ముందుమాట :
పరలోకములో ముగ్గురు దేవుళ్లు ఉన్నట్టు బైబిల్ లో ఎక్కడ లేదు.
యేసుక్రీస్తు పరలోకములో మరో దేవుడని యెహోవా వలె పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దూతల చేత మహిమ పొందుతునట్టు ఎక్కడ చెప్పలేదు.
దేవుడు అంటే : సమస్తమును ఎవరు ఉత్పత్తి చేయగలరో లేక ఎవని నుండి సమస్తము కలిగినవో, సర్వాధికారము, అనంతజ్ఞానము గల ఆ మూలవాసిని దేవుడు అందురు..
ద్వితియోపదేశకాండము 32:39: ఇదిగో *నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు* “మృతినొందించువాడను బ్రదికించువాడను *నేనే* గాయపరచువాడను స్వస్థపరచువాడను *నేనే* నా చేతిలోనుండి విడిపించువాడెవడును లేడు“
1కోరింథీయులకు 8:6 ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, *మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి;* ఆయన నుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము.
చాలామంది bible teachers, pastors, గొప్ప గొప్ప మేధావులు అనుకునేవారు సహితం దేవుడేవరు? అనే ప్రశ్నకు సమాధానం దొరకక నిమిషానికో మాట చెప్తూ ఉంటారు ౼ యేసయ్య దేవుడు, త్రియేకదేవుడని, యేసుక్రీస్తు యెహోవా పరిశుద్దాత్మ ముగ్గురు దేవుళ్లే గాని అందులో యెహోవా మాత్రం మనకు దేవుడు అంటూ వారికి నచ్చిన/తెలిసిన విధముగా చెప్పుదురు గాని బైబిల్ చదవరు, వారు వారి గురువులను నమ్ముట వలన ఇలాంటి సమస్యలు వస్తున్నాయి, నేడు లేఖణాల వెలుగులో దేవుడు ఎవరు?
ఆయన లక్షణములను గూర్చి తెలుసుకుందాము.
దేవుళ్లు ముగ్గురా? దేవుడు ఒక్కడా?
1తిమోతికి 2:5: దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు.
యాకోబు 2:19: దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు. ఆలాగునమ్ముట మంచిదే; దయ్యములును నమ్మి వణకుచున్నవి.
1కోరింథీయులకు 8:4: కాబట్టి విగ్రహ ములకు బలిగా అర్పించినవాటిని తినుట విషయము : లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము.
1కోరింథీయులకు 12:6: నానావిధములైన కార్యములు కలవు గాని అందరిలోను అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే.
దేవుడు అనే గుర్తింపు గల person “ఒక్కడే” అని గ్రంధం సెలవిస్తోంది. ఆ ఒకనితో ఎవరిని పోల్చలేము.
యెషయా 40:25: నీవు ఇతనితో సమానుడవని మీరు “నన్నెవనికి” సాటి చేయుదురు? అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు.
యెషయా 46:5: మేము సమానులమని “నన్ను” ఎవనికి సాటిచేయుదురు? మేము సమానులమని యెవని నాకు పోటిగా చేయుదురు?
దేవుళ్లు రకములు :
మూలవాసియైన దేవుడు ఒక్కడే ఉన్నాడు.
మూలవాసియైన దేవుని చేత నియమింపబడిన దేవుళ్లు ఉన్నారు
రాజులు, న్యాయాధిపతులు
మనుష్యులతో చేయబడిన దేవులున్నారు
విగ్రహాలు, దూడ, కప్పలు, పాములు, చెట్లు etc..
ఆ ఒక్కడే దేవుడు ఎవరు?
తండ్రైన యెహోవా మాటలలో దేవుడేవరు?
ఆదికాండము 46:3 ౼ ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను,
ద్వితియోపదేశకాండము 32:39 ౼ ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు
యెషయా 43:10 ౼ నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తరువాత ఏ దేవుడు నుండడు.
యెషయా 45:21 ౼ నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు
యెషయా 45:22 ౼ దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు.
యెషయా 46:9 ౼ దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు నేను దేవుడను నన్ను పోలినవాడెవడును లేడు.
యెషయా 44:6 ౼ నేను తప్ప ఏ దేవుడును లేడు.
యెషయా 45:5 ౼ నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు నేను తప్ప ఏ దేవుడును లేడు.
యెషయా 45:6 ౼ యెహోవాను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు
యేసుక్రీస్తు మాటలలో దేవుడేవరు?
యోహాను 17:3 ౼ అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును,
యోహాను 20:17 ౼ నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన
మార్కు 15:34 ౼ మూడు గంటలకు యేసు ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసెను; అ మాటలకు నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యివిడిచితివని అర్థము.
ప్రకటన గ్రంథం 3:2: నీ క్రియలు నా దేవుని యెదుట
ప్రకటన గ్రంథం 3:12: జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను; అందులోనుండి వాడు ఇకమీదట ఎన్నటికిని వెలు పలికిపోడు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్దనుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను.
పాత నిబంధన భక్తుల మాటలలో దేవుడేవరు?
2సమూయేలు 7:22 ౼ కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనతగలవాడవు, నీవంటి దేవుడొకడును లేడు; మేము వినిన దానినంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడును లేడు.
కీర్తనలు 90:2: పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగయుగములు నీవే దేవుడవు
1రాజులు 8:60 ౼ అప్పుడు లోకమందున్న జనులందరును యెహోవాయే దేవుడనియు, ఆయన తప్ప మరి ఏ దేవుడును లేడనియు తెలిసికొందురు.
కీర్తనలు 100:3 ౼ యెహోవాయే దేవుడని తెలిసికొనుడి ఆయనే మనలను పుట్టించెను
యెహోషువ 22:34 ౼ రూబేనీయులును గాదీయులును యెహోవాయే దేవుడనుటకు ఇది మనమధ్యను సాక్షియగు నని దానికి ఏద అను పేరు పెట్టిరి.
1రాజులు 18:39 ౼ అంతట జనులందరును దాని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు,యెహోవాయే దేవుడు అని కేకలువేసిరి.
కీర్తనలు 118:27 ౼ యెహోవాయే దేవుడు,
యెషయా 45:18 ౼ ఆయన సెలవిచ్చునదేమనగా యెహోవాను నేనే మరి ఏ దేవుడును లేడు.
యిర్మియా 10:10 ౼ యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు,
క్రొత్త నిబంధన భక్తుల మాటలలో దేవుడేవరు?
ఎఫెసీయులకు 4:6 ౼ అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే.
హెబ్రీయులకు 12:29 ౼ ఏలయనగా మన దేవుడు దహించు అగ్నియై యున్నాడు.
యాకోబు 1:13 ౼ దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు;
1పేతురు 1:3 ౼ మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక.
1యోహాను 4:8 ౼ దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు.
తండ్రైన యెహోవా మాటలలోగాని, యేసుక్రీస్తు మాటలలోగాని, పాత మరియు క్రొత్త నిబంధన భక్తుల మాటలలోగాని వారి హృదయములో వారి దృష్టిలో దేవుడు అంటే యెహోవానే తప్ప వేరొకరు లేడు.
దేవుడు అంటే ముగ్గురు వేరు వ్యక్తుల కలయిక(తండ్రి+యేసు+పరిశుద్త్మ = దేవుడు) అనే భావము వచ్చునట్టు ఎక్కడ లేదు..
ఆ దేవుని అదృశ్య లక్షణములు
రోమా 1:20
శక్తికి సంబంధించిన లక్షణములు
వ్యక్తిత్వానికి సంబంధించిన లక్షణములు
1.శక్తికి సంబంధించిన లక్షణములు :
“సర్వశక్తిమంతుడు” – ఏదైనా చేయగలిగినవాడు ౼ ఆది 17:1,2; ఎపేసి 3:20,21
“అనంత జ్ఞాని” – 1సమూయేలు2:3, రోమా 16:27.
“సర్వజ్ఞుడు” – అన్ని తెలిసినవాడు ౼ కీర్తన 147:5; 139:1-6.
“సర్వాంతర్యామి/సర్వవ్యాపి” – అన్ని చోట్లా ఒకే సారి ఉండువాడు ౼ యిర్మీయా 23:23,24; కీర్తన 139:7-12.
“నిత్యుడు” – ఎల్లపుడు ఉండువాడు ౼ నిర్గమ 3:14; కీర్తన 90:1.
