Monday, 29 July 2019

బైబిల్ vs సైన్స్

Truths...

1 ) భూమి శూన్యంలో వ్రేలాడుతుందని కోపర్నికస్ అనే శాస్త్రవేత్త క్రీ.శ. 1475 లో కనుగొన్నాడు. ఇదే విషయాన్ని ఎన్నో విజ్ఞాన విషయములు కనుగొన్న “సర్ ఐజక్ న్యూటన్” కూడా 17వ శతాబ్దములో భూమి శూన్యంలో వ్రేలాడుతుందని నిరూపించి తెలియజేసాడు. అప్పటి నుంచి విద్యార్ధులకు భూమి శూన్యంలో వ్రేలాడుతుందని చెప్పడం ప్రారంభించారు. అయితే ఇదే విషయాన్ని “పరిశుద్ధ గ్రంధమైన బైబిలు” క్రీ.పూ. 1500 సంవత్సరాల క్రితమే “యోబు” గ్రంధములో తెలియజేసింది.

శూన్యమండలముపైని ఉత్తరదిక్కుననున్న ఆకాశవిశాలమును ఆయన పరచెను శూన్యముపైని భూమిని వ్రేలాడచేసెను. (యోబు 26:7)

2 ) భూమి గుండ్రముగా ఉందని క్రీ. పూ. 3వ శతాబ్దంలో అరిస్టాటిల్ కొన్ని పరిశోధనలతో తెలియజేసినప్పటికి, కాదు బల్లపరుపుగా ఉందని మరి మరికొందరు శాస్త్రవేత్తలు క్రీ.శ. 16వ శతాబ్దము వరకు వాదిస్తూనే ఉన్నారు. ఇలాంటి వాదనలు ఉన్న సమయములో “గెలీలియో” అనే శాస్త్రవేత్త క్రీ.శ. 16వ శతాబ్దములో పలు ప్రయాసల చేత భూమి గుండ్రముగా ఉందని నిరూపించాడు. ఇదే విషయాన్ని “దైవ గ్రంధమైన బైబిలు” క్రీ.పూ. 1500 సంవత్సరాల క్రితమే  “యోబు” గ్రంధములో తెలియజేసింది.

ఆయనవలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్య మైన భూగోళము మీద మెరుపును మేఘములును సంచారము చేయును ఆయన వాటికి ఆజ్ఞాపించునది యావత్తును అవి నెర వేర్చును (యోబు 37:12).

ఆయన భూమండలముమీద ఆసీనుడై యున్నాడు. (యెషయా 40:22)
He that sitteth upon the circle of the earth (Issiah 40:22)

3 ) విలియం హార్వే క్రీ.శ. 1628 లో ప్రాణం రక్తములో ఉన్నదని చెప్పాడు. క్రీ.పూ. 14వ శతాబ్ధములోనే ఈ విషయాన్ని దేవుడు మోషే ద్వారా తన గ్రంధములో వ్రాయించాడు. (ఆదికాండము 9:4,5; లేవికాండము 17:11)

రక్తము దేహమునకు ప్రాణము (లేవీకాండము 17:11)

4 ) టెలీస్కోప్ ను కనిపెట్టకముందు మరియు కనిపెట్టిన (క్రీ.శ. 1600) తరువాత చాలా మంది నక్షత్రాలను లెక్కపెట్టడానికి ప్రయత్నించారు. ఎన్నో కోట్లు ఖర్చుపెట్టి, ఎన్నో ప్రయత్నాలు చేసి చివరకు క్రీ.శ. 20వ శతాబ్దములో నక్షత్రాలను లెక్కించలేమని విజ్ఞాన శాస్త్రవేత్తలు తెలియజేసారు. నక్షత్రాలను లెక్కించడం వీలు కాదని బైబిలు క్రీస్తు పూర్వమే తెలియజేసింది. (ఆదికాండము 15:5, యిర్మియా 33:22)

ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్టుగాను, సముద్రపు ఇసుకరేణువుల నెంచుట అసాధ్యమైనట్టుగాను, నా సేవకుడైన దావీదు సంతానమును, నాకు పరిచర్యచేయు లేవీయులను లెక్కింప లేనంతగా నేను విస్తరింపజేయుదును. (యిర్మియా 33:22)

5 ) 21వ శతాబ్దములో శాస్త్రవేత్తలు పరిశోధించి ఒక నక్షత్రమునకు, మరొక నక్షత్రమునకు బేధము కలదని, ఒకొక్క నక్షత్రము వేరు వేరు ఉష్ణం, కాంతి గలవని చెప్పకముందే బైబిలులో పరిశుద్దాత్మ దేవుడు ఈ విషయములను వ్రాయించాడు.

నూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమవేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమనుబట్టి యొక నక్షత్రమునకును మరియొక సక్షత్రమునకును భేదముకలదు (1 కొరింథీ 15:41)

6 ) క్రీ.శ. 1783 లో జోసెఫ్ మౌంట్ మరియు జాక్వస్ “బలూన్ (Balloon)”ని కనుగొన్న తరువాత గాలికి బరువు ఉన్నాదని ప్రపంచం మొత్తం తెలుసుకున్నారు. వీరు ఈ విషయాలను కనిపెట్టక పూర్వమే పరిశుద్ధ గ్రంధం బైబిలు క్రీ.పూ. 1500 సంవత్సరాల క్రితమే తెలియజేసింది.

గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించి నప్పుడు ప్రమాణమునుబట్టి జలములకు ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు (యోబు 28:25)

7 ) సముద్ర జలములు సూర్యవేడిమి చేత ఆవిరిగా మారి, మేఘములుగా మారి వర్షం కురిసి నదులు, సముద్రాలు నిండుతున్నాయి అని ఇది ఒక జల చక్రం అని క్రీ.శ. 17వ శతాబ్దములో మన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ విషయాన్ని బైబిలు క్రీస్తు పూర్వమే తెలియజేసింది. (కీర్తనలు 135:7; ప్రసంగి 1:7; యిర్మియా 10:13; యోబు 36:28).

నదులన్నియు సముద్రములో పడును, అయితే సముద్రము నిండుట లేదు; నదులు ఎక్కడనుండి పారివచ్చునో అక్కడికే అవి ఎప్పుడును మరలిపోవును (ప్రసంగి 1:7).

భూదిగంతములనుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే. వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే తన నిధులలోనుండి గాలిని ఆయన బయలువెళ్లజేయును. (కీర్తనలు 135:7)

ఇలాంటి విషయాలు ఎన్నో బైబిలులో కలవు. ఇవి కేవలం కొన్ని మాత్రమే. నేటి మానవులు అనేక పరికరాల ద్వారా, పరిశోధనల ద్వారా, టెక్నాలజీ ద్వారా “విశ్వ సంబందిత” విషయాలను కనుగొంటున్నారు. అయితే బైబిలు వ్రాసిన వ్యక్తులు ఎలాంటి టెక్నాలజీ లేని సమయములోనే, ఎలాంటి పరిశోధనలు లేకుండానే విశ్వ సంబందిత విషయాలను మరియు భవిష్యత్తు ప్రవచనాలను తెలియజేసారు. ఇదెలా సాధ్యం?

ఎందుకంటే వ్రాసింది వ్యక్తులే అయినా, వారి చేత వ్రాయించింది మాత్రం దేవుడే. అందుకే బైబిలును దైవ గ్రంధం అని, ఇలాంటి విషయాలను దేవుడు మాత్రమే ముందుగానే వ్రాయించగలడని కొన్ని శతాబ్దాలుగా శాస్త్రవేత్తలు  తమ నోటితో ఒప్పుకొంటూనే ఉన్నారు.
అందును బట్టి  బైబిల్ ని ఊరికే విమర్శించే వట్టి మాటలు కట్టిపెట్టి బైబిల్ ని చదివి నిత్యజీవానికి మార్గన్ని కనుగొనండి... అప్పుడు మీరే మీ నోటితో ఒప్పుకుంటారు బైబిల్ మాత్రమే సత్యం అని..

Wednesday, 24 July 2019

సంఘ పెద్దలు

*సంఘ పెద్దలు అనగా నేమి? అందరూ పెద్దలా??*🖲🖲🖲

👑సర్వశక్తిమంతుడు, సకల చరాచర సృష్త్తిని ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న శ్రీమంతుడైన దేవునికి స్తోత్రములు🛐🛐🛐మరియు తను పంపిన లోక రక్షకుడు, విమోచకుడైన క్రీస్తు యేసు నామములో ప్రియులందరికీ శుభములు🙏🏽🙏🏽🙏🏽.

1) సంఘంలో *పెద్దలు* ఉండటం ఆనవాయితీయే గాక వాక్యం కూడా బోధించుచున్నది. ప్రతి పట్టణంలో *పెద్దలను* నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చితిని (తీతు 1:5). యేసు రక్తము చేత కడగబడి లోకానికి వేరుగా జీవించువారైన క్రైస్తవులు దేవుని సంఘంగా పిలవబడుతూ, వారిలోని *ఉత్తములను వాక్యమును బట్టి పెద్దలనుగా* ఎన్నుకొని వారి పరిపాలన క్రింద సంఘముగా ఉందురు.

🖲సంఘ పెద్దలు బైబిల్ లో వివిధ పేర్లతో పిలవబడుతున్నారు.👇🏿

*సంఘ పెద్దలు*🖲🖲

తీతుకు 1: 5
నేను నీకాజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్నవాటిని దిద్ది, ప్రతి పట్టణములోను *పెద్దలను నియమించు* నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చితిని.
(అపో 20: 17)
అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి *సంఘపు పెద్దలను* పిలిపించెను.
1పేతురు 5: 1
*తోటి పెద్దను*, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనునైన నేను మీలోని *పెద్దలను* హెచ్చరించుచున్నాను.

