Monday, 25 July 2016

జీవితం చేజారనీకు

జీవితం చేజారనీకు
*****************
( ఆపిల్ కంపెనీ సృష్టికర్త , ప్రపంచ మేధావుల్లో ఒకరైన స్టీవ్ జాబ్స్
ఆసుపత్రిలో , తన ఆఖరి రోజుల్లో డైరీలో రాసుకున్న మాటలు )
వ్యాపార జగత్తులో శిఖరాన్ని చేరాను నేను. విజయానికి ప్రతీకగా నిలిచాను.
పని తప్ప నాకు వేరే ఆనందం తెలీదు. సంపాదనకే అంకితమైపోయాను.
ఇప్పుడు ఈ మరణశయ్య మీద రోజులు లెక్కపెట్టుకుంటున్న నేను
ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే , ఇన్నాళ్ళూ నేను గర్వపడిన పేరూ డబ్బూ ఎందుకూ కొరగానివని నాకు అనిపిస్తోంది .
ఈ నిశిరాత్రిలో ........ నా ప్రాణాలు నిలిపేందుకు అమర్చిన యంత్రాలు చేసే శబ్దంలో నాకు మృత్యుదేవత ఊపిరి చప్పుడు వినిపిస్తోంది.
నాకిప్పుడనిపిస్తోంది........... జీవితంలో సరిపడా డబ్బు సంపాదించాక ,
మనం ఆలోచించాల్సిన విషయాలు వేరే ఉన్నాయి.
కళలూ , అనుబంధాలూ , చిన్నపాటి కలలూ , కోరికలూ , సేవ ..........
ఇలా డబ్బుకి అవతల చాలా ప్రపంచం ఉంది .
కానీ డబ్బు వెనుక పెట్టే పరుగు మనిషిని మరమనిషిలా మార్చేస్తుంది .
అందుకు నేనే ఉదాహరణ .
ఇతరుల మనసుల్లోని ప్రేమను గుర్తించాలనే దేవుడు మనకు జ్ఞానేంద్రియాలను ఇచ్చాడు. కానీ డబ్బుకు మాత్రమే విలువనిచ్చే కాల్పనిక జగత్తును మనం సృష్టించుకున్నాం.
నేను సంపాదించిన డబ్బు ఈ క్షణం నాకు తోడుగా లేదు .
నా ఈ ఆఖరి ప్రయాణంలో అది నా వెంట రాదు .
నేను నాతో తీసుకువెళ్ళగలిగేది ప్రేమానుభూతులూ,
అందమైన జ్ఞాపకాలు మాత్రమే .
ఈ ప్రేమపూర్వక అనుభూతులే ఎప్పుడూ మనతో ఉంటాయి.
మనల్ని ఉన్నతస్థాయికి చేరుస్తాయి .
నిజం , అంతా మన హృదయంలోనే , మన చేతుల్లోనే ఉంది .
ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన మంచం ఏదో తెలుసా?........
నువ్వు రోగంతో బాధపడుతూ పడుకున్న మంచం.
నీ కారు నడపడానికి ఒక డ్రైవర్ ను నియమించుకోగలవు .
నీ కోసం సంపాదించిపెట్టగలిగే ఉద్యోగులను నియమించుకోగలవు.
కానీ , నీ జబ్బునూ , నీ బాధనూ అనుభవించే వ్యక్తిని మాత్రం
ఎన్ని కోట్లు పెట్టినా నువ్వు ఏర్పాటు చేసుకోలేవు .
నువ్వు దేన్ని కోల్పోయినా తిరిగి పొందవచ్చుగానీ
చేజారిన జీవితాన్ని మాత్రం తిరిగి పొందలేవు .
జీవితంలో ఈరోజు మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నా –
కథ ముగిసే రోజు , తెరపడే రోజు ఒకటి వస్తుంది .
అప్పుడు – ఎంత ఆరాటపడినా కాలం వెనక్కి వెళ్ళదు .
అందుకే ..........., కాస్త ముందే కళ్ళు తెరువు .
డబ్బును కాదు , నీ కుటుంబాన్ని ప్రేమించు . నీ స్నేహితులను ప్రేమించు . ఆనందంగా జీవించు . అందరినీ ఆనందంగా జీవించు .

