1. We follow the Doctrine of Christ. 2. We teach all the books in the Bible... 3. We conduct Bible Training programs.
Thursday, 30 April 2020
దేవుని సభ - God's Counsel
Thursday, 23 April 2020
యేసుక్రీస్తు కూడా మరో దేవుడా?
Tuesday, 14 April 2020
అవిశ్వాసిని వివహమాడవచ్చా?
*ప్రశ్న:- అవిశ్వాసిని పెళ్ళి చేసుకోవచ్చా..?*
*జవాబు:-*
*2 కొరిం 6:14*
మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి. అంటే అవిశ్వాసులతో జోడీవేసుకోవద్దు,
జోడీ కట్టొద్దు.
కాడి వేసుకోవద్దు. అని అర్ధం.
రెండు ఎద్దులు కలిపి ఒక కాడి వేస్తారు.
మీరు అవిశ్వాసులతో కాడివేసుకోవద్దు.
*ఇది సిద్దాంతం.* నీవు ఎంతవరకూ పాటిస్తావో, పాటించవో నీ యిష్టం.
దేవుడు మానవునికి స్వేచ్చను ఇస్తున్నాడు. నిర్భంధించడం లేదు.
మానవునికివ్వబడిన స్వేచ్చను దుర్వినియోగ పరచుకుంటున్న మానవుడు దేవుడు చెప్పిన సిద్దాంతాన్ని ప్రక్కనపెట్టి, దేవుని అంగీకారం లేకపోయినా, అవిశ్వాసులతో జోడీకడతానంటే దేవుడు మానవుని స్వాతంత్ర్యంలో జోక్యం చేసుకోడు. ఆపుచేయడు.
ఏది మేలు ?ఏది కీడు అనేది మాత్రమే చెబుతాడు. తరువాత నీ యిష్టం..
బైబిల్ చెప్పిందా.,? సరే కాసేపు ప్రక్కనపెడదాం..
దేవుడు చెప్పిన నియమమా ? చూద్దాంలే.. అని నిర్లక్ష్యం చేస్తూ తన ఇష్టాన్నే నెరవేర్చుకుంటున్నాడు.
*ద్వితి 7:1-4*
నీవు వారితో నిబంధన చేసుకొనకూడదు. వియ్యమందకూడదు. వాని కుమారుని నీకుమార్తెకు ఇయ్యకూడదు. నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. నన్ను అనుసరింపకుండా ఇతరదేవతలను పూజించునట్లు నీ కుమారునివారు మళ్ళించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీమీద రగులుకొని, ఆయన నిన్ను త్వరగా నశింపజేయును.
దేవుడు చెప్పిన సిద్దాంతంను ప్రక్కనపెట్టిన ఓ రాజు practical లైఫ్ లో ఎలా fail అయ్యాడో చూద్దాం
*1రాజు 11:4-8*
సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును *ఇతర దేవతలతట్టు త్రిప్పగా* అతని తండ్రియైన దావీదు హృదయమువలె అతని హృదయము దేవుడైన యెహోవాయెడల యథార్థము కాక పోయెను.
5.సొలొమోను అష్తారోతు అను సీదోనీయుల దేవతను మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను.
6.ఈ ప్రకారము సొలొమోను *యెహోవా దృష్టికి చెడు నడత నడచి* తన తండ్రియైన దావీదు అనుసరించినట్లు *యథార్థహృదయముతో యెహోవాను అనుసరింపలేదు.*
7.సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూష లేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను.
8.తమ దేవతలకు ధూపము వేయుచు బలుల నర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఈలాగు చేసెను.
సిద్దాంతం వేరు
practical life వేరు
మహాజ్ఞానియైన సొలోమోను సహితం practical life లో fail అయ్యాడు.
మరి మీ పరిస్థితి మీరే ఆలోచించుకోవాలి..
*ఆల్రెడీ అవిశ్వాసులతో వివాహం జరిగిపోయి ఉంటే.. వారి పరిస్దితి ఏమిటి..?*
*1కొరిం 7:14*
అవిశ్వాసియైన భర్త భార్యను బట్టి పరిశుద్ధ పరచబడును; అవిశ్వాసురాలైన భార్య విశ్వాసియైన భర్తనుబట్టి పరిశుద్ధపరచబడును. లేనియెడల మీ పిల్లలు అపవిత్రులై యుందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు.
