Tuesday, 7 July 2020

కృపావరములు

*పరిశుద్ధాత్మ-కృపావరములు.*
➖➖➖➖➖➖➖➖
🎤మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయువారినిగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాటలాడువారినిగాను నియమించెను. 
1వ కోరింథీ:12:28:
📍 పరిశుద్ధాత్మచే అనుగ్రహింపబడిన వరములను పరిశుద్ధాత్మ వరముతో తికమక చేయకూడదు.
📍 పరిశుద్ధాత్మవరము  *Dorea* అనే గ్రీకు పదమునుండి  తర్జుమా చేయబడినది.
📍దేవుని కుమారులకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ అనేవరము అంతరంగమందు నివసించు ఆత్మ .1వకొరింధీ :6:19:
📍 మనలో నివసించు ఆత్మ వలన. 2వ తిమోతి:1:14:
📍 మీలో నివసించు ఆత్మ.రోమా:8:9:
📍 పరిశుద్ధాత్మచే అనుగ్రహింపబడే వరములు *Chrisma* అనే గ్రీకు పదము నుండి తర్జుమా చేయబడినది.
📍 దైవికముగా అనుగ్రహింపబడే మానవాతీత శక్తులు. రోమా:12:6,7:
📍 *Chrisma* కృపా వరములు అనికూడా తర్జుమా చేయవచ్చు. రోమా:5:15;1వ పేతురు:4:10,11:
 *గమనిక:-* ఆత్మచే అద్భుతములు చేయ శక్తి పొందువరము కాదు. అంతరంగములో నివసించు ఆత్మ అను వరము.
📍 క్రైస్తవ జీవితం జీవించేలా క్రైస్తవుని బలపరుస్తుంది.
 మీరు అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లుగాను.ఎఫెస్సీ:3:15:
1️⃣ *నానా విధములైన వరములు* 
🔥 కృపావరములు నానా విధములుగా ఉన్నవిగాని ఆత్మ ఒక్కడే.1వ కోరింది:12:4:
🔥వివిధములైన కృపావరములు ఉన్నాయంటే, కోరింథీయులకు వివిధములైన ఆత్మలు ఉన్నాయని పౌలు యొక్క ఉద్దేశం కాదు.
🔥 పరిశుద్ధాత్మ కృపావరములు *9.* (1)బుద్ధి వాక్యము,(1వ కొరింధీ:12:8)(2)జ్ఞాన వాక్యము.(12:8)(3)విశ్వాసము.(12:9) (4) స్వస్థపరచు వరము.(12:9) (5)అద్భుత కార్యములుచేయు శక్తియు.(12:10)(6) ప్రవచన వరము(12:10)(7)ఆత్మల వివేచనము (12:10)(8)నానావిధ భాషలను.(12:10) (9)భాషల అర్థం చెప్పు శక్తియు.(12:10)
🔥 కొరింధీలో ఉన్న ఏ ఒక్క క్రైస్తవునికి ఈవరములన్నియు లేవు. ఆత్మ యొక్క ఇష్టానుసారముగా ఇవ్వబడ్డాయి.
🔥అయినను వీటినన్నిటిని ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచియిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. 
1వ కోరింథీ:12:11:
🔥 తన సొంతదైన యోగ్యతవల్లనో లేక సామర్ధ్యం వలననో ఆయా కృపావరములు కలిగియుండలేదని పొందినవారు గ్రహించవలసి యున్నది.
2️⃣  *కృపావరములు ఉద్దేశము* 
🔥 ఆత్మ సంబంధమైన పరిపక్వత పెంచుటకు సహాయపడునట్లు కృపా వరములు ఇవ్వబడ్డాయి.
🔥 కృపావరము- పొందినవాని స్వప్రయోజనము కొరకుగాక సంఘ ప్రయోజనము కొరకు ఉద్దేశించబడ్డాయి.
🔥 కృపావరము యొక్క ఉద్దేశము _క్షేమాభివృద్ధి,హెచ్చరికయు,ఆదరణ_ కలుగునట్లు ప్రవచించువారు మనుషులతో మాట్లాడుచున్నాడు.
🔥మీరు ఆత్మసంబంధమైన వరముల విషయమై ఆసక్తిగలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించునట్లు ప్రయత్నము చేయుడి. 
1వ కోరింథీ:14:12:
3️⃣ *కృపావరములు* 
🔥 _జ్ఞానవాక్యమనే_ కృపావరము.1వ కొరింధీ:12:8:
📍 ఆత్మద్వారా అందించబడిన దైవసందేశము.
📍 మానవ ప్రయాస వాని సామర్ధ్యం కంటే వ్యత్యాసంగా ఉంటుంది.
📍నేను మాటలాడినను సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తియ్యని మాటలను వినియోగింపక, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే వినియోగించితిని.
 పరిపూర్ణులైనవారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది యీ లోక జ్ఞానము కాదు, నిరర్థకులై పోవుచున్న యీ లోకాధికారుల జ్ఞానమును కాదుగాని 
1వ కోరింథీ :2:5,6:
📍ఏలాగనగా, యూదులమైనను, గ్రీసుదేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. 
1వ కోరింథీ:12:13:
🔥 _బుద్ధి వాక్యము._ 1వ కోరింధీ12:8;
