Sunday, 10 May 2020

పేర్లు - అర్ధాలు

*******************************************
*పరిశుద్ధ గ్రంథము లోని కొన్ని పేర్లు వాటి అర్థాలు* 👉🏻 📖
--------------------------------------------------------------------
నోవహు = నెమ్మది
బాబెలు = తారుమారు
ఇష్మాయేలు = దేవుడు వినును
లహాయిరోయి = నన్ను చూచుచున్న సజీవుని బావి
శారా = రాజకుమారి
సోయరు = చిన్నది
బెయేర్షెబా = సాక్షార్ధమైన బావి
యెహోవా యీరే = యెహోవా చూచుకొనును
ఏశావు = రోమము లేక ఎఱ్ఱని
యాకోబు = మడిమెను పట్టుకొనినవాడు లేక,మోసగాడు
ఎదోము = ఎఱ్ఱని
ఏశెకు = జగడమాడు
శిత్నా = విరోధము
రహెబోతు = ఎడము
షేబ = ప్రమాణము
బేతేలు = దేవుని మందిరము
యగర్‌ శాహదూతా = సాక్షికుప్ప
మహనయీము = రెండు సేనలు
ఇశ్రాయేలు = దేవునితో పోరాడువాడు
పెనూయేలు = దేవుని ముఖము
సుక్కోతు = పాకలు
ఏల్‌ ఎలోహేయి = ఇశ్రాయేలు దేవుడే దేవుడు
ఏల్‌ బేతేలు = బేతేలు దేవుడు
అల్లోను బాకూత్‌   =   ఏడ్పు చెట్టు
బెనోని   =   నా దుఃఖ పుత్రుడు
బెన్యామీను   =  కుడిచేతి పుత్రుడు
మనష్షే   =   మరచుట
ఎఫ్రాయిము   =   అభివృద్ధి లేక ఫలము
ఆబేల్‌ మిస్రాయిము   =   ఐగుప్తీయుల దుఃఖము
గెర్షోము = పరదేశి
మారా  = చేదు
మస్సా  = శోధించుట
మెరీబా = వాదము
యెహోవా నిస్సీ  = ధ్వజము
ఎలీయెజెరు = దేవసహయం
ఆమేన్‌ = అలాగున జరుగును గాక
తబేరా  =  మంట
కిబ్రోతుహత్తావా  = దురాశ
ఎష్కోలు = ద్రాక్షగెల
మెరీబా  =  వివాదము
హోర్మా = నిర్మూలము
గిల్గాలు = దొరలించిన
ఆకోరు లోయ = బాధ లోయ
ఏద = సాక్షి
బోకీము =  ఏడ్పు
యెరుబ్బయలు = వాదించువాడు
రామత్లెహీ = దవడకొండ
నయోమి = మధురము
ఈకాబోదు = ప్రభావముపోయెను
ఎబెనెజరు = సహాయపు రాయి
సెలహమ్మలెకోతు = భయవిముక్తి శిల.

****************************************

Monday, 4 May 2020

బోధకుడివా నీవు.... బాధకుడివా!

భోదకుడివా నీవు..... బాధకుడివా!

కొండమీదకెక్కుతున్న క్రీస్తులా
నువ్వు స్టేజిమీదకెక్కుతుంటే
నా గుండె పొలంలో నాలుగు విత్తనాలు
నాటి వెళ్ళతావనుకున్నాను

వాచీ ఊడదీసి పక్కనపెట్టి
ఒకడికి పదిసార్లు
స్వరభేరిని నీవు సవరిస్తోంటే
రెండంచుల ఖడ్గధారివై
నా సంకెళ్ళు తెగ్గొడతావనుకున్నాను

అరగంటగా నువ్వు భావించే గంటన్నరలో 
ఆదికాండం నుంచి ఆఖరి గ్రంథందాకా
భూమ్యాకాశాలన చుట్టివచ్చావుగానీ
చిన్న వెలుతురు జాడను కూడా
వెంటబెట్టుకొని రాలేకపోయావు.

మూడు జోకులు ఆరు కొటేషన్లతో
అవలీలగా ప్రసంగాన్ని అల్లేస్తావుగానీ
ఎండిన ఎముకుల్లో నీరుపోసే వేడి నీకు లేదు 

పేరుకు వెనుక ముందూ వెనకా బారెడు డిగ్రీలను బడాయిగా 
మోస్తావుగానీ
దేవుడి మాటలు నాదాకా 
మోసుకురాలేవు

పవర్ పాయింట్లతో మా సహనాన్ని 
పరీక్షీస్తావే తప్ప నీ దగ్గర 
పవరూ లేదు పాయింటు లేదు 
చిత్రమైన ఒత్తుల భాషతో
చిత్ర వధ చేసే నీవు 
భోధకుడివా 'బాధ'కుడివా?

వారం వారం నీ బడిలో చదువుకుంటాను గానీ 
జీవితం పెట్టే ఏ పరీక్షా
పాసవ్వలేకపోతున్నాను.

మొకాళ్ళ పై శ్రమించి వాక్యలోతుల్ని శోధించి
సున్నితంగా నా ఆత్మను
స్పృశించే శక్తి నీవు పొందేదాకా
మహోన్నతుని ప్రతినిధిగా
మనుషుల ముందు నిలబడే
అర్హత నీకు లేదు  !

చెబుతారు కానీ చేయరు

*వారు చెప్పుదురే గాని చేయరు. మత్తయి-23:3* """"""""""""""""...