*1పేతు3:1-*
స్త్రీలు తమ స్వపురుషులకు లొబడి యుండాలి. భయముతో కూడిన ప్రవర్తనను బట్టి, భర్తలనడవడికను మార్చవచ్చు..
ఆరాధన చేయు స్థలము
*ఆరాధన చేయు స్థలమేది ?*
*ఎక్కడ పడితే అక్కడ ఆరాధన చేయవచ్చా..?*
*1. పితరుల యుగములో..*
పితరుల యుగంలో ఆరాధన అనేది తేటగా ఆలోచించ బడిన సందేశం కాదు.
అయినప్పటికీ
పితరులు దేవునిని ఎలా ఆరాధించారు అంటే..? ఒకచోట బలిపీఠం కట్టి, అక్కడనే బలి అర్పించే వారు.
అది ఆకాలంలో ఆరాధనగా ఎంచబడింది. దేవుడు ఆ సువాసనను ఆఘ్రాణించాడు. *(ఆది 8:20-21; ఆది 13:3-4)*
*2. మోషే యుగంలో...*
ఆరాధించే స్ఠలానికి అత్యంత ప్రాముఖ్యత చూస్తాము.
ఆరాధన యెహోవా మందిరములో మాత్రమే జరగాలి
ఆరాధన యెరూషలేములో మాత్రమే జరగాలి
యెరూషలేము ఆనాడు మత కేంద్రముగా పేరొంధి, విలసిల్లినది.
*ద్వితి 12:13,14*
నీవు చూచిన ప్రతీస్థలమున నీ దహనబలులు అర్పింపకూడదు. యెహోవా నీ గోత్రములలో ఒకదానియందు *ఏర్పరచుకొను స్ధలముననే నీ దహనబలులు అర్పించి*, నేను మీకాజ్ఞాపించుచున్న సమస్తమును *అక్కడనే జరిగించవలెను.*
2 Samuel(రెండవ సమూయేలు) 15:32
*దేవుని ఆరాధించు స్థలమొకటి ఆ కొండమీద ఉండెను*. వారు అచ్చటికి రాగా అర్కీయుడైన హూషై పై వస్త్రములు చింపుకొని తలమీద ధూళి పోసికొనివచ్చి రాజును దర్శనము చేసెను.
2 Chronicles(రెండవ దినవృత్తాంతములు) 7:3
అగ్నియు *యెహోవా తేజస్సును మందిరముమీదికి* దిగగా చూచి ఇశ్రాయేలీయులందరును సాష్టాంగనమస్కారము చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతర ముండునని చెప్పి *ఆయనను ఆరాధించి స్తుతించిరి.*
2 Chronicles(రెండవ దినవృత్తాంతములు) 29:20,28,29
20.అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడలేచి, పట్టణపు అధికారులను సమకూర్చుకొని *యెహోవా మందిరమునకు పోయెను.*
28.అంత సేపును సర్వసమాజము *ఆరాధించుచుండెను.* గాయకులు పాడుచుండిరి, బూరలు ఊదు వారు నాదముచేయుచుండిరి,దహనబలియర్పణ సమాప్తమగువరకు ఇదియంతయు జరుగుచుండెను.
29.వారు అర్పించుట ముగించిన తరువాత రాజును అతనితోకూడనున్న వారందరును *తమ తలలు వంచి ఆరాధించిరి.*
Jeremiah(యిర్మీయా) 26:2
యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా, *నీవు యెహోవా మందిరావరణములో* నిలిచి, నేను నీ కాజ్ఞాపించు మాట లన్నిటిని *యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చు* యూదా పట్టణస్థులందరికి ప్రకటింపుము; వాటిలో ఒక మాటైనను చెప్పక విడవకూడదు.
