Wednesday, 9 June 2021

సంఘము

సంఘము అంటే నిర్వచనం.
నిర్వచనం ప్రకారం పిలువబడినవారు.

పిలువబడినవారు అంటే ?
అపోస్తుల యొక్క సువార్త వలన దేవుడు మనుషులను పిలుస్తాడు. ఇంకొక రూపంలో పిలిచే ఏర్పాటులో దేవునికి లేవు.
దేవుడు ప్రత్యేకంగా పిలవడు, కలలో పిలవడు, దర్శనం ద్వారా పిలవడు.

పరిశుద్ధ గ్రంథం తెలియజేసిన విధంగా అపోస్తుల యొక్క సువార్త వలన దేవుడు మనుషులను పిలుస్తాడు. 

2 థెస్స2 :14 - మీరీలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క మహిమను పొందవలెనని, ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను.

ప్రకటింపబడిన సువార్త అపోస్తుల సువార్త అయి ఉండాలి.గాలి మాటలు వింటే అంగీకారం కాదు.

1. ఆయన(దేవుడు) మా(అపోస్తుల) సువార్త వలన మిమ్మును పిలిచెను.

ప్రతి వ్యక్తికి సువార్త వినాలి. 
ఎఫెసీ1:13  మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి.

రక్షణ సువార్త వినాలి.
17. కాగా వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును.(Romans - రోమీయులకు 10:17)
ఏమి వినాలి?   
సువార్త వినాలి
సువార్త(బోధ) లో రకాలు.
సామెతలు 14:25 నిజము పలుకు సాక్షి మనుష్యులను రక్షించును అబద్ధములాడువాడు వట్టి మోసగాడు.
A) దయ్యముల బోధ:-
2. దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు.3. ఆ అబద్ధికులు, వాత వేయబడిన మనస్సాక్షిగలవారై, వివాహమునిషేధించుచు, సత్యవిషయమై అనుభవజ్ఞానముగల విశ్వాసులు కృతజ్ఞ తాస్తుతులు చెల్లించిపుచ్చుకొనునిమిత్తము దేవుడు సృజించిన ఆహారవస్తువులను కొన్నిటిని తినుట మానవలెనని చెప్పు చుందురు.(Timothy I - 1 తిమోతికి 4:2-3)
B) దేవుని వాక్యమును కలిపి చెరిపెడు బోధ:-
17. కావున ఇట్టి సంగతులకు చాలినవాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకులవలె ఉండక, నిష్కాపట్యముగలవారమును దేవునివలన నియమింపబడిన వారమునైయుండి, క్రీస్తునందు దేవునియెదుట బోధించు చున్నాము.(Corinthians II - 2 కొరింథీయులకు 2:17)
C) మరియొక సువార్త:-
8. మేము మీకు ప్రక టించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పర లోకమునుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రక టించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక.9. మేమిది వరకు చెప్పినప్రకారమిప్పుడును మరల చెప్పుచున్నాము; మీరు అంగీకరించిన సువార్త గాక మరియొకటి యెవడైనను మీకు ప్రకటించిన యెడల వాడు శాపగ్రస్తుడవును గాక. 
ఏమి వినాలి?
D) అపొస్తలుల బోధ వినాలి:-
3. ప్రియులారా, మనకందరికి కలిగెడు రక్షణనుగూర్చి మీకు వ్రాయవలెనని విశేషాసక్తిగలవాడనై ప్రయత్నపడు చుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసివచ్చెను.(Judah - యూదా 1:3)
17. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతి రేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలుకొను చున్నాను. వారిలోనుండి తొలగిపోవుడి.(Romans - రోమీయులకు 16:17)
3. ఎందుకనగా జనులు హితబోధను6 సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అను కూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని,4. సత్యమునకు చెవినియ్యక కల్పనాకథలవైపునకు తిరుగుకాలము వచ్చును.5. అయితే నీవు అన్నివిషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము.(Timothy II - 2 తిమోతికి 4:3-5)


2. దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు.

2 కొరింథీ5: 20 కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమైదేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము.

1. నా సహవాసం మీకు కావాలి.
2. నా రక్షణ మీకు కావాలి.
3. నా పాపక్షమాపణ మీకు కావాలి.
4. నా నీతి మీకు కావాలి.     

దేవుడు మా (అపొస్తలుల)  ద్వారా వేడుకుంటున్నాడు.

దేవుని వలన మనుషులకు ఏమి కావాలి అంటే?

2 కొరింథీ 5:21 - ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను.

అందువలన నీకు దేవుని నీతి కావాలి.
దేవుని ఉగ్రత నుండి తప్పింపబడడం కావాలి.
నీకు రక్షణ కావాలి.

3. దేవుడు మనుషులను పిలుస్తున్నాడు.

ఎక్కడ నుండి పిలుస్తున్నాడు?

1.చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుస్తున్నాడు.
                                                                                    (1 పేతురు 2:9 )

2.పాపపు జీవితపు అనుభవం నుండి దేవుని నీతి లోనికి పిలుస్తున్నాడు.
                                                                                  (1 యోహాను 2:29)

3. లోకపు సహవాసము నుండి క్రీస్తు ప్రభువు సహవాసానికి పిలుస్తున్నాడు.
                                                                      (1 కొరింథీ 1:9, 1 యోహాను 1: 3)

పిలిచేటప్పుడు దేవుడు బ్రతిమాలు చున్నాడు.   
ఆ.. పోయా అన్నావ్ అనుకో. నీ నాశనం నీవు అనుభవించాలి.

ప్రకటన గ్రంథము14: 10,11 -

10 ఏమియు కలపబడకుండ దేవుని ఉగ్రతపాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల యెదుటను గొఱ్ఱపిల్ల యెదుటను అగ్నిగంధకములచేత వాడు బాధింపబడును.
11 వారి బాధసంబంధమైన పొగ యుగయుగములు లేచును; ఆ క్రూరమృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారముచేయువారును, దాని పేరుగల ముద్ర ఎవడైనను వేయించుకొనినయెడల వాడును రాత్రింబగళ్లు నెమ్మదిలేనివారై యుందురు.

ఇంకా ఉంది ..........



చెబుతారు కానీ చేయరు

*వారు చెప్పుదురే గాని చేయరు. మత్తయి-23:3* """"""""""""""""...