Saturday, 12 September 2020

Bible

Books of the Bible and Authors
1) Genesis: Moses
2) Exodus: Moses
3) Leviticus: Moses
4) Numbers: Moses
5) Deuteronomy: Moses
6) Joshua: Joshua
7) Judges: Samuel
8) Ruth: Samuel
9) 1 Samuel: Samuel; Gad; Nathan
10) 2 Samuel: Gad; Nathan
11) 1 Kings: Jeremiah
12) 2 Kings: Jeremiah
13) 1 Chronicles: Ezra
14) 2 Chronicles: Ezra
15) Ezra: Ezra
16) Nehemiah: Nehemiah
17) Esther: Mordecai
18) Job: Moses
19) Psalms: David and others
20) Proverbs: Solomon; Agur; Lemuel
21) Ecclesiastes: Solomon
22) Songs of Solomon: Solomon
23) Isaiah: Isaiah
24) Jeremiah: Jeremiah
25) Lamentations: Jeremiah
26) Ezekiel: Ezekiel
27) Daniel: Daniel
28) Hosea: Hosea
29) Joel: Joel
30) Amos: Amos
31) Obadiah: Obadiah
32) Jonah: Jonah
33) Micah: Micah
34) Nahum: Nahum
35) Habakkuk: Habakkuk
36) Zephaniah: Zephaniah
37) Haggai: Haggai
38) Zechariah: Zechariah
39) Malachi: Malachi
40) Matthew: Matthew
41) Mark: Mark
42) Luke: Luke
43) John: Apostle John
44) Acts: Luke
45) Romans: Paul
46) 1 Corinthians: Paul
47) 2 Corinthians: Paul
48) Galatians: Paul
49) Ephesians: Paul
50) Philippians: Paul
51) Colossians: Paul
52) 1 Thessalonians: Paul
53) 2 Thessalonians: Paul
54) 1 Timothy: Paul
55) 2 Timothy: Paul
56) Titus: Paul
57) Philemon: Paul
58) Hebrews: Unknown
59) James: James (Jesus’ brother)
60) 1 Peter: Peter
61) 2 Peter: Peter
62) 1 John: Apostle John
63) 2 John: Apostle John
64) 3 John: Apostle John
65) Jude: Jude (Jesus’ brother)
66) Revelation: Apostle John

*BIBLE STATISTICS*

*Amazing Bible Facts And Statistics*
👉🏼 Number of Books in the Bible: *66*
👉🏼 Chapters: 1,189
👉🏼 Verses: 31,101
👉🏼 Words: 783,137
👉🏼 Letters: 3,566,480
👉🏼 Number of Promises given in the Bible: 1,260
👉🏼 Commands: 6,468
👉🏼 Predictions: over 8,000
👉🏼 Fulfilled Prophecy: 3,268 verses
👉🏼 Unfulfilled Prophecy: 3,140
👉🏼 Number of Questions: 3,294
👉🏼Longest Name: Mahershalalhashbaz (Isaiah 8:1)
👉🏼 Longest Verse: Esther 8:9 (78 words)
👉🏼 Shortest Verse: John 11:35 (2 words: "Jesus wept" .
👉🏼 Middle Books: Micah and Nahum
👉🏼 Middle Chapter: Psalm 117
👉🏼 Shortest Chapter (by number of words): Psalm 117 (by number of words)
👉🏼 Longest Book: Psalms (150 Chapters)
👉🏼 Shortest Book (by number of words): 3 John
👉🏼 Longest Chapter: Psalm 119 (176 verses)
👉🏼 Number of times the word *"God"* appears: 3,358
👉🏼 Number of times the word *"Lord"* appears: 7,736
👉🏼 Number of different authors: 40
👉🏼 Number of languages the Bible has been translated into: over 1,200

*OLD TESTAMENT STATISTICS:*
👉🏼 Number of Books: 39
👉🏼 Chapters: 929
👉🏼 Verses: 23,114
👉🏼 Words: 602,585
👉🏼 Letters: 2,278,100
👉🏼 Middle Book: Proverbs
👉🏼 Middle Chapter: Job 20
👉🏼 Middle Verses: 2 Chronicles 20:17,18
👉🏼 Smallest Book: Obadiah
👉🏼 Shortest Verse: 1 Chronicles 1:25
👉🏼 Longest Verse: Esther 8:9 (78 words)
👉🏼 Longest Chapter: Psalms 119

*NEW TESTAMENT STATISTICS:*
👉🏼 Number of Books: 27
👉🏼 Number of Chapters: 260
👉🏼 Number of Verses: 7,957
👉🏼 Words: 180,552
👉🏼 Letters: 838,380
👉🏼 Middle Book: 2 Thessalonians
👉🏼 Middle Chapters: Romans 8, 9
👉🏼 Middle Verse: Acts 27:17
👉🏼 Smallest Book: 3 John
👉🏼 Shortest Verse: John 11:35
👉🏼 Longest Verse: Revelation 20:4 (68 words)
👉🏼Longest Chapter: Luke 1

There are 8,674 different Hebrew words in the Bible, 5,624 different
Greek words, and 12,143 different English words in the King James Version.

• Bible Written by Approximately 40 Authors
• Written over a period of 1,600 years
• Written over 40 generations
• Written in three languages: Hebrew, Greek and Aramaic
• Written on three continents: Europe, Asia and Africa
• Written in different locations: wilderness, dungeon, palace, prison, in exile, at home
• Written by men from all occupations: kings, peasants, doctors, fishermen, tax collectors, scholars, etc.
• Written in different times: war, peace, poverty, prosperity, freedom and slavery
• Written in different moods: heights of joy to the depths of despair
• Written in harmonious agreement on a widely diverse range of subjects and doctrines.

*10 Longest Books in the Bible*

1) Psalm - 150 Chapters, 2,461 verses, 43,743 words
2) Jeremiah - 52 chapters, 1,364 verses, 42,659 words
3) Ezekiel - 48 chapters, 1,273 verses, 39,407 words
4) Genesis - 50 chapters, 1,533 verses, 38,267 words
5) Isaiah - 66 chapters, 1,292 verses, 37,044 words
6) Numbers - 36 chapters, 1,288 verses, 32,902 words
7) Exodus - 40 chapters, 1,213 verses, 32.602 words
8) Deuteronomy - 34 chapters, 959 verses, 28,461 words
9) 2 Chronicles - 36 chapters, 822 verses, 26,074 words
10) Luke - 24 chapters, 1,151 verses, 25,944 words

*10 Shortest Books in the Bible*
1) 3 John - 1 chapter, 14 verses, 299 words
2) 2 John - 1 chapter, 13 verses, 303 words
3) Philemon - 1 chapter,bb 25 verses, 445 words
4) Jude - 1 chapter, 25 verses, 613 words
5) Obadiah - 1 chapter, 21 verses, 670 words
6) Titus - 3 chapters, 46 verses, 921 words
7) 2 Thessalonians - 3 chapters, 47 verses, 1,042 words
8) Haggai - 2 chapters, 38 verses, 1,131 words
9) Nahum - 3 chapters, 47 verses, 1,285 words
10) Jonah - 4 chapters, 48 verses, 1,321.

*Spread the Gospel*

Tuesday, 7 July 2020

అన్యదేవతలు

*అన్య దేవతలు మరియు విగ్రహారాధనలు* 
➿➿➿➿➿➿➿➿
🎤 ప్రియ సోదరులకు గమనిక.ఇశ్రాయేలు జనులు అన్య దేవతలను పూజించి తప్పిపోయిరి.అన్య దేవతల పేర్లు తెలుసుకోవడం ద్వారా మన ప్రసంగంలో *పుట్ నోట్* కు ప్రయోజనకరంగా ఉంటాయని ఆశిస్తున్నాను.
🍒 *అషేరాదేవి*(Asherah or Ashatorath) 1రాజు:18:17: అషేరాదేవి సముద్ర స్త్రీ గా పరిగణించబడెను.గిద్యోను తండ్రియైన యేవాషు ఈ దేవతను ఆరాధించుచుండెను.గిద్యోను అషేరాదేవి దేవత స్తంభమును నాశనము చేసెను.న్యాయాధి:6:24-32:
🍒 *అష్తారోతు* (Ashtorath) కనానీయుల దేవతయు బయలు యొక్క సహవాసి ఈ అష్తారోతు దేవతను ఇశ్రాయేలీయులు ఆరాధించుచుండగా సమూయేలు వారిని యెహోవా దేవుని వైపు మళ్ళించెను.1సమూ:7:3,4:
🍒 *బయలు దేవత* కనానీయుల ప్రధాన దేవతయైన ఈ బయలు దేవతకు ఏలియా కర్మేలు పర్వతము దగ్గర వీరి ప్రవక్తలందరిని వధించెను.యెహూ బయలు దేవతలను ఇశ్రాయేలీయుల మధ్యను లేకుండా పూర్తిగా నాశనము చేసెను.1రాజులు: 18:17-40;2రాజు:10:28:
🍒 *బయల్జెబూలు* (దయ్యములరాజు) యేసు దయ్యము పట్టిన గ్రుడ్డివాడిని, మూగవాడిని బాగు చేయగా అది చూసిన పరిసయ్యులు  దయ్యములకు అధిపతియైన బయల్జెబూలు అని యేసు క్రీస్తును నిందించిరి.మత్త:10:25;12:24:
🍒 *దాగోను దేవుడు* ఫిలిష్తీయుల ముఖ్యమైన వ్యవసాయ దేవుడు. దాగోను గుడిలో దేవుని మందసము ఉంచగా, దేవుని మందసము విగ్రహమును నాశనము చేసెను. 1సమూ:5:1-7: సంసోను ఈ గుడిని పడగొట్టెను.న్యాయాధి: 16:23-30:
🍒 *అర్తెమిదేవి* (డయానా) అనేక రొమ్ములతో వికృతమైన ఆకారము కలిగి భూలోకమంతయు పూజింపబడుచున్న ఈ దేవతవిషయమై అపోస్తులుడైన పౌలు ఎఫెస్సీ పట్టణములో ప్రసంగించెను. అపో:కా:19:27-35:
🍒 *ద్యుపతి* (బృహస్పతి) లుస్త్రలోని ప్రజలు అపోస్తులుడైన పౌలు ఒక కుంటి వానిని స్వస్థపరచుటచూచి, పౌలుతోకూడ ఉన్న బర్నబాకు రోమీయులైన ద్యుపతి దేవత పేరు పెట్టిరి:అపో:కా:14:12,13:
🍒 *హెర్మే* ద్యుపతి కుమారుడైన హెర్మే పేరును లుస్త్రలో ముఖ్య ప్రసంగియైన పౌలుకు ఆ పట్టణ ప్రజలు పెట్టిరి.అపో:కా:14:12,13:
🍒 *మెరోదకు* బబులోనీయులకు ప్రధాన దేవుడు మరియు నెబుకద్నేజరుకు ఇష్టుడైన దేవుడు.యిర్మియా:50:2:
🍒 *మొలెకు దేవత* పరిశుద్ధ లేఖనములలో ప్రస్తావించబడిన అన్య దేవతలందరిలో హేయమైన, అమ్మోనీయుల దేవత. ఈ దేవతకు సొలోమోను యెరూషలేములో కొండమీద బలిపీఠము కట్టించెను.రాజు:11:7: మనిష్షే దేవుని నుండి వెడలిపోయి ఈ దేవతా విగ్రహాలకు తన కుమారులను బలియిచ్చెను.2దిన:వృ:28:1-4;33:6:
🍒 *నన్న దేవుడు* ఊరు పట్టణము యొక్క చంద్రదేవుడు. అబ్రహామును  దేవుడు పిలువకమునుపు వారి పితరులు ఆరాధించారు. యెహోషు:24:2:
🍒 *నెబో* బబులోనీయుల దేవుడు.యేష:46:1:
🍒 *నిస్రోకు* అష్షూరు రాజైన సన్హెరీబు ఆరాధించు దేవత. 2రాజు:19:37:
🍒 *రిమ్మోను* సిరియనుముల సైన్యాధిపతియు కుష్టు రోగియైన నయమాను స్వస్థతపొందకమునుపు ఆరాధించిన దేవుడు. 2రాజు:5:15-18:
🍒 *తమ్మూజు దేవత* గర్భో త్పత్తి కలిగించు దేవత.యెహెజ్కే:8:14:
🍒 పేర్లులేని దేవతా విగ్రహములు.
📍రాహేలు తండ్రి ఇంట దొంగిలించిన గృహదేవతలు.ఆది:కా:31:19:
📍సినాయి కొండ వద్ద ఇశ్రాయేలీయులు తయారుచేసిన బంగారు దూడ. నిర్గమ:కా: 32!!అ!!
📍 యెరోబాము రెండు బంగారు దూడలను చేయించి ఒకటి బేతేలు నందు రెండవది దాను నందు ఉంచెను.1రాజు:12:28-31:
📍 నెబుకద్నేజరు దూరాయను మైదానములో నిలువబెట్టించిన బంగారు ప్రతిమ.
📍 పౌలు ఏథెన్స్ లో చూసిన పేరు తెలియని దేవతా విగ్రహము.అపో: కా:17!!అ!!
📍 కౄరమృగము
 యొక్క ప్రతిమ.ప్రకట:13:14:
     