John(యోహాను సువార్త) 4:20
మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని *ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో* ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను
Acts(అపొస్తలుల కార్యములు) 8:27
అప్పుడు ఐతియొపీయుల రాణియైన కందాకే క్రింద మంత్రియై ఆమెయొక్క ధనాగారమంతటి మీదనున్న ఐతియొపీయుడైన *నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు* వచ్చియుండెను.
Acts(అపొస్తలుల కార్యములు) 24:11
*యెరూషలేములో ఆరాధించుటకు* నేను వెళ్లిననాట నుండి పండ్రెండు దినములు మాత్రమే అయినదని తమరు విచారించి తెలిసికొన వచ్చును.
మోషే యుగంలో ఆరాధన.,
👉దేవుడు కోరుకున్న జనముతో,
👉దేవుడు ఎంచుకున్న స్థలములో,
👉దేవుడు ఆజ్ఞాపించిన విధముగా,
👉దేవుడు కోరిన రీతిలో,
👉 దేవుడేర్పరచిన నమూనాలో,
👉పోలికలో నిర్మింపబడిన ప్రత్యక్షగుడారములో, యెహోవా మందిరములో మాత్రమే ఆరాధన జరిగినట్లు మనము గమనించగలము
*క్రైస్తవుల ఆరాధనా స్ధలమేది ?*
మోషే, ధర్మశాస్త్ర కాలములో భౌతిక సంబంధమైన స్థలానికి ప్రాముఖ్యత ఇవ్వబడినది.
కానీ నేడు బౌతిక స్థలానికి ప్రాముఖ్యత లేదు.
Hebrews(హెబ్రీయులకు) 10:1
ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల *ఛాయ* గలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలదికాదు గనుక ఆ యాజకులు ఏటేట ఎడతెగకుండ అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడును *సంపూర్ణసిద్ధి కలుగజేయ నేరవు.*
Hebrews(హెబ్రీయులకు) 9:9
ఆ గుడారము ప్రస్తుతకాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమునుబట్టి మనస్సాక్షి విషయములో *ఆరాధకునికి సంపూర్ణసిద్ధి కలుగజేయలేని* అర్పణలును బలులును అర్పింపబడుచున్నవి.
John(యోహాను సువార్త) 4:20,21,22,23,24
20.మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను
21.అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను *యెరూషలేములో నైనను మీరు తండ్రిని ఆరాధింపరు*. నా మాట నమ్ముము;
22.మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము; రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది.
23.అయితే *యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను ,సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది;* అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు;(మూలభాషలో-వెదుకుచున్నాడు).
24.దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.
👉పర్వతం మీద ఆరాధించరు.
👉 యెరూషలేములో ఆరాధించరు.
👉నేడు స్థలానికి ప్రాముఖ్యత లేదు
*స్థలానికి బదులు జనాన్ని కోరుకున్నాడు దేవుడు.*
Isaiah(యెషయా గ్రంథము) 51:16
నేను ఆకాశములను స్థాపించునట్లును భూమి పునాదులను వేయునట్లును *నాజనము నీవేయని సీయోనుతో చెప్పునట్లును* నీ నోట నా మాటలు ఉంచి నా చేతినీడలో నిన్ను కప్పియున్నాను.
Psalms(కీర్తనల గ్రంథము) 132:13,14
యెహోవా *సీయోనును ఏర్పరచుకొనియున్నాడు. తనకు నివాసస్థలముగా దానిని కోరుకొని యున్నాడు.*
14. *ఇది నేను కోరినస్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును ఇక్కడనే నేను నివసించెదను*
సీయోను అనగా...
👉దేవుడు కోరుకున్న స్ఠలం,
👉దేవుని జనము,
👉క్రీస్తు సంఘము నకు సూచన
👉ఆరాధన క్రీస్తు ప్రభువు సంఘములో జరగాలి
👉క్రీస్తు శరీరమైన సంఘములో జరిగేది ఆరాధన
👉క్రీస్తు రాజుగా ఉన్న రాజ్యములో ఆయన ఏలుబడి క్రింద జీవించే ప్రజలు జరిగించేది
ఆరాధన అనబడుతుంది
👉క్రీస్తు శిరస్సుగా గల సంఘములో ఆయన అధికారం క్రింద జీవించే ప్రజలున్న సంఘములో జరిగేది ఆరాధన
👉ఆయన ఏం చెప్పినా అన్నివిషయాలలో ఆయన మాట వినేవారి సముదాయం గలవారు ఉన్నచోట దేవుడు నివశిస్తాడు.
