Friday, 19 April 2019

యోహాను సువార్త ఉద్దేశంలో యేసు దేవుడా?

*యోహాను సువార్తలొ*

యేసుక్రీస్తు దేవున్ని నా తండ్రి అంటేనే యూదులు దేవుడు  సొంత తండ్రి అని చెప్పడం వలన దేవునితో  సమానునిగా చేసుకుంటున్నాడు అని రాళ్లు వేసి చంప చూస్తే, (యోహాను 5:18)

అలాంటి యూదులకు సువార్త వ్రాస్తూ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని అనేక ఋజువులను చూపిస్తూ ఈ సువార్త వ్రాశాడు.
అంటే యేసు వారు ఎదురు చూస్తున్న మెస్సీయా అని వారి లేఖనాలలో ఉన్న క్రీస్తును ఋజువులతో ఒప్పించడానికి, వారు నమ్మెటట్టు ఒక పుస్తకమే వ్రాస్తే, వారిలో ఎంత మంది అంగీకరించారో లేదో కానీ....

అదే యోహాను
మొదటి అధ్యాయంలో యేసుని దేవుడని పరిచయము చేస్తే నమ్ముతారని యేసుని దేవుడని పరిచయం చేసి ఒక్క మాటలో వారిని ఒప్పించాలనే చూసి ఉంటాడా?

క్రీస్తు అంటేనే ఒప్పుకోకుండా సిలువ వేసిన వాళ్ళు, ఒక్కడే దేవుడని వేరొక దేవుని అంగీకరించడానికి కానీ, అలాంటి ఊహాని గాని, దేవునితో ఎవరైనా సమానునిగా చేసుకునే ఆలోచనను కూడా సహించని యూదులకు .... ఒక్క మాటలో యేసు దేవుడని చెప్పి ఉంటాడా!

అక్కడ యోహాను సువార్త ప్రారంభములో ఇద్దరు దేవుళ్లను పరిచయం చేస్తున్నాడా?
అలా పరిచయం చేస్తే గ్రంధములో మరెక్కడా యేసు ప్రభువు గానీ ఆయన శిష్యులు గానీ, గ్రంథ కర్త యైన యోహాను గాని యేసుక్రీస్తు దేవుడని ఎక్కడ వాడలేదు, అలాంటి భావన కూడా అన్నట్టు గాని గ్రంథ కర్త అలాంటి statement  కానీ వాడలేదు.

యేసే.... క్రీస్తు అని నిరూపించడానికి అపొస్తలులు ఎంతగా ఆరాటపడ్డారో చూడండి...

Acts 2:36: "36 *మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను.* ఇది ఇశ్రాయేలు వంశ మంతయు రూఢిగా తెలిసికొనవలెనని చెప్పెను."

Acts 5:42: "42 ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు, *యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి."*

TELOV Acts 17:2: "2 [2-3] గనుక పౌలు తనవాడుక చొప్పున సమాజపు వారియొద్దకు వెళ్లి– *క్రీస్తు శ్రమపడి* మృతులలోనుండి లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురముచేయు *యేసే క్రీస్తయియున్నాడనియు* *లేఖనములలోనుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు*, వారితో మూడువిశ్రాంతిదినములు *తర్కించుచుండెను.౹"*

Acts 18:5: "5 సీలయు తిమోతియు మాసిదోనియనుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురతగలవాడై, *యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చు చుండెను.*
Acts 18:28: *"యేసే క్రీస్తు అని లేఖనములద్వారా అతడు దృష్టాంతపరచి,* యూదుల *వాదమును* బహిరంగముగాను గట్టిగాను *ఖండించుచు వచ్చెను."*

Acts 4:27: "27 [27-28] ఏవి జరుగవలెనని *నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో,* వాటినన్నిటిని చేయుటకై *నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు* విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోను ఇశ్రాయేలు ప్రజలతోను ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి.౹

Acts 4:30: "30 రోగులను స్వస్థపరచుటకును, *నీ పరిశుద్ధ సేవకుడైన యేసు* నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములనుచేయుటకును నీ చెయ్యి చాచియుండగా, నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించునట్లు అనుగ్రహించుము.౹"

Acts 9:20: "20 వెంటనే సమాజమందిరములలో — *యేసే దేవుని కుమారుడని* ఆయననుగూర్చి ప్రకటించుచు వచ్చెను.౹

Acts 9:22: "22 అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి– *ఈయనే క్రీస్తు అని రుజువు పరచుచు* దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను."

TELOV Acts 25:19-20: "19 అయితే తమ మతమునుగూర్చియు, చనిపోయిన *యేసు అను ఒకనిగూర్చియు* ఇతనితో వారికి కొన్ని వివాదములున్నట్టు కనబడెను;౹
20 *ఆ యేసు బ్రదికియున్నాడని పౌలు చెప్పెను.* నేనట్టి వాదముల విషయమై యేలాగున విచారింపవలెనో యేమియు తోచక, యెరూషలేమునకు వెళ్లి అక్కడ వీటినిగూర్చి విమర్శింపబడుటకు అతని కిష్టమవునేమో అని అడిగితిని.౹"

TELOV Acts 28:23: "23 అతనికి ఒక దినము నియమించి, అతని బసలోనికి అతనియొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయమునుండి సాయంకాలమువరకు అతడు దేవుని రాజ్యమునుగూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు, *మోషే ధర్మశాస్త్రములోనుండియు ప్రవక్తలలోనుండియు సంగతులెత్తి యేసునుగూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను."*

---------------------------------------

పాత నిబంధన లేఖనాలా ఆధారంగా యేసే క్రీస్తు అని రుజువు చేస్తుంటేనే వారు అంగీకరించక పోతే.

యేసు దేవుడని నిజంగా అపొస్తలులు బోధించారా

పై సందర్భాలలో ఎక్కడైనా దేవుడైన యేసును క్రీస్తుగాను ప్రభువుగాను దేవుడు నియమించెను అన్నట్టుగా బోధించినట్టు ఉందా, కనీసం అలాంటి భావన అపొస్తలులు తమ సువార్త పరిచర్యలో కను పరిచారా.

దేవుడొక్కడే అని బోధించిన గ్రంధము
మరొకరిని దేవుడు అని చూపిస్తే గ్రంధాన్ని గ్రంధమే వ్యతిరేకించినట్టు కాదా!

మరి లేఖనాలలో యేసుక్రీస్తు కూడా దేవుడన్నట్టు ఉంది.

వాటి మూలలను, అక్కడ సందర్భాలను, అటువంటి సందర్భాలు గ్రంధములో ఎక్కడన్నా ఉన్నవా అక్కడ ఎవరి గూర్చి వ్రాయబడెను ఇలాంటి వాటిని విశ్లేషణ చేయవలసిందే.....

చెబుతారు కానీ చేయరు

*వారు చెప్పుదురే గాని చేయరు. మత్తయి-23:3* """"""""""""""""...