2) *అధ్యక్షులు*🖲🖲

*సంఘ పెద్దలను దేవుని వాక్యము అధ్యక్షులుగా* పిలుస్తున్నది. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన *సంఘమును కాయుటకు మిమ్ములను *అధ్యక్షులుగా* ఉంచెను. అపో 20: 28.
ఫిలిప్పీలో ఉన్నక్రీస్తు యేసునందలి సకల *పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును* క్రీస్తుయేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. (ఫిలిప్పీ 1: 1)
1తిమోతికి 3: 1
ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించినయెడల అట్టివాడు *దొడ్డపనిని* అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది.

3) *నాయకులు*🖲🖲
సంఘ పెద్దలను సంఘ నాయకులుగా వాక్యము పిలుచుచున్నది.
మీ పైన *నాయకులుగా* ఉన్న వారిని జ్ఞాపకము చేసికొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు, వారి విశ్వాసం అనుసరించుడి. ఎందుకనగా మీ పైన *నాయకులుగా* ఉన్న వారు లెక్క చెప్పవలసిన వారి వలె *మీ ఆత్మలను కాయుచున్నారు*. అందువలన వారి మాట విని, వారికిలోబడి యుండుడి.
హెబ్రీయులకు 13: 7
మీకు దేవుని *వాక్యము బోధించి, మీపైని నాయకులుగా* ఉన్నవారిని జ్ఞాపకము చేసికొని, వారి ప్రవర్తన ఫలమును(లేక, వారు అంతమువరకు నడుచుకొనిన రీతిని) శ్రద్ధగా తలంచుకొనుచు, వారి విశ్వాసమును అనుసరించుడి.
హెబ్రీ 13: 17
*మీపైని నాయకులుగా* ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసినవారివలె మీ ఆత్మలను కాయుచున్నారు; వారు దుఃఖముతో ఆ పని చేసినయెడల మీకు నిష్‌ప్రయోజనము గనుక దుఃఖముతో కాక, ఆనందముతో చేయునట్లు వారి మాట విని, వారికి లోబడియుండుడి.
హెబ్రీ 13: 24
*మీ పైని నాయకులైన* వారికందరికిని పరిశుద్ధులకందరికిని నా వందనములు చెప్పుడి.

4) *కాపరులు*🖲🖲

సంఘమును కాయు పెద్దలు...
అధ్యక్షులుగాను.. నాయకులుగాను.. మరియు కాపారులుగాను.... వాక్యమందు పిలువబడుచున్నారు. సంఘమనే దేవుని మందను దేవుని యందలి బయముతో వాక్యమును బట్టి కాయవలెను. పెద్దలు అధ్యక్షులు నాయకులు వివిధ పేర్లతో పిలువబడుతున్న వీరు సంఘమునకు కాపారులుగా వాక్యమందు వ్రాయబడినది.

5) 1పేతురు 5: 2
బలిమిచేత కాక దేవుని చిత్తప్రకారము ఇష్ట పూర్వకముగాను, దుర్లాభా పేక్షతోకాక సిద్ధమనస్సుతోను, మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి.
మీకు అప్పగింపబడినవారిపైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి;
అపో 20: 28 *తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో* ఆ యావత్తు మందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి.
హెబ్రీ 13: 17
*మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసినవారివలె మీ ఆత్మలను కాయుచున్నారు*; వారు దుఃఖముతో ఆ పని చేసినయెడల మీకు నిష్‌ప్రయోజనము గనుక దుఃఖముతో కాక, ఆనందముతో చేయునట్లు వారి మాట విని, వారికి లోబడియుండుడి.

6) పై వాక్యమును పరిశీలిస్తే.... *పెద్దలు, అధ్యక్షులు, నాయకులు గా పిలవబడుతున్న వీరే సంఘ కాపరులు*. అనగా వాక్యమును బట్టి దేవుని సంఘమును కాయుచున్నారని దేవుడు రాయించెను.

7) *సంఘములోని వారిని పెద్దలుగా గుర్తించుట ఎట్లు?*🖲🖲🖲🖲

నేడు మనం ఆరాధనకు సంఘముగా కూడుకొను అనేక చోట్ల లోని పెద్దలను చూస్తున్నాము. వారు విద్యను బట్టి ఉన్నత ఉద్యోగంని బట్టి అంతస్తు పలుకుబడిని బట్టి కాలాన్ని బట్టి ఎన్నికలను బట్టి సంఘ పెద్దల అధ్యక్షతను వారికిచ్చుట జరుగుచున్నది.
అక్కడ జరుగుతున్న
మరో ఘోర కలిని మీరు తెలుసుకొనవచ్చు. సంఘమునకు కాపరి ఒకరు ఉండగా.. సంఘ పెద్దలు మరికొంత మంది కాగా.. వారిలో ఏఒక్కడో అధ్యక్షపదవిని కలిగి ఉండును. వీరి దృష్టిలో కాపరి వేరు, అధ్యక్షుడు వేరు, సంఘ పెద్దలు వేరు అని అర్థం. కాపరి కావడానికి వేదాంత కళాశాలలో సర్టిఫికెట్ పొందినవాడు అర్హుడు. కాగా మిగిలిన వారికి ముందుగా వ్రాసినట్లు లోక సంబంధమైన ఆధిక్యతలు అను అర్హత కలిగి ఉండాలి.

