*అన్య దేవతలు మరియు విగ్రహారాధనలు*
➿➿➿➿➿➿➿➿
🎤 ప్రియ సోదరులకు గమనిక.ఇశ్రాయేలు జనులు అన్య దేవతలను పూజించి తప్పిపోయిరి.అన్య దేవతల పేర్లు తెలుసుకోవడం ద్వారా మన ప్రసంగంలో *పుట్ నోట్* కు ప్రయోజనకరంగా ఉంటాయని ఆశిస్తున్నాను.
🍒 *అషేరాదేవి*(Asherah or Ashatorath) 1రాజు:18:17: అషేరాదేవి సముద్ర స్త్రీ గా పరిగణించబడెను.గిద్యోను తండ్రియైన యేవాషు ఈ దేవతను ఆరాధించుచుండెను.గిద్యోను అషేరాదేవి దేవత స్తంభమును నాశనము చేసెను.న్యాయాధి:6:24-32:
🍒 *అష్తారోతు* (Ashtorath) కనానీయుల దేవతయు బయలు యొక్క సహవాసి ఈ అష్తారోతు దేవతను ఇశ్రాయేలీయులు ఆరాధించుచుండగా సమూయేలు వారిని యెహోవా దేవుని వైపు మళ్ళించెను.1సమూ:7:3,4:
🍒 *బయలు దేవత* కనానీయుల ప్రధాన దేవతయైన ఈ బయలు దేవతకు ఏలియా కర్మేలు పర్వతము దగ్గర వీరి ప్రవక్తలందరిని వధించెను.యెహూ బయలు దేవతలను ఇశ్రాయేలీయుల మధ్యను లేకుండా పూర్తిగా నాశనము చేసెను.1రాజులు: 18:17-40;2రాజు:10:28:
🍒 *బయల్జెబూలు* (దయ్యములరాజు) యేసు దయ్యము పట్టిన గ్రుడ్డివాడిని, మూగవాడిని బాగు చేయగా అది చూసిన పరిసయ్యులు దయ్యములకు అధిపతియైన బయల్జెబూలు అని యేసు క్రీస్తును నిందించిరి.మత్త:10:25;12:24:
🍒 *దాగోను దేవుడు* ఫిలిష్తీయుల ముఖ్యమైన వ్యవసాయ దేవుడు. దాగోను గుడిలో దేవుని మందసము ఉంచగా, దేవుని మందసము విగ్రహమును నాశనము చేసెను. 1సమూ:5:1-7: సంసోను ఈ గుడిని పడగొట్టెను.న్యాయాధి: 16:23-30:
🍒 *అర్తెమిదేవి* (డయానా) అనేక రొమ్ములతో వికృతమైన ఆకారము కలిగి భూలోకమంతయు పూజింపబడుచున్న ఈ దేవతవిషయమై అపోస్తులుడైన పౌలు ఎఫెస్సీ పట్టణములో ప్రసంగించెను. అపో:కా:19:27-35:
🍒 *ద్యుపతి* (బృహస్పతి) లుస్త్రలోని ప్రజలు అపోస్తులుడైన పౌలు ఒక కుంటి వానిని స్వస్థపరచుటచూచి, పౌలుతోకూడ ఉన్న బర్నబాకు రోమీయులైన ద్యుపతి దేవత పేరు పెట్టిరి:అపో:కా:14:12,13:
🍒 *హెర్మే* ద్యుపతి కుమారుడైన హెర్మే పేరును లుస్త్రలో ముఖ్య ప్రసంగియైన పౌలుకు ఆ పట్టణ ప్రజలు పెట్టిరి.అపో:కా:14:12,13:
🍒 *మెరోదకు* బబులోనీయులకు ప్రధాన దేవుడు మరియు నెబుకద్నేజరుకు ఇష్టుడైన దేవుడు.యిర్మియా:50:2:
🍒 *మొలెకు దేవత* పరిశుద్ధ లేఖనములలో ప్రస్తావించబడిన అన్య దేవతలందరిలో హేయమైన, అమ్మోనీయుల దేవత. ఈ దేవతకు సొలోమోను యెరూషలేములో కొండమీద బలిపీఠము కట్టించెను.రాజు:11:7: మనిష్షే దేవుని నుండి వెడలిపోయి ఈ దేవతా విగ్రహాలకు తన కుమారులను బలియిచ్చెను.2దిన:వృ:28:1-4;33:6:
🍒 *నన్న దేవుడు* ఊరు పట్టణము యొక్క చంద్రదేవుడు. అబ్రహామును దేవుడు పిలువకమునుపు వారి పితరులు ఆరాధించారు. యెహోషు:24:2:
🍒 *నెబో* బబులోనీయుల దేవుడు.యేష:46:1:
🍒 *నిస్రోకు* అష్షూరు రాజైన సన్హెరీబు ఆరాధించు దేవత. 2రాజు:19:37:
🍒 *రిమ్మోను* సిరియనుముల సైన్యాధిపతియు కుష్టు రోగియైన నయమాను స్వస్థతపొందకమునుపు ఆరాధించిన దేవుడు. 2రాజు:5:15-18:
🍒 *తమ్మూజు దేవత* గర్భో త్పత్తి కలిగించు దేవత.యెహెజ్కే:8:14:
🍒 పేర్లులేని దేవతా విగ్రహములు.
📍రాహేలు తండ్రి ఇంట దొంగిలించిన గృహదేవతలు.ఆది:కా:31:19:
📍సినాయి కొండ వద్ద ఇశ్రాయేలీయులు తయారుచేసిన బంగారు దూడ. నిర్గమ:కా: 32!!అ!!
📍 యెరోబాము రెండు బంగారు దూడలను చేయించి ఒకటి బేతేలు నందు రెండవది దాను నందు ఉంచెను.1రాజు:12:28-31:
📍 నెబుకద్నేజరు దూరాయను మైదానములో నిలువబెట్టించిన బంగారు ప్రతిమ.
📍 పౌలు ఏథెన్స్ లో చూసిన పేరు తెలియని దేవతా విగ్రహము.అపో: కా:17!!అ!!
📍 కౄరమృగము
యొక్క ప్రతిమ.ప్రకట:13:14: