి పుట్టినవారు.
2. ఏర్పరచబడిన వంశం
3. రాజులైన యాజక సమూహం
4. పరిశుద్దజనం,
5. దేవుని సొత్తైన ప్రజలు (1పేతు2:9)
6. ప్రత్యేకింపబడిన ఓ జనాంగం.
దానికి తగిన జీవితం జీవించనక్కర్లేదని భావిస్తే....నీగతి... నీగమ్యం ఎటు పోతోంది...?? ఎటువైపు నీ ప్రయాణం ?? దేనిని చేతపట్టుకొని పోలేమో.... దానిని గురించిపడే నీ ప్రయాస పొర్లాటల యొక్క ఆంతర్యం ఏమిటి ???
ప్రియ సహోదరి, సహోదారుడా ఆలోచించు...మారుమనస్సుకు దేవుడు ఆహ్వానిస్తున్నాడు.... ఆయన ప్రేమ మమ్మును బలవంతం చేస్తున్నది.

చెబుతారు కానీ చేయరు

*వారు చెప్పుదురే గాని చేయరు. మత్తయి-23:3* """"""""""""""""...