అద్బుతములు మరియు స్వస్థతలు

*అద్భుతములు మరియు స్వస్థతలు.*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🎤ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున, ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొందియుండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్ల క్ష్యముచేసినయెడల ఏలాగు తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభువు భోధించుటచేత ఆరంభమై, 
 దేవుడు తన చిత్తానుసారముగా సూచకక్రియలచేతను, మహత్కార్య ములచేతను,నానావిధములైన అద్భుతములచేతను, వివిధము లైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుటచేతను, వారితో కూడ సాక్ష్యమిచ్చుచుండగా వినినవారిచేత మనకు దృఢ పరచబడెను. 
హెబ్రీ:2:2-4:
📍 పరిశుద్ధాత్మ యొక్క పనిలో అద్భుతములు ఒక ప్రాముఖ్యమైయున్నవి.
📍 తండ్రియైన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా జరిగించువాడు.
📍 ఆత్మ యొక్క శక్తి ద్వారా తన వాక్యాన్ని తెలియపరచి,స్థిరపరచి,భద్రపరిచాడు.
🔥 *అద్భుతములకు ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది.* 
🍇 సృష్టిని చేయటం ద్వారా దేవుని ఉనికిని ఋజువుచేయడం జరిగింది. రోమా:1:20:
🍇 అద్భుతముల ద్వారా యెహోవాయే నిజమైన దేవుడని కనుపరుచుకున్నాడు.
🍇 ఐగుప్తు దేవతలకంటే గొప్పవాడనియు..నిర్గమ:కా:10:1,2;18:11:
🍇 ఏలియా ద్వారా కనానీయుల దేవతలకంటే మించిన వాడని ప్రదర్శించుకున్నాడు. 1వ రాజు18:37-39:
🍇 సూచకక్రియలు, అద్భుతములు, మహత్కార్యముల ద్వారా యేసుక్రీస్తు దేవుని కుమారుడని నిరూపించుకున్నాడు. యోహాను:20:30-31; అపో:కా:2:22:
🍇 అద్భుతములు, మహత్కార్యములు జరిగించుటచే అపోస్తుల ద్వారా దేవుని శక్తిని పరిశుద్ధాత్మ కనుపరిచెను.
🍇 దేవుని పక్షముగా మాట్లాడేవారికి అద్భుత రీతిగా వాక్యాన్ని ఇవ్వడము మాత్రమే కాకుండా, అద్భుతములు ద్వారా స్థిరపరచబడింది.మార్కు:16:20;అపో:కా:14:3;హెబ్రీ:2:4:
🔥 *అబద్ధ ప్రవక్తలు + అబద్ధబోధకులు.*
🍇 నిజమైన ప్రవక్తలా? ఉపదేశకులా? అద్భుతముచేయు చేయువారా? అని పరీక్షింపవలసియున్నది. ద్వితీ:కా:13:1-5:
🍇 మోషే చేసిన సూచ క్రియలకు బదులుగా తాము మంత్రములద్వారా చేయగలమని శకునగాండ్రు ఫరోని తప్పుదోవ పట్టించారు. నిర్గమ:కా:7:11:
🍇 క్రీస్తు యొక్క అపోస్తులుల వేషం అబద్ద బోధకులు ధరించుకొనియున్నారు.
 ఏలయనగా అట్టివారు క్రీస్తుయొక్క అపొస్తలుల వేషము ధరించుకొనువారైయుండి, దొంగ అపొస్తలులును మోసగాండ్రగు పనివారునైయున్నారు.
 ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు 
 గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతికాదు. వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును. 
2వ కొరింధీ:11:13-15:
🍇 దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను.అపో:కా:19:12:
🍇 అప్పుడు దేశసంచారులును మాంత్రికులునైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి, దయ్యములు పట్టినవారిమీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. 
 యూదుడైన స్కెవయను ఒక ప్రధానయాజకుని కుమారులు ఏడుగురు ఆలాగు చేయుచుండిరి.
అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును, పౌలునుకూడ ఎరుగుదును, గాని మీరెవరని అడుగగా ఆ దయ్యముపట్టినవాడు ఎగిరి, వారిమీద పడి, వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను; అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ యింటనుండి పారిపోయిరి.అపో:కా:19:13-16:
🍇 నేడు అబద్ధబోధకులు అద్భుతములు చేస్తామని ప్రజలను మోసంచేస్తూ ధనము సంపాదించుకుంటున్నారు.
🔥 *అద్భుతములు దైవికమైనవి* 
🍇 ఒకని విశ్వాస బలము మీదనే కాకుండా దేవునిశక్తి ద్వారా అద్భుతములు జరిగినాయి.
🍇 తాను అభిషేకించిన అపోస్తుల ద్వారా పరిశుద్ధాత్మ శక్తిచేత అద్భుతములు జరిగినాయి.
🍇 అపోస్తులులు చేతులుంచువరకు ఇతరులు అద్భుతములు చేయకుండిరి.అపో:కా:6:5-6;8:6:
🍇 పరిశుద్ధాత్మవరము  చేతులుంచుటవలన ప్రసాదించగల అధికారము పరిశుద్ధాత్మచేత అపోస్తలులకు ఇవ్వబడినది.
Eg:-తరువాత పౌలు వారిమీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారిమీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాటలాడుటకును, ప్రవచించుటకును మొదలుపెట్టిరి. 
అపో:కా:19:6;ఆ హేతువుచేత నా హస్తనిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలెనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. 
2వ తిమోతి:1:6:
🍇 అపోస్తులుల ద్వారా శక్తిపొందినవారు తిరిగి తమ చేతులు ఇతరుల మీద ఉంచుట ద్వారా అద్భుతవరములు ప్రసాదించినట్లు మనకు ఎలాంటి రుజువులు లేవు. 
అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమునుగూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి, పురుషులును స్త్రీలును బాప్తిస్మము పొందిరి. 
అప్పుడు సీమోనుకూడ నమ్మి బాప్తిస్మముపొంది ఫిలిప్పును ఎడబాయకుండి, సూచక క్రియలును గొప్ప అద్భుతములును జరుగుట చూచి విభ్రాంతి నొందెను.అపో:కా:8:12,13:
🍇అప్పుడు పేతురును యోహానును వారిమీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. 
అపొస్తలులు చేతులుంచుటవలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడెనని సీమోనుచూచి 
వారియెదుట ద్రవ్యముపెట్టి నేనెవనిమీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకియ్యుడని అడిగెను. 
అందుకు పేతురునీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతోకూడ నశించునుగాక.అపో:కా:8:17-20:
🍇మీరు శ్రమలలో ఏలాగు పాలివారైయున్నారో, ఆలాగే ఆదరణలోను పాలివారైయున్నారని యెరుగుదుము గనుక మిమ్మును గూర్చిన మా నిరీక్షణ స్థిరమైయున్నది. 
2వ కోరింథీ:1:7:
🍇 అపోస్తులుల దినాలు గడిచిపోయినవి.సూచక క్రియలు,అద్భుతములు, మహత్కార్యములు, నిలిచిపోయినవి. అలాంటి వరములు అనుగ్రహించుటకు అపోస్తులులులేరు.
🔥 *అద్భుతములు స్వస్థతలు అందరినీ బాగుచేసేవికావు* 
🍇 క్రీస్తు-రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు.
 మత్తయి:9:12;లూకా:5:31:
🍇 పౌలు తన జతపనివానిని(తిమోతి, త్రోఫిము) బాగుచేయలేదనేది వాస్తవం.ఔషధం ఉపయోగించమన్నాడు.
🍇ఇకమీదట నీళ్లేత్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము. 
1వ తిమోతి:5:23: _ద్రాక్షారసము కేవలము ఔషధము కొరకే పౌలు వాడమన్నాడు._ 
స్వస్థత అనేది కేవలం రోగులను బాగు చేయుట.వరం పొందిన వారికి వర్తిస్తుంది.
🍇ఎరస్తు కొరింథులో నిలిచిపోయెను. త్రోఫిము రోగియైనందున అతని మిలేతులో విడిచివచ్చితిని. 
2వ తిమోతిక:4:20: పౌలు త్రోఫీమును,తిమోతినీ స్వస్థపరచలేదు.కారణం పౌలు విశ్వాసములో, ప్రార్థనలో శక్తిలేదా? లేక వారిలో విశ్వాసము లేదా?
🍇 అద్భుతాలు,స్వస్థతలు విశ్వాసులకు ఉద్దేసింపబడలేదని చదువరులు గ్రంథ ప్రకారం వాస్తవం గుర్తించాలి.
🍇 నేడు అద్భుతములు స్వస్థతలు బూటకమే. వారు స్థాపించిన సంఘముల విస్తరణ కొరకు ఆర్థికవృద్ధి కొరకు మాత్రమే.
🍇 ఎప్పుడైనా ఊచచేతులు గలవారిని, అవిటివారిని, మూగవారిని, గ్రుడ్డి వారిని బాగుచేసినట్లు మీరు ఎక్కడైనా, ఎప్పుడైనా చూశారా? మోసపోకుడి మీరు దేవునికి ప్రార్ధనలు, విజ్ఞాపనలు తెలియజేయుడి. దేవుడు వింటాడు. యాకోబు:5:12-18:
 🔅*కరోనా* సమయంలో వీరందరూ ఏమైపోయారో? ఆలోచించండి.
(ఇంకా ఉంది....!)

