Thursday, 29 February 2024

రోమా పత్రిక

*రోమా పత్రిక* 

*కాలము* - క్రీ॥శ॥ 57-58
*గ్రంధకర్త* - అపో॥ పౌలు

*రోమాలో సంఘాన్ని స్థాపించినవారెవరు ?*

పేతురు, పౌలు అనే ఇద్దరు అపోస్తలులు రోమాలో హతసాక్షులు గా చేయబడినా వారిలో ఏ ఒక్కరు కూడా స్వయంగా రోమా సంఘాన్ని స్థాపించిన వారు కారు

మరి రోమ సంఘాన్ని ఎవరు స్థాపించారు.?

పెంతుకోస్తు దినాన యెరూషలేము లో మార్పు పొందినవారిలో ఎవరైనా అక్కడ సంఘ ప్రారంభానికి సాధనములుగా ఉండి ఉండవచ్చు (అపో. 2:10)
 లేదా పేతురు, పౌలుల పరిచర్యవలన మార్పు చెందిన వారిలో ఎవరైనా రోమాలో క్రీస్తు సంఘపు ఏర్పాటుకు దోహదపడి ఉండవచ్చు 

*రోమా సంఘంలో సభ్యులు ఎవరు..?*

 సభ్యత్వం ప్రధానంగా అన్యజనులలోనుండి వచ్చిన వారితో కూడినదై యుంది 
(రోమా 1:13; 11:13; 15 15 -16)

అంతకు ముందుగా స్థాపించబడి లోక వ్యాప్తంగా ప్రచారంలో ఉన్న సంఘములో పరిచర్య చేయాలనే ఆశతో పౌలు ఈ ఉత్తరాన్ని వారికి ముందుగా పంపినట్లు తెలియజేయబడుతుంది (రోమా 1:8) 

*ఎక్కడనుండి వ్రాయబడినది ?*

ఇది కొరింధు నుండి వ్రాయబడింది పాలస్తీనాలోని పేదలైనవారి కొరకు చందా పోగు చేస్తున్న కాలంలో వ్రాయబడింది 
(రోమా 15: 14 -17)

రోముకు వెళ్ళి అక్కడనుండి స్పెయిన్ ప్రయాణం సాగించాలనే సంకల్పంతో ఉన్న దినాలవి. (రోమా 15 :24)
యెరూషలేములో తాను బంధింపబడినందున ఈ ఏర్పాటుకు అంతరాయం కలిగింది

*ఈ ఉత్తరంఎవరి ద్వారా పంపబడినది ?*

కెంక్రేయ నుండి తన స్వకార్యం మీద రోమాకు వెళుతున్న *ఫీబే అను సహోదరి ద్వారా* ఈ ఉత్తరం పంపబడినట్టుంది. (రోమా 16:1)

తాను లోకమందు సందర్శించిన సంఘములోని 26 మంది సహోదర, సహోదరీల పేర్లు ప్రస్తావించాడంటే అక్కడ ఉన్న ప్రజలను తాను ఎంతగా ఎరుగునో మనకు ఆశ్చర్యంగా ఉంటుంది.  

*చర్చనీయాంశం*

*నీతిమంతుడు విశ్వాసమూలమున జీవించును* అనేది ఈ రచన చర్చనీయాంశమైంది

*ఉద్థేశ్యము*

 ఏ భేదము లేకుండా, క్రీస్తు శరీరమైన సంఘములో ఏకశరీరంలోని అవయవాలుగా బంధింపబడి ఉండాలనేది ఈ రచన ఉద్దేశ్యమై ఉంది.

 అందరూ ఆ శరీరంలో ఏకముగా క్రీస్తు ప్రభువు యొక్క సమరూపానికి మార్చబడాలి. 
ధర్మ శాస్త్రము వలన యూదులు, అన్యజనులనే భేధము, దానివలన కలిగిన ద్వేషము క్రీస్తు శిలువయందు అంతము చేయబడి, పాపము సకల జనులను ఏకముగా కట్టి పడవేసి నందున అందరూ క్రీస్తునందు ఏక శరీరమునకు మల్చబడిన వారై ఉంటారు


యేసుక్రీస్తు పై విచారణ

*యేసుక్రీస్తు పై విచారణ*: (చరిత్రలో అత్యంత అన్యాయపు విచారణ) యేసుక్రీస్తు విచారణ అనేది మానవ చరిత్రలో అత్యంత అన్యాయమైన ప్రక్రియగా పరిగణించబడుత...