గర్వము వ్యభిచారముకంటే అపాయకరమైనది

ఎదోముమీద దేవుని తీర్పును గురించి ఓబద్యా మాట్లాడెను. ఎదోము మన శరీరమునకు సాదృశ్యముగా ఉన్నది . గనుక ఈ ప్రవచనము మన శరీరము యొక్క పతనమునుగూర్చి సూచించుచున్నది.

ఎదోముయొక్క గర్వము గురించి ఇక్కడ చెప్పబడియున్నది. “అత్యున్నతమైన పర్వతములమీద ఆసీనుడవైయుండి కొండసందులలో నివసించువాడవు”. నన్ను క్రిందకు పడద్రోయ గలవాడెవడని అనుకొనువాడా, నీ హృదయపు గర్వముచేత నీవు మోసపోతివి. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దానిని కట్టినను అచ్చటనుండియు నేను నిన్ను క్రింద పడవేతును (ఓబద్యా 1:3,4).

శరీరము ఎల్లప్పుడు తన్నుతాను హెచ్చించుకొనుటను కోరును. కాని ఆ గర్వమంతటినీ పూర్తిగా నాశనము చేయుటకు దేవుడు నిర్ణయించెను. దొంగలు రాత్రివేళ వచ్చినట్లయితే వారు సమస్తమును దొంగిలించలేరు. కాని ఇక్కడ “వారి సొమ్ము సోదా చేయబడును, వారు దాచిపెట్టిన ధనమంతయు పట్టబడును”. దీని భావము ఆత్మచేత “శరీరానుసారమైన” సమస్తమును, శరీరయిచ్ఛలును పూర్తిగా నాశనము చేయబడును.

యాకోబు సంతతి బంధీలుగా పట్టబడి గొప్ప అవసరములో ఉన్నప్పుడు తమ సొంత బంధువులైన వారిని బలాత్కారము చేసినందున, దేవుడు ఎదోమును శిక్షించెను, పరదేశులు వారి ఆస్తిని పట్టుకొనిపోయిన దినమందు, అన్యులు వారి గుమ్మములలోనికి చొరబడి యెరూషలేము మీద చీట్లు వేసిన దినమందు నీవును వారితో కలసికొంటివిగదా అనెను (ఓబద్యా 1:10,11). ఇశ్రాయేలీయుల శత్రువుల వలె వారు పని చేసిరి. ఇశ్రాయేలుకు సహయపడుటకు ఎదోము ఏమియు చేయలేదు.