కృపావరములు

*పరిశుద్ధాత్మ-కృపావరములు.*
➖➖➖➖➖➖➖➖
🎤మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయువారినిగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాటలాడువారినిగాను నియమించెను. 
1వ కోరింథీ:12:28:
📍 పరిశుద్ధాత్మచే అనుగ్రహింపబడిన వరములను పరిశుద్ధాత్మ వరముతో తికమక చేయకూడదు.
📍 పరిశుద్ధాత్మవరము  *Dorea* అనే గ్రీకు పదమునుండి  తర్జుమా చేయబడినది.
📍దేవుని కుమారులకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ అనేవరము అంతరంగమందు నివసించు ఆత్మ .1వకొరింధీ :6:19:
📍 మనలో నివసించు ఆత్మ వలన. 2వ తిమోతి:1:14:
📍 మీలో నివసించు ఆత్మ.రోమా:8:9:
📍 పరిశుద్ధాత్మచే అనుగ్రహింపబడే వరములు *Chrisma* అనే గ్రీకు పదము నుండి తర్జుమా చేయబడినది.
📍 దైవికముగా అనుగ్రహింపబడే మానవాతీత శక్తులు. రోమా:12:6,7:
📍 *Chrisma* కృపా వరములు అనికూడా తర్జుమా చేయవచ్చు. రోమా:5:15;1వ పేతురు:4:10,11:
 *గమనిక:-* ఆత్మచే అద్భుతములు చేయ శక్తి పొందువరము కాదు. అంతరంగములో నివసించు ఆత్మ అను వరము.
📍 క్రైస్తవ జీవితం జీవించేలా క్రైస్తవుని బలపరుస్తుంది.
 మీరు అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లుగాను.ఎఫెస్సీ:3:15:
1️⃣ *నానా విధములైన వరములు* 
🔥 కృపావరములు నానా విధములుగా ఉన్నవిగాని ఆత్మ ఒక్కడే.1వ కోరింది:12:4:
🔥వివిధములైన కృపావరములు ఉన్నాయంటే, కోరింథీయులకు వివిధములైన ఆత్మలు ఉన్నాయని పౌలు యొక్క ఉద్దేశం కాదు.
🔥 పరిశుద్ధాత్మ కృపావరములు *9.* (1)బుద్ధి వాక్యము,(1వ కొరింధీ:12:8)(2)జ్ఞాన వాక్యము.(12:8)(3)విశ్వాసము.(12:9) (4) స్వస్థపరచు వరము.(12:9) (5)అద్భుత కార్యములుచేయు శక్తియు.(12:10)(6) ప్రవచన వరము(12:10)(7)ఆత్మల వివేచనము (12:10)(8)నానావిధ భాషలను.(12:10) (9)భాషల అర్థం చెప్పు శక్తియు.(12:10)
🔥 కొరింధీలో ఉన్న ఏ ఒక్క క్రైస్తవునికి ఈవరములన్నియు లేవు. ఆత్మ యొక్క ఇష్టానుసారముగా ఇవ్వబడ్డాయి.
🔥అయినను వీటినన్నిటిని ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచియిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. 
1వ కోరింథీ:12:11:
🔥 తన సొంతదైన యోగ్యతవల్లనో లేక సామర్ధ్యం వలననో ఆయా కృపావరములు కలిగియుండలేదని పొందినవారు గ్రహించవలసి యున్నది.
2️⃣  *కృపావరములు ఉద్దేశము* 
🔥 ఆత్మ సంబంధమైన పరిపక్వత పెంచుటకు సహాయపడునట్లు కృపా వరములు ఇవ్వబడ్డాయి.
🔥 కృపావరము- పొందినవాని స్వప్రయోజనము కొరకుగాక సంఘ ప్రయోజనము కొరకు ఉద్దేశించబడ్డాయి.
🔥 కృపావరము యొక్క ఉద్దేశము _క్షేమాభివృద్ధి,హెచ్చరికయు,ఆదరణ_ కలుగునట్లు ప్రవచించువారు మనుషులతో మాట్లాడుచున్నాడు.
🔥మీరు ఆత్మసంబంధమైన వరముల విషయమై ఆసక్తిగలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించునట్లు ప్రయత్నము చేయుడి. 
1వ కోరింథీ:14:12:
3️⃣ *కృపావరములు* 
🔥 _జ్ఞానవాక్యమనే_ కృపావరము.1వ కొరింధీ:12:8:
📍 ఆత్మద్వారా అందించబడిన దైవసందేశము.
📍 మానవ ప్రయాస వాని సామర్ధ్యం కంటే వ్యత్యాసంగా ఉంటుంది.
📍నేను మాటలాడినను సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తియ్యని మాటలను వినియోగింపక, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే వినియోగించితిని.
 పరిపూర్ణులైనవారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది యీ లోక జ్ఞానము కాదు, నిరర్థకులై పోవుచున్న యీ లోకాధికారుల జ్ఞానమును కాదుగాని 
1వ కోరింథీ :2:5,6:
📍ఏలాగనగా, యూదులమైనను, గ్రీసుదేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. 
1వ కోరింథీ:12:13:
🔥 _బుద్ధి వాక్యము._ 1వ కోరింధీ12:8;
📍 దైవికముగా ప్రసాదించబడిన తెలివి లేక బుద్ధి గ్రీకు భాషలో *Gnosis* అనే పదము నుండి తర్జుమా చేయబడినది.
📍 జ్ఞానముతో పాటు ఈ బుద్ధి క్రీస్తునందు గుప్తమైయున్నది. కొలస్సీ :2:3:
📍 మానవ తెలివికి మారుగా బుద్ధివాక్యమనేది దేవునికి సంబంధించిన ప్రత్యక్షతద్వారా బయలుపరచబడుతుంది.రోమా:11:33:
🔥 _ఆత్మచే ఇవ్వబడే విశ్వాసమనే_ కృపావరము.1వ కోరింధీ:12:9:
📍 దేవుని వాక్యము చదువుట ద్వారా కలిగిన విశ్వాసము కాదు.రోమా:10:17:
📍 విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వాడైయుండాలి.
📍మీరు ఏ విషయములో ఎదిరించువారికి బెదరక అందరును ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షము పోరాడుచూ ఏకమనస్సుగలవారై ఉండవలెను.ఈ విశ్వాసాన్ని పొందిన వారికి ప్రకృతికి అతీతమైన  శక్తి మనస్సు కలిగి ఉంటుంది.
🔥 _స్వస్థపరచు వరము_ 🔥 _అద్భుతములు చేయు శక్తియు_ ఆత్మవరములైయున్నాయి.దీనికి మరోసారి వివరణ ఇస్తాను.
🔥 _ప్రవచన వరం._ 
📍ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. 
 ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి.
2వ పేతురు:1:20,21:
📍 యొక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరనికొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించినయెడల దేవోక్తులు బోధించునట్లు బోధించవలెను.1వ పేతురు :4:10:
📍క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తలులుగాను, ప్రవక్తలనుగాను నియమించెను.ఎఫెస్సీ:4:12:
📍 క్రొత్త నిబంధన ప్రవక్తలు-
 మరియు యూదాయు సీలయుకూడ ప్రవక్తలై యుండినందున పెక్కుమాటలతో సహోదరుల నాదరించి స్థిరపరచిరి. 
అపో.కా:15:32:
📍 అపోస్తులులు ఏర్పరుచుకున్న ఏడుగురిలో ఒకడు, సువార్తికుడైన పిలుప్పుకు ప్రవక్తలుగా ఉన్న నలుగురు కన్యకలు అతనికుండిరి.వారు ప్రవచించువారు. అపో:కా:21:8,9:
📍ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాటలాడవచ్చును; తక్కినవారు వివేచింపవలెను. 
 అయితే కూర్చున్న మరియొకనికి ఏదైనను బయలు పరచబడిన యెడల మొదటివాడు మౌనముగా ఉండవలెను. 
 అందరు నేర్చుకొనునట్లును అందరు హెచ్చరిక పొందునట్లును మీరందరు ఒకని తరువాత ఒకడు ప్రవచింపవచ్చును. 
1వ కోరింథీ:14:29-31:
🔥 _ఆత్మలవివేచన అనే కృపావరము._ 
📍 ఈ కృపావరము గలవారు అబద్ధబోధకు,సత్య బోధకు మధ్య తారతమ్యాన్ని వేరు చేయగలవారై ఉంటారు.
📍ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. 
1వ యోహాను:4:1:
📍 ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ యేదో, భ్రమపరచు ఆత్మ యేదో తెలిసికొనుచున్నాము. 
1వ యోహాను:4:6:
📍 ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాటలాడవచ్చును; తక్కినవారు వివేచింపవలెను. 
1వ కోరింథీ :14:29:
🔥 _నానావిధ భాషలు మరియు భాషలకు అర్థం చెప్పుటయు_ చేర్చబడ్డాయి.1వ కొరింధీ:12:10:
📍ఈ కృపావరమును పొందినవారు తాము నేర్చుకొనని భాష మాట్లాడుతారు.
📍 లేదా అంతకు ముందు ఎరుగని భాషకు భావాన్ని చెబుతారు.
📍భాషతో ఎవడైనను మాటలాడితే, ఇద్దరు అవసరమైన యెడల ముగ్గురికి మించకుండ, వంతులచొప్పున మాటలాడవలెను, ఒకడు అర్థము చెప్పవలెను. 
 అర్థము చెప్పువాడు లేనియెడల అతడు సంఘములో మౌనముగా ఉండవలెను గాని, తనతోను దేవునితోను మాటలాడుకొనవచ్చును. 
1వ కోరింధీ.14:27,28:
📍 అర్థము చెప్పేవారు ఉంటేనే గాని భాష మాట్లాడుటకు వీలు లేదు.
📍కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకు సూచికయై యున్నది.
(ఇంకా ఉన్నది....!)
( *తరువాత అద్భుతములు మరియు భాషలు* )
   

విగ్రహారాధన

*విగ్రహారాధన*

బైబిల్ మొత్తం మీద ముఖ్యంగా పాతనిబంధన లో విగ్రహారాధన చెయ్యొద్దు అని అనేకచోట్ల యెహోవా  గట్టిగా హెచ్చరించాడు.

ఇలా చెప్పటానికి కారణం ఏమిటి ?

ఎందుకు విగ్రహారాధన చెయ్యవద్దని చెప్పాడు ?

విగ్రహారాధన చేస్తే ఆయనకు వచ్చిన నష్టం ఏమిటి ?

హిందూ సోదరులు కూడా విగ్రహారాధన విషయం లో బైబిల్ ను అదేపనిగా విమర్శిస్తూ ఉంటారు.

ఈ విషయాలను బైబిల్ వెలుగులో మరియు చారిత్రక ఆధారాల వెలుగులో క్షుణ్ణంగా పరిశీలిద్దాం.

బైబిల్ మొత్తం లో విగ్రహాల లో ఉండే దేవుళ్ళు కానీ దేవతలు కానీ ఒక్కచోట కూడా తమ ఆక్టివిటీ కనపరచలేదు.
అంటే యెహోవా శక్తిని అడ్డుకోవడం కానీ ,    కనీసం మానవుల మీదనైనా  తమ ప్రభావాన్ని చూపడం కానీ జరగలేదు.
కారణం ఏమై ఉంటుంది ?
ఆ విగ్రహాల లో ఏమైనా ఉంటే కదా ప్రభావం చూపటానికి.

విగ్రహాల లో దేవుళ్ళు ,దేవతలు ఎవరూ లేరని ,
యెహోవా నిరూపించిన సందర్భాన్ని బైబిల్ నుండి చూద్దాం.

యెహోవా ఈజిప్ట్ పైకి రప్పించిన తెగుళ్ళు అన్నీ కూడా ఆ దేశంలోని దేవుళ్ళ పైకి రప్పించినవే.

నదులను ,జంతువులను ,చెట్టులను ,చేమలను,
పాములను ఇప్పుడు మన భారతీయులు పూజించినట్లు గా,అప్పుడు ఈజిప్ట్ ప్రజలు కూడ పూజించే వారు ,
ఈజిప్ట్ ప్రజలు ప్రక్రుతిని ,విగ్రహాలను ఆరాదిస్తారు.

ఈజిప్ట్ ప్రజల దేవుళ్ళను వరుసగా ఇప్పుడు చూద్దాం.

1. ఓసిరిస్  :-  నైలునది దేవుడిని వీళ్ళు ఓసిరీస్ అని పిలుస్తారు.
యెహోవా మొట్టమొదటి తెగులును నైలునది దేవుడు మీదనే ఎక్కుపెట్టాడు. నదిలోని నీళ్ళన్నీ 
రక్తం లా మార్చాడు.
నైలునది దేవుడు యెహోవా యొక్క శక్తిని అడ్డుకోలేకపోయాడు (నిర్గమ 7:20).

