*దేవుడు మనపాపములను తిరిగి జ్ఞాపకం చేసుకొనే అవకాశం ఉంది. జాగ్రత్త*
పాపక్షమాపణ దేవుడు మనకు పెట్టిన భిక్ష
క్రొత్తనిబంధనలో ప్రవేశించినవారికీ మాత్రమే ఈ వాగ్దానం సొంతం అవుతుంది
Hebrews(హెబ్రీయులకు) 8:10,11,12
10.ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటివారితో *నేను చేయబోవు నిబంధన* యేదనగా,వారి మనస్సులో నా ధర్మవిధులను ఉంచెదను వారి హృదయములమీద వాటిని వ్రాయుదును నేను వారికి దేవుడునై యుందును వారు నాకు ప్రజలై యుందురు.
11.వారిలో ఎవడును ప్రభువును తెలిసికొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశముచేయడు వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరును నన్ను తెలిసికొందురు.
12.నేను వారి *దోషముల విషయమై దయగలిగి* *వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసికొననని* ప్రభువు సెలవిచ్చుచున్నాడు.
నేను *దయ కలిగి* వారి పాపములు జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు దేవుడు
జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు గానీ.. మర్చిపోతాను అనడం లేదు..
ఆ పాపముల జోలికి ఇక నీవు వెళ్ళకూడదు
మరలా రేపకూడదు
దేవునికీ నీ గత పాపములు జ్ఞాపకం చేయకూడదు
నీవు నీ పనులను బట్టి దేవునికి నీపాపాలు జ్ఞాపకం చేసే అవకాశం ఉంది
అదిరెండురకాలుగా నీవు ఆయనకు జ్ఞాపకం చేయవచ్చు..
*1. నీయెడల అపరాధం చేసినవారిని నీవు క్షమించలేకపోతే...!!??*
Matthew(మత్తయి సువార్త) 18:32,33,34,35
32.అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించిచెడ్డ దాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని;
33. *నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసియుండెను* గదా అని వానితో చెప్పెను.
34.అందుచేత వాని యజమానుడు కోపపడి, తనకు అచ్చియున్నదంతయు చెల్లించు వరకు బాధ పరచువారికి వాని నప్పగించెను.
35.మీలో ప్రతివాడును *తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపనియెడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీయెడల చేయుననెను.*
క్రైస్తవ జీవితం క్షమాభిక్షతో కూడిన జీవితం
క్షమించే గుణం లేనివాడు క్రైస్తవుడు కాలేడు
క్షమించే స్వభావం నీకు లేకపోతే నీవు క్రైస్తవ జీవితం జీవించలేవు
నీవు నీ సహోదరుని క్షమించలేకపోతే.. నీ తండ్రియూ నీ పాపములు క్షమించడు. క్షమించినా నీ క్రియలవలన ఆయనకు తిరిగి జ్ఞాపకం తెచ్చినవాడవగుదువు.
*2, బుద్దిపూర్వకముగా పాపము చేస్తే..??*
Hebrews(హెబ్రీయులకు) 10:26,27
26.మనము *సత్యమునుగూర్చి అనుభవజ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినయెడల పాపములకు బలి యికను ఉండదు* గాని
27.న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును.
దేవుడు పాపాలను నీ పాపాలను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు
నీవు నీ ప్రవర్తనను బట్టి ఆయనకు తిరిగి జ్ఞాపకం చేయకు..