*నేడు "ఉపవాసం" అపహాస్యం పాలవుతుందా???*🤔
*ఉపోద్ఘాతం*
👉 *ఉపవాసమనేది* ఆనాడు సందర్భానుసారంగా ఉండేది.
👉 నేటి దినాల్లో సమయం, సందర్భం లేకుండా ఈ *ఉపవాస* దినాలు జరిగిస్తు న్నారు.
👉 ఇలా చేసే *"ఉపవాసాలు"* నిజంగానే అపహాస్యం గా మారిపోతున్నాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
👉 నేడు క్రైస్తవులు అనబడే వారు అసలు *"ఉపవాసం"* అనే పదానికి ఉన్న అర్థాన్నే మార్చేశారు ఇది ముమ్మాటికీ నిజం.
👉 *"శ్రమదినాల"* పేరుతో *"40రోజుల ఉపవాస దీక్షలు"* చేస్తూ చేయకూడని పనులు చేస్తూ,మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ,వినకూడని విషయాలు వింటూ,చూడకూడని దృశ్యాలు చూస్తూ, వారు చేసేదే *"నిజమైన ఉపవాసమని" భక్తి* అంటే ఇదే అని వారు భ్రమపడుతూ ఎదుటి వారిని *వాస్తవాన్ని* గ్రహించలేని దుస్థితికి తీసుకెళ్తుంది నేటి *క్రైస్తవ సమాజం.*
*A. ఉపవాసమనేది ఆజ్ఞ కాదు.* కానీ మనకున్న సమస్యలు తొలగిపోవాలంటే ఉపవాసం చేయాల్సిందే.(మార్కు.9:29)
👉 *దేవుడు* ఎక్కడా కూడా మీరు ఆహారం, నీళ్ళు మానేసి నన్ను సేవించమని ఏ ఒక్కరితోనూ చెప్పలేదు.
👉 *యేసుక్రీస్తు* వారు కూడా నాలాగే మీరు కూడా *"40రోజలు" ఉపవాసం* ఉండమని ఎవ్వరితోనూ చెప్పలేదు.
👉
*B . ఉపవాసం అంటే ఏమిటి?*
💐 ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోక పోవడమే.(అనగా ఆహారం, నీరు, పండ్లు, పండ్లరసాలు,తీసుకోకపోవడమే, ఆఖరికి లాలాజలం (ఉమ్మి) కూడా మింగకపోవడమే).
*a. నేడు ఉపవాసం ఉంటున్న వారు ఎలాంటి ఉపవాసం ఉంటున్నారు?*
🔆 ఒక్క మాటలో చెప్పాలంటే కేవలం *భోజనం* తప్ప అన్నీ తినవచ్చు అని చెబుతున్నారు.
👉 అయితే సాయింత్రం 3గం"లు దాటిన తరువాత లేదా కొందరైతే 6గం"లు దాటిన తరువాత ఎలాంటి నియమనిబంధనలు ఉండవని చెబుతున్నారు,ఒక నిర్దిష్టమైన సమయం తర్వాత ఏదైనా తినవచ్చును అంటే భోజనం కూడా చేయొచ్చు అని చెబుతున్నారు.
☝️ పైవన్నీ తిని, తాగి, కేవలం భోజనం మాత్రమే చేయకుండా ఉండటాన్ని ఎక్కడైనా *"ఉపవాసం"* అంటారా? ఆలోచించండి 🤔
*C.మనుష్యులు కల్పిచిన పద్దతులే దైవోపదేశాలు* గా మార్చిన నేటి దైవసేవకులు/బోధకులు.
🔆 *ఉపవాసం* అంటే ఖచ్చితంగా 40రో" చేయాలని, ప్రత్యేకమైన వస్త్రధారణ కలిగి ఉండాలని, కాళ్ళకు చెప్పులు ధరించకూడదని దైవ గ్రంథమైన *బైబిల్* లో ఎక్కడైనా చెప్పబడిందా? అంటే ఎక్కడా కూడా చెప్పబడలేదు.
*యెషయా 29: 13:*
వారు నాయెడల చూపు *భయభక్తులు* మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి.
*మత్తయి:15:6-9:*
*మార్కు:7:7-8:* ,
*అపో"కా "28:27:*👈ఈ వచనాలు కూడా పరిశీలన చేయండి.
*1.వినే,చదివి, పరిశీలించే వారికి హెచ్చరికలు*
యాకోబు:1:22,23: వాక్యం విని మోసపోవద్దు, పరిశీలన చేయండి
*ఎలా చదవాలి* యెషయా:34:16: యెహోవా గ్రంధాన్ని పరిశీలించి చదువుకోండి.
*పరిశీలన* అపో"కా ":17:11:*బెరయా సంఘస్థుల* వలె ప్రతి రోజూ *వాక్యాన్ని పరిశీలన* చేయాలి.
*1థెస్స'5:21:* సమస్తాన్ని *పరీక్షించి మేలైన* దాన్ని చేపట్టాలి.
