Friday, 19 April 2019

దేవుడొక్కడే

ద్వితీ.కాం.   4:35   "అయితే యెహోవా దేవుడనియు, *ఆయన తప్ప మరి యొకడు లేడనియు నీవు తెలిసికొనునట్లు* అది నీకు చూపబడెను."

ద్వితీ.కాం.   4:39   "కాబట్టి *పైనున్న ఆకాశమందును  క్రిందనున్న భూమియందును యెహోవాయే దేవుడనియు, మరియొక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకము నకు తెచ్చుకొనుము*"

నిర్గ.కాం.   34:14   "ఏలయనగా *వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు, ఆయన నామము రోషముగల యెహోవా; ఆయన రోషముగల దేవుడు."*

1 రాజులు   8:60  "అప్పుడు *లోకమందున్న జనులందరును యెహోవాయే దేవుడనియు, ఆయన తప్ప మరి ఏ దేవుడును లేడనియు తెలిసికొందురు."*

యెషయా   45:5   "నేను యెహోవాను, *మరి ఏ దేవుడును లేడు నేను తప్ప ఏ దేవుడును లేడు."*

యెషయా   45:18  *ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు;* ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిర  పరచెను నిరాకారముగానుండునట్లు *ఆయన* దాని సృజింప  లేదు నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను ఆయన సెలవిచ్చునదేమనగా *యెహోవాను నేనే మరి ఏ దేవుడును లేడు.*

యెషయా   45:21-22  "మీ ప్రమాణవాక్యములు నా సన్నిధిని తెలియ జేయుడి జనులు కూడుకొని ఆలోచన చేసికొందురు గాక; పూర్వకాలము మొదలుకొని ఆ కార్యమును తెలియ జేసినవాడెవడు?చాలకాలముక్రిందట దాని ప్రకటించినవాడెవడు? *యెహోవానగు నేనే గదా? నేను తప్ప వేరొక దేవుడు లేడు*  నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను *నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు"*
"భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి *దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు.*

🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅
*దేవుడు ఒంటరిగా సమస్తము జరిగించెను*
*God alone did everything*
🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎

నిర్గ.కాం.   22:20 యోహోవాకు *మాత్రమే* గాక వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు.

Exodus 22:20  `He who is sacrificing to a god, save to Jehovah *alone*, is  devoted.

ద్వితీ.కాం.   32:12   యెహోవా *మాత్రము* వాని నడిపించెను అన్యులయొక్క దేవుళ్లలో ఏ దేవుడును ఆయనతో  కూడ ఉండలేదు.

Deuteronomy 32:12   Jehovah *alone* doth lead him, And there is no strange god  with him.

2 రాజులు   19:15   "యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థనచేసెనుయెహోవా, కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమ్యా కాశములను కలుగజేసిన *అద్వితీయ దేవా*, నీవు లోక మందున్న సకల రాజ్యములకు దేవుడవైయున్నావు."

2 Kings 19:15  And Hezekiah prayeth before Jehovah, and saith, `O  Jehovah, God of Israel, inhabiting the cherubs, Thou [art] *God  Himself* -- *Thyself alone* -- to all the kingdoms of the earth:  Thou hast made the heavens and the earth.

2 రాజులు   19:19   యెహోవా మా దేవా; లోక మందున్న సమస్త జనులు *నీవే నిజముగా అద్వితీయ దేవుడ వైన యెహోవావని* తెలిసికొనునట్లుగా అతనిచేతిలోనుండి మమ్మును రక్షించుము.

2 Kings 19:19  And now, O Jehovah our God, save us, we pray Thee, out of  his hand, and know do all kingdoms of the earth that Thou [art]  Jehovah God -- *Thyself alone.'*

నెహె.   9:6  *నీవే,* *అద్వితీయుడవైన* యెహోవా, *నీవే* ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును, భూమిని దానిలో ఉండునది అంతటిని, సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటినన్నిటిని కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు *నీకే* నమస్కారము చేయుచున్నది."

కీర్తనలు   72:18 దేవుడైన యెహోవా ఇశ్రాయేలుయొక్క దేవుడు స్తుతింపబడును గాక *ఆయన మాత్రమే* ఆశ్చర్యకార్యములు చేయువాడు.

Psalms 72:18  Blessed is Jehovah God, God of Israel, *He alone* is doing  wonders,

కీర్తనలు   83:18  యెహోవా అను నామము ధరించిన *నీవు మాత్రమే* సర్వలోకములో *మహోన్నతుడవని* వారెరుగుదురు గాక.

Psalms 83:18  And they know that Thou -- *(Thy name [is] Jehovah -- by  Thyself,) [Art] the Most High over all the earth!*

కీర్తనలు   148:13   అందరును యెహోవా నామమును స్తుతించుదురు గాక *ఆయన నామము మహోన్నతమైన నామము* ఆయన ప్రభావము భూమ్యాకాశములకు పైగా నున్నది.

Psalms 148:13 They praise the name of Jehovah, For *His name alone* hath  been set on high, His honour [is] above earth and heavens.

యెషయా   2:11  నరుల అహంకారదృష్టి తగ్గింపబడును మనుష్యుల గర్వము అణగద్రొక్కబడును ఆ దినమున *యెహోవా మాత్రమే* ఘనత వహించును.

Isaiah 2:11 The haughty eyes of man have been humbled, And bowed down  hath been the loftiness of men, And set on high hath *Jehovah  alone been* in that day.

యెషయా   44:24   గర్భమునుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను *నేనొకడనే* ఆకాశమును విశాలపరచినవాడను నేనే భూమిని పరచినవాడను

Isaiah 44:24 Thus said Jehovah, thy redeemer, And thy framer from the  womb: `I [am] Jehovah, doing all things, Stretching out the  heavens by *Myself, Spreading out the earth -- who [is] with Me?*

మత్తయి 4:10  "యేసు వానితో-''సాతానా, పొమ్ము- ప్రభువైన నీ *దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను''*  అని వ్రాయబడియున్నది'' అనెను."

Matthew 4:10   Then Jesus said to him, "Away with you, Satan! For it is written, 'You shall worship the Lord your God, and *Him only you shall serve.'* "

యోహాను 5:44  *"అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక, యొకని వలన ఒకడు మెప్పుపొందుచున్న మీరు ఏలాగు నమ్మగలరు ?* నేను తండ్రి యొద్ద మీ మీద నేరము మోపుదునని తలంచకుడి;"

John 5:44 *How can you believe,* who receive honor from one another, and do not seek the honor that comes from the *only God?*

మార్కు 12:29, 32 "అందుకు యేసు ''ప్రధానమైనది ఏదనగా - ఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు,"
"ఆ శాస్త్రి- బోధకుడా, బాగుగా చెప్పితివి; *ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేనియు* నీవు చెప్పిన మాట *సత్యమే.*"

🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿

చెబుతారు కానీ చేయరు

*వారు చెప్పుదురే గాని చేయరు. మత్తయి-23:3* """"""""""""""""...