👉అది ఆయన కోరిన స్థానము.
👉అది ఆయనకు నిత్యమూ విశ్రమ స్దానము.
👉ఆరాధన అక్కడే జరగాలి.
ఇంకెక్కడ జరిగినా అది ఆరాధన అనబడదు
ఆత్మతో సత్యముతో ఆరాధన
*ఆత్మతోను సత్యముతోను ఆరాధించుట అంటే ఏమిటి..?*
*ఆత్మతో ఆరాధన*
👉శరీరమును ఆస్పాదము చేసుకొనని దానిని ఆత్మతో అనగా భావించబడుతుంది
👉శరీరమును ఆస్పదము చేసుకొనక, దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు, క్రీస్తు యేసునందు అతిశయ పడుచున్న మనమే సున్నతి గలవారము. (ఫిలి 3:3)
👉శరీరమును ఆస్పదము చేసుకోవడం అంటే నీ ఉద్యోగము, నీ హోదా, నీ కులగోత్రాలు, మీ కుటుంబము, నీ అంతస్తు, వగైరాలన్ని ఆధారము చేసుకొనడమే శరీరాన్ని ఆస్పదము చేసుకోవడం.
👉పౌలుకు అతిశయ కారణాలు ఎన్ని ఉన్నా వాటిని బట్టి ఎన్నడూ అతిశయించలేదు.
దేవుని సన్నిధిలో నీశరీరాన్ని బట్టి అతిశయించదగిన కారణాలేమీ ఉండకూడదు. అప్పుడే ఆత్మతో ఆరాధన చేసినట్టు అవుతుంది.
*సత్యముతో ఆరాధన*
👉సత్యముతో ఆరాధన అంటే మనుషులు కల్పించే పద్ధతులు దైవోపదేశములుగా బోధించుచు చేసే ఆరాధన సత్య ఆరాధన కాదు (మత్త15:9)
👉ఒకడు తనకు తోచినట్లు అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి, తాను చూచిన వాటిని గూర్చి, విన్నవాటిని గూర్చి, గొప్పగా చెప్పుకొనుచూ, శరీర సంబంధమైన మనసు వలన ఉప్పొంగుచూ.. శిరస్సును హత్తుకొననివాడు చేసే ఆరాధనా సత్యారాధన అనబడదు (కొల2:18-19)
👉తెలియని దేవునికి చేసే ఆరాధనా సత్య ఆరాధన కాదు (అపో. 17:23)
*సత్య ఆరాధన.. అంటే లేఖనాలను పరిశీలించి, లేఖనాల ప్రకారం ఆరాధించడం సత్యముతో ఆరాధించడమే*
ఆరాధన ప్రారంభము
*ఆరాధనకు ఎక్కడ బీజాలు పడ్డాయి..?*
అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ. *ఆదికాండము 15 :13*
నీ సంతతి వారు తమదికాని పరదేశ మందు నివసించి ఆదేశపు వారికి దాసులుగా నుందురు. వారు నాలుగు వందల యేండ్లు వీరిని శ్రమ పెట్టుదురు
మీరు ఎవరికి దాసులగుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును
అబ్రహాము తండ్రి ఇల్లు విగ్రహారాధన తో కూడిన ఇల్లు. దాని నుండి బయటికి రా అన్నాడు దేవుడు
*యెహోషువ 24: 2*
ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పునదేమనగా ఆదికాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకు తండ్రి యైన తెరహు కుటుంబికులు నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అయితే నేను అది అద్దరి నుండి మీ పితరులైన అబ్రాహామును తోడుకొని వచ్చి, కనాను దేశమంతటా సంచరింప చేసి, సంతానమును విస్తరింపచేసి అతనికి ఇస్సాకును ఇచ్చితిని
విగ్రహారాధన నుండి ఇతర దేవతల నుండి బయటకు వచ్చేసేయ్. నా సంకల్పానికి సాధనంగా నీవు ఉంటావు.