2.హెక్ట్   :-      ఈజిప్ట్ ప్రజలు కొలిచే హెక్ట్ అనే దేవత కప్ప రూపం లో ఉంటుంది.
దేవుడు ఈజిప్ట్ ను కప్పలతో నింపి ప్రజలు ఆ కప్పలతోటి బాగా ఇబ్బంది పడేలా చేశాడు,
కప్ప దేవత యెహోవా శక్తిని అడ్డుకోలేక 
పోయింది( నిర్గమ 7:20 ).

3. సెబ్   :-      సెబ్ అంటే భూదేవి. వీరు భూమిని దేవత గా పూజిస్తారు ,ఆ దేవత పేరు సెబ్.
మోశే కర్ర తో భూమి మీద ధూళి ని రేపగా ,ఆ ధూళి పేలు రూపంలో  ఈజిప్ట్ దేశం మొత్తం వ్యాపించి  ప్రజలను ,జంతువులను బాగా బాగా ఇబ్బంది పెట్టెను.
భూదేవి కూడా యెహోవా శక్తిని అడ్డుకోలేకపోయింది ( నిర్గమ 8:17 ).

4. హేటకోక్ :-   నైలునది దేవుడి భార్య పేరు హెటకోక్. ఈదేవత కీటకము రూపం లో ఉంటుంది. ఈ దేవతకు వ్యతిరేకంగా యెహోవా          బాధాకరమైన ఈగలగుంపును ఈజిప్ట్ లోకి పంపించాడు ,వీటివల్ల ఈజిప్ట్ దేశం చెడిపోయెను అని ఉంటుంది.
ఈ దేవత కూడ యెహోవా శక్తి ని అడ్డుకోలేక పోయింది ( నిర్గమా 8:24 ).

5. అపిస్ :-   అపిస్ అంటే ఎద్దు రూపం లో ఉండే నంది దేవుడు.
ఈ నంది దేవుడికి వ్యతిరేకం గా యెహోవా ఈజిప్ట్ పశువుల మీదకు తెగులు పంపించాడు.
యెహోవా యొక్క శక్తిని నంది దేవుడు కూడా అడ్డుకోలేకపోయాడు ( నిర్గమ 9:6 ).

6. టైఫోన్  :-    టైఫోన్ అనే దేవతకు వ్యతిరేకం గా యెహోవా  దద్దుర్లు అనే రోగాన్ని ఈజిప్ట్ ప్రజల మీదకు పంపుతాడు.అవి వారిని బహుగా బాధ పెట్టెను.
ఈ దేవత కూడా యెహోవా శక్తిని అడ్డుకోలేక పోయింది ( నిర్గమ 9:10 ).

7. షు  :-     షు అనేది ఈజిప్ట్ ప్రజలకు వర్షాన్ని ఇచ్చే దేవుడు అని వారి నమ్మకం.
ఈ వరుణ దేవుడికి వ్యతిరేకం గా అగ్నితో కూడిన వడగళ్ళు యెహోవా కురిపించాడు.
వరుణదేవుడు కూడ యెహోవా శక్తిని అడ్డుకోలేక పోయాడు ( నిర్గమ 9:24 ).

8. సెరాపియ  :-   ఇతను మిడత రూపంలో ఉండే దేవుడు. ఈజిప్ట్ ప్రజల పంటలను మిడతల బారినుండి ఈ దేవుడె కాపాడుతున్నాడు అని వీరి నమ్మకం.
యెహోవా ఈ దేవునికి వ్యతిరేకం గా మిడతల దండు ను పంపాడు అవి ఈజిప్ట్ దేశం లోని నెలంతా కప్పివేసి వారి పంటలను పూర్తిగా తినివేశాయి.
ఈ దేవుడు కూడ యెహోవా శక్తిని అడ్డుకోలేక పోయాడు ( 10:13 ).

9. రా   :-   వీళ్ళు సూర్యుడిని రా అనే పేరు తో  పిలుస్తారు ,సూర్యుడు కూడా ఈజిప్ట్ ప్రజలకు ముఖ్యమైన దేవుడే.
యెహోవా 3 రోజుల పాటు ఈజిప్ట్ ను దట్టమైన చీకటి తో నింపుతాడు.
కానీ ఇశ్రాయేలీయుల వద్ద వెలుతురు ఉంటుంది.
వీరు దేవుడుగా కొలిచే సూర్యుడు యెహోవా శక్తి ని అడ్డుకోలేక పోయాడు ( నిర్గమ 10:22 ).

10. దేవుళ్ళు అందరూ :-   చివరిగా యెహోవా ఈజిప్ట్ లోని తొలి సంతానం మొత్తాన్ని హతం చేశాడు. ఈజిప్ట్ ప్రజలు దేవుళ్ళు గా భావించే ఏ ఒక్కరూ దీనిని అడ్డుకోలేకపోయారు ( నిర్గమా 12:29 ).

ఈజిప్ట్ ప్రజలు పూజించే విగ్రహాల లో ఉండే దేవుళ్ళు యెహోవా శక్తిని ఎందుకు అడ్డుకోలేకపోయారు ?
ఎందుకంటే విగ్రహాల లో ఏ దేవుడు లేడు ,ఉండడు కాబట్టి ,
విగ్రహాలను ,ప్రక్రుతి ని ఆరాదించటము వ్యర్ధం కనుక యెహోవా విగ్రహారాధన చెయ్యవద్దని ,విగ్రహాలను పడగొట్టమని చెప్పాడు.

నేటి భారతీయ విగ్రహారాధికులకు నేను ఒక ప్రశ్న అడుగుతున్నా  ఏమిటంటే ,

ఇప్పుడు మీరు పూజిస్తున్నట్లే నదులు ,జంతువులు ,చెట్లు ,చేమలను ఆనాడు ఈజిప్ట్ ప్రజలు కూడ పూజించారు.
విగ్రహాలలో దేవుడు ఉన్నాడు అని ఇప్పుడు మీరు నమ్ముతున్నట్లే ఆనాడు వాళ్ళు కూడా నమ్మారు.
యెహోవా ఈ దేవుళ్ళ మీదనే తెగుళ్ళు పంపినప్పుడు ఈ దేవుళ్ళు  యెహోవా శక్తిని అడ్డుకోలేక పోయారు ఎందుకని ?
కారణం ఏమిటి ?
సమాధానం చెప్పాలి మీరు.

ఆనాడు ఈజిప్ట్ ప్రజలు పూజించిన విగ్రహాలు వారిని కాపాడలేకపోయాయి.
ఈనాడు మీరు పూజించే విగ్రహాలు కూడా మిమ్మల్ని కాపాడ లేవు,నిత్య జీవానికి నడిపించలేవు.
విగ్రహారాధికులనందరినీ ఈరోజు  ఈ పోస్ట్ ద్వారా యెహోవా హెచ్చరిస్తున్నాడు.
సత్యాన్ని గ్రహించండి.

సృష్టి ని శాసించి, తానే దేవుడిని ,తానే సృష్టికర్త ను అని ప్రపంచానికి నిరూపించాడు యెహోవా.

విగ్రహారాధన చెయ్యవద్దని ,విగ్రహాలను నాశనం చెయ్యండిఅని యెహోవా చెప్పిన  ఈ మాటలన్నీ  అసూయ తోనో ,అహంకారం తోనో చెప్పిన  మాటలు కావు ,
అధికారం తో చెప్పే మాటలు.

అసలు యెహోవా ఇన్ని అద్భుతాలు చేశాడా ? నిజమేనా ?మానవులు ఊహించి వ్రాసుకున్న కట్టుకథ కావచ్చేమో అని కొంతమంది విగ్రహారాధికులకు సందేహం రావచ్చు.
అది కూడా చూద్దాం నిజమా ,కాదా అని.

దీనిని బట్టి బైబిల్ లో వ్రాయబడినవి కట్టుకధలు కాదు అని మనకు నిరూపణ అయ్యింది.
సోదోమ ,గోమోర పట్టణాలు కూడ ఈనాటికీ మన కళ్ళ ముందు కనిపిస్తూ  యెహోవా సర్వ శక్తి కలిగిన దేవుడు అని సాక్ష్యమిస్తున్నాయి.

కనుక విగ్రహారాధికులు అందరూ పక్షపాతాన్ని పక్కన పెట్టి, ఆలొచన చేసి ,సత్యాన్ని గ్రహించాలి అని ప్రేమ పూర్వకంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను.

Sunday, 10 May 2020

పేర్లు - అర్ధాలు

*******************************************
*పరిశుద్ధ గ్రంథము లోని కొన్ని పేర్లు వాటి అర్థాలు* 👉🏻 📖
--------------------------------------------------------------------
నోవహు = నెమ్మది
బాబెలు = తారుమారు
ఇష్మాయేలు = దేవుడు వినును
లహాయిరోయి = నన్ను చూచుచున్న సజీవుని బావి
శారా = రాజకుమారి
సోయరు = చిన్నది
బెయేర్షెబా = సాక్షార్ధమైన బావి
యెహోవా యీరే = యెహోవా చూచుకొనును
ఏశావు = రోమము లేక ఎఱ్ఱని
యాకోబు = మడిమెను పట్టుకొనినవాడు లేక,మోసగాడు
ఎదోము = ఎఱ్ఱని
ఏశెకు = జగడమాడు
శిత్నా = విరోధము
రహెబోతు = ఎడము
షేబ = ప్రమాణము
బేతేలు = దేవుని మందిరము
యగర్‌ శాహదూతా = సాక్షికుప్ప
మహనయీము = రెండు సేనలు
ఇశ్రాయేలు = దేవునితో పోరాడువాడు
పెనూయేలు = దేవుని ముఖము
సుక్కోతు = పాకలు
ఏల్‌ ఎలోహేయి = ఇశ్రాయేలు దేవుడే దేవుడు
ఏల్‌ బేతేలు = బేతేలు దేవుడు
అల్లోను బాకూత్‌   =   ఏడ్పు చెట్టు
బెనోని   =   నా దుఃఖ పుత్రుడు
బెన్యామీను   =  కుడిచేతి పుత్రుడు
మనష్షే   =   మరచుట
ఎఫ్రాయిము   =   అభివృద్ధి లేక ఫలము
ఆబేల్‌ మిస్రాయిము   =   ఐగుప్తీయుల దుఃఖము
గెర్షోము = పరదేశి
మారా  = చేదు
మస్సా  = శోధించుట
మెరీబా = వాదము
యెహోవా నిస్సీ  = ధ్వజము
ఎలీయెజెరు = దేవసహయం
ఆమేన్‌ = అలాగున జరుగును గాక
తబేరా  =  మంట
కిబ్రోతుహత్తావా  = దురాశ
ఎష్కోలు = ద్రాక్షగెల
మెరీబా  =  వివాదము
హోర్మా = నిర్మూలము
గిల్గాలు = దొరలించిన
ఆకోరు లోయ = బాధ లోయ
ఏద = సాక్షి
బోకీము =  ఏడ్పు
యెరుబ్బయలు = వాదించువాడు
రామత్లెహీ = దవడకొండ
నయోమి = మధురము
ఈకాబోదు = ప్రభావముపోయెను
ఎబెనెజరు = సహాయపు రాయి
సెలహమ్మలెకోతు = భయవిముక్తి శిల.

****************************************

Monday, 4 May 2020

బోధకుడివా నీవు.... బాధకుడివా!

భోదకుడివా నీవు..... బాధకుడివా!

కొండమీదకెక్కుతున్న క్రీస్తులా
నువ్వు స్టేజిమీదకెక్కుతుంటే
నా గుండె పొలంలో నాలుగు విత్తనాలు
నాటి వెళ్ళతావనుకున్నాను

వాచీ ఊడదీసి పక్కనపెట్టి
ఒకడికి పదిసార్లు
స్వరభేరిని నీవు సవరిస్తోంటే
రెండంచుల ఖడ్గధారివై
నా సంకెళ్ళు తెగ్గొడతావనుకున్నాను

అరగంటగా నువ్వు భావించే గంటన్నరలో 
ఆదికాండం నుంచి ఆఖరి గ్రంథందాకా
భూమ్యాకాశాలన చుట్టివచ్చావుగానీ
చిన్న వెలుతురు జాడను కూడా
వెంటబెట్టుకొని రాలేకపోయావు.