“ఆత్మస్వరూపి” – భౌతిక రూపము లేనివాడు ౼ యోహాను 4:24.
“అగోచరుడు” ౼ యోబు 37:23
సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే ఉండువాడు ౼ 1 తిమోతి 6:16.
2.వ్యక్తిత్వానికి సంబంధించిన లక్షణములు
దేవుని వ్యక్తిత్వమునే దేవత్వము లేదా దేవస్వభావము అందురు
“పరిశుద్ధుడు” – పాపము లేనివాడు ౼ లేవి 19:2; 1పేతురు 1:14.
“నీతిమంతుడు” – పాపము చేయలేనివాడు ౼ కీర్తనలు 18:30; యోహాను 17:25
“ప్రేమా స్వరూపి” – దేవుడు మనకు సమస్థాన్ని ఇచ్చాడు ౼ 1యోహాను 4:8,16
“సత్యవంతుడు” – అబద్దమాడనేరని వాడు. ౼ సంఖ్యా 23:19; తీతు 1:2..
“నమ్మదగినవాడు” ౼ ద్వితీయోప 7:9; 1కొరింది 1:9
“మంచివాడు” – సత్పురుషుడు, ఉత్తముడు. ౼ కీర్తన 34:8; నహుమ 1:7; మత్తయి 19:17;20:15.
“పరిపూర్ణుడు” – స్వభావములోను, వ్యక్తిత్వములోనూ పరిపూర్ణుడు (ఏ కొదువ,లోపము లేనివాడు) ౼ కీర్తన 18:25; 19:7-11; మత్తయి 5:48.
“కనికరము, దయ, దీర్ఘశాంతము” గలవాడు ౼ నిర్గమ 34:6.
దేవుని శక్తిని మానవుడు అందుకోలేడు గాని ఆయన తత్వాన్ని అందుకోగలడు. యేసుక్రీస్తునే మనకు మాదిరి, మనము దేవ స్వభావమునకు ఎదగాలని దేవుడు కోరుచున్నాడు ౼ 2పేతురు 1:4
తండ్రైన యెహోవా ఎవరెవరికి దేవుడు?
అందరికి దేవుడు ౼ ఎపేసి 4:6; కీర్త 100:1-3
పితరులకు దేవుడు ౼ నిర్గమ 3:15
ఇశ్రాయేలుకు దేవుడు ౼ నిర్గమ 5:1
అన్యులకు దేవుడు ౼ రోమా 3:29
యేసుక్రీస్తుకు దేవుడు ౼ యోహాను 20:17
క్రైస్తవులకు దేవుడు – 1కోరింది 8:6
యెహోవా మాత్రమే అద్వితీయ దేవుడు
అద్వితీయదేవుడు అంటే ఒక్కడే దేవుడు ద్వితీయుడు కానివాడు అని అర్ధం వచ్చును. G3441 (monos) తెలుగులో అద్వితీయుడు అని తర్జుమా చేశారు, దాని భావము ౼ ఏకైక, ఒక్కడే, ఒంటరి అనే భావము వచ్చును. ౼ యోహాను 17:3; యూదా 1:24; 1తిమోతి 1:17, 6:15; యోహాను 5:44; మార్కు 12:29(క్రీస్తు మాటలలో).
గమనిక :
గ్రంధంలో యెహోవా ౼ నేనే దేవుడను, నేనే దేవుడను అని నొక్కి చెప్తున్నప్పుడు, యేసు, మోషే, పరిశుద్దాత్మ , దూత, న్యాయాధిపతులు ఎలా యెహోవాలాంటి దేవుళ్లు కాగలరు? దేవుడు అని రాసిన పదాలను వాటి భావమును బట్టి చూడాలి, అంతేగాని పదార్థముగా చూసినయెడల నేనే దేవుడను అనే మాట తప్పు అవుతుంది, మరి దేనికి దేవుడు అని కొందరిని ఉద్దేశించి రచయిత రాసాడు? అలంకరముగా దేవుడు అని రాశాడే కానీ రచయిత హృదయములో నిజమైన దేవుడు మాత్రం యెహోవానే.
ముగింపు :
యెహోవాయే దేవుడు
యెహోవాయే అందరికి దేవుడు.
యెషయా 54:5 ౼ సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు..