Sunday, 4 August 2019

దేవుడు మానవుడు అవుతాడా?

*భూమిపై దేవుడై జీవించిన యేసుక్రీస్తు, మానవులు పాపము చేయకుండా ఉండటానికి మాదిరేనా?*

యేసుక్రీస్తు నరుడు కాడు దేవత్వము కలిగిన దేవుడు అని బోధించడం, దేవత్వము కలిగి మాత్రమే పాపం చేయకుండా బ్రతికాడు అని చూపడం ద్వారా మానవుడు పాపం చేయకుండా బ్రతకడం అసాధ్యము అనే అబద్ధం నేడు క్రైస్తవ సమాజంలో ఉన్నది.....

మెస్సియాకు సంబంధించిన లేఖనాలకు లేని దేవత్వాన్ని అద్ది, లౌకిక జ్ఞానపు పదజాలంతో అమాయకులను సత్యము అంటూ అదే ముసుకులో మోసం చేసే కుయుక్తిగల బోధ నేడు సంఘాలలో....

*దేవుడు ఒక్కడే ఆయన తండ్రి*
అని బైబిల్ చెప్పింది..

అదే బైబిల్ లో మరో వ్యక్తి కూడా దేవుడు గా కనబడినట్టు ఉంటే, అది ఎలా సాధ్యము సందర్భాలనుబట్టి దేవునికి సంబందించినదా కాదా అని ఆలోచించకుండా క్రీస్తును కూడా మరో దేవునిగా చూడాలి అనే కుతూహలంతో సమర్ధించుకుంటు, దేవుడే గాని మనకు దేవుడు కాదు అంటారు ఏమిటి ఈ అర్ధరహితమైన బోధ..

మనకు దేవుడు కాదా మరి ఎవరికి దేవుడు, దేవుడంటే ఎవరికో ఒకరికి దేవుడవ్వాలి కదా ...

మనకు దేవుడా? కాదా? అనేది తరువాత ప్రశ్న.

యేసు దేవుడనేదే కదా దేవుడు ఒక్కడే అనే సత్యానికి తూట్లు పొడిచే బోధ!

మరి అలా అయితే దేవుడు ఒక్కడే అనే ఈ గ్రంధసంభందమైన బోధకు తూట్లు పొడవడము కాదంటారా?

దేవుని అద్వితీయతకు సవాలు విసరడం కాదా?

‎దేవుని దేవునిగా మహిమ పర్చక పోగా నువ్వొక్కడివే కాదు మాకు మరొకదేవుడు వున్నాడు అని దేవున్ని మరో పద్దతిలో హేళనచేసినట్టుకాదా..

ఆనాడు వారికి నాయకుడుగా నియమించిన మోషే పైకి ఎక్కిపోతే, మన దేవుడైన యెహోవా ఇదే అని క్రింద ఉన్న ఇశ్రాయేలీయులు, ఐగుప్తు ఆచారాల ప్రభావంతో నిండి పోయి దూడ బొమ్మను చేసుకున్నారు, ఈనాడు మనకు ప్రభువుగా, క్రీస్తుగా నియమించబడిన యేసు పైకి వెళ్ళగానే, దేవున్ని వదిలేసి లేనిదేవత్వాన్ని యేసు క్రీస్తుకు ఆపాదించి ఆయనను దేవున్ని చేసింది అన్య దేవతల బోధచేత ప్రభావితమైన ఈ అన్యుల ప్రపంచం.

కారణం ఒకే సృష్టికర్త, ఒకే దేవుడైన తండ్రిని సరిగా ఎరగక పోవడమే, దేవుని యొక్క అద్వితీయతను శంకించి, ఆయన అన్నిటికి చాలిన ఒకే ఒక దేవుడు అని నమ్మలేక పోవడమే.

పాత, కొత్త నిబంధనలో దేవుడొక్కడే అని లేఖనాలు చెబుతున్నవి.

లేఖనములు ఎరిగిన భక్తిగల ఏ యూదుడైనా వేరెవరిని దేవునిగా అంగీకరించ గలడా..

యేసుక్రీస్తు మానవుడిగా వున్నప్పుడు దేవత్వము కలిగి పాపము చేయకుండా జీవిస్తే......

1.దేవత్వం లేని మానవులు పాపము చేయకుండా బ్రతకడానికి దేవత్వమున్న యేసు ఎలా మాదిరి అవుతాడు.? (1. పేతురు 2: 21-24)

2.యేసుక్రీస్తు శరీరములో వున్నప్పుడు దేవుడైతే పాపము చేయకుండా ఉండడము పెద్ద గొప్ప సంగతేమి కాదుగదా! (సంఖ్యా 23:19)

3. దేవుడు పాపము చేయడము అసాధ్యము కదా!

4. దేవత్వము కలిగినవాడు పాపము ఎలా చేయగలడు?

5. తనలో ఉన్న దేవత్వము పాపము చేయించదు గదా!

6. దేవుడు శోధింపబడడు గదా, మరి యేసు క్రీస్తు మనవలెనే అన్ని విషయములలో శోధింపబడ్డాడు కదా ( యాకోబు 1:13, హెబ్రీయులకు 2:15, 4:17 )

7. అయితే ఆయన పరిపూర్ణ మానవుడు అయిఉండాలంటే మనవలె దేవత్వము లేని వాడై యుండాల్సిందే కదా! ( హోషేయ 11.9 )

8. యేసు భూమి మీద కూడా దేవుడైతే ఆయన జ్ఞానమందు ఎదగడమేంటి? (లూకా 2: 40,52).

9. ‎యేసు దేవుడైతే శ్రమలద్వారా సంపూర్ణుడు అవడమేంటి? దేవుడంటేనే సంపూర్ణుడని కదా!

10. యేసు దేవుడైతే శ్రమలద్వారా విధేయత నేర్చుకోవడం ఏంటి? దేవుడు తన స్వభావమును మార్చుకోడు కదా!

11. ‎ యేసు క్రీస్తు నరుడు అని అపొస్తలుల స్పష్టమైన బోధ, ఈ క్రింది వచనములు చూడు...
1 తిమోతి 2:5
అపొ.కార్య. 17:31
అపొ. కార్య 2:22 ( ఇవన్నీ ఇంగ్లీష్ అనువాదంలో చూడండి)
యోహాను 8: 40
రోమా 5: 19

యేసు దేవుడు కాబట్టి పాపము చేయకుండా బ్రతికాడు బ్రతకగలడు.

అయితే దేవుడు కాని మానవున్ని పాపము చేయకుండా ఉండాలని చెప్పే బోధకు ఏమైనా అర్ధము ఉన్నదా?

దేవుడై పాపము చేయకుండా బ్రతికిన యేసు....
దేవత్వము లేని మానవుని పాపము చేయకుండా బ్రతక మని చెప్పడము ఏంటో! ఇలా చెబుతాడా దేవుడు. ఇది మానవ జ్ఞానతత్వ వాదం కాదా?

దేవత్వమున్న యేసు దేవత్వము లేని మానవునికి మాదిరి అని చెప్పడము అర్ధము లేని వింత బోధ విధానము కాదా!

యేసు దేవత్వము కలిగి ఉంటే సంపూర్ణమానవుడు ఎలా అవుతాడు?
ఎందుకంటే మానవులమైన మనకు దేవత్వము లేదు కదా?

యేసుక్రీస్తు నరుడు అని అపొస్తలులు చెప్పినవి అన్ని ఒట్టి మాటల మూటలేనా?

లేఖనములో ఉన్నదాన్ని మాత్రమే విశ్వసించు అంతకంటే ఎక్కువ ఊహించకు.

తిత్వ సిద్దాంత భావజాలంలో కొట్టుకుని పోమాకు,
త్రిత్వ సిద్ధాంతాన్ని మరో కొత్తకోణంలో అవిష్కరించకు.

తండ్రి యైన దేవుని గూర్చి యూదులకు, అపొస్తలులకు బాగానే తెలుసు ఆయన దేవుడని అయినప్పటికీ కొత్త నిబంధనలో దేవుడొక్కడే ఆయన తండ్రి అని, ఆయనే సృష్టికర్త అని అన్ని పుస్తకాలలోఅనేక సార్లు జ్ఞాపకం చేశారంటే ఎందుకు, ఏవిధంగా అయిన దుష్టుడు మోసం చేయగలడనే, ఎవరినైనా వాడుకోగలడు, దుష్టుని తంత్రములను ఎరుగని వారము కాదు అని అపో.పౌలు చెప్పినవి జ్ఞాపకము చేసుకో....

క్రీస్తుని గూర్చి ఏ మాత్రము అవగాహన లేని లోకానికి.....
పాతనిబంధనలో ఎక్కడ కూడా క్రీస్తు కూడా మరో దేవుడు అని లేఖనాలు లేనప్పుడు, నేడు కొంత మంది బోధిస్తున్నట్టు ఒకవేళ యేసే దేవుడయితే, ఎంత ఖచ్చితంగా అపొస్తలులు ఋజువులతో నిరూపించి ఉండాలి.
యేసే క్రీస్తు అని ఋజువులతో చూపించిన అపొస్తలులు, యేసే దేవుని పక్కన ఉన్న మరో దేవుడు అని రుజువులు చూపించలేదు ఎందుకని, రెండో దేవున్ని సృష్టించడం అపొస్తలుల బోధ కాదు కాబట్టి.

మరి బైబిల్ లో కొన్ని చోట్ల యేసు దేవుడని వ్రాయబడిన లేఖనాలా మాటేంటి అని అనుమానంగా చూస్తున్నవా.....
వాటిని గూర్చిన పూర్తి వివరణ ఉంది, ఎక్కడ తప్పు జరిగిందో, లేఖనాలను ఎలా చదివితే ఆ లేఖనాలు ఎవరు దేవుడని తెలియజేస్తున్నవో, క్రీస్తు బోధ వెలుగులో తెలియజేస్తాను.

మూలాలు వెతుకు, సత్యాన్ని మరింత లోతుగా విశ్లేషణ చెయ్, పరిశీలనాత్మక దృష్టితో దేవుని ప్రణాలికను గ్రహించి అప్పుడురా సత్యమని సత్య సంభంధిగా బ్రతకడానికి.

ఛాయాలో లేనిది నిజస్వరూపంలోకి ఎలా వచ్చిపడుతుంది.

మనకు భోదించేవారు ఏది చెబితే అదే సత్యమన్నట్టుగా అతుక్కుపోకు. వారు పరిశీలించారో లేదో మనం పరిశీలించాల్సిందే సుమా!

ఈ విషయాలు వ్రాయడానికి కారణం సత్యము చదివి పరిశీలిస్తారనే నమ్మకంతోనే....

చెబుతారు కానీ చేయరు

*వారు చెప్పుదురే గాని చేయరు. మత్తయి-23:3* """"""""""""""""...