మూడు జోకులు ఆరు కొటేషన్లతో
అవలీలగా ప్రసంగాన్ని అల్లేస్తావుగానీ
ఎండిన ఎముకుల్లో నీరుపోసే వేడి నీకు లేదు 

పేరుకు వెనుక ముందూ వెనకా బారెడు డిగ్రీలను బడాయిగా 
మోస్తావుగానీ
దేవుడి మాటలు నాదాకా 
మోసుకురాలేవు

పవర్ పాయింట్లతో మా సహనాన్ని 
పరీక్షీస్తావే తప్ప నీ దగ్గర 
పవరూ లేదు పాయింటు లేదు 
చిత్రమైన ఒత్తుల భాషతో
చిత్ర వధ చేసే నీవు 
భోధకుడివా 'బాధ'కుడివా?

వారం వారం నీ బడిలో చదువుకుంటాను గానీ 
జీవితం పెట్టే ఏ పరీక్షా
పాసవ్వలేకపోతున్నాను.

మొకాళ్ళ పై శ్రమించి వాక్యలోతుల్ని శోధించి
సున్నితంగా నా ఆత్మను
స్పృశించే శక్తి నీవు పొందేదాకా
మహోన్నతుని ప్రతినిధిగా
మనుషుల ముందు నిలబడే
అర్హత నీకు లేదు  !

Thursday, 30 April 2020

దేవుని సభ - God's Counsel

👉🏻 *దేవుని సభ*   

*God's council of holy ones* 👇🏻


 Job 15:7-9: "మొదట పుట్టిన పురుషుడవు నీవేనా? నీవు పర్వతములకు ముందుగా పుట్టినవాడవా? *నీవు దేవుని ఆలోచనసభలో చేరియున్నవాడవా?* నీవు మాత్రమే జ్ఞానవంతుడవా? మేము ఎరుగనిది నీవేమి యెరుగుదువు? మేము గ్రహింపనిది నీవేమి గ్రహింతువు?"

 Ps 89:5-8: "యెహోవా, ఆకాశవైశాల్యము నీ ఆశ్చర్యకార్యము లను స్తుతించుచున్నది పరిశుద్ధదూతల సమాజములో నీ విశ్వాస్యతనుబట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. *మింటను యెహోవాకు సాటియైనవాడెవడు?*
 దైవపుత్రులలో యెహోవా వంటివాడెవడు? *పరిశుద్ధదూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు తన చుట్టునున్న వారందరికంటె భయంకరుడు.* *యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, యెహోవా, నీవంటి బలాఢ్యుడెవడు?* నీ విశ్వాస్యతచేత నీవు ఆవరింపబడియున్నావు." Dan 4:24: "రాజా, యీ దర్శనభావమేదనగా, సర్వోన్నతుడగు దేవుడు రాజగు నా యేలినవానిగూర్చి చేసిన *తీర్మానమేదనగా"* Gen 3:22: "అప్పుడు దేవుడైన యెహోవా–ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు, ఆదాము *మనలో ఒకనివంటివాడాయెను.* కాబట్టి అతడు ఒక వేళ తన చెయ్యి చాచి జీవ వృక్షఫలమును కూడ తీసికొనితిని నిరంతరము జీవించునేమో అని" Gen 11:7: "గనుక *మనము దిగిపోయి* వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండ అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను.౹"

Isa 6:1-6: "రాజైన ఉజ్జియా మృతినొందిన సంవత్సరమున *అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడైయుండగా నేను చూచితిని*; ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను.౹ ఆయనకు పైగా సెరాపులు నిలిచియుండిరి; ఒక్కొక్కరికి ఆరేసి రెక్క లుండెను. ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురు చుండెను.౹ వారు– *సైన్యములకధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు; సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది* అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి.౹ వారి కంఠస్వరమువలన గడప కమ్ముల పునాదులు కదలుచు మందిరము ధూమముచేత నిండగా నేను–అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను; అపవిత్రమైన పెదవులుగల జనులమధ్యను నివసించువాడను; నేను నశించితిని; *రాజును సైన్యములకధిపతియునగు యెహోవాను నేను కన్నులార చూచితిననుకొంటిని*.౹ అప్పుడు ఆ సెరాపులలో నొకడు తాను బలిపీఠముమీదనుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకొని నాయొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాని తగిలించి"

 Isa 6:8: "అప్పుడు–నేను ఎవని పంపెదను? *మా నిమిత్తము* ఎవడు పోవునని ప్రభువు సెలవియ్యగా వింటిని. అంతట నేను–చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుమనగా"

1Kin 22:19-24: "మీకాయా యిట్లనెను–యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము; *యెహోవా సింహాసనా సీనుడై యుండగా పరలోకసైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమపార్శ్వమునను నిలిచి యుండుట నేను చూచితిని* –అహాబు రామోత్గిలాదుమీదికి పోయి *అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించునని యెహోవా సెలవియ్యగా,* ఒకడు ఈ విధముగాను మరియొకడు *ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి.*౹ 

*అంతలో ఒక ఆత్మ యెదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడి–నేను అతనిని ప్రేరేపించెదననగా యెహోవా —ఏ ప్రకారము నీవతని ప్రేరేపించుదువని అతని నడిగెను.౹*

 అందుకతడు–నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన– *నీవు అతని ప్రేరేపించి జయము నొందుదువు; పోయి ఆప్రకారము చేయుమని అతనికి సెలవిచ్చెను.*౹ యెహోవా నిన్నుగూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచియున్నాడు.౹ మీకాయా యిట్లనగా, కెనయనా కుమారుడైన సిద్కియా అతని దగ్గరకు వచ్చి— *నీతో మాటలాడుటకు యెహోవా ఆత్మ నాయొద్దనుండి ఏవైపుగా పోయెనని* చెప్పి మీకాయాను చెంపమీద కొట్టెను.౹"


 Dan 4:17: *ఈ ఆజ్ఞ జాగరూకులగు దేవదూతల ప్రకటన ననుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటన ననుసరించి సంభవించును.* మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైని అధికారియైయుండి, తానెవరికి అనుగ్రహింప నిచ్ఛయించునో వారికనుగ్రహించుననియు, ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుష్యులను ఆయన నియమించుచున్నాడనియు మనుష్యులందరు తెలిసికొనునట్లు ఈలాగు జరుగును.౹" Dan 7:9-10: "ఇంక సింహాసనములను వేయుట చూచితిని; *మహా వృద్ధుడొకడు కూర్చుండెను.* ఆయన వస్త్రము హిమమువలె ధవళముగాను, ఆయన తలవెండ్రుకలు శుద్ధమైన గొఱ్ఱెబొచ్చువలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్నిజ్వాలలవలె మండుచుండెను; దాని చక్రములు అగ్నివలె ఉండెను.౹ అగ్నివంటి ప్రవాహము ఆయనయొద్దనుండి ప్రవహించుచుండెను. *వేవేలకొలది ఆయనకు పరిచారకులుండిరి;* కోట్లకొలది మనుష్యులు ఆయనయెదుట నిలిచిరి, తీర్పుతీర్చుటకై గ్రంథములు తెరువబడెను.౹ *దేవుని సభ*

Rev 5:1-6,9-12: "మరియు లోపటను వెలుపటను వ్రాతకలిగి, *యేడు ముద్రలు గట్టిగా వేసియున్న యొక గ్రంథము సింహాసనమునందు ఆసీసుడైయుండువాని కుడిచేత చూచితిని.౹* మరియు *దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైనవాడెవడని బలిష్ఠుడైన యొక దేవదూత బిగ్గ రగా ప్రచురింపగా చూచితిని.*

౹ అయితే పరలోకమందు గాని భూమిమీదగాని భూమిక్రిందగాని *ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను.*౹

 *ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున* నేను బహుగా ఏడ్చుచుండగా౹ ఆ పెద్దలలో ఒకడు–ఏడువకుము; ఇదిగో *దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయముపొందెనని నాతో చెప్పెను.౹* మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను, వధింపబడినట్లుండిన గొఱ్ఱెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొఱ్ఱెపిల్లకు ఏడు కొమ్ములును ఏడు కన్నులు నుండెను. ఆ కన్నులు భూమి యందంతటికి పంపబడిన దేవుని యేడు ఆత్మలు.౹ … [9-10] *ఆ పెద్దలు* — *నీవు* ఆ గ్రంథమును తీసికొని దాని *ముద్రలను విప్పుటకు యోగ్యుడవు*, నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి, ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవునికొరకు మనుష్యులనుకొని, *మా దేవునికి* వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి; గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్తపాట పాడుదురు.౹ మరియు *నేను చూడగా సింహాసనమును జీవులను, పెద్దలను ఆవరించియున్న అనేక దూతల స్వరము వినబడెను, వారి లెక్క కోట్లకొలదిగా ఉండెను.౹ వారు* –వధింపబడిన గొఱ్ఱెపిల్ల, శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి.౹"

*God's Cabinet*

ఇప్పుడీ దేవుని సభలోకి మననుష్య కుమారుని ప్రవేశము ( దానియేలు 7: 13,14 వచనాల నెరవేర్పు)

ప్రకటన 5 వ అధ్యాయంలో చెప్పినట్టు
*గ్రంధాన్ని విప్పగల అర్హుడిగా పరిశుద్ధాత్మ  దేవుడెక్కడ?*

*అసలు సభలో ఈ మూడో దేవుడెక్కడ వున్నాడు?*

దేవుని సభలో కోటానుకోట్ల ఆత్మలు, దూతలు, కెరూబులూ, సెరాపులు వీరందరి ప్రస్తావన పాత నిబంధనలో ఉంది గాని....

ఇదే సభలో మరో ఇద్దరి స్థానాలు ఎక్కడ ఉన్నాయి?

దేవుని కుడి యెడమలు ఎవరున్నారు అనేది గ్రంధము స్పష్టంగానే చెప్పింది లేకణాల్లో....

ఇప్పుడు దేవుని కుడి పర్శ్వమున ఉన్న మన ప్రభువైన క్రీస్తు, నాటి కాలంలో, పూర్వం ఎక్కడ వున్నాడు?
 అంటే ఉండి కూడా చెప్పడం లేదా?

కీర్తనలు 89: 5-8 లో వున్నవి నమ్మాలా? అవసరం లేదా,, వాటికి కూడా ఇంకేమైనా వక్రభాష్యం అల్లుకోవాలా?

గ్రంధాన్ని దాని పరిధిలో వుండే ఆలోచన చేయాల్సిందే... గ్రంధ హద్దులు మీరి, ఉన్న లేఖనానికి మన ఆలోచన చేర్చి ఒక సిద్ధాంతాన్ని స్థాపించడం సరియైన ధోరణి కాదు...నాడు అపొస్తలులు లేఖనాల వెలుగులో స్థాపించిందే ....మనం త్రవ్వి చూడాల్సింది....అంతవరకే...


🙏💐🙏🍀🙏💐🍀🙏💐

Thursday, 23 April 2020

యేసుక్రీస్తు కూడా మరో దేవుడా?

🏉🏐🎾⚾🏈🏀⚽

*యేసుక్రీస్తు మరో దేవుడనే బోధ లేఖన ఆధారమైన దేనా?*

🙏🌸🌼🌺🌾🍄🌴🙏

🌱 _యేసుక్రీస్తుని దేవుడు అని నిరూపించి ఒప్పించే పని కానీ,_
_యేసుక్రీస్తు దేవుడు కాదు అని నిరూపించి ఒప్పించే పని కానీ నాడుఅపొస్తలులు తమ నెత్తి కెత్తుకెత్తుకోలేదు ఎందుకని?_

🌱 *వారు నిత్యుడగు అద్వితీయ సత్య దేవుడైన తండ్రిని, ఆయన సంకల్పాన్ని బాగుగా ఎరిగిన వారు.*

🌱 వారు యేసుని క్రీస్తుగాను, ప్రభువుగాను, దేవుని కుమారునిగాను, ప్రధానాయజకునిగాను వారి గ్రంధాలైన ధర్మశాస్త్రములోను, కీర్తనలలోను, ప్రవక్తల గ్రంధాలలోను వారికి వాగ్ధానం చేయబడిన మెస్సియను లేఖన ఆధారాలతో వివరించి, ఒప్పించి నిరూపించారు.

