*రాజుకు స్తుతి పాడుట/నమస్కారం చేయుట*
1 Samuel 18:8 - ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొనివారు దావీదునకు పదివేలకొలది అనియు, *నాకు* (సౌలు) వేలకొలది అనియు *స్తుతులు పాడిరే* ; రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసికొనగలడు అను కొనెను
2 Samuel 14:22 - తరువాత¸°వనుడగు అబ్షాలోమును రప్పింపుమని అతడు సెలవియ్యగా యోవాబు *సాష్టాంగ నమస్కారము చేసి రాజును స్తుతించి* రాజవగు నీవు నీ దాసుడనైన నా మనవి అంగీకరించినందున నా యేలిన వాడవగు నీవలన నేను అనుగ్రహము నొందితినని నాకు తెలిసెనని చెప్పి లేచి గెషూరునకు పోయి
2 Samuel 16:4 - అందుకు రాజు మెఫీబోషెతునకు కలిగినదంతయు నీదేయని సీబాతో చెప్పగా సీబానా యేలినవాడా రాజా, నీ దృష్టియందు నేను అనుగ్రహము పొందుదునుగాక, నేను *నీకు నమస్కారము చేయుచున్నాననెను* .
2 Samuel 19:18 - రాజు ఎదుట నది దాటిరి; రాజు ఇంటివారిని అవతలకు దాటించుటకును రాజు దృష్టికి అనుకూలమైన దానిని చేయుటకును రేవుపడవను ఇవతలకు తెచ్చి యుండిరి. అంతట గెరా కుమారుడగు షిమీ వచ్చి రాజు యొర్దానునది దాటి పోగానే *అతనికి సాష్టాంగపడి*
1 Kings 1:16 - బత్షెబ వచ్చి *రాజు ఎదుట సాగిలపడి నమస్కారము చేయగా* రాజునీ కోరిక ఏమని అడిగి నందుకు ఆమె యీలాగు మనవి చేసెను
1 Kings 1:23 - (నాతాను ప్రవక్త) అతడు *రాజు సన్నిధికి వచ్చి నమస్కారము చేసి* *సాష్టాంగపడి*
1 Samuel 25:23 - అబీగయీలు దావీదును కనుగొని, గార్దభముమీదనుండి త్వరగా దిగి *దావీదునకు సాష్టాంగ నమస్కారముచేసి* అతని పాదములు పట్టుకొని ఇట్లనెను
1 Samuel 24:8 - అప్పుడు దావీదు లేచి గుహలోనుండి బయలువెళ్లినా యేలినవాడా రాజా, అని సౌలు వెనుకనుండి కేక వేయగా సౌలు వెనుక చూచెను. *దావీదు నేల సాష్టాంగ పడి నమస్కారము చేసి*
Luke 5:12 - ఆయన యొక పట్టణములో నున్నప్పుడు ఇదిగో కుష్ఠ రోగముతో నిండిన యొక మనుష్యుడుండెను. వాడు *యేసును చూచి, సాగిలపడి* ప్రభువా, నీ కిష్ట మైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనను వేడుకొనెను
Matthew 8:2 - ఇదిగో కుష్ఠరోగి వచ్చి *ఆయనకు మ్రొక్కి* ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను.
Matthew 15:25 - అయినను ఆమె వచ్చి *ఆయనకు మ్రొక్కి* ప్రభువా, నాకు సహాయము చేయుమని అడిగెను
Luke 17:16 - గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరచుచు, తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిం చుచు, *ఆయన పాదములయొద్ద సాగిలపడెను* ; వాడు సమరయుడు.
Luke 5:8 - సీమోను పేతురు అది చూచి, *యేసు మోకాళ్లయెదుట సాగిలపడి* ప్రభువా, నన్నువిడిచి పొమ్ము, నేను పాపాత్ముడ నని చెప్పెను
Mark 3:11 - అపవిత్రాత్మలు పట్టినవారు ఆయనను చూడ గానే *ఆయన యెదుట సాగిలపడి* నీవు దేవుని కుమారుడ వని చెప్పుచు కేకలువేసిరి.
Matthew 14:33 - అంతట దోనెలో నున్నవారు వచ్చినీవు నిజముగా *దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి.*
1 Peter 2:17 - అందరిని సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, *రాజును సన్మానించుడి* .
Revelation 5:13 - అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై యున్నవానికిని *గొఱ్ఱపిల్లకును స్తోత్రమును* కలుగును గాక
Revelation 5:14 - ఆ నాలుగు జీవులుఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు *సాగిలపడి నమస్కారము చేసిరి* .
రాజుకు స్తుతి పాడుట,నమస్కారం చేయుట, మ్రొక్కుట ఇదంతా కూడా రాజును ఘనపరచుటే.
ఆరాధించడం కాదు అని గ్రహించండి
ఆరాధన చేయాలంటే యే నరుడు దేవుని ఆరాధించాల్సి వచ్చిన
దేవుని ధర్మ శాస్త్రము ప్రకారం యాజకుడు మధ్య వర్తిగా ఉండాలి...
దేవుని ఆరాధించుటకు యేసుక్రీస్తు అను మరి శ్రేష్ఠమైనా యాజకుడు మనకున్నాడు..
యేసుక్రీస్తు అనే ప్రధాన యాజకుని ఆరాధించమని ఎవరు ఎక్కడ బోధించలేదు
ఆరాధనకు పాత్రుడు మాత్రమే ఆరాధన కోరుకుంటున్నాడు అయన తండ్రీ మాత్రమే అని యేసుక్రీస్తు స్వయంగా చెప్పాడు
యేసుక్రీస్తు మాటలను నమ్మి పాటించాలి అంతే...
John 4:23: "అయితే యథార్థముగా ఆరా ధించువారు ఆత్మతోను సత్యముతోను *తండ్రిని ఆరాధించు కాలమువచ్చుచున్నది;* అది ఇప్పుడును వచ్చేయున్నది; *తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు;*