తెరహు ఇంటిలో యవ్వన దంపతులు దేవునికి కనబడ్డారు. వారు అబ్రహాము శారా.
ఆదర్శ దంపతులు వీళ్ళు
విగ్రహారాధన సంబంధమైన మీ తండ్రి ఇంట్లో నుండి బయటకు వచ్చేయ్. అన్నాడు దేవుడు
పురుష నాయకత్వం దేవుని యొక్క ఏర్పాటు. అబ్రాహాము పురుషనాయకత్వం గల వ్యక్తి. మారు మాట్లాడలేదు.
నీ దేశాన్ని, నీ తండ్రి ఇంటిని, బంధువులను, వదలి వచ్చేయ్ అనగానే వచ్చేశాడు అబ్రాహాము.
విగ్రహారాధన తో కూడిన ఇల్లు నాకు వద్దు
నా సంకల్పాన్ని విగ్రహారాధన జరిగే ఇంట్లో నుండి మొదలు పెట్టలేను.
అబ్రహాము ఎక్కడికి వెళ్ళవలెనో ఎరుగకయే బయలుదేరాడు. శారా తల్లి నీవు ఎక్కడికి వెళ్ళదువో నేను అక్కడే ఉంటాను అన్నది *హెబ్రీ 11: 8*
దేవుని సంకల్పంనకు పురుష నాయకత్వం తో కూడిన ఇల్లు అయి ఉండాలి
"ఇల్లు చూసి బాగుంటే వస్తాను" అనే టైప్ కాదు ఆ శారా తల్లి
బహు సుందరవతి
నా గతి ఏమిటి ?
ఆ భార్య గతి ఏమిటి ?
అనేకమైన ఆలొచనలు..
అబ్రాహాము ఇంటిలో 318 మంది జన్మించారు. అబ్రాహాము బహు ధనవంతుడైనాడు.
*ఆదికాండము 15: 1* నాకు ఏమి ఇచ్చిననేమి ?
నేను సంతానము లేని వాడిని పోవుచున్నానే అని అబ్రహాము అన్నప్పుడు
అబ్రహాముతో నిబంధన స్థిరపరిచాడు దేవుడు
*ఆదికాండము 15 : 13*
నీసంతతి వారు నాలుగు వందల సంవత్సరాలు శ్రమ పడతారు
తరతరాలకు ముందుగా ఏం జరుగుతుందో చూడగలిగిన వాడు దేవుడు
నాలుగువందల సంవత్సరాల పిమ్మట ఐగుప్తు నుండి విడుదల పొందిన ఇశ్రాయేలీయులతో,. మీరందరూ గుడారాలు వేసుకుంటున్నారు నాకు కూడా ఒక డేరా వేయండి నేను మీ మధ్యలో నివాసము చేస్తాను
*నిర్గమ 25:8* నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధస్థలమును నిర్మింపవలెను
*ఇక్కడే ఆరాధనకు బీజాలు పడ్డాయి*
విమోచింపబడిన వారి మధ్యలో ఆరాధింపబడడానికి దేవుడు ఇష్టపడ్డాడు
నా డేరా ఇలాఇలా ఉండాలి అని *నిర్గమకాండము 25 నుండి 40 అధ్యాయాలు* మధ్య గుడారముయొక్క విశేషమైన సంగతులు ఉన్నాయి
క్రీస్తు రక్తం చేత విమోచన బడిన వారి మధ్యలో నేడు దేవుడు నివాసము చేస్తాడు
క్రీస్తు ప్రభువు సంఘములో దేవుడు నివాసం చేస్తాడు
*ఎఫెసి 2:19* కాబట్టి మీరు ఇకమీదట పర జనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్తులను దేవుని ఇంటివారునై యున్నారు
అపోస్తలులు ను ప్రవక్తలును వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు
ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువు నందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా దేవునికి నివాసస్థలమైన యుండుటకు కట్టబడుచున్నారు
*యెషయ 28 :16* యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింప బడిన రాయి. అమూల్యమైన తల రాయి, బహు స్థిరమైన పునాదియైన మూలరాయియైయున్నది విశ్వసించువాడు కలవరపడడు.