8) కాపరి, పెద్ద, అధ్యక్షుడు, నాయకుడు, అను బైబిల్ లోని వివిధ పేర్లతో పిలువబడిన వాటన్నిటికీ ఓకే అర్థం ఇచ్చినట్టు సంఘమును సంరక్షించు వారుగా ఉన్నారు.
ఇకపోతే *లోక సంబంధమైన అర్హతను బట్టి వీరిని నియమించుట దేవుని దృష్టికి పెద్ద నేరం* అవుతుంది.

దేవుడు రాయించి ఇచ్చిన వేద గ్రంధాన్ని పరిశీలిస్తే....
వీరి అర్హతలు కొట్టవచ్చినట్లుగా కనబడుతున్నవి. ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల, అట్టి వాడు దొడ్డ పనిని ఆపేక్షించుచున్నాడు అన్నమాట నమ్మదగినది.

9) ఈ క్రింది👇🏿 *అర్హతలున్న వారిని* సంఘమును కాయు బాధ్యతలో ఉంచవచ్చు.

1 నింద రహితుడు.
2 ఏక పత్ని పురుషుడు.
3 మితానుభావుడు.
4 స్వస్థ బుద్ధి కలవాడు.
5 మర్యాదస్తుడు.
6 అతిధి ప్రియుడు.
7 బోధించ తగినవాడు.
8 మధ్యపాని కానీ వాడు.
9 కొట్టువాడు కాకూడదు.
10 సాత్వికుడు.
11 జగడమాడనివాడు.
12 ధనాపేక్ష లేనివాడు.
13 ఒకరికంటే ఎక్కువ పిల్లలను కలిగి, ఆ పిల్లలు ప్రభువును నమ్మి, వారిని తనకు లోబరుచుకొను వాడు.
14 తన యింటి వారినందరిని బాగుగా ఏలువాడు.
(నా కుటుంబం లోని కొందరు నా మాట వినట్లేదని చెప్పకూడదు) ఎందుకంటే తన ఇంటి వారినే ఏల లేని చేతగానివాడు దేవుని సంఘంమును ఏలాగు పాలించును?)
15 గర్వాంధుడు కాకూడదు
16 కొత్త సభ్యుడై ఉండకూడదు
17 సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందినవాడు.
18 నేరము మోపబడని వారు.
19 వాక్యమునకవిధేయుడై ఉండకూడదు.
20 స్వేచ్చాపరుడు కాకూడదు. (నా ఇష్టం అనే వాడు)
21 ముక్కోపి కాకూడదు.
22 ఉత్తములను ప్రేమించువాడు.
23 నీతిమంతుడు.
24 పవిత్రుడు.
25 వాక్యం ఎరిగినవాడు.

అను బైబిలు అర్హతలు కలిగిన వారు మాత్రమే *సంఘమునకు పెద్దగా* నియమించబడవచ్చు. *ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా వారు సంఘ పెద్దలుగా నియమించబడకూడదు.*
1తిమోతికి 3: 1
తీతు 1:5

10) దేవుని వాక్యమును ఎరుగక, పట్టించుకోక, ఆ.... ఎవరైతేలే అంటూ....

🔥పెళ్లి కాని వారు,
🔥పెళ్లి అయి పిల్లలు లేనివారు,
🔥పిల్లలు ఉండి..ఆ పిల్లలు విశ్వాసులుగా ఉండక దేవునికి లోబడనివారు,....

ఇలా ఎన్నో అర్హతలు లేని వారు, సంఘాలకు అధ్యక్షులుగా, కాపరులుగా, నాయకులుగా,
పెద్దలుగా....
వివిధ పదవులను అలంకరించి
వాక్యమును విభజించి స్వకీయ నాశనమునకు పరుగెత్తుతున్నారు.

