*ప్రశ్న:- అవిశ్వాసిని పెళ్ళి చేసుకోవచ్చా..?*
*జవాబు:-*
*2 కొరిం 6:14*
మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి. అంటే అవిశ్వాసులతో జోడీవేసుకోవద్దు,
జోడీ కట్టొద్దు.
కాడి వేసుకోవద్దు. అని అర్ధం.
రెండు ఎద్దులు కలిపి ఒక కాడి వేస్తారు.
మీరు అవిశ్వాసులతో కాడివేసుకోవద్దు.
*ఇది సిద్దాంతం.* నీవు ఎంతవరకూ పాటిస్తావో, పాటించవో నీ యిష్టం.
దేవుడు మానవునికి స్వేచ్చను ఇస్తున్నాడు. నిర్భంధించడం లేదు.
మానవునికివ్వబడిన స్వేచ్చను దుర్వినియోగ పరచుకుంటున్న మానవుడు దేవుడు చెప్పిన సిద్దాంతాన్ని ప్రక్కనపెట్టి, దేవుని అంగీకారం లేకపోయినా, అవిశ్వాసులతో జోడీకడతానంటే దేవుడు మానవుని స్వాతంత్ర్యంలో జోక్యం చేసుకోడు. ఆపుచేయడు.
ఏది మేలు ?ఏది కీడు అనేది మాత్రమే చెబుతాడు. తరువాత నీ యిష్టం..
బైబిల్ చెప్పిందా.,? సరే కాసేపు ప్రక్కనపెడదాం..
దేవుడు చెప్పిన నియమమా ? చూద్దాంలే.. అని నిర్లక్ష్యం చేస్తూ తన ఇష్టాన్నే నెరవేర్చుకుంటున్నాడు.
*ద్వితి 7:1-4*
నీవు వారితో నిబంధన చేసుకొనకూడదు. వియ్యమందకూడదు. వాని కుమారుని నీకుమార్తెకు ఇయ్యకూడదు. నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. నన్ను అనుసరింపకుండా ఇతరదేవతలను పూజించునట్లు నీ కుమారునివారు మళ్ళించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీమీద రగులుకొని, ఆయన నిన్ను త్వరగా నశింపజేయును.
దేవుడు చెప్పిన సిద్దాంతంను ప్రక్కనపెట్టిన ఓ రాజు practical లైఫ్ లో ఎలా fail అయ్యాడో చూద్దాం
*1రాజు 11:4-8*
సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును *ఇతర దేవతలతట్టు త్రిప్పగా* అతని తండ్రియైన దావీదు హృదయమువలె అతని హృదయము దేవుడైన యెహోవాయెడల యథార్థము కాక పోయెను.
5.సొలొమోను అష్తారోతు అను సీదోనీయుల దేవతను మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను.
6.ఈ ప్రకారము సొలొమోను *యెహోవా దృష్టికి చెడు నడత నడచి* తన తండ్రియైన దావీదు అనుసరించినట్లు *యథార్థహృదయముతో యెహోవాను అనుసరింపలేదు.*
7.సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూష లేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను.
8.తమ దేవతలకు ధూపము వేయుచు బలుల నర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఈలాగు చేసెను.
సిద్దాంతం వేరు
practical life వేరు
మహాజ్ఞానియైన సొలోమోను సహితం practical life లో fail అయ్యాడు.
మరి మీ పరిస్థితి మీరే ఆలోచించుకోవాలి..
*ఆల్రెడీ అవిశ్వాసులతో వివాహం జరిగిపోయి ఉంటే.. వారి పరిస్దితి ఏమిటి..?*
*1కొరిం 7:14*
అవిశ్వాసియైన భర్త భార్యను బట్టి పరిశుద్ధ పరచబడును; అవిశ్వాసురాలైన భార్య విశ్వాసియైన భర్తనుబట్టి పరిశుద్ధపరచబడును. లేనియెడల మీ పిల్లలు అపవిత్రులై యుందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు.
*1పేతు3:1-*
స్త్రీలు తమ స్వపురుషులకు లొబడి యుండాలి. భయముతో కూడిన ప్రవర్తనను బట్టి, భర్తలనడవడికను మార్చవచ్చు..