🌱 *ఆనాటి యూదులు యేసు దేవుడు కాదు అని వాదించినట్టు గాని తిరుగుబాటు చేసినట్టు గాని గ్రంధంలో ఎక్కడా కనబడదు కారణం*
🌱 *_యేసుక్రీస్తు తాను దేవుడిని అని ఎప్పుడు చెప్పుకోలేదు,_* 
 అపొస్తలులు తమ బోధ ద్వారా యేసుని దేవుడని నిరూపించే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు, ఆ ఆలోచన కూడా చేయలేదు కారణం వారి పాత నిబంధన లేఖనాలలో యేసుని దేవుడని నిరూపించడానికి గాని ఒప్పించడానికి గాని వారిదగ్గర ఒక్క లేఖన ఆధారం కూడా లేదు. 
🌱 *కాబట్టే యేసుక్రీస్తు దేవుడు అనే బోధ విషయమై చర్చ కానీ వాదనగాని, తర్కం గాని గ్రంధంలో ఎక్కడా కనపడదు.*

🌱 *మన దేవుడైన యహోవా అద్వితీయ దేవుడు అనే సత్యానికి భిన్నంగా ఆనాటి భక్తిగల ఏ యూదుడైన ఆలోచన చేసే సాహసం చేయలేదు.*

🌱 _లేఖనాలు గ్రహించని యూదులు యేసుక్రీస్తుని కాని అపొస్తలులు కానీ చంపడానికి వారికున్న వ్యతిరేకత యేసుని మెస్సియాగా అంగీకరించలేక పోవడమే గాని మరొకటి కాదు._

🌱 *కాబట్టి ప్రారంభ క్రైస్తవ దినములలో యేసు దేవుడు లేదా దేవుడు కాదు అనే సమస్యే తలెత్త లేదు.*

🌱 *అన్నిటికి చాలిన అద్వితీయ దేవుడు వారికుండగా* వారు మరో దేవుని సహాయం కోసం ఎదురు చూడలేదు గాని వారికి వాగ్ధానం చేయబడిన మెస్సియా దావీదు సంతానము నుండి వస్తాడని రాజ్యము స్థాపిస్తాడని వారి నిరీక్షణ, ఆ మెస్సియా యేసుక్రీస్తు అని నాటి *అపొస్తలులు తమ బోధ ద్వారా లేఖనాలా వెలుగులో నిరూపిస్తూ సువార్త కొనసాగించారు.* 

🌱 లేఖనలను వక్రీకరించి ఇంకేదో అద్ది మరింత అద్భుతంగా చూపించి యేసు మరో దేవుడని, మరో సృష్టికర్త అని ఇంకేదో మర్మ మున్నట్టుగా శ్రోతలను, విశ్వాసులను బ్రమపెట్టే ఆరాటం ఉన్న నేటి బోధకులు తమ మాటల గారడితో, లేఖనాలకు వక్రభాష్యం చెపుతూ తమను అనుసరించే విధంగా మల్చుకుంటున్న ప్రతి వ్యక్తి గ్రంధముతో ఆటలాడుకుంటున్నాడు, దేవుడొక్కడే అనే గ్రంథ సత్యానికి తూట్లు పొడుస్తు సత్యాన్ని మూలలతో సహా ధ్వంసం చేయడానికి ఆరాట పడుతున్నాడు.

🌱 *కళ్ళున్న వారు లేఖనాలా వెలుగులోకి వచ్చి తమకు వినబడుతున్న ప్రతి బోధ సత్యమేన కాదా అని సత్య పరిశీలన చేసి గ్రంథము యొక్క ఉద్దేశాన్ని, ఒకే దేవుని గూర్చిన బోధను కాపాడాలని మా హృదయభిలాష.*

🐶🐱🐰🐹🐥🦆🐋🦈🐳🐬

Tuesday, 14 April 2020

అవిశ్వాసిని వివహమాడవచ్చా?

*ప్రశ్న:- అవిశ్వాసిని పెళ్ళి చేసుకోవచ్చా..?*

*జవాబు:-*

*2 కొరిం 6:14*
మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి. అంటే అవిశ్వాసులతో జోడీవేసుకోవద్దు,
జోడీ కట్టొద్దు. 
కాడి వేసుకోవద్దు. అని అర్ధం.

రెండు ఎద్దులు కలిపి ఒక కాడి వేస్తారు.
మీరు అవిశ్వాసులతో కాడివేసుకోవద్దు.

*ఇది సిద్దాంతం.* నీవు ఎంతవరకూ పాటిస్తావో, పాటించవో నీ యిష్టం.

దేవుడు మానవునికి స్వేచ్చను ఇస్తున్నాడు. నిర్భంధించడం లేదు.

మానవునికివ్వబడిన స్వేచ్చను దుర్వినియోగ పరచుకుంటున్న మానవుడు దేవుడు చెప్పిన సిద్దాంతాన్ని ప్రక్కనపెట్టి, దేవుని అంగీకారం లేకపోయినా, అవిశ్వాసులతో జోడీకడతానంటే దేవుడు మానవుని స్వాతంత్ర్యంలో జోక్యం చేసుకోడు. ఆపుచేయడు.

ఏది మేలు ?ఏది కీడు అనేది మాత్రమే చెబుతాడు. తరువాత నీ యిష్టం..

బైబిల్ చెప్పిందా.,? సరే కాసేపు ప్రక్కనపెడదాం..
దేవుడు చెప్పిన నియమమా ? చూద్దాంలే.. అని నిర్లక్ష్యం చేస్తూ తన ఇష్టాన్నే నెరవేర్చుకుంటున్నాడు.

*ద్వితి 7:1-4*
నీవు వారితో నిబంధన చేసుకొనకూడదు. వియ్యమందకూడదు. వాని కుమారుని నీకుమార్తెకు ఇయ్యకూడదు. నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. నన్ను అనుసరింపకుండా ఇతరదేవతలను పూజించునట్లు నీ కుమారునివారు మళ్ళించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీమీద రగులుకొని, ఆయన నిన్ను త్వరగా నశింపజేయును.

దేవుడు చెప్పిన సిద్దాంతంను ప్రక్కనపెట్టిన ఓ రాజు practical లైఫ్ లో  ఎలా fail అయ్యాడో చూద్దాం

*1రాజు 11:4-8*
సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును *ఇతర దేవతలతట్టు త్రిప్పగా* అతని తండ్రియైన దావీదు హృదయమువలె అతని హృదయము దేవుడైన యెహోవాయెడల యథార్థము కాక పోయెను.
5.సొలొమోను అష్తారోతు అను సీదోనీయుల దేవతను మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను.
6.ఈ ప్రకారము సొలొమోను *యెహోవా దృష్టికి చెడు నడత నడచి* తన తండ్రియైన దావీదు అనుసరించినట్లు *యథార్థహృదయముతో యెహోవాను అనుసరింపలేదు.*
7.​సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూష లేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను.
8.​తమ దేవతలకు ధూపము వేయుచు బలుల నర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఈలాగు చేసెను.

సిద్దాంతం వేరు
practical life వేరు
మహాజ్ఞానియైన సొలోమోను సహితం practical life లో  fail అయ్యాడు.
మరి మీ పరిస్థితి మీరే ఆలోచించుకోవాలి..

*ఆల్రెడీ అవిశ్వాసులతో వివాహం జరిగిపోయి ఉంటే.. వారి పరిస్దితి ఏమిటి..?*

*1కొరిం 7:14*
అవిశ్వాసియైన భర్త భార్యను బట్టి పరిశుద్ధ పరచబడును; అవిశ్వాసురాలైన భార్య విశ్వాసియైన భర్తనుబట్టి పరిశుద్ధపరచబడును. లేనియెడల మీ పిల్లలు అపవిత్రులై యుందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు.

*1పేతు3:1-*
స్త్రీలు తమ స్వపురుషులకు లొబడి యుండాలి. భయముతో కూడిన ప్రవర్తనను బట్టి, భర్తలనడవడికను మార్చవచ్చు..

ఆరాధన చేయు స్థలము

*ఆరాధన చేయు స్థలమేది ?*
*ఎక్కడ పడితే అక్కడ ఆరాధన చేయవచ్చా..?*

*1. పితరుల యుగములో..*

పితరుల యుగంలో ఆరాధన అనేది తేటగా ఆలోచించ బడిన సందేశం కాదు.
అయినప్పటికీ
పితరులు దేవునిని ఎలా ఆరాధించారు అంటే..? ఒకచోట బలిపీఠం కట్టి, అక్కడనే బలి అర్పించే వారు.
అది ఆకాలంలో ఆరాధనగా ఎంచబడింది. దేవుడు ఆ సువాసనను ఆఘ్రాణించాడు. *(ఆది 8:20-21; ఆది 13:3-4)*

*2. మోషే యుగంలో...*

ఆరాధించే స్ఠలానికి అత్యంత ప్రాముఖ్యత చూస్తాము.
ఆరాధన యెహోవా మందిరములో మాత్రమే జరగాలి
ఆరాధన యెరూషలేములో మాత్రమే జరగాలి
యెరూషలేము ఆనాడు మత కేంద్రముగా పేరొంధి, విలసిల్లినది.

*ద్వితి 12:13,14*
నీవు చూచిన ప్రతీస్థలమున నీ దహనబలులు అర్పింపకూడదు. యెహోవా నీ గోత్రములలో ఒకదానియందు *ఏర్పరచుకొను స్ధలముననే నీ దహనబలులు అర్పించి*, నేను మీకాజ్ఞాపించుచున్న సమస్తమును *అక్కడనే జరిగించవలెను.*

2 Samuel(రెండవ సమూయేలు) 15:32
*దేవుని ఆరాధించు స్థలమొకటి ఆ కొండమీద ఉండెను*. వారు అచ్చటికి రాగా అర్కీయుడైన హూషై పై వస్త్రములు చింపుకొని తలమీద ధూళి పోసికొనివచ్చి రాజును దర్శనము చేసెను.

2 Chronicles(రెండవ దినవృత్తాంతములు) 7:3
అగ్నియు *యెహోవా తేజస్సును మందిరముమీదికి* దిగగా చూచి ఇశ్రాయేలీయులందరును సాష్టాంగనమస్కారము చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతర ముండునని చెప్పి *ఆయనను ఆరాధించి స్తుతించిరి.*

2 Chronicles(రెండవ దినవృత్తాంతములు) 29:20,28,29
20.అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడలేచి, పట్టణపు అధికారులను సమకూర్చుకొని *యెహోవా మందిరమునకు పోయెను.*
28.అంత సేపును సర్వసమాజము *ఆరాధించుచుండెను.* గాయకులు పాడుచుండిరి, బూరలు ఊదు వారు నాదముచేయుచుండిరి,దహనబలియర్పణ సమాప్తమగువరకు ఇదియంతయు జరుగుచుండెను.
29.వారు అర్పించుట ముగించిన తరువాత రాజును అతనితోకూడనున్న వారందరును *తమ తలలు వంచి ఆరాధించిరి.*

Jeremiah(యిర్మీయా) 26:2
యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా, *నీవు యెహోవా మందిరావరణములో* నిలిచి, నేను నీ కాజ్ఞాపించు మాట లన్నిటిని *యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చు* యూదా పట్టణస్థులందరికి ప్రకటింపుము; వాటిలో ఒక మాటైనను చెప్పక విడవకూడదు.