బైబిల్ ను ప్రమాణ గ్రంథంగా పట్టుకొని, అందు చెప్పబడని... మానవ కల్పిత జ్ఞానము అనగా.... *సాతాను బొధలను నమ్మి ఘటసర్పమును పూజిస్తున్నారు*. దేవునికి ఆలయమైన సంఘంలో...సాతాను సింహాసనముండుట దురదృష్టకర పరిణామం.
(2థెస్స 2: 4)
ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో, దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికిపైగా వాడు తన్నుతానే హెచ్చించుకొనుచు, *తాను దేవుడనని* తన్ను కనుపరచుకొనుచు, *దేవుని ఆలయములో కూర్చుండును*. గనుక ఏవిధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి.🙏🏽🙏🏽🙏🏽

Wednesday, 17 July 2019

దేవుని లక్షణములు

*దేవుని ఎవరు అంటే...*
➖➖➖➖➖➖

1. ఆది: 43:14
*సర్వ శక్తుడైన దేవుడు*
2. నిర్గమ: 15:3
*యుద్ద శూరుడైన దేవుడు*
3. నిర్గమ: 15:11
*పరిశుద్దతను బట్టి మహానీయుడైన దేవుడు*
4. నిర్గమ: 15:11
*స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడైన దేవుడు*
5. నిర్గమ: 15:11
*అద్భుతములు చేయు దేవుడు*
6. నిర్గమ: 34:14
*రోషము గల దేవుడు*
7. సంఖ్యా : 23: 19
*మాట ఇచ్చి స్థాపించు దేవుడు*  8. ద్వితి : 4: 7
*సమీపంగా ఉండే దేవుడు*
9. ద్వితి : 4: 31
*కనికరము గల దేవుడు*
10. ద్వితి : 7: 9
*కృప చూపు దేవుడు*
11. ద్వితి : 7: 9
*నమ్మదగిన దేవుడు*
12. ద్వితి : 10: 17
*మహా దేవుడు*
13. ద్వితి : 10: 17
*పరమ దేవుడు* 
14. ద్వితి : 10: 17
*పరమ ప్రభువు*
15. ద్వితి : 10: 17
*పరాక్రమ వంతుడైన దేవుడు*
16.  ద్వితి : 10: 21
*కీర్తనీయుడైన దేవుడు*
17. ద్వితి : 31:8
*విడువని, ఎడబాయని దేవుడు*
18.  ద్వితి : 32: 4
*నమ్ముకొన దగిన దేవుడు*
19. ద్వితి : 32: 4
*ఆశ్రయ దుర్గమైన దేవుడు*
20.  ద్వితి : 32: 4
*నీతిపరుడైన దేవుడు*
21. ద్వితి : 32: 4 *యధార్ధవంతుడైన దేవుడు*
22.  ద్వితి : 32: 6
*సృష్టికర్తయైన దేవుడు*
23. ద్వితి : 32: 8
*మహోన్నతుడైన దేవుడు*
24. ద్వితి : 32: 18
*మనలను కన్న తండ్రియైన దేవుడు*
25. ద్వితి : 32:39
*బ్రతికించే దేవుడు*
26. ద్వితి : 32:39
*స్వస్థపరచే దేవుడు*
27. ద్వితి : 33:27
*శాశ్వతుడైన దేవుడు* 
28. ద్వితి: 33: 29
*సహాయకరమైన కేడెము*
29. యెహో:3:11
*జీవము గల దేవుడు*
30. యెహో:22:22
*దేవుళ్లలో యెహోవాయే దేవుడు*
31. యెహో: 24: 19
*పరిశుద్ధ దేవుడు*
32.  I సమూ : 2: 3
*అనంత జ్ఞానియగు దేవుడు*
33. I సమూ : 2: 3
*క్రియలను పరీక్షించు దేవుడు*
34.  I సమూ : 2: 6
*జనులను సజీవులు గాను మృతులు గాను చేయు దేవుడు*
35. I సమూ : 2: 7
*ఐశ్వర్యమును కలుగ చేయు దేవుడు* 
36. I సమూ : 2: 8
*పైకి లేవనెత్తే దేవుడు*
37. I సమూ : 2: 9 
*భక్తులను కాపాడు దేవుడు*
38.  II సమూ : 22: 31 *నిర్మలమైన వాక్కు గల దేవుడు*
39. II సమూ : 22: 33
*బలమైన కోటగా గల దేవుడు*
40.  II సమూ : 22: 47
*స్తోత్రార్హుడైన దేవుడు*
41. II సమూ : 22: 47
*రక్షణాశ్రయ దుర్గమైన  దేవుడు*
42.  II దిన : 2:5
*సకలమైన దేవతలకంటే మహనీయుడైన దేవుడు*
43. నేహెమ్య: 2: 20
*ఆకాశమందు నివాసియైన  దేవుడు* 
44. యోబు : 36: 5
*బలవంతుడైన దేవుడు*
45. యోబు : 36: 5
*బహు బలమైన వివేచనా శక్తి గల దేవుడు* 
46. యోబు : 36: 22
*శక్తిమంతుడైన దేవుడు*
47. యోబు : 36: 22
*ఘనత వహించిన దేవుడు*
48.  యోబు : 37: 23
*మహాత్మ్యము గల దేవుడు*
49. యోబు : 37: 23 *అగోచరుడైన దేవుడు*  
50. కీర్తన : 18: 2
*శైలము, కోట, రక్షించువాడు, కేడెము, రక్షణ శృంగము, ఉన్నత దుర్గమైన దేవుడు*  
51. కీర్తన : 18:28
*నా దీపము వెలిగించు దేవుడు*
52.  కీర్తన : 29:3
*మహిమ గల దేవుడు*
53. కీర్తన : 44:21
*హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు*
54. కీర్తన : 46:1
*నమ్ముకొనదగిన సహాయకుడైన దేవుడు*
55. కీర్తన : 47:7
*సర్వ భూమికి రాజై ఉన్న దేవుడు*
56. కీర్తన : 48:14
*సదా కాలము దేవుడై ఉన్న దేవుడు*
57. కీర్తన : 48:14
*మరణం వరకు మనలను నడిపించు దేవుడు* 
58. కీర్తన : 50:6
*న్యాయ కర్తయై  ఉన్న దేవుడు*
59. కీర్తన : 59:17
*ఎత్తైన కోటగా ఉండు దేవుడు*
60. కీర్తన : 59:17
*కృప గల దేవుడు*
61. కీర్తన : 76:1
*గొప్ప నామము గల ప్రసిద్ధుడైన దేవుడు* 
62. కీర్తన : 95:3
*దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజై ఉన్న దేవుడు*
63. కీర్తన : 116:5