ఎవరిచేతో పునాది వేస్తే దేవుడు ఒప్పుకోడు. అపోస్తులుల బోధ కుండే విశేషమైన సమాచారం ఇది.
అపో. లు, ప్రవక్తలు వేసిన పునాది మీదే కట్టబడాలి. అలా లేకపోతే మీ ఆరాధనా అంగీకరించబడదు
ఇశ్రాయేలీయుల మధ్య ఒక గుడారము ఏర్పరచి, వారి మధ్యలో నేను ఆరాధించబడాలి.
అలా ఆరాధనకు బీజాలు పడ్డాయి.
మంచి దినములు చూడగొరువాడు
*మంచి రోజులు చూడాలనుకునేవారు ఎవరిని ప్రేమించాలి..? దేనిని ప్రేమించాలి....???*
*జీవమును ప్రేమించాలి.* (1పేతు 3:10)
👉మంచిరోజులు కోసం ఎదురు చూసేవారు జీవమును ప్రేమిస్తారు.
👉ప్రాణాన్ని ప్రేమించడం వేరు. జీవాన్ని ప్రేమించడం వేరు.
👉నీవు నీ ప్రాణాన్ని ప్రేమిస్తే జీవాన్ని ప్రేమిస్తున్నట్టు కాదు.
👉దేహాన్ని బ్రతికించేది ప్రాణం
ఆత్మను జీవింపజేసేది జీవం
👉ప్రాణాన్ని ప్రేమించేవాడికి మంచి రోజులుండవు.
👉(మత్త 16:25) తన ప్రాణంను రక్షించు కోవాలనుకొనేవాడు దానిని పోగొట్టుకుంటాడు.
👉రక్షించుకోవాలని నీవు ఆరాటపడుతుంటే.. అది నీకు దక్కదా..? ఆశ్చర్యంగా లేదూ..?
👉నా నిమిత్తం తన ప్రాణంను పోగొట్టుకొనువాడు దానిని దక్కించుకొంటాడు.
👉కాబట్టి ప్రాణాన్ని దక్కించుకోవాలనే ఆలోచన చెయ్యకు.
👉ప్రాణాన్ని శుభప్రదంగా ఉంచుకోవాలని తాపత్రయపడకు.
👉(లూకా 12:16)
👉వెర్రివాడైన ధనవంతుడు
*నా ప్రాణమా...*
(అది పోగొట్టుకునే ప్రాణం.)
👉ఏది పొగొట్టుకుంటావో అది నీదెలా అవుతుంది..?
👉దేవుడు పిలిస్తే వెళ్ళిపోయే ప్రాణం.
👉ఆ ప్రాణంతో ధనవంతుడు చెప్పుకొంటున్నాడు.
👉 *అనేక సంవత్సరాలకు..*
👉ఈరోజుకే Guarantee లేదు.
👉అనేక సంపత్సరాలకొరకు ప్లానా..?
*వెర్రివాడు..*
👉ఈ రాత్రే దేవుడు ప్రాణం అడిగితే ఇచ్చేయాలని తెలుసుకోలేకపోయాడు.
👉ప్రాణం నకు భవిష్యత్ లేదు.
👉ప్రాణం నకు మంచి రోజులు రావు.
👉ప్రాణానికి సుఖం ఉండదు.
👉దుర్ధినాలే వస్తాయి.
👉ప్రతీ ఒక్కరి జీవితంలో నాప్రాణానికి సుఖం, సంతోషం లేదని చెప్పే రోజులు ఉన్నాయి.
👉నీవు ప్రాణాన్ని ప్రేమిస్తే,.
దానిని పోగొట్టుకొంటావ్..
👉 *జీవాన్ని ప్రేమించు. నీకు మంచిరోజులు వస్తాయ్..*
👉ఆస్ధి సంపాదించుకొనేవాడు తన ప్రాణం కొరకు ఆలోచన చేస్తున్నాడు.
👉ఈ లోక సంబంధులు ప్రాణం కొరకు ఆలోచన చేస్తారు.
