Sunday, 5 November 2023

ప్రకటన రచనా కాలం

*ప్రకటన యెరూషలేము నాశనమునకు (70 AD) ముందు వ్రాయబడినది అనడానికి ప్రకటన గ్రంథము నుండి రుజువులు*



Rev 11:1-2: "మరియు ఒకడు చేతికఱ్ఱవంటి కొలకఱ్ఱ నాకిచ్చి— నీవు లేచి *దేవుని ఆలయమును బలిపీఠమును కొలతవేసి, ఆలయములో పూజించువారిని లెక్కపెట్టుము. ౹ ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలతవేయక విడిచి పెట్టుము; అది అన్యులకియ్యబడెను, వారు నలువది రెండు నెలలు పరిశుద్ధపట్టణమును కాలితో త్రొక్కుదురు.౹"*

Rev 17:10: "మరియు *ఏడుగురు రాజులు కలరు;* అయిదుగురు కూలిపోయిరి, ఒకడున్నాడు, *కడమవాడు ఇంకను రాలేదు,* వచ్చినప్పుడు అతడు *కొంచెము కాలముండవలెను.౹"*
1.Julius
2. Augustus
3.Tiberius
4. Caligula
 5.Claudius
6.NERO,
7. Galba.
8. Nero

Rev 18:15: "ఆ పట్టణముచేత ధనవంతులైన యీ సరకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు– అయ్యో, అయ్యో, సన్నపు నారబట్టలను ధూమ్రరక్తవర్ణపు వస్త్రములను ధరించుకొని, బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడిన *మహాపట్టణమా, యింత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడైపోయెనే* అని చెప్పుకొనుచు, దాని బాధను చూచి భయాక్రాంతులై దూరముగా నిలుచుందురు.౹"

Wednesday, 1 November 2023

రోమా పత్రిక 1అధ్యాయం

*రోమా పత్రిక*

*1వ అధ్యాయం*

*జవాబులు*

✍🏽🌲🍀🌿☘️🙏🏼

1. రోమా పత్రిక గ్రంథకర్త ఎవరు?
A. *అపొ.పౌలు*

2. రోమా పత్రిక గ్రహీతలు ఎవరు?
A. *రోమా లో వున్న దేవుని ప్రియులు*

3. దేవుని ప్రియులందరికి అనగా.....?
A. *పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు*

4. దేవుడు ఎవరు?
A. *మన తండ్రి* 

5. యేసుక్రీస్తు ఎవరు?
A. *ప్రభువు*

6. యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను దేవుడు ఎవరి ద్వారా వాగ్దానము చేసెను?
A. *ప్రవక్తల ద్వార*

7. యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను దేవుడు ఎక్కడ వాగ్దానం చేసేను?
A. *పరిశుద్ధ లేఖనములయందు*

8. యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను ఎప్పుడు వాగ్దానం చేసెను?
A. *ముందు*

9. యేసు క్రీస్తు శరీరమును బట్టి ఎవరి కుమారుడు?
A. *దావీదు కుమారుడు* 

10. యేసుక్రీస్తు ఆత్మను బట్టి ఎవరి కుమారుడు?
A. *దేవుని కుమారుడు*

11. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు దేనికి విధేయులు అవ్వాలి అని దేవుని ఏర్పాటు?
A. *విశ్వాసమునకు.*

12. ఎవరి ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి?
A. *యేసు క్రీస్తు ద్వారా*

13. ఒకరి విశ్వాసముద్వారా ఒకరు ఏమి పొందవలెను?
A. *ఆదరణ పొందవలెనని*

14. పౌలు రోమియులకు ఏమి ఇవ్వాలని వారిని చూడ మిగుల ఆపేక్షించుచున్నాడు?A. *ఆత్మసంబంధమైన కృపావరమేదైనా* 

15. పౌలు ఎవరికి ఋణస్తుడను అని చెప్పెను?
A. *గ్రీసుదేశస్థులకును గ్రీసుదేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును మూఢులకును*