*దయాళుడైన దేవుడు* 
64. కీర్తన : 116:5
*వాత్సల్యత గల దేవుడు*
65. కీర్తన : 24: 10
*మహిమ గల రాజై ఉన్న దేవుడు*
66. కీర్తన : 8: 7
*సింహసనాసీనుడై ఉన్న దేవుడు* 
67. కీర్తన : 25: 8
*ఉత్తముడైన దేవుడు*
68. కీర్తన : 145:9
*అందరికి ఉపకారి అయిన దేవుడు*
69. కీర్తన : 37: 28
*న్యాయమును ప్రేమించు దేవుడు*
70. కీర్తన : 47:2
*సర్వ భూమికి మహారాజై ఉన్న దేవుడు*
71. కీర్తన : 72:18
*ఆశ్చర్య కార్యములు చేయు దేవుడు* 
72. కీర్తన : 84:11
*సూర్యుడును, కేడెమునై ఉన్న దేవుడు*
73. కీర్తన : 96:4
*అధిక స్తోత్రము పొంద తగిన దేవుడు*  
74. కీర్తన : 96:4
*సమస్త దేవతల కంటెను పుజ్యనీయుడైన దేవుడు*
75. కీర్తన : 111: 4
*దయా దాక్షిణ్య పూర్ణుడైన దేవుడు* 
76. కీర్తన : 132: 12
*మాట తప్పని దేవుడు*
77. కీర్తన : 145:8
*దయా దాక్షిణ్యములు గల దేవుడు* 
78. కీర్తన : 145:8
*దీర్ఘశాంతుడైన దేవుడు*
79. కీర్తన : 145: 8 *కృపాతిశయము గల దేవుడు*   80. కీర్తన : 147: 6
*దీనులను లేవనెత్తు దేవుడు*
81. సామె : 17: 3
*హృదయ పరిశోధకుడైన దేవుడు*
82. ప్రసంగి: 2: 26
*జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించు దేవుడు*
83. ప్రసంగి: 6:2
*ధన ధాన్యసమృద్దిని, ఘనతను అనుగ్రహించు దేవుడు* 
84. యెషయ: 12:2
*రక్షణకు కారణ భూతుడగు దేవుడు* 
85. యెషయ: 12:2
*నా కీర్తనకాస్పాదమైన దేవుడు*
86.  యెషయ: 12:2 *రక్షణాధారమైన దేవుడు*
87. యెషయ: 12:6
*ఘనుడై ఉన్న దేవుడు* 
88. యెషయ: 40:28
*భూ దిగంతములను సృజించిన వాడు*
89. యెషయ: 40:28
*నిత్యుడగు దేవుడు*
90. యెషయ: 40:28 *సొమ్మసిల్లని, అలయని దేవుడు* 
91. యెషయ: 60:19
*నిత్యమైన దేవుడు* 
92. యెషయ: 49:14
*న్యాయ కర్తయైన దేవుడు*
93. యెషయ: 26:4
*నిత్యాశ్రయ దుర్గమైన దేవుడు* 94. యెషయ: 33 :5 
*మహా ఘనత నొందియున్న  దేవుడు*
95. యెషయ: 33:22
*శాసన కర్త, న్యాయాధిపతియైన దేవుడు*  96. యిర్మియా: 10:10
*నిజమైన దేవుడు*
97. యిర్మియా: 10:10
*జీవము గల దేవుడు* 
98. యిర్మియా: 11:20 *జ్ఞానేంద్రియములను, హృదయములను శోదించు దేవుడు*
99. దాని: 2:20
*జ్ఞాన బలములు గల దేవుడు*  100. దాని: 2:47
*దేవతలకు దేవుడును, రాజులకు ప్రభువును, మర్మములు బయలు పరుచు దేవుడు*
101. దాని:3:28
*పూజర్హుడైన దేవుడు* 
102. దాని: 6:26
*యుగ యుగములు ఉండు దేవుడు*
103. ఆమోసు: 9:6
*ఆకాశ మండలమునకు భూమియందు పునాదులు వేయు దేవుడు* 
104. ఆమోసు: 9:6
*సముద్ర జలములను పిలచి వాటిని భూమి మీద ప్రవహింప చేయు దేవుడు*
105. మీకా: 7:7
*ప్రార్ధన ఆలకించు దేవుడు* 106. నహుము : 1:3
*మహా బలము గల దేవుడు*
107. లూకా: 12:24
*పోషించు దేవుడు*
108. అపో కా : 2: 23
*భవిష్యత్ జ్ఞాని అయిన దేవుడు*
109. అపో కా : 13:౩౦ *మృతులలో నుండి యేసును లేపిన దేవుడు* 
110. అపో కా : 15:8 *హృదయములను ఎరిగిన దేవుడు*
111. అపో కా : 17:24
*జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు*
112. రోమా: 15:6
*ఒర్పునకును, ఆదరణకును కర్త యగు దేవుడు*
113. రోమా: 15:13
*నిరీక్షణ కర్తయగు దేవుడు*
114. రోమా: 15:33
*సమాధాన కర్తయగు దేవుడు*
115. II కొరిం : 1: 3
*కనికరము చూపు తండ్రియైన దేవుడు* 
116. II కొరిం : 9 : 10
*విత్తు వానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు*
117. II కొరిం : 13: 11
*ప్రేమ, సమాధానములకు కర్తయగు దేవుడు*
118. ఎఫెస్సి: 1:3
*మన ప్రభువైన యేసు క్రీస్తుకు తండ్రి అయిన దేవుడు*
119. ఎఫెస్సి: 2:4
*కరుణా సంపన్నుడైన దేవుడు*  120. ఎఫెస్సి: 4:6
*అందరికి తండ్రియు, ఒక్కడై ఉన్న దేవుడు*
121. ఎఫెస్సి: 4:6
*అందరికి పైగా ఉన్న దేవుడు*  122. ఎఫెస్సి: 4:6
*అందరిలోనూ వ్యాపించి ఉన్న దేవుడు*
123. ఎఫెస్సి: 4:6
*అందరిలో ఉన్న దేవుడు* 
124. I తిమో : 1: 8
*శ్రీమంతుడగు దేవుడు*
125. హెబ్రీ : 11: 10
*పునాదులు గల పట్టణమునకు శిల్పియు, నిర్మాణకుడైన దేవుడు* 
126. I పేతురు : 5: 10
*సర్వ కృపానిధియగు దేవుడు*
127. I యోహాను : 1: 5
*వెలుగై ఉన్న దేవుడు* 
128. I తిమో : 6: 16 *సమీపింపరాని తేజస్సు లో వసించుచు, అమరత్వము గల దేవుడు*
129. I యోహాను : 4: 8
*ప్రేమా స్వరూపి అయిన దేవుడు*
130. రోమా 16:25-27
*అద్వితీయ జ్ఞానవంతుడు.*
131. 1 Timothy 6:15 *అద్వితీయ సర్వాధిపతి.*

