Friday, 19 April 2019

బోధించే వారు పాటించవలసిన జాగ్రత్తలు

*బోధకులకు ముందు జాగ్రత్తలు కొన్ని....

*ప్రసంగ సభకు వెళ్లేముందు దంతాలు నోరు తోముకుని వెళ్లాలి నోటికి సువాసనగా  ఉంచే లవంగం, దాల్చిన చెక్క, మౌత్ వాష్ వంటివి ఉపయోగించడం మంచిది

*చెమట కంపు రాకుండా అందరూ బాడీ స్ప్రే వంటివి ఉపయోగించడం ఆత్మీయతకు అడ్డం కాదు.

వేశ్యల వలే ఇంత ఇస్తే వస్తానని అనకూడదు

*బోధకునికి పని చేస్తున్న వాచి, జేబులో బాగా రాస్తున్న పెన్ను, శుభ్రమైన చేతి రుమాలు, పాదాలకు  కంపు కొట్టని సాక్స్, తనదైన చిన్న దువెన, తనతో ఉంచుకోవాలి

*అన్నపానాలు వద్ద చికాకులు చేయడం, కానుకలు విషయంలో పేచీ పెట్టటం, డిమాండ్లు చేయటం బోధకునికి తగదు.

*బోధనలో బంధుత్వాలు చెప్పుకోవడం వరుసలతో పిలుచుకోవటం సభా మర్యాద కాదు.

*బోధకుడు తన శత్రువులను సభలో బయట పెట్టుకోకూడదు.

*చర్చాగోష్టిలో తప్ప ప్రసంగంలో బోధకుడు శ్రోతలకు ప్రశ్నలు వేయటం తగ్గించాలి

*ప్రసంగంలో ఆవేశం, వేగం, కంటే స్పష్టత ముఖ్యం.అర్థమగు సామాన్య భాష అవసము.

*బోధ సమయంలో పాటలు పాడేవారు ఉపదేశానికి తగిన వచనాలని  పాడాలి గాని, అసందర్భమైనవి గాని, ఎక్కువ చరణాలు గాని పాడకూడదు.

*ప్రసంగం సమయంలో శ్రోతల ప్రోత్సాహంతో ఉప్పొంగిపోయి అంశాన్ని దారిమళ్ళించ కూడదు.

*సభల వాల్ పోస్టర్లు, వేరే వాల్ పోస్టర్లు మీద గాని, రోడ్ల సైన్ బోర్డులు మీద గాని అనుమతి లేని చోట్ల గాని అంటించుకు రాదు.రాజకీయ నాయకులవలె భారీగా తమ ఫొటోలు అతికించకూడదు.

*ఎదురెదురు మైకులు పెట్టుకొని ప్రసంగాలు చేయడం దేవుని నామానికి అవమానకరం.

*ఒకే తేదీల్లో ఒకే ప్రాంతంలో వేరు వేరు సంఘాలవారు పోటీగా సభలుకు వెళ్లడం వలన భేధాలు రాకుండా చూడాలి.

*నేనేమీ గొప్ప బోధకుని కాదు తప్పులు ఉంటే దయచేసి క్షమించండి అనే మాటలు బోధకుడు సభలో అనకూడదు.

*బోధకుడు ఆనాలోచనగా సభలకు తేదీలు ఇవ్వకూడదు మాట ఇచ్చి తప్పకూడదు.

*ప్రార్థించేటప్పుడు త్వరపడి మాటలాడకుండా, నిదానముగా అందరికొరకు ప్రార్థించడం క్షేమము.

*బోధకుడు సభకు ఆలస్యంగా వెళ్ళకూడదు. అందరికంటే ముందుగానే వెళ్లి, సరియైన సూచనలు కార్యవర్గంనకు ఇవ్వడం మంచిది.

*ఆహ్వానించని వారి ఇంటికి బోధకుడు ఒంటరిగా వెళ్లడము, ఆర్థిక బాధలు చెప్పుకోవడం మంచిది కాదు.

*దేవునికి ఇచ్చే కానుకలను బలవంతంగా కాకుండా మనస్పూర్తిగా ఇచ్చేటట్లు చూడాలి.

*అప్పులు చేయడం, అప్పులు ఇవ్వడం  జామీను ఉండడం వంటివి బోధకునికి బొత్తిగా తగవు.

బోధకుని విలువ అతని వస్త్రధారణ, వాహనములను బట్టి కాకుండా అతని సందేశము మీదే ఆధారపడి ఉంటుంది కనుక బాగా సిధ్ధపడాలి.

చెబుతారు కానీ చేయరు

*వారు చెప్పుదురే గాని చేయరు. మత్తయి-23:3* """"""""""""""""...