Friday, 19 April 2019

సృష్టికర్తలా? సృష్టికర్తనా?

*సృష్టికర్త ఒక్కడా లేదా ఎంతమంది మరి?*

Gen 1:26: "దేవుడు– *మన స్వరూపమందు* మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారు సముద్రపు చేపలను ఆకాశపక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను.౹"

ఇక్కడ మన అంటే త్రిత్వ దేవుళ్ళు ( అదే మరో భాషలో అయితే దేవత్వమున్న ముగ్గురు ) అని మనుష్యులను మోసము చేసే ఈ తరం బోధకులకి....

1.పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాలు వ్రాసిన ప్రవక్తలు గ్రహించకుండానే సృష్టికర్త ఒక్కడే అని, దేవుడు ఒక్కడే అని వ్రాసారా?
2. ఆ పుస్తకాలలో ఉన్న భక్తిపరుల మాటలలో గాని, వారి ప్రార్ధనలో గాని సృష్టి ముగ్గురి ద్వారా కలిగింది అన్నట్టు లేదేంటి?
3. త్రిత్వ దేవుళ్ళ సిద్ధాంత అభిప్రాయంతో మన అంటే ముగ్గురు అని బాగానే చమత్కరిస్తున్నారు...
4. కొత్త నిబంధనలో కూడా సృష్టికర్త ఒక్కడే, దేవుడొక్కడే అని బోధించిన అపొస్తలులకు తోచని వ్యాఖ్యానం .....నేటి బోధకులకి ఎవరి బయల్పాటు వలన తెలిసింది?
5. ముగ్గురు చేసినట్టు ఏ ఆధారంతో, ఏ లేఖనాల వివరణతో ఈ ముగింపుకు వచ్చారో?

వీటి వివరణ తెలియజేయగలరు?

Mat 19:4,6: "ఆయన— *సృజించినవాడు ఆదినుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెననియు* … కాబట్టి వారికను ఇద్దరుకాక ఏకశరీరముగా ఉన్నారు గనుక *దేవుడు జతపరచినవారిని* మను ష్యుడు వేరుపరచ కూడదని చెప్పెను."

యేసు క్రీస్తు మాటలలో సృజించిన వాడు అని దేవున్ని మాత్రమే అని చెబుతున్నాడేంటి.....

మన స్వరూపము అంటే ముగ్గురు కలిసి మానవులను చేసింది అని కదా చమత్కారపు బోధ.....

*మరి యేసుక్రీస్తు పై మాటలలో తాను కూడా మానవులను చేస్తే ..... తాను సృష్టికర్త అనే సంగతి మర్చిపోయాడా ఏంటి....*

యేసుక్రీస్తు తన తల్లి యైన మరియను ఆమె తల్లి గర్భములో దేవునితో కలిసి సృజించిన తరువాత.... ఆమె గర్భములో తాను జన్మించాడు అన్నమాట....
తాను భూమిమీద వున్నప్పుడు
సృజించే పనిలో యేసుక్రీస్తు leave పెట్టడం వలన....

ఇక ఆ పని దేవుడొక్కడే చేస్తున్నాడా.....

నా తల్లి గర్భమందు నిర్మించిన వాడవు నీవే అని దావీదు మాటలు అబద్దమై యుండాలి....

ఎందుకంటే...నా తల్లి గర్భమందు నన్ను నిర్మించింది మీరే అని పద ప్రయోగము చేయలేదుకదా 139 వ కీర్తనలో....

ఊహాలకి కొంత గ్రంధమాటలు అద్ది  బోధించి మోసం చేయకండి.....

గ్రంధసారాంశం మొత్తం గ్రహించి చూడండి.....

అక్షరము కనబడింది కదా అని నీవు నమ్మిన సిద్ధాంతానికి అతికించి బోధించి నీ బోధను బలపరుచుకోకు.....పరిశీలన చేసి...రూఢి పర్చుకో.....

రోమా 1: 18-24
అపో 17: 22- 31
పౌలు పై వచనాలు మాట్లాడుతున్నప్పుడు ఒక్కడే సృష్టికర్త అని మాట్లాడుతున్నాడేంటి, మిగతా ఇద్దరు సృష్టికర్తలను మర్చిపోయాడా ఏంటి?

దీనికి కూడా మీదగ్గర ఒక theory (సిద్ధాంతం లేదా కథ) ఉందా ఏంటి?

దేవత్వములో ముగ్గురు అనే కథల పుస్తకం బైబిల్ కంటే ఎక్కువ నాటుకున్నట్టుంది....

దాని నుండి బయటకు రాలేక దానిని సమర్ధించడానికి ఎన్ని తంటాలు పడుతున్నారో, లేని దాన్ని నిరూపించే ప్రయత్నాలకి, సొంత సిద్ధాంతాలతో గ్రూపులు కట్టడంలో మునిగి తెలుతున్నవారికి భజన పరులు చాలామందే ఉన్నారు..

చెబుతారు కానీ చేయరు

*వారు చెప్పుదురే గాని చేయరు. మత్తయి-23:3* """"""""""""""""...