చేయవలసినవి చేయకపోవుట మరియు చెయ్యకూడనివి చేయుట అను పాపములు ఉన్నవి. తరచుగా మనము పాపములను గూర్చి తలంచినప్పుడు, కేవలము చేసిన పాపములను మాత్రమే తలంచెదము. గమనించండి. మంచిసమరయుని కథలో యాజకుడు మరియు లేవీయుడు పాపము చేయలేదు. పడియున్న వ్యక్తిని వారు కొట్టలేదు. అవసరములో ఆ వ్యక్తికి వారి చేతివ్రేలితో కూడా సహయపడకపోవడమే పాపము. అవసరములో ఉన్న వ్యక్తికి సహయపడకపోవడము పాపమని మీరు గుర్తించుచున్నారా? అది చేయవలసినది చేయకపోవడమనే పాపము. ఎదోము చేయవలసినది చేయలేదు- దానిని ప్రభువు తీవ్రముగా తీసుకొనెను. ఇశ్రాయేలీయుల శ్రమను చూచి సంతోషించుట ఎదోము చేసిన రెండవపాపము(ఓబద్యా 1:12). నీకు ఇష్టములేని వారికి శ్రమ కలిగినప్పుడు, నీవు సంతోషించుచున్నావా? అది పాపము. ఇతరుల శ్రమలను బట్టి మనము సంతోషింపకూడదు. కాని అది మాత్రమే కాదు నిస్సహాయులైన ఇశ్రాయేలీయులను సంహరించుటకు ఎదోమీయులు అడ్డత్రోవలలో నిలిచిరి (ఓబద్యా 1:14). వారు ఇశ్రాయేలీయుల శత్రువులకు సహకరించిరి. చివరకు ఇశ్రాయేలీయులు స్వతంత్రులగుదురని ప్రభువు చెప్పెను. దాదాపు ప్రతి ప్రవక్త మళ్ళి స్థాపించబడటము గూర్చి చెప్పిరి. ఒకరోజు “తప్పించుకొనిన వారు యెరుషలేములో నివసింతురు” (ఓబద్యా 1:17). అది ప్రతిష్టత స్థలమగును. యాకోబు సంతతివారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకొందురు. ఆ సమయమున యాకోబు సంతతివారు అగ్నియు, ఏశావు సంతతివారు కొయ్యకాలగుదురు. మరియు ఏశావు యొక్క కొండకు తీర్పుతీర్చుటకై సీయోనుకొండ మీద రక్షకులు పుట్టుదురు. అప్పుడు రాజ్యము యెహోవాది యగును (ఓబద్యా 1:21). దిగజారిన దేవుని ప్రజలకు “ఇదిగో మీ రాజు” అని ప్రకటించి, మరియు వారిని వెనుకకు పిలుచుటకు రక్షకులుగా ఉండుటకు దేవుడు మనలను పిలచెను.

ఎదోము పతనమగుటకు కారణమేమిటి? “నీ హృదయపుగర్వము చేత నీవు మోసపోతివి”(ఓబద్యా 1:3). గర్వము, సైతాను స్వభావమైయున్నందున, మనము గర్వించినప్పుడు అత్మీయ మోసమునకు ద్వారము తెరచినట్లగును. నీకున్న అందమునుబట్టి, తెలివితేటలనుబట్టి, ఆత్మీయతనుబట్టి, బైబిలు జ్ఞానమునుబట్టి, మరిదేనిగూర్చియైనను నీవు గర్వించిన వెంటనే సాతాను నీ మీదకు వచ్చి, ఇప్పుడు “నీవు మరియు నేను సహవాసము కలిగియున్నామని చెప్పును”. మరొకవైపున యేసు, భూమి మీద నడిచిన మనుష్యులందరిలో దీనుడైయున్నారు మరియు నిన్ను నీవు తగ్గించుకొనిన వెంటనే ఆయనతో సహవాసము కలిగియుందువు.

వ్యభిచారము బహింరంగపాపము గనుక వ్యభిచారముకంటే గర్వమె అపాయకరమైనది - మరియు బహిరంగ పాపములు రహస్యపాపములకు కంటెఅపాయకరమైనవి కావు. వారి గర్వములో సంతోషించువారు మోసపొయెదరని ఓబద్యా వారిని హెచ్చరించుచున్నాడు. శరీరేచ్చల బంధకాలలో మన చుట్టూ ఉన్నవారికి, ప్రభువైన యేసు వారిని పూర్తిగా విడిపించగలడని ప్రకటించుటకు ఈ క్లుప్తమైన హెచ్చరికనుండి మనము నేర్చుకొనెదము గాక.

ఆస్తికత్వం Vs నాస్తికత్వం

ఒక తల్లి గర్భంలో ఇద్దరు కవలలు మాట్లాడుకుంటూ ఉంటారు.

మొదటి (నాస్తిక)శిశువు : మనం ఇక్కడనుండి వెళ్లిపోయాకా ఉండే జీవితం మీద నీకు నమ్మకం ఉందా?

రెండో (ఆస్తిక)శిశువు : ఆ... ఎందుకు లేదు? ఖచ్చితంగా ఇక్కడనుండి వెళ్లిపోయాకా ఇంకా చాలా ఉండే ఉంటుంది. బహుశా ఇక్కడ మనల్ని మనం ఆ జీవితానికి తగ్గట్టు మలుచుకుంటున్నామేమో...

