*దేవుడు అన్ని కాలములలో తన కృపను సత్యమును నానా విధములుగా బయలు పరిచెను.*
*తన కృపాసత్యము యొక్క సంపూర్ణతను క్రీస్తులో బయలుపరిచెను.*
John 1:1: "1 ఆదియందు (ఆరంభమందు) వాక్యముండెను, *వాక్యము* దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.౹"
1Jn 1:1-2: *జీవవాక్యమును* గూర్చినది, *ఆదినుండి (మొదటి నుండి) ఏది యుండెనో,* మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము.౹
*ఆ జీవము ప్రత్యక్షమాయెను;* తండ్రియొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్యజీవమును మేము చూచి, ఆ జీవమునుగూర్చి సాక్ష్యమిచ్చుచు, దానిని మీకు తెలియ పరచుచున్నాము.౹"
John 1:4: "4 *ఆయనలో జీవముండెను;* ఆ జీవము మనుష్యులకు *వెలుగైయుండెను.౹"*
John 1:5,9: " *ఆ వెలుగు* చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను. …
9 *నిజమైన వెలుగు* ఉండెను; *అది* లోకములోనికి వచ్చుచు ప్రతిమనుష్యుని *వెలిగించుచున్నది.౹"*
Tit 1:2: "2 [2-4] *నిత్యజీవమునుగూర్చిన* నిరీక్షణతోకూడిన భక్తికి ఆధారమగు సత్యవిషయమైన అనుభవజ్ఞానము నిమిత్తమును, దేవుని దాసుడును యేసుక్రీస్తు అపొస్తలుడునైన పౌలు, మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయునది. *ఆ నిత్యజీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాదికాలమందే వాగ్దానము చేసెను గాని*, యిప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటనవలన *తన వాక్యమును* యుక్తకాలములయందు బయలుపరచెను. తండ్రియైన దేవునినుండియు మన రక్షకుడైన క్రీస్తుయేసు నుండియు కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగును గాక."
John 1:14: " *ఆ వాక్యము* శరీరధారియై, *కృపాసత్యసంపూర్ణుడుగా* మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి౹"
🌷🕊🌼☘🌸🌺💐🌹🌴🌳🌿
Gen 24:26: "ఆ మనుష్యుడు తన తలవంచి యెహోవాకు మ్రొక్కి — అబ్రాహామను నా యాజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక; *ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు;* నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల యింటికి నన్ను నడిపించెననెను.౹"
Exo 34:6: "అతనియెదుట యెహోవా అతని దాటి వెళ్లుచు–యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన *కృపాసత్యములుగల దేవుడైన యెహోవా"*
2Sam 2:6: *"యెహోవా మీకు కృపను సత్యస్వభావమును అగపరచును,* నేనును మీరు చేసిన యీ క్రియనుబట్టి మీకు ప్రత్యుపకారము చేసెదను.౹"
2Sam 15:20: "నిన్ననే వచ్చిన నీకు, ఎక్కడికి పోవుదుమో తెలియకయున్న మాతోకూడ ఈ తిరుగు లాట యెందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము; *కృపాసత్యములు నీకు తోడుగా ఉండును గాక* యని చెప్పగా"
Ps 25:10: "ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొనువారి విషయములో *యెహోవా త్రోవలన్నియు కృపాసత్యమయములై యున్నవి"*
Ps 26:3: " *నీ కృప నా కన్నులయెదుట* నుంచుకొనియున్నాను *నీ సత్యము ననుసరించి నడుచుకొనుచున్నాను"*
Ps 40:10: "నీ నీతిని నా హృదయములో నుంచుకొని నేను ఊర కుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడిచేసియున్నాను *నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగుచేయలేదు."*
Ps 40:11: "యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు *నీ కృపాసత్యములు ఎప్పుడును నన్ను కాపాడునుగాక"*
Ps 57:3: "ఆయన ఆకాశమునుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును నన్ను మ్రింగగోరువారు దూషణలు పలుకునప్పుడు *దేవుడు తన కృపాసత్యములను పంపును.* (సెలా.)"
Ps 61:7: "దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించును గాక అతని కాపాడుటకై *కృపాసత్యములను నియమించుము."*
Ps 85:10: *"కృపాసత్యములు కలిసికొనినవి* నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దుపెట్టుకొనినవి."
Ps 86:15: "ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములుగల దేవుడవు దీర్ఘశాంతుడవు *కృపాసత్యములతో నిండినవాడవు"*
Ps 89:14: "నీతిన్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు *కృపాసత్యములు నీ సన్నిధానవర్తులు."*
Ps 115:1: "మాకు కాదు, యెహోవా మాకు కాదు *నీ కృపాసత్యములనుబట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక"*
Ps 138:2: "నీ పరిశుద్ధాలయముతట్టు నేను నమస్కారముచేయు చున్నాను నీ నామమంతటికంటె *నీవిచ్చిన వాక్యమును* నీవు గొప్పచేసియున్నావు. *నీ కృపాసత్యములనుబట్టి* నీ నామమునకు కృతజ్ఞతా స్తుతులు నేను చెల్లించెదను."
Prov 20:28: *"కృపాసత్యములు రాజును కాపాడును* కృపవలన అతడు తన సింహాసనమును స్థిరపరచు కొనును."
Isa 16:5: *"🌷కృపవలన సింహాసనము స్థాపింపబడును 🌱సత్యసంపన్నుడై దానిమీద కూర్చుండి తీర్పుతీర్చు నొకడు కలడు దావీదు గుడారములో అతడాసీనుడై న్యాయము విచారించుచు న్యాయము జరిగించుటకై తీవరించును."*
🌹☘🌹☘🌹☘🌹☘🌹☘
John 1:14: *"ఆ వాక్యము* శరీరధారియై, *కృపాసత్యసంపూర్ణుడుగా* మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి౹"
John 1:17: "ధర్మశాస్త్రము మోషేద్వారా అను గ్రహింపబడెను; *కృపయు సత్యమును యేసు క్రీస్తుద్వారా కలిగెను.౹"*
🌿🌳🌴🌹💐🌺🌸☘🌼🕊🌷