📍 దైవికముగా ప్రసాదించబడిన తెలివి లేక బుద్ధి గ్రీకు భాషలో *Gnosis* అనే పదము నుండి తర్జుమా చేయబడినది.
📍 జ్ఞానముతో పాటు ఈ బుద్ధి క్రీస్తునందు గుప్తమైయున్నది. కొలస్సీ :2:3:
📍 మానవ తెలివికి మారుగా బుద్ధివాక్యమనేది దేవునికి సంబంధించిన ప్రత్యక్షతద్వారా బయలుపరచబడుతుంది.రోమా:11:33:
🔥 _ఆత్మచే ఇవ్వబడే విశ్వాసమనే_ కృపావరము.1వ కోరింధీ:12:9:
📍 దేవుని వాక్యము చదువుట ద్వారా కలిగిన విశ్వాసము కాదు.రోమా:10:17:
📍 విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వాడైయుండాలి.
📍మీరు ఏ విషయములో ఎదిరించువారికి బెదరక అందరును ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షము పోరాడుచూ ఏకమనస్సుగలవారై ఉండవలెను.ఈ విశ్వాసాన్ని పొందిన వారికి ప్రకృతికి అతీతమైన  శక్తి మనస్సు కలిగి ఉంటుంది.
🔥 _స్వస్థపరచు వరము_ 🔥 _అద్భుతములు చేయు శక్తియు_ ఆత్మవరములైయున్నాయి.దీనికి మరోసారి వివరణ ఇస్తాను.
🔥 _ప్రవచన వరం._ 
📍ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. 
 ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి.
2వ పేతురు:1:20,21:
📍 యొక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరనికొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించినయెడల దేవోక్తులు బోధించునట్లు బోధించవలెను.1వ పేతురు :4:10:
📍క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తలులుగాను, ప్రవక్తలనుగాను నియమించెను.ఎఫెస్సీ:4:12:
📍 క్రొత్త నిబంధన ప్రవక్తలు-
 మరియు యూదాయు సీలయుకూడ ప్రవక్తలై యుండినందున పెక్కుమాటలతో సహోదరుల నాదరించి స్థిరపరచిరి. 
అపో.కా:15:32:
📍 అపోస్తులులు ఏర్పరుచుకున్న ఏడుగురిలో ఒకడు, సువార్తికుడైన పిలుప్పుకు ప్రవక్తలుగా ఉన్న నలుగురు కన్యకలు అతనికుండిరి.వారు ప్రవచించువారు. అపో:కా:21:8,9:
📍ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాటలాడవచ్చును; తక్కినవారు వివేచింపవలెను. 
 అయితే కూర్చున్న మరియొకనికి ఏదైనను బయలు పరచబడిన యెడల మొదటివాడు మౌనముగా ఉండవలెను. 
 అందరు నేర్చుకొనునట్లును అందరు హెచ్చరిక పొందునట్లును మీరందరు ఒకని తరువాత ఒకడు ప్రవచింపవచ్చును. 
1వ కోరింథీ:14:29-31:
🔥 _ఆత్మలవివేచన అనే కృపావరము._ 
📍 ఈ కృపావరము గలవారు అబద్ధబోధకు,సత్య బోధకు మధ్య తారతమ్యాన్ని వేరు చేయగలవారై ఉంటారు.
📍ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. 
1వ యోహాను:4:1:
📍 ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ యేదో, భ్రమపరచు ఆత్మ యేదో తెలిసికొనుచున్నాము. 
1వ యోహాను:4:6:
📍 ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాటలాడవచ్చును; తక్కినవారు వివేచింపవలెను. 
1వ కోరింథీ :14:29:
🔥 _నానావిధ భాషలు మరియు భాషలకు అర్థం చెప్పుటయు_ చేర్చబడ్డాయి.1వ కొరింధీ:12:10:
📍ఈ కృపావరమును పొందినవారు తాము నేర్చుకొనని భాష మాట్లాడుతారు.
📍 లేదా అంతకు ముందు ఎరుగని భాషకు భావాన్ని చెబుతారు.
📍భాషతో ఎవడైనను మాటలాడితే, ఇద్దరు అవసరమైన యెడల ముగ్గురికి మించకుండ, వంతులచొప్పున మాటలాడవలెను, ఒకడు అర్థము చెప్పవలెను. 
 అర్థము చెప్పువాడు లేనియెడల అతడు సంఘములో మౌనముగా ఉండవలెను గాని, తనతోను దేవునితోను మాటలాడుకొనవచ్చును. 
1వ కోరింధీ.14:27,28:
📍 అర్థము చెప్పేవారు ఉంటేనే గాని భాష మాట్లాడుటకు వీలు లేదు.
📍కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకు సూచికయై యున్నది.
(ఇంకా ఉన్నది....!)
( *తరువాత అద్భుతములు మరియు భాషలు* )
   

చెబుతారు కానీ చేయరు

*వారు చెప్పుదురే గాని చేయరు. మత్తయి-23:3* """"""""""""""""...