Monday, 15 July 2019

ఆదిసంభూతుడు

కొలస్సీ. 1:15-20 (TBO) ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి *ఆదిసంభూతుడై* యున్నాడు.
" *ఏలయనగా,* ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని *అవి* సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును *ఆయనయందు(క్రీస్తునందు) (in him not by him)* సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను(through him not by him) ఆయననుబట్టియు (for him, not by him) సృజింప బడెను."

ఆయన అన్నిటికంటె( క్రొత్త సృష్టిలో ఉన్నవాటి అన్నిటిలో) ముందుగా ఉన్నవాడు; ఆయనే సమస్తమునకు ఆధార భూతుడు.
"సంఘము అను శరీరమునకు *ఆయనే శిరస్సు*; ఆయనకు *అన్నిటిలో ప్రాముఖ్యము* కలుగు *నిమిత్తము*, ఆయన *ఆదియై* యుండి *మృతులలో నుండి లేచుటలో ఆదిసంభూతు డయెను.* "

" *ఆయనయందు* సర్వసంపూర్ణత నివసింపవలెననియు, ఆయన *సిలువరక్తముచేత* సంధిచేసి, ఆయన ద్వారా *సమస్తమును*, అవి *భూలోక మందున్నవైనను* పరలోకమందున్నవైనను,"
వాటినన్నిటిని ఆయనద్వారా తనతో సమాధాన పరచు కొనవలెననియు తండ్రి అభీష్టమాయెను.

ఆయన సర్వ సృష్ఠికి ఆదిసంభూతుడై యున్నాడు
ఎలా ఆదిసంభూతుడై యున్నాడు

మృతులలో నుండి లేచుటలో మొదటి వాడు కనుక

ఆయన సర్వ సృష్ఠికి ఆదిసంభూతుడు అంటే?