John(యోహాను సువార్త) 4:20
మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని *ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో* ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను

Acts(అపొస్తలుల కార్యములు) 8:27
అప్పుడు ఐతియొపీయుల రాణియైన కందాకే క్రింద మంత్రియై ఆమెయొక్క ధనాగారమంతటి మీదనున్న ఐతియొపీయుడైన *నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు* వచ్చియుండెను.

Acts(అపొస్తలుల కార్యములు) 24:11
*యెరూషలేములో ఆరాధించుటకు* నేను వెళ్లిననాట నుండి పండ్రెండు దినములు మాత్రమే అయినదని తమరు విచారించి తెలిసికొన వచ్చును.

మోషే యుగంలో ఆరాధన.,
👉దేవుడు కోరుకున్న జనముతో,
👉దేవుడు ఎంచుకున్న స్థలములో,
👉దేవుడు ఆజ్ఞాపించిన విధముగా,
👉దేవుడు కోరిన రీతిలో,
👉 దేవుడేర్పరచిన నమూనాలో,
👉పోలికలో నిర్మింపబడిన ప్రత్యక్షగుడారములో, యెహోవా మందిరములో మాత్రమే ఆరాధన జరిగినట్లు మనము గమనించగలము

*క్రైస్తవుల ఆరాధనా స్ధలమేది ?*

మోషే, ధర్మశాస్త్ర కాలములో భౌతిక సంబంధమైన స్థలానికి ప్రాముఖ్యత ఇవ్వబడినది.
కానీ నేడు బౌతిక స్థలానికి ప్రాముఖ్యత లేదు.

Hebrews(హెబ్రీయులకు) 10:1
ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల *ఛాయ* గలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలదికాదు గనుక ఆ యాజకులు ఏటేట ఎడతెగకుండ అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడును *సంపూర్ణసిద్ధి కలుగజేయ నేరవు.*

Hebrews(హెబ్రీయులకు) 9:9
ఆ గుడారము ప్రస్తుతకాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమునుబట్టి మనస్సాక్షి విషయములో *ఆరాధకునికి సంపూర్ణసిద్ధి కలుగజేయలేని* అర్పణలును బలులును అర్పింపబడుచున్నవి.

John(యోహాను సువార్త) 4:20,21,22,23,24
20.మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను
21.అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను *యెరూషలేములో నైనను మీరు తండ్రిని ఆరాధింపరు*. నా మాట నమ్ముము;
22.మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము; రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది.
23.అయితే *యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను ,సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది;* అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు;(మూలభాషలో-వెదుకుచున్నాడు).
24.దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.

👉పర్వతం మీద ఆరాధించరు.
👉 యెరూషలేములో ఆరాధించరు.
👉నేడు స్థలానికి ప్రాముఖ్యత లేదు

*స్థలానికి బదులు జనాన్ని కోరుకున్నాడు దేవుడు.*

Isaiah(యెషయా గ్రంథము) 51:16
నేను ఆకాశములను స్థాపించునట్లును భూమి పునాదులను వేయునట్లును *నాజనము నీవేయని సీయోనుతో చెప్పునట్లును* నీ నోట నా మాటలు ఉంచి నా చేతినీడలో నిన్ను కప్పియున్నాను.

Psalms(కీర్తనల గ్రంథము) 132:13,14
యెహోవా *సీయోనును ఏర్పరచుకొనియున్నాడు. తనకు నివాసస్థలముగా దానిని కోరుకొని యున్నాడు.*
14. *ఇది నేను కోరినస్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును ఇక్కడనే నేను నివసించెదను*

సీయోను అనగా...
👉దేవుడు కోరుకున్న స్ఠలం,
👉దేవుని జనము,
👉క్రీస్తు సంఘము నకు సూచన

👉ఆరాధన క్రీస్తు ప్రభువు సంఘములో జరగాలి
👉క్రీస్తు శరీరమైన సంఘములో జరిగేది ఆరాధన
👉క్రీస్తు రాజుగా ఉన్న రాజ్యములో ఆయన ఏలుబడి క్రింద జీవించే ప్రజలు జరిగించేది
ఆరాధన అనబడుతుంది
👉క్రీస్తు శిరస్సుగా గల సంఘములో ఆయన అధికారం క్రింద జీవించే ప్రజలున్న సంఘములో జరిగేది ఆరాధన
👉ఆయన ఏం చెప్పినా అన్నివిషయాలలో ఆయన మాట వినేవారి సముదాయం గలవారు ఉన్నచోట దేవుడు నివశిస్తాడు.

👉అది ఆయన కోరిన స్థానము.
👉అది ఆయనకు నిత్యమూ విశ్రమ స్దానము.
👉ఆరాధన అక్కడే జరగాలి.
ఇంకెక్కడ జరిగినా అది ఆరాధన అనబడదు

ఆత్మతో సత్యముతో ఆరాధన

*ఆత్మతోను సత్యముతోను ఆరాధించుట అంటే ఏమిటి..?*

*ఆత్మతో ఆరాధన*

👉శరీరమును ఆస్పాదము చేసుకొనని దానిని ఆత్మతో అనగా భావించబడుతుంది

👉శరీరమును ఆస్పదము చేసుకొనక, దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు, క్రీస్తు యేసునందు అతిశయ పడుచున్న మనమే సున్నతి గలవారము. (ఫిలి 3:3)

👉శరీరమును ఆస్పదము  చేసుకోవడం అంటే నీ ఉద్యోగము, నీ హోదా, నీ కులగోత్రాలు, మీ కుటుంబము, నీ అంతస్తు, వగైరాలన్ని ఆధారము చేసుకొనడమే శరీరాన్ని ఆస్పదము చేసుకోవడం.

👉పౌలుకు అతిశయ కారణాలు ఎన్ని ఉన్నా వాటిని బట్టి ఎన్నడూ అతిశయించలేదు.
దేవుని సన్నిధిలో నీశరీరాన్ని బట్టి అతిశయించదగిన కారణాలేమీ ఉండకూడదు. అప్పుడే ఆత్మతో ఆరాధన చేసినట్టు అవుతుంది.

*సత్యముతో ఆరాధన*

👉సత్యముతో ఆరాధన అంటే మనుషులు కల్పించే పద్ధతులు దైవోపదేశములుగా  బోధించుచు చేసే ఆరాధన సత్య ఆరాధన కాదు (మత్త15:9)

👉ఒకడు తనకు తోచినట్లు అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి, తాను చూచిన వాటిని గూర్చి, విన్నవాటిని గూర్చి, గొప్పగా చెప్పుకొనుచూ, శరీర సంబంధమైన మనసు వలన ఉప్పొంగుచూ.. శిరస్సును హత్తుకొననివాడు చేసే ఆరాధనా సత్యారాధన అనబడదు (కొల2:18-19)

👉తెలియని దేవునికి చేసే ఆరాధనా సత్య ఆరాధన కాదు (అపో. 17:23)

*సత్య ఆరాధన.. అంటే లేఖనాలను పరిశీలించి, లేఖనాల ప్రకారం ఆరాధించడం సత్యముతో ఆరాధించడమే*

ఆరాధన ప్రారంభము

*ఆరాధనకు ఎక్కడ బీజాలు పడ్డాయి..?*

అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ. *ఆదికాండము 15 :13*
నీ సంతతి వారు తమదికాని పరదేశ మందు నివసించి ఆదేశపు వారికి దాసులుగా నుందురు. వారు నాలుగు వందల యేండ్లు వీరిని శ్రమ పెట్టుదురు
మీరు ఎవరికి దాసులగుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును

అబ్రహాము తండ్రి ఇల్లు విగ్రహారాధన తో కూడిన ఇల్లు. దాని నుండి బయటికి రా అన్నాడు దేవుడు

*యెహోషువ 24: 2*
ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పునదేమనగా ఆదికాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకు తండ్రి యైన తెరహు కుటుంబికులు నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి.  అయితే నేను అది అద్దరి నుండి మీ పితరులైన అబ్రాహామును తోడుకొని వచ్చి, కనాను దేశమంతటా సంచరింప చేసి, సంతానమును విస్తరింపచేసి అతనికి ఇస్సాకును ఇచ్చితిని

విగ్రహారాధన నుండి  ఇతర దేవతల నుండి బయటకు వచ్చేసేయ్. నా సంకల్పానికి సాధనంగా నీవు ఉంటావు.

తెరహు ఇంటిలో యవ్వన దంపతులు దేవునికి కనబడ్డారు. వారు అబ్రహాము శారా.
ఆదర్శ దంపతులు వీళ్ళు

విగ్రహారాధన సంబంధమైన మీ తండ్రి ఇంట్లో నుండి బయటకు వచ్చేయ్. అన్నాడు దేవుడు

పురుష నాయకత్వం దేవుని యొక్క ఏర్పాటు. అబ్రాహాము పురుషనాయకత్వం గల వ్యక్తి. మారు మాట్లాడలేదు.
నీ దేశాన్ని, నీ తండ్రి ఇంటిని, బంధువులను, వదలి వచ్చేయ్ అనగానే వచ్చేశాడు అబ్రాహాము.

విగ్రహారాధన తో కూడిన ఇల్లు నాకు వద్దు
నా సంకల్పాన్ని విగ్రహారాధన జరిగే ఇంట్లో నుండి మొదలు పెట్టలేను.

అబ్రహాము ఎక్కడికి వెళ్ళవలెనో  ఎరుగకయే బయలుదేరాడు. శారా తల్లి నీవు ఎక్కడికి వెళ్ళదువో నేను అక్కడే ఉంటాను అన్నది *హెబ్రీ 11: 8*

దేవుని సంకల్పంనకు  పురుష నాయకత్వం తో కూడిన ఇల్లు అయి ఉండాలి

"ఇల్లు చూసి బాగుంటే వస్తాను" అనే టైప్ కాదు ఆ శారా తల్లి
బహు సుందరవతి
నా గతి ఏమిటి ?
ఆ భార్య గతి ఏమిటి ?
అనేకమైన ఆలొచనలు..

అబ్రాహాము ఇంటిలో 318 మంది జన్మించారు.  అబ్రాహాము బహు ధనవంతుడైనాడు.

*ఆదికాండము 15: 1* నాకు ఏమి ఇచ్చిననేమి ?
నేను సంతానము లేని వాడిని పోవుచున్నానే అని అబ్రహాము అన్నప్పుడు

అబ్రహాముతో నిబంధన స్థిరపరిచాడు దేవుడు
*ఆదికాండము 15 : 13*
నీసంతతి వారు నాలుగు వందల సంవత్సరాలు శ్రమ పడతారు

తరతరాలకు ముందుగా ఏం జరుగుతుందో చూడగలిగిన వాడు దేవుడు

నాలుగువందల సంవత్సరాల పిమ్మట ఐగుప్తు నుండి విడుదల పొందిన ఇశ్రాయేలీయులతో,. మీరందరూ గుడారాలు వేసుకుంటున్నారు నాకు కూడా ఒక డేరా వేయండి నేను మీ మధ్యలో నివాసము చేస్తాను

*నిర్గమ 25:8* నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధస్థలమును నిర్మింపవలెను
*ఇక్కడే ఆరాధనకు బీజాలు పడ్డాయి*

విమోచింపబడిన వారి మధ్యలో ఆరాధింపబడడానికి దేవుడు ఇష్టపడ్డాడు

నా డేరా ఇలాఇలా ఉండాలి అని *నిర్గమకాండము 25 నుండి 40 అధ్యాయాలు* మధ్య గుడారముయొక్క విశేషమైన సంగతులు ఉన్నాయి

క్రీస్తు రక్తం చేత విమోచన బడిన వారి మధ్యలో నేడు దేవుడు నివాసము చేస్తాడు
క్రీస్తు ప్రభువు సంఘములో దేవుడు నివాసం చేస్తాడు

*ఎఫెసి 2:19* కాబట్టి మీరు ఇకమీదట పర జనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్తులను దేవుని ఇంటివారునై యున్నారు
అపోస్తలులు ను ప్రవక్తలును వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు
ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువు నందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది.  ఆయనలో మీరు కూడా దేవునికి నివాసస్థలమైన యుండుటకు కట్టబడుచున్నారు

*యెషయ 28 :16*  యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింప బడిన రాయి. అమూల్యమైన తల రాయి, బహు స్థిరమైన పునాదియైన మూలరాయియైయున్నది విశ్వసించువాడు కలవరపడడు.

