Friday, 19 April 2019

యేసుక్రీస్తు నిరంతరము దేవుడైయున్నాడా?

*నిరంతరం*

Rom 9:5: "పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన *సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్.౹"*

యేసు క్రీస్తు *నిరంతరము దేవుడై* స్తోత్రార్హుడై యున్నాడా?

*పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తుని స్తోత్రర్హుడుగా గ్రంధము చూపేనా?*
మరి నిరంతరము అంటే అన్ని యుగాలలో అని కదా!

యేసుక్రీస్తు పుట్టక మునుపు దేవుని మాత్రమే స్తుతించినట్టుంది, ఆయన మాత్రమే స్తుతికి పాత్రుడు, ఆయన తప్ప మరి ఏ దేవునికి స్తోత్రాలు చెల్లించాలని వ్రాయబడలేదు.

మరి యేసుక్రీస్తు నిరంతరము స్తోత్రర్హుడైన దేవుడేలా?
ఏ లేఖన ఆధారాన్ని బట్టి చెబుతున్నాడు, అలా పౌలు వ్రాసి ఉంటాడా లేదా తర్జుమాలో జరిగిన పోరాబాటా?

అది తండ్రికి మాత్రమే వర్తించేది కాదా,

ఇదే పత్రికలో పౌలు ఎలా వాడాడో చూసి పరిశీలించుదాము.

Rom 1:25: "అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. *యుగములవరకు ఆయన స్తోత్రార్హుడై యున్నాడు, ఆమేన్."*

Rom 16:25: "[25-27] సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు, అనాదినుండి రహస్యముగా ఉంచబడి యిప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము, నిత్యదేవుని ఆజ్ఞప్రకారము ప్రవక్తల లేఖనములద్వారా వారికి తెలుపబడియున్నది. ఈ మర్మమును అనుసరించియున్న నా సువార్త ప్రకారము గాను, యేసు క్రీస్తునుగూర్చిన ప్రకటన ప్రకారముగాను, మిమ్మును స్థిరపరచుటకు *శక్తిమంతుడును √అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి,√ 【యేసుక్రీస్తు ద్వారా,】 నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్."*

Rom 15:8-11: "[8-9] నేను చెప్పునదేమనగా, *పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని సాప్థిచుటకును*, అన్యజనులు *ఆయన కనికరమునుగూర్చి దేవుని మహిమపరచుటకును* క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడాయెను. అందు విషయమై— ఈ హేతువుచేతను *అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును*; నీ నామసంకీర్తనము చేయుదును అని వ్రాయబడియున్నది. మరియు అన్యజనులారా, ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు మరియు *సమస్త అన్యజనులారా, యెహోవాను స్తుతించుడి సకల ప్రజలు ఆయనను కొనియాడుదురు గాక అనియు చెప్పియున్నది."*

Rom 14:11: "[11-12] *నా తోడు, ప్రతి మోకాలును నా యెదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును* అని యెహోవా చెప్పుచున్నాడు అని వ్రాయబడియున్నది గనుక మనలో *ప్రతివాడును తన్నుగురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను."*

Rom 3:3: "కొందరు అవిశ్వాసులైన నేమి? వారు అవిశ్వాసులైనందున *దేవుడు నమ్మతగినవాడు కాక పోవునా?* అట్లనరాదు."

Rom 3:30: *"దేవుడు ఒకడే గనుక*, ఆయన సున్నతి గలవారిని విశ్వాసమూలముగాను, సున్నతి లేనివారిని విశ్వాసముద్వారాను, నీతిమంతులనుగా తీర్చును.౹"

Rom 1:25: "అట్టివారు *దేవుని సత్యమును* ~అసత్యమునకు మార్చి~, *సృష్టికర్తకు* ప్రతిగా ~సృష్టమును పూజించి సేవించిరి.~ *యుగములవరకు ఆయన స్తోత్రార్హుడై యున్నాడు, ఆమేన్."*

పౌలు ఇన్ని చోట్ల దేవుని గూర్చి వ్రాసి, మరో దేవుని ప్రస్తావన చేసి ఉంటాడా?

అనేక తర్జుమలలో, ఇంగ్లీష్ లో కూడ ఈ క్రింది విధంగా ఉంది.

Rom 9:5: "పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. *సర్వాధికారియైన దేవుడు నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్.౹"*
అయినను దేవుని మాట తప్పి పోయినట్టు కాదు....

ఏసుక్రీస్తును దేవుడు మృతులలో నుండి లేపి ప్రభువుగా నియమించి సర్వాధికారాలు ఇవ్వడం క్రీస్తు అప్పటినుండి ప్రభువుగా స్తోత్రర్హుడై యున్నాడని మిగత లేఖనాలు చూపిస్తున్నాయి గాని.

నిరంతరము దేవునిగా స్తోత్రార్హుడై యున్నాడని మరెక్కడా ఏ గ్రంధాకర్త వాడలేదు.

దేవుడుఒక్కడే ఆయనే దేవునిగా నిరంతరము స్తోత్రర్హుడైయున్నాడు.

చెబుతారు కానీ చేయరు

*వారు చెప్పుదురే గాని చేయరు. మత్తయి-23:3* """"""""""""""""...