పైన మొత్తం అలంకార బాషా వాడిన యేసు ఇక్కడ
Matthew(మత్తయి సువార్త) 24:31
31.మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివరనుండి ఆ చివరవరకు నలుదిక్కులనుండి ఆయన *ఏర్పరచుకొనినవారిని పోగుచేతురు.*
పాత నిబంధన కాలములో,
Numbers(సంఖ్యాకాండము) 10:1,2
1.యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెనునీవు *రెండు వెండి బూరలు చేయించుకొనుము* ;
2.నకిషిపనిగా వాటిని చేయింపవలెను. *అవి* *సమాజమును పిలుచుటకును సేనలను తర్లించుటకును నీకుండవలెను.*
Leviticus(లేవీయకాండము) 25:9,10
9.ఏడవ నెల పది యవనాడు మీ స్వదేశమంతట శృంగనాదము చేయవలెను. ప్రాయశ్చిత్తార్థదినమున మీ దేశమంతట *ఆ శృంగనాదము చేయవలెను.*
10.మీరు ఆ సంవత్సరమును, అనగా ఏబదియవ సంవత్స రమును పరిశుద్ధపరచి మీ దేశవాసులకందరికి విడుదల కలిగినదని చాటింపవలెను; *అది* *మీకు సునాదముగానుండును* ; అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను; ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను.
Isaiah(యెషయా గ్రంథము) 27:12,13
12.ఆ దినమున యూఫ్రటీసు నదీప్రవాహము మొదలు కొని ఐగుప్తునదివరకు యెహోవా తన ధాన్య మును త్రొక్కును. *ఇశ్రాయేలీయులారా, మీరు ఒకరినొకరు కలిసికొని కూర్చబడుదురు.*
13. *ఆ దినమున పెద్ద బూర ఊదబడును* అష్షూరుదేశములో నశింప సిద్ధమైనవారును ఐగుప్తుదేశములో వెలివేయబడినవారును,వచ్చెదరు, యెరూషలేములోనున్న పరిశుద్ధపర్వతమున యెహో వాకు నమస్కారము చేయుదురు.
బూర ఊడటం అంటే gathering/సంకుర్చుట...యేషయా 27 లో ఇక్కడ చెదిరిన ఇజ్రాయెల్ ప్రజలను సమకూర్చటానికి ఉపయోగించబడింది..
ఇది ఎప్పుడు జరుగును???
Isaiah(యెషయా గ్రంథము) 27:9,10
9.కావున యాకోబు దోషమునకు ఈలాగున ప్రాయ శ్చిత్తము చేయబడును ఇదంతయు అతని పాపపరిహారమునకు కలుగు ఫలము. *ఛిన్నాభిన్నములుగా చేయబడు సున్నపురాళ్లవలె అతడు బలిపీఠపు రాళ్లన్నిటిని కొట్టునప్పుడు దేవతాస్తంభము సూర్యదేవతా ప్రతిమలు ఇకను మరల లేవవు.*
10. *ప్రాకారముగల పట్టణము నిర్జనమై అడవివలె విడువ బడును విసర్జింపబడిన* నివాసస్థలముగా నుండును అక్కడదూడలు మేసి పండుకొని దాని చెట్లకొమ్మలను తినును.
యెరూషలేము నాశనము ను సూచిస్తుంది.
1 కోరంతి 15 లో ఉదబడిన కడబూరా, Mat 25 లో బూర మ్రోగగానే, gathering/పొగుడుకోవడానికే జరగటం..
ఇవన్నీ చూస్తే
దేవుని బూర ఊదినప్పుడు, చెదరినా ఇశ్రాయేలు కూడగట్టబడతారని యెషయా చెప్పాడు.
ఇది gathering of remanant/శేషము గురించి మునుపటి మెస్సియానిక్ వాగ్దానాన్ని సూచిస్తుంది.
Isaiah(యెషయా గ్రంథము) 11:11,12
11.ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులోనుండియు ఐగుప్తులోనుండియు పత్రోసులోనుండియు కూషులోనుండియు ఏలాములోనుండియు షీనారులోనుండియు హమాతులో నుండియు సముద్రద్వీపములలోనుండియు *విడిపించి రప్పించుటకు యెహోవా రెండవమారు తన చెయ్యి చాచును*
12. *జనములను పిలుచుటకు* ఆయన యొక ధ్వజము నిలువ బెట్టును భ్రష్టులైపోయిన *ఇశ్రాయేలీయులను పోగుచేయును భూమియొక్క నాలుగు దిగంతములనుండి చెదరి పోయిన యూదా వారిని సమకూర్చును.*
ఇది క్రీస్తు లో జరిగే కార్యము..
ఇది బూర ఊడినప్పుడు జరిగే restoration language.
1 Corinthians(మొదటి కొరింథీయులకు) 15:51,52
51.ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను; మన మందరము నిద్రించము గాని నిమిషములో, ఒక రెప్పపాటున, *కడబూర మ్రోగగానే మనమందరము మార్పుపొందుదుము.*
52. *బూర మ్రోగును* ; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పుపొందుదుము.
ఇది restoration MAT 24:31.
Matthew(మత్తయి సువార్త) 24:31
31.మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివరనుండి *ఆ చివరవరకు నలుదిక్కులనుండి ఆయన ఏర్పరచుకొనినవారిని పోగుచేతురు.*
ఇది దానియల్ పునరుత్థానం మరియు జెరూసలేం నాశనం కు connect చేయబడింది..
Daniel(దానియేలు) 12:1,2,7
1. *ఆ కాలమందు* నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు *మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని యీ కాలము వరకు ఎన్నటికిని కలుగనంత ఆపద కలుగును* ; అయితే *నీ జనులలో గ్రంథమునందు దాఖలైనవారెవరో వారు తప్పించుకొందురు.*
2.మరియు *సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు; కొందరు నిత్యజీవము అనుభవించుటకును* , కొందరు నిందపాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు.
👆ఇది ఎప్పుడు జరుగును???
7.నారబట్టలు వేసికొని యేటిపైన ఆడుచున్న ఆ మనుష్యుని మాటను నేను వింటిని; ఏమనగా, అతడు తన కుడిచేతిని ఎడమచేతిని ఆకాశము వైపుకెత్తి నిత్యజీవియగు వాని నామమున ఒట్టుపెట్టుకొని, ఒకకాలము కాలములు అర్ధకాలము *పరిశుద్ధజనము యొక్క బలమును కొట్టివేయుట ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగుననెను* .
*యూదుల/ఇజ్రాయెల్ ప్రజలు దేవుని పరిశుద్ధ ప్రజలు వారి బలము కొట్టివేయడం సమాప్తమైన తరువత.* 12 : 1-2, పునరుత్ధానం ఎప్పుడు జరుగును అంటే, 12: 7 *యూదుల బలము కొట్టివేయబడటం లో అన్ని నేరవీరుని దూత చెప్పటం జరిగింది.*
Luke(లూకా సువార్త) 21:27,28,31
27.అప్పుడు మనుష్యకుమారుడు *ప్రభావముతోను మహా మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూతురు.*
28.ఇవి జరుగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తికొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను.
31.అటువలె మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయెనని తెలిసికొనుడి.
*ఆకాశ మేఘరూఢుడై రావడం లో*
*వారి విమోచన కు link* *అయివుంది** .*
*అలాగే దేవుని రాజ్యము కు link అయి ఉంది.***