*D.బైబిల్ గ్రంధంలో ఉపవాసం చేసిన కొన్ని సందర్బభాలు*
*1.మోషే ,ఏలియా, యేసుక్రీస్తు,* వారు వీళ్ళు మాత్రమే 40రోజుల "ఉపవాసం". చేశారు
👉 *మోషే* నిర్గమ 34: 28
40రేయింబగళ్లు *మోషే* భోజనము చేయలేదు నీళ్లు త్రాగలేదు;
*ద్వితి: 9: 9*
అన్నపానములు మాని ఆ కొండమీద *40పగళ్లు ,40 రాత్రులుంటిని.*
👉 ద్వితీయో:9:18,25 వచనాలు కూడా పరిశీలన చేయండి.
👉 *ఏలియా* 1రాజులు:19:8 40రాత్రింబగళ్ళు ప్రయాణం చేసెను.
సందర్భం 🔆1రాజులు:19:15,16.
👉 *యేసుక్రీస్తు వారు*
బాప్తీస్మం పొందిన తరువాత 40దినాలు ఉపవాసం చేశారు.
మత్తయి:4:1,2;లూకా:4:1,2.
☝️ఈ ముగ్గురు తప్ప ఇంకెవ్వరూ ఇలా 40 రోజులు ఉపవాసం చేయలేదు.
*2.దావీదు చేసిన "ఉపవాసం".*
👉 దావీదు కుమారుడు జబ్బుపడిన సందర్భం లో 7రోజులు" ఉపవాసం 2సమూ:12:16-23.
*3.మొర్దెకై మరియు ఎస్తేరు రాణి తన పనికత్తెలు చేసిన "ఉపవాసం".*
*సందర్భం* యూదా జాతికి వచ్చిన సమస్య నుండి విడిపించ బడటం కోసం వారు 3రోజుల ఉపవాసం చేసిరి ఎస్తేరు.3:13; మరియు 4వ అధ్యాయం.
*4.నీనెవె పట్టణస్థులు చేసిన *"ఉపవాసం".*
యోనా:3:1-10:రాజుతో సహా జనులందరూ మరియు పశువులను కూడా ఉపవాసం ఉంచి రాబోయే ప్రమాదం నుండి తప్పించ బడిన సందర్భం.
☝️ పైన చెప్పిన సందర్భాలలో భక్తులు ఉపవాసం చేసే సమయంలో ఏమీ తినలేదు త్రాగలేదు .
👉 పైగా వారు *ఉపవాసం"*
చేసిన సందర్భాలు వేరు.
*గమనిక* అయితే ఈనాటి ప్రజలు చేస్తున్న "ఉపవాసం" దేని కొరకు?
👉 సమస్య నుండి బయటపడటం కోసమేనా? ఆలోచించండి 🤔
*రోమా:2:24: దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది*
👉 దేవుని నామము దూషణపాలవుతొంది అంటే అపహాస్యం పాలవుతుందనే కదా దీనర్థం.
*E.ఎలాంటి "ఉపవాసం" దేవునికిష్టం?*
*1.చేయకూడని* "ఉపవాసం".
యెషయా 58: 3
మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్యపెట్టవు? అని అందురు మీ ఉపవాసదినమున మీరు మీ వ్యాపారము చేయుదురు. మీ పనివారిచేత కఠినమైనపని చేయించుదురు
యెషయా 58: 4,5:*కలహపడుతూ* ఉపవాసం చేయకూడదు
మత్తయి 6: 16
*వేషధారులవలె* ఉపవాసము చేయొద్దు.
*2.చేయవలసిన లేదా దేవుడు కోరిన "ఉపవాసం"*.
యెషయా 58: 6
దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు తీయుటయు బాధింపబడినవారిని విడిపించుటయు ప్రతి కాడిని విరుగగొట్టుటయు నే నేర్పరచుకొనిన ఉపవాసము గదా?
👉 చెడు వ్యసనాలకు బానిసైన వారికి *సువార్త ప్రకటన* చేసి పాప బంధకాలలో నుండి విడిపించడమే నిజమైన *ఉపవాసం.*
*యెషయా 58: 7,8*
నీ ఆహారము ఆకలిగొనినవారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ యింట చేర్చుకొనుటయు,వస్త్రహీనులకు వస్త్రాలు ఇవ్వడం .☝️ *దేవుడు మెచ్చే *ఉపవాసం*
యెషయా:58:9-11వచనాలు కూడా చూడండి.
మత్తయి 6: 17,18
*దేవుడే* మనకు ప్రతిఫలమిచ్చును.
హెబ్రీ: 11:6.ఫలము దయచేయువాడు " *దేవుడే.*"
ముగింపు *ఇంతకీ ఉపవాసం చేయాలా వద్దా?*
👉చేయాలి.
*మార్కు:9:29:* మనకు వచ్చిన సమస్యలు తొలగిపోవాలంటే *ఉపవాసం* చేయాల్సిందే.
👉 వేషధారణ తో కూడిన ఉపవాసం చేయకూడదు.
👉 *భక్తులు చేసినట్లు 40రోజుల ఉపవాసం ఇప్పుడు మనం చేయాల్సిన అవసరం లేదు*.ఎందుకంటే అది చేయలేము, అలాగే చేయమని దేవుడు ఎక్కడా కూడా చెప్పలేదు.
*గమనిక* ఉపవాసం చేసే రోజుల్లో మిగిలే ఆహార పదార్థాలను తిరిగి సహాయం చేయలేని నిరుపేదలకు ఇవ్వడం మంచిది.(యాకోబు:1:27.)