👉నీ సంపాదన అంతా నీ ప్రాణం కొరకే అయితే నీవు నష్టపోతావ్,,
👉ఆత్మ కొరకు సంపాదన వేరేగా ఉంటుంది.
👉(1తిమో 6:11)
నీతిని, భక్తిని, విశ్వాసంను, ప్రేమను, ఓర్పును, సాత్వీకంను సంపాదించుకొనుటకు ప్రయాసపడుము.
👉ఇది జీవంను ప్రేమించేవారు చేసేపని.
👉మంచిరోజులు చూడాలనుకొనేవారు సంపాదించుకునే గుణ లక్షణాలు.
👉ధనాపేక్ష సమస్త కీడులకు మూలము.
👉ధనాపేక్ష ప్రాణానికి సంబంధించినది,
👉నా భవిష్యత్ ఏమిటి..? అని ఆలోచించేవారు డబ్బుపై తన మనస్సు పెడతారు.
👉ఇల్లు, వాకిలి, డబ్బు, ఆస్తులు
LIC పాలసీలు ఇవన్నీ ప్రాణానికి సంబంధించిన department. ఇవి నిన్ను రక్షింపలేవు.
👉జీవానికి సంబంధించిన department వేరేగా ఉంటుంది.
👉అవి నీవు సంపాదించుకోవాలి.
👉ఆ list నీదగ్గర ఉండాలి.
👉నీవు దేనిని ప్రేమిస్తున్నావో వాటికొరకు ఎగబడతావు.
👉ప్రాకులాడతావు. ఆరాటపడతావు. శ్రమిస్తావు.
👉అనేక సంవత్సరాలకు plan వేసుకుంటే... అది నీకు security కల్పించదు. నీవు మోసపోతావ్..
👉నీ భద్రత జీవాన్ని ప్రేమించడంలో ఉంది.
👉జీవాన్ని ప్రేమించేవాడు భౌతికసంబంధమైన భద్రత కోసం ఆలోచించడు.
👉ఆత్మసంబంధంగా ఆలోచన చేస్తాడు.
👉అతని Account లో నీతి, భక్తి, విశ్వాసం వగైరా ఎంతవరకూ ఉన్నాయో ఆలోచించుకుంటాడు. వాటికొరకు ప్రయాసపడతాడు.
👉నీకు భౌతికంగా ఎన్ని bank account లు ఉన్నా వృధా,,
నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా వృధా,,
👉(ఎఫె 4:18) దేవుని వలన కలిగేది జీవం. దానిలోనుండి నీవు వేరుకావద్దు. నీకు మంచిరోజులు రావు.
👉(ఎఫె 2:1) అపరాధంల చేత పాపముల చేత చచ్చినవారు జీవంలో నుండి వేరుచేయబడినవారు,
👉జీవాన్ని ప్రేమించేవారు వెలుగులో పయనిస్తారు.
👉దేవునితో సహవాసం కలిగియుంటారు. వానికి భవిష్యత్ ఉంటుంది.
👉దేవుని ఇంటిలో నిరంతరం జీవించే అవకాశం జీవమును ప్రేమించేవారికే..
👉నా retirement తర్వాత ఏమిటి..? అని ఆలోచిస్తే..
ఏముంది..? పోతావ్.. అంతకుమించి ఏం జరుగుతుంది..?
👉మంచి ఉద్యోగం, మంచి సంపాదన, మంచి పొజిషన్ ఇవేమీ నీకు మంచిరోజులు తెచ్చిపెట్టవు.
*దేవుని జీవము నీకు నిత్యభద్రత కల్పిస్తుంది. నీకు మంచిరోజులు వస్తాయ్..*
క్రైస్తవుల ఆరాధన స్థలము
*క్రై స్తవుల ఆరాధనా స్ధలమేది ?*
మోషే, ధర్మశాస్త్ర కాలములో భౌతిక సంబంధమైన స్థలానికి ప్రాముఖ్యత ఇవ్వబడినది.
కానీ నేడు బౌతిక స్థలానికి ప్రాముఖ్యత లేదు.