ఎవరిచేతో పునాది వేస్తే దేవుడు ఒప్పుకోడు. అపోస్తులుల బోధ కుండే విశేషమైన సమాచారం ఇది.
అపో. లు,  ప్రవక్తలు వేసిన పునాది మీదే కట్టబడాలి. అలా లేకపోతే మీ ఆరాధనా అంగీకరించబడదు

ఇశ్రాయేలీయుల మధ్య ఒక గుడారము ఏర్పరచి, వారి మధ్యలో నేను ఆరాధించబడాలి.

అలా ఆరాధనకు బీజాలు పడ్డాయి.

మంచి దినములు చూడగొరువాడు

*మంచి రోజులు చూడాలనుకునేవారు ఎవరిని ప్రేమించాలి..? దేనిని ప్రేమించాలి....???*

*జీవమును ప్రేమించాలి.* (1పేతు 3:10)

👉మంచిరోజులు కోసం ఎదురు చూసేవారు జీవమును ప్రేమిస్తారు.
👉ప్రాణాన్ని ప్రేమించడం వేరు. జీవాన్ని ప్రేమించడం వేరు.
👉నీవు నీ ప్రాణాన్ని ప్రేమిస్తే జీవాన్ని ప్రేమిస్తున్నట్టు కాదు.
👉దేహాన్ని బ్రతికించేది ప్రాణం
ఆత్మను జీవింపజేసేది జీవం
👉ప్రాణాన్ని ప్రేమించేవాడికి మంచి రోజులుండవు.

👉(మత్త 16:25) తన ప్రాణంను రక్షించు కోవాలనుకొనేవాడు దానిని పోగొట్టుకుంటాడు.

👉రక్షించుకోవాలని నీవు ఆరాటపడుతుంటే.. అది నీకు దక్కదా..? ఆశ్చర్యంగా లేదూ..?

👉నా నిమిత్తం తన ప్రాణంను పోగొట్టుకొనువాడు దానిని దక్కించుకొంటాడు.

👉కాబట్టి ప్రాణాన్ని దక్కించుకోవాలనే ఆలోచన చెయ్యకు.
👉ప్రాణాన్ని శుభప్రదంగా ఉంచుకోవాలని తాపత్రయపడకు.

👉(లూకా 12:16)
👉వెర్రివాడైన ధనవంతుడు
*నా ప్రాణమా...*
(అది పోగొట్టుకునే ప్రాణం.)
👉ఏది పొగొట్టుకుంటావో అది నీదెలా అవుతుంది..?
👉దేవుడు పిలిస్తే వెళ్ళిపోయే ప్రాణం.
👉ఆ ప్రాణంతో ధనవంతుడు చెప్పుకొంటున్నాడు.
👉 *అనేక సంవత్సరాలకు..*
👉ఈరోజుకే Guarantee లేదు.
👉అనేక సంపత్సరాలకొరకు ప్లానా..?

*వెర్రివాడు..*
👉ఈ రాత్రే దేవుడు ప్రాణం అడిగితే ఇచ్చేయాలని తెలుసుకోలేకపోయాడు.

👉ప్రాణం నకు భవిష్యత్ లేదు.
👉ప్రాణం నకు మంచి రోజులు రావు.
👉ప్రాణానికి సుఖం ఉండదు.
👉దుర్ధినాలే వస్తాయి.
👉ప్రతీ ఒక్కరి జీవితంలో నాప్రాణానికి సుఖం, సంతోషం లేదని చెప్పే రోజులు ఉన్నాయి.

👉నీవు ప్రాణాన్ని ప్రేమిస్తే,.
దానిని పోగొట్టుకొంటావ్..
👉 *జీవాన్ని ప్రేమించు. నీకు మంచిరోజులు వస్తాయ్..*

👉ఆస్ధి సంపాదించుకొనేవాడు తన ప్రాణం కొరకు ఆలోచన చేస్తున్నాడు.
👉ఈ లోక సంబంధులు ప్రాణం కొరకు ఆలోచన చేస్తారు.

👉నీ సంపాదన అంతా నీ ప్రాణం కొరకే అయితే నీవు నష్టపోతావ్,,

👉ఆత్మ కొరకు సంపాదన వేరేగా ఉంటుంది.
👉(1తిమో 6:11)
నీతిని, భక్తిని, విశ్వాసంను, ప్రేమను, ఓర్పును, సాత్వీకంను సంపాదించుకొనుటకు ప్రయాసపడుము.
👉ఇది జీవంను ప్రేమించేవారు చేసేపని.
👉మంచిరోజులు చూడాలనుకొనేవారు సంపాదించుకునే గుణ లక్షణాలు.

👉ధనాపేక్ష సమస్త కీడులకు మూలము.
👉ధనాపేక్ష ప్రాణానికి సంబంధించినది,
👉నా భవిష్యత్ ఏమిటి..? అని ఆలోచించేవారు డబ్బుపై తన మనస్సు పెడతారు.
👉ఇల్లు, వాకిలి, డబ్బు, ఆస్తులు
LIC పాలసీలు ఇవన్నీ  ప్రాణానికి సంబంధించిన department. ఇవి నిన్ను రక్షింపలేవు.

👉జీవానికి సంబంధించిన department వేరేగా ఉంటుంది.
👉అవి నీవు సంపాదించుకోవాలి.
👉ఆ list నీదగ్గర ఉండాలి.
👉నీవు దేనిని ప్రేమిస్తున్నావో వాటికొరకు ఎగబడతావు.
👉ప్రాకులాడతావు. ఆరాటపడతావు. శ్రమిస్తావు.

👉అనేక సంవత్సరాలకు plan వేసుకుంటే... అది నీకు security కల్పించదు. నీవు మోసపోతావ్..
👉నీ భద్రత జీవాన్ని ప్రేమించడంలో ఉంది.
👉జీవాన్ని ప్రేమించేవాడు భౌతికసంబంధమైన భద్రత కోసం ఆలోచించడు.
👉ఆత్మసంబంధంగా ఆలోచన చేస్తాడు.
👉అతని Account లో నీతి, భక్తి, విశ్వాసం వగైరా ఎంతవరకూ ఉన్నాయో ఆలోచించుకుంటాడు. వాటికొరకు ప్రయాసపడతాడు.

👉నీకు భౌతికంగా ఎన్ని bank account లు ఉన్నా వృధా,,
నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా వృధా,,

👉(ఎఫె 4:18) దేవుని వలన కలిగేది జీవం. దానిలోనుండి నీవు వేరుకావద్దు. నీకు మంచిరోజులు రావు.

👉(ఎఫె 2:1) అపరాధంల చేత పాపముల చేత చచ్చినవారు జీవంలో నుండి వేరుచేయబడినవారు,

👉జీవాన్ని ప్రేమించేవారు వెలుగులో పయనిస్తారు.
👉దేవునితో సహవాసం కలిగియుంటారు. వానికి భవిష్యత్ ఉంటుంది.
👉దేవుని ఇంటిలో నిరంతరం జీవించే అవకాశం జీవమును ప్రేమించేవారికే..

👉నా retirement తర్వాత ఏమిటి..? అని ఆలోచిస్తే..
ఏముంది..? పోతావ్.. అంతకుమించి ఏం జరుగుతుంది..?

👉మంచి ఉద్యోగం, మంచి సంపాదన, మంచి పొజిషన్ ఇవేమీ నీకు మంచిరోజులు తెచ్చిపెట్టవు.

*దేవుని జీవము నీకు నిత్యభద్రత కల్పిస్తుంది. నీకు మంచిరోజులు వస్తాయ్..*

క్రైస్తవుల ఆరాధన స్థలము

*క్రై స్తవుల ఆరాధనా స్ధలమేది ?*

మోషే, ధర్మశాస్త్ర కాలములో భౌతిక సంబంధమైన స్థలానికి ప్రాముఖ్యత ఇవ్వబడినది.
కానీ నేడు బౌతిక స్థలానికి ప్రాముఖ్యత లేదు.

Hebrews(హెబ్రీయులకు) 10:1
ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల *ఛాయ* గలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలదికాదు గనుక ఆ యాజకులు ఏటేట ఎడతెగకుండ అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడును *సంపూర్ణసిద్ధి కలుగజేయ నేరవు.*

Hebrews(హెబ్రీయులకు) 9:9
ఆ గుడారము ప్రస్తుతకాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమునుబట్టి మనస్సాక్షి విషయములో *ఆరాధకునికి సంపూర్ణసిద్ధి కలుగజేయలేని* అర్పణలును బలులును అర్పింపబడుచున్నవి.

John(యోహాను సువార్త) 4:20,21,22,23,24
20.మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను
21.అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను *యెరూషలేములో నైనను మీరు తండ్రిని ఆరాధింపరు*. నా మాట నమ్ముము;
22.మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము; రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది.
23.అయితే *యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను ,సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది;* అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు;(మూలభాషలో-వెదుకుచున్నాడు).
24.దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.

👉పర్వతం మీద ఆరాధించరు.
👉 యెరూషలేములో ఆరాధించరు.
👉నేడు స్థలానికి ప్రాముఖ్యత లేదు

*స్థలానికి బదులు జనాన్ని కోరుకున్నాడు దేవుడు.*

Isaiah(యెషయా గ్రంథము) 51:16
నేను ఆకాశములను స్థాపించునట్లును భూమి పునాదులను వేయునట్లును *నాజనము నీవేయని సీయోనుతో చెప్పునట్లును* నీ నోట నా మాటలు ఉంచి నా చేతినీడలో నిన్ను కప్పియున్నాను.

Psalms(కీర్తనల గ్రంథము) 132:13,14
యెహోవా *సీయోనును ఏర్పరచుకొనియున్నాడు. తనకు నివాసస్థలముగా దానిని కోరుకొని యున్నాడు.*
14. *ఇది నేను కోరినస్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును ఇక్కడనే నేను నివసించెదను*

సీయోను అనగా...
👉దేవుడు కోరుకున్న స్ఠలం,
👉దేవుని జనము,
👉క్రీస్తు సంఘము నకు సూచన

👉ఆరాధన క్రీస్తు ప్రభువు సంఘములో జరగాలి
👉క్రీస్తు శరీరమైన సంఘములో జరిగేది ఆరాధన
👉క్రీస్తు రాజుగా ఉన్న రాజ్యములో ఆయన ఏలుబడి క్రింద జీవించే ప్రజలు జరిగించేది
ఆరాధన అనబడుతుంది
👉క్రీస్తు శిరస్సుగా గల సంఘములో ఆయన అధికారం క్రింద జీవించే ప్రజలున్న సంఘములో జరిగేది ఆరాధన
👉ఆయన ఏం చెప్పినా అన్నివిషయాలలో ఆయన మాట వినేవారి సముదాయం గలవారు ఉన్నచోట దేవుడు నివశిస్తాడు.

👉అది ఆయన కోరిన స్థానము.
👉అది ఆయనకు నిత్యమూ విశ్రమ స్దానము.
👉ఆరాధన అక్కడే జరగాలి.
ఇంకెక్కడ జరిగినా అది ఆరాధన అనబడదు

చెబుతారు కానీ చేయరు

*వారు చెప్పుదురే గాని చేయరు. మత్తయి-23:3* """"""""""""""""...