Rom 8:9-10: *దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల* మీరు ఆత్మస్వభావము గలవారేగాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను *క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు.౹*
*క్రీస్తు మీలోనున్నయెడల* మీ శరీరము పాపవిషయమై మృతమైనది గాని *మీ ఆత్మ నీతివిషయమై జీవము కలిగియున్నది.౹"*
*క్రీస్తు ఆత్మ అంటే ఏంటి???*
Luk 9:54: "శిష్యులైన యాకోబును యోహానును అది చూచి– ప్రభువా, ఆకాశమునుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయునట్లు మేమాజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగగా, ఆయన వారితట్టు తిరిగి . మీరెట్టి ఆత్మ గలవారో మీరేరుగరు అని వారిని గద్దించెను"
క్రీస్తు భూమి మీద జీవించిన కాలంలో
దేవుని పట్ల ఎలాంటి వైఖరి కలిగి చూపించాడు
దేవుని చిత్తము జరిగించడంలో..
దేవునికి విధేయత చూపించడంలో
దేవుని మెప్పించడంలో
దేవుని ఆజ్ఞలు పాటించడంలో
ఒక్కమాటలో చెప్పాలంటే
క్రీస్తు భూమి మీద ఎలా జీవించాడో అలాజీవించే తత్వము గూర్చి
*క్రీస్తు spirit లేని వాడైతే దేవుని వానిగా వుండలేము*
*ఏలీయా ఆత్మ గల వాడు బా.యోహాను*
*Luther గారి స్పిరిట్ ఉంటేనే luther గారి విధానము అనుసరించగలము*
*భక్తసింగ్ గారి స్పిరిట్ ఉంటేనే భక్థసింగ్ గారి విశ్వాస విధానమును అనుసరించగలరు*
*నక్సలైట్ స్పిరిట్ ఉంటేనే నక్సలైట్ ల వలె వుండగలడు, పోరాడగలడు*
*అలాగే క్రీస్తు spirit ఉంటేనే క్రీస్తు లాగా బతకగలము*
*The Spirit of Christ*
*మనకు ఏ spirit ఎక్కించబడుతుందో మన హృదయాల్లోకి అదే spirit తో పని చేస్తాము*
Gal 4:6: "మరియు మీరు కుమారులై యున్నందున– నాయనా తండ్రీ, అని మొఱ్ఱపెట్టు *తన కుమారుని ఆత్మ ను దేవుడు మన హృదయములలోనికి పంపెను.౹"*
*ఎవరిని అనుసరించాలన్నా వారి spirit మనకు వస్తేనే కానీ వారి వలే వుండలేము*
*దేనికైనా spirit ఉండాలి ఆయా పనులు చేయాలంటే...*
Rom 8:15: "ఏలయనగా మరల భయపడుటకు మీరు *దాస్యపు ఆత్మను* పొందలేదుగాని *దత్తపుత్రాత్మను పొందితిరి.* ఆ ఆత్మ కలిగినవారమై మనము– అబ్బా తండ్రీ అని మొఱ్ఱపెట్టుచున్నాము.౹"
💐🙏💐🙏💐🙏💐💐🙏