Monday, 29 April 2019

వివాహము కావలసిన స్త్రీ అర్హతలు

*2.వివాహము కావాల్సిన స్త్రీ అర్హతలు*

💐🙏🏼💐🙏🏼💐🙏🏼💐🙏🏼💐🙏🏼

*1. వినయము గల స్త్రీ అయివుండాలి.*

2. స్త్రీ యొక్క స్వభావిక మృదుత్వము గలదై యుండాలి.

*3. వంట రుచిగా చేయగల నేర్పరియై యుండాలి.*

4. పొదుపును పాటించే స్త్రీ అయివుండాలి.

*5. భర్తకు సాటియైన సహకారిగా పని చేయగలిగినదై యుండాలి.*

6. కుటుంబ బాధ్యత తెలిసినదై యుండాలి.

*7