*ఈసర్వ సృష్టి అంటే క్రొత్త సృష్టి*

ఎలా అంటే
ఈ సృష్టి *ఆయనయందు (in him)* ఆయనను *బట్టి (for)* ఆయన *ద్వారాను(through)* సృజించ బడెను.

*ఆయనచేత అని చెప్పబడలేదు(not by him)*

ఆయనయందు అంటే క్రీస్తునందు అని మనకు తెలిసిన సంగతే

దేవుడు క్రీస్తునందు ఏమి చేశాడు అంటే

2 కొరింధీ. 5:17 "కాగా ఎవడైను *క్రీస్తు నందున్న* యెడల వాడు *నూతన సృష్టి;* పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను;"

ఎఫెసీ. 2:10 "మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై, మనము *"క్రీస్తు యేసునందు" సృష్టింప బడిన వారమై* ఆయన చేసిన పనియైయున్నాము."

ఎఫెసీ. 2:15 "ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని *తన యందు* ఒక్క *నూతన పురుషునిగా సృష్టించి*,"

ఎఫెసీ. 4:24 నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా *సృష్టింపబడిన నవీన స్వభావమును* ధరించుకొనవలెను.

గలతీ. 6:15 *"క్రొత్తసృష్టి* పొందుటయే గాని సున్నతి పొందుటయందేమియు లేదు, పొందకపోవుట యందేమియు లేదు."
భౌతిక సృష్టి చేసినది దేవుడు అనే విషయం ఆది కాండములో అనేవిషయం మనకు తెలిసిందే,

యేసుక్రీస్తు మాటలలో ఇలా ఉంది...

మత్తయి 19:4, 6 (TBO) "'' *సృజించినవాడు* ఆది నుండియు వారిని స్త్రీ గాను పురుషునిగాను సృజించెననియు,"
కాబట్టి వారికను ఇద్దరుగాకాక ఏక శరీరముగా నున్నారు. గనుక *దేవుడు జతపరిచిన వారిని*మనుష్యుడు వేరుపరచకూడదు'' అని చెప్పెను.

అలాగే క్రొత్త సృష్టిని కూడా దేవుడే చేసాడు క్రీస్తునందు చేసాడు, క్రీస్తును బట్టి చేసాడు, క్రీస్తు సిలువమరణము ద్వారా, ఆయనను మృతులలోనుండి లేపుటద్వారా, ఆయన సిలువరక్తము ద్వారా చేసాడు.

*సర్వము అంటే క్రీస్తునందు ఉన్నవన్నియు అని...*

ఎఫెసీ. 1:10 (TBO) "ఈ సంకల్పమును బట్టి ఆయన *పరలోకములో ఉన్నవే* గాని, *భూమిమీద ఉన్నవే* గాని *సమస్తమును క్రీస్తునందు ఏకముగా* సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను."

కొలస్సీ. 1:19-20 " *ఆయనయందు సర్వసంపూర్ణత* నివసింపవలెననియు, ఆయన సిలువరక్తముచేత సంధిచేసి, ఆయన *ద్వారా* సమస్తమును, అవి *భూలోక మందున్న* వైనను *పరలోకమందున్న* వైనను,"
*వాటినన్నిటిని* ఆయన *ద్వారా* తనతో సమాధాన పరచు కొనవలెననియు తండ్రి అభీష్టమాయెను.

కాబట్టి భూమియందున్న అధికారాలు, ఆకాశమందున్న అధికారాలు క్రీస్తు నందు (క్రొత్తసృష్టిలో) ఉన్న అధికారాలే అని స్పష్టమౌతుంది.

ఆకాశమందున్నవి, భూమియందున్నవి అంటే
జంతువులు, పక్షులు, చెట్లు, నక్షత్రాలు, గ్రహాల గూర్చి చెప్పడంలేదు

ఆకాశమందున్నవి అయినను, భూమియందున్నవియైనను అదృశ్యమైనవి గాని, దృశ్యమైనవి గాని *అవి* సింహాసనములైనను, అధికారములైనను, ప్రభుత్వములైనను అని ఉంది

*క్రొత్త సృష్టిలో ఉన్న సింహాసనములు*

మత్తయి 19:28 (TBO) "యేసు- '' *ప్రపంచ పునర్జన్మమందు* (పునఃస్థితి స్థాపన మందు) మనుష్య కుమారుడు తన మహిమగల *సింహాసనముపై ఆసీనుడై యుండు* నప్పుడు, నన్ను వెంబడించిన మీ పన్నెండు మంది *పన్నెండు సింహాసనములపై కూర్చుండి* ఇశ్రాయేలు పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చెదరు."

*అధికారములు, ప్రభుత్వములు* అన్నిటిని ఇవ్వబడిన అధికారముతో పరిపాలన చేస్తున్నది కుమారుడు*

చెబుతారు కానీ చేయరు

*వారు చెప్పుదురే గాని చేయరు. మత్తయి-23:3* """"""""""""""""...