16. పౌలు తాను దేని విషయమై సిగ్గుపడువాడను కాను అని చెప్పెను ?
A. *సువార్త విషయమై*

17. నమ్ము ప్రతివానికి రక్షణ కలుగజేయుటకు ఏది దేవుని శక్తియై యున్నది?
A. *సువార్త*

18. నీతిమంతుడు దేని మూలంగా జీవించునని వ్రాయబడియున్నది?
A. *విశ్వాసమూలంగా*

19. దుర్నీతి చేత మనుష్యులు దేనిని అడ్డగించు చున్నారు?
A. *సత్యమును*

20. మనుష్యుల సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను పరలోకము నుండి ఏమి బయలుపరచబడుచున్నది?
A. *దేవుని కోపము*

21. దేవునికి ఉన్న రెండు అదృశ్య లక్షణములు ఏమి?
A. *నిత్యశక్తి*
*దేవత్వము*

22. దేవుని దేవునిగా మహిమ పరచని వారి అవివేకహృదయం ఏమాయెను?
A. *అంధకారమయమాయెను*

23. అక్షయుడగు దేవుని మహిమను ఎటువంటి ప్రతిమాస్వరూపములోనికి మార్చిరి? నాలుగు వ్రాయుము.
A. *మనుషుల యొక్కయు*
*జంతువుల యొక్కయు*
 *పురుగుల యొక్కయు*
 *చత్రస్పాద జంతువులయొక్కయు*

24. వారు తమ శరీరములను అవమాన పరుచుకొనునట్లు దేవుడు వారిని దేనికి అప్పగించెను?
A. *అపవిత్రతకు*

25. అట్టివారు దేవుని సత్యమును ఏమి చేసిరి?
A. *అసత్యమునకు మార్చిరి*

26. సృష్టికర్తకు ప్రతిగా దేనిని పూజించి సేవించిరి?
A. *సృష్టిని*

27. అయినప్పటికీ దేవుడు ఎప్పటివరకు స్తోత్రార్హుడైయున్నాడు ?
A. *యుగముల వరకు*

28. స్ట్రీలు, పురుషులు వారి యొక్క ఏ ధర్మమును విడిచిరి?
A. *స్వాభావికమైన ధర్మమును*

29. తమతప్పిదమునకు తగిన ప్రతిఫలము పొందుచూ ఒకరి యెడల ఒకరు ఏమయ్యారు?
A. *కామతప్తులు* 

30. వారు దేవునికి ఎక్కడ చోటియ్యలేదు? A. *మనస్సులో*

31. చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని దేనికి అప్పగించెను?
A. *బ్రష్ట మనసుకు.*

32. 21 చెడ్డ కార్యములలో మీకు గుర్తున్న 5 చెడ్డకార్యములు వ్రాయుము.
A. *1 దుర్నీతిచేతను*
*2. దుష్టత్వముచేతను* *3.లోభముచేతను* *4.ఈర్ష్యచేతను*
*5. మత్సరము*
*6. నరహత్య*
*7. కలహము*
*8. కపటము*
 *9.వైరము*
*10. కొండెగాండ్రును*
*11.అపవాదకులును*
*12. దేవద్వేషులును*
*13. హింసకులును*
*14. అహంకారులును*
*15. బింకములాడువరు*
*16.చెడ్డవాటిని కల్పించువారును* *17.తలిదండ్రులకవిధేయులును*
 *18.అవివేకులును*
*19.మాట తప్పువారును*
*20. అనురాగ రహితులును* *21.నిర్దయులునైరి.*

33. ఇట్టి చెడ్డ కార్యములు అభ్యసించువారు దేనికి తగినవారు?
A . *మరణమునకు*

34. దేవునియొక్క ఏ విధిని వారు బాగుగా ఎరిగియున్నారు?
A. *దేవుని న్యాయవిధిని.*

35. రోమియులకు పౌలు ఈ పత్రిక వ్రాయుటకు గల ఉద్దేశం ఈ ఒకటవ అధ్యాయంలో ఉన్నది వ్రాయుము.
A. *నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును (1:17 ; హబక్కు 2:4)*

చెబుతారు కానీ చేయరు

*వారు చెప్పుదురే గాని చేయరు. మత్తయి-23:3* """"""""""""""""...