Hebrews(హెబ్రీయులకు) 10:1
ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల *ఛాయ* గలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలదికాదు గనుక ఆ యాజకులు ఏటేట ఎడతెగకుండ అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడును *సంపూర్ణసిద్ధి కలుగజేయ నేరవు.*
Hebrews(హెబ్రీయులకు) 9:9
ఆ గుడారము ప్రస్తుతకాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమునుబట్టి మనస్సాక్షి విషయములో *ఆరాధకునికి సంపూర్ణసిద్ధి కలుగజేయలేని* అర్పణలును బలులును అర్పింపబడుచున్నవి.
John(యోహాను సువార్త) 4:20,21,22,23,24
20.మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను
21.అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను *యెరూషలేములో నైనను మీరు తండ్రిని ఆరాధింపరు*. నా మాట నమ్ముము;
22.మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము; రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది.
23.అయితే *యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను ,సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది;* అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు;(మూలభాషలో-వెదుకుచున్నాడు).
24.దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.
👉పర్వతం మీద ఆరాధించరు.
👉 యెరూషలేములో ఆరాధించరు.
👉నేడు స్థలానికి ప్రాముఖ్యత లేదు
*స్థలానికి బదులు జనాన్ని కోరుకున్నాడు దేవుడు.*
Isaiah(యెషయా గ్రంథము) 51:16
నేను ఆకాశములను స్థాపించునట్లును భూమి పునాదులను వేయునట్లును *నాజనము నీవేయని సీయోనుతో చెప్పునట్లును* నీ నోట నా మాటలు ఉంచి నా చేతినీడలో నిన్ను కప్పియున్నాను.
Psalms(కీర్తనల గ్రంథము) 132:13,14
యెహోవా *సీయోనును ఏర్పరచుకొనియున్నాడు. తనకు నివాసస్థలముగా దానిని కోరుకొని యున్నాడు.*
14. *ఇది నేను కోరినస్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును ఇక్కడనే నేను నివసించెదను*
సీయోను అనగా...
👉దేవుడు కోరుకున్న స్ఠలం,
👉దేవుని జనము,
👉క్రీస్తు సంఘము నకు సూచన
👉ఆరాధన క్రీస్తు ప్రభువు సంఘములో జరగాలి
👉క్రీస్తు శరీరమైన సంఘములో జరిగేది ఆరాధన
👉క్రీస్తు రాజుగా ఉన్న రాజ్యములో ఆయన ఏలుబడి క్రింద జీవించే ప్రజలు జరిగించేది
ఆరాధన అనబడుతుంది
👉క్రీస్తు శిరస్సుగా గల సంఘములో ఆయన అధికారం క్రింద జీవించే ప్రజలున్న సంఘములో జరిగేది ఆరాధన
👉ఆయన ఏం చెప్పినా అన్నివిషయాలలో ఆయన మాట వినేవారి సముదాయం గలవారు ఉన్నచోట దేవుడు నివశిస్తాడు.
👉అది ఆయన కోరిన స్థానము.
👉అది ఆయనకు నిత్యమూ విశ్రమ స్దానము.
👉ఆరాధన అక్కడే జరగాలి.
ఇంకెక్కడ జరిగినా అది ఆరాధన అనబడదు
చెబుతారు కానీ చేయరు
*వారు చెప్పుదురే గాని చేయరు. మత్తయి-23:3* """"""""""""""""...
-
*నేటి కాలంలో కృపావరములు ఉన్నాయా..?* కృపావరములు 9 *1 Corinthians(మొదటి కొరింథీయులకు) 12:1,4,8,9,10* 1.మరియు సహోదరులారా, *ఆత్మసంబంధమైన వరము...
-
*పరిశుద్ధాత్మ-కృపావరములు.* ➖➖➖➖➖➖➖➖ 🎤మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధ...
-
*స్త్రీలు - అలంకరణ* స్త్రీల అలంకరణ మూడు రకములు గా గ్రంధం వివరించింది *1. శరీర సంబంధమైన అలంకరణ/బాహ్య అలంకరణ* *ప్రక 21:2* భర్తకొరకు అలంకరి...