Friday, 19 April 2019

దేవుడొక్కడేనా? కాదా?

*దేవుడు ఒక్కడే ఆయన తండ్రి*
అని బైబిల్ చెప్పింది

అదే బైబిల్ లో మరో వ్యక్తిని కూడా దేవుడు గా చూపిస్తుంటే, అది ఎలా సాధ్యము అని ఆలోచించకుండా కొంత సమర్ధించుకుంటు, దేవుడే గాని మనకు దేవుడు కాదు, ఏంటి ఈ యుక్తి.

కాదా మరి ఎవరికి దేవుడు, దేవుడంటే ఎవరికో ఒకరికి దేవుడవ్వాలి కదా ...

మనకు దేవుడా కాదా అనేది తరువాత ప్రశ్న.

యేసు దేవుడనే కదా బోధ!

మరి దేవుడు ఒక్కడే అనే ఈ గ్రంధసంభందమైన బోధకు తూట్లు పొడవడము కాదంటారా?

పాత నిబంధనలో దేవుడొక్కడే అని లేఖనాలు చెబుతున్నవి.

లేఖనములు ఎరిగిన భక్తిగల ఏ యూదుడైనా వేరెవరిని దేవునిగా అంగీకరించడు.

యేసుక్రీస్తు  మానవుడిగా వున్నప్పుడు దేవత్వము కలిగి పాపము చేయకుండా జీవిస్తే......

1.దేవత్వం లేని మానవులు పాపము చేయకుండా బ్రతకడానికి దేవత్వమున్న యేసు ఎలా మాదిరి అవుతాడు.?

2.యేసుక్రీస్తు శరీరములో వున్నప్పుడు దేవుడైతే పాపము చేయకుండా ఉండడము పెద్ద గొప్ప సంగతేమి కాదుగదా!

3. దేవుడు పాపము చేయడము అసాధ్యము కదా!

4. దేవత్వము కలిగినవాడు పాపము ఎలా చేయగలడు?

5. తనలో ఉన్న దేవత్వము పాపము చేయించదు గదా!

6. దేవుడు శోధింపబడడు గదా, మరి యేసు క్రీస్తు మనవలెనే శోధింపబడ్డాడు కదా

7. అయితే ఆయన సంపూర్ణ మానవుడు అయిఉండాలంటే మనవలె దేవత్వము లేని వాడై యుండాల్సిందే కదా!

ఆయన మానవుడే అని అనేక వచనాలు ఉన్నాయి

నా next పోస్టులో ఆయన సంపూర్ణ మానవుడే అనే లేఖనాలు చూపుతాను.

యేసు దేవుడు కాబట్టి పాపము చేయకుండా బ్రతికాడు బ్రతకగలడు.

అయితే దేవుడు కాని మానవుని పాపము చేయకుండా ఉండాలని చెప్పే బోధకు ఏమైనా అర్ధము ఉన్నదా?

దేవుడై పాపము చేయకుండా బ్రతికిన యేసు....
దేవత్వము లేని మానవుని పాపము చేయకుండా బ్రతక మని చెప్పడము ఏంటో.

దేవత్వమున్న యేసు దేవత్వము లేని మానవునికి మాదిరి అని చెప్పడము అర్ధము లేని వింత బోధ విధానము కాదా!

యేసు దేవత్వము కలిగి ఉంటే సంపూర్ణమానవుడు ఎలా అవుతాడు?
ఎందుకంటే సంపూర్ణ మానవుల మైన మనకు దేవత్వము లేదు కదా?

భర్త ప్రమేయము లేకుండా కన్యకకు పుట్టడములోనే దేవత్వము కలిగి పుట్టాడు అని చెప్పబూనుకోవడమంటే, తల్లిదండ్రులు లేకుండా పుట్టిన ఆదాము  మరెంత దేవత్వముగల వాడు అవుతాడో కదా!

కన్యక గర్భములో పుట్టడము అనేది  దేవుడు మెస్సీయా కోసం ఎదురు చూస్తున్న వారికి *సూచన* గా చూపించడము కొరకే అని నమ్మాలి ఎందుకంటే లేఖనములో అది మాత్రమే ఉంది కాబట్టి అంతకంటే ఎక్కువ ఊహించకు.

తిత్వ సిద్దాంత భావజాలం విడవలేక పోవడమే.

బైబిల్ లో 6 చోట్ల యేసు క్రీస్తు దేవుడు అని వాడబడిన వచనాల్లో

గ్రీకు మూలాలు వాటిని సమర్ధించడం లేదు. గ్రీకు మూలల్లో ఉన్న సమస్యను చూడకుండా నమ్మేయడమేన!

తండ్రి యైన దేవుని గూర్చి యూదులకు, అపొస్తలులకు బాగానే తెలుసు ఆయన దేవుడని అయినప్పటికీ కొత్త నిబంధనలో దేవుడొక్కడే ఆయన తండ్రి ఆయనే సృష్టికర్త అని అన్ని పత్రికలలో అనేక సార్లు వాడబడితే....

భూమిపై మానవునిగా బ్రతికిన యేసుని ....ఇంతకు ముందు యేసుని గూర్చి ఏ మాత్రము అవగాహన లేని లోకానికి..... పాతనిబంధనలో ఎక్కడ కూడా యేసుని గూర్చి దేవుడుగా గుర్తించ లేనప్పుడు, మరి యేసును దేవుడని ఎన్నిసార్లు రాయబడలి, ఎంత ఖచ్చితంగా నిరూపించాలి.

యేసు దేవుడైతే కేవలము 6 చోట్లే రాయబడింది ఏంటి అనే common sence వాడ లేని మతజాడ్యపు ముసుకులోనుండి కళ్ళు తెరిచి బయటకు చూడు.

మూలాలు వెతుకు, సత్యాన్ని మరింత లోతుగా విశ్లేషణ చేయి అప్పుడురా సత్యమని సత్య సంభంధిగా.

తర్జుమా చేసినవాడు దేవుని సంకల్పము ఎరిగిన వాడేనా, లేఖనాన్ని గ్రీకు నుండి తీసుకుని తర్జుమా చేస్తున్నప్పుడు త్రిత్వ సిద్ధాంత మూలభావాలు మనసులోవుంటే ఎలా తర్జుమా జరిగుంటుందో ఆలోచించలేమా, నిరంతరము బైబిల్ చదువుతూ భోదించేవాడికే స్పష్టత కరువైతే భాషను తర్జుమా చేసేవాడు, గ్రంథ భావములోకి ఎలా తొంగి చూడగలడు, అక్షరాలను తనకున్న అప్పటి త్రిత్వసిద్ధాంత మనసు మూలాలనుండి తర్జుమా చేసి  పొరబాటు జరిగించి ఉండొచ్చుగా, గతములో సత్యమును పరిశీలించని మతశాఖలవారు గుడ్డిగా అనుసరించవచ్చు, మనము సత్యాన్ని పరిశీలిస్తున్నామే, జాగ్రత్త వహించాలి కదా అలా కాకుండా ఇప్పటి వరకు మనము నమ్మింది చాల్లే ఇంకా ఏమి లేదు అని అపోహలోనో ఊహల్లోనో విహరిస్తున్నమా!

మనకు భోదించేవారు ఏది చెబితే అదే సత్యమన్నట్టుగా అతుక్కుపోకు. వారు పరిశీలించారో లేదో మనం పరిశీలించాల్సిందే సుమా!

చెబుతారు కానీ చేయరు

*వారు చెప్పుదురే గాని చేయరు. మత్తయి-23:3* """"""""""""""""...