మొదటి (నాస్తిక)శిశువు : ఛ ఛ, అలాంటిదేమీ ఉండదు. అయినా అసలు ఇది కాకుండా ఇంకా ఏమి ఉంటుంది?

రెండో (ఆస్తిక)శిశువు : నాకు తెలియదు. కాని అక్కడ ఇంతకన్నా ఎక్కువ కాంతి ఉంటుంది. బహుశా అక్కడ మనం మన కాళ్లతో నడుస్తూ, నోటి ద్వారా ఆహారం తీసుకుంటూ ఉంటామేమో. ఇంకా ప్రస్తుతం మనం అర్థం చేసుకోలేనివి ఇంకా చాలా ఉంటాయి.

మొదటి (నాస్తిక)శిశువు : మనం కదలడమా? నోటి ద్వారా ఆహారం తీసుకోవడమా?? అసంభవం... మనకు కావలసినదంతా మన బొడ్డు ద్వారానే మనకు అందుతుంది. కాని అది చాలా తక్కువ పొడవు ఉంటుంది. కాబట్టి ఇక్కడనుండి బయటకు వెళ్లిపోయాకా ఉండడం అస్సలు కుదరదు.

రెండో (ఆస్తిక)శిశువు : కాని అక్కడ ఇలా ఉండకపోవచ్చు. మనకి బొడ్డు అవసరం కూడా ఉండదేమో...

మొదటి (నాస్తిక)శిశువు : అదంతా మూర్ఖత్వం. అయినా బయట ఏమైనా ఉంటే అక్కడ నుంచి ఎప్పుడైనా, ఎవరైనా తిరిగి వచ్చారా? గర్భం నుండి బయటకు వెళ్ళడం అంటే అది మన అంతం. ఆ తర్వాత అంతా చీకటి, నిశ్శబ్దం. అంతే... ఇంక ఏమీ ఉండదు.

రెండో (ఆస్తిక)శిశువు : సర్లే... నాకు తెలియదులే. కానీ మనం అక్కడకు వెళ్ళాకా మన అమ్మని కలుస్తాం. మనల్ని తనే చూసుకుంటుంది.

మొదటి(నాస్తిక) శిశువు : అమ్మా...! నువ్వు అమ్మని కూడా నమ్ముతున్నావా!? ఇది నిజంగా వెటకారం. నిజంగా అమ్మ అని ఎవరైనా ఉంటే, ఎక్కడ ఉందో చెప్పు?

రెండో(ఆస్తిక) శిశువు : తను మన చుట్టూ ఉంటుంది. మనం తనలోనే ఉన్నాం. అసలు అమ్మ లేకుండా మనం ఉంటున్న ప్రపంచం లేదు.

మొదటి (నాస్తిక)శిశువు : నేను తనని ఎప్పుడూ చూడలేదు. అది చాలు తను లేదు అని చెప్పడానికి.

రెండో (ఆస్తిక)శిశువు : ఒక్కోసారి... నువ్వు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, వినే దాని మీద దృష్టి నిలిపినప్పుడూ తన ఉనికి నీకు తెలుస్తుంది. పై నుంచి తన మాటలు కూడా వినిపిస్తాయి...

ప్రియసహోదరి, సహోదరుడా...

 మనం మరణించిన తరువాత శరీరం విడచిన ఆత్మలముగా మరో జీవితం ఉన్నాదనే విషయాన్ని పరిశుద్ద (బైబిల్) గ్రంధం తెలియజేస్తుంది.

ఈ విషయాన్ని నమ్మి, దేవుడు కోరిన విధంగా ఈలోకంలో జీవించి, నిత్యరాజ్యంలో శాశ్వత ఆనందం తో జీవిస్తావో,

లేక

 ఇవన్నీ వట్టిదని భావించి, నాస్తికుడివై జీవించి, నిత్యనరకంలో వేదనతో ఉంటావో ఆలోచించుకో.

చెబుతారు కానీ చేయరు

*వారు చెప్పుదురే గాని చేయరు. మత్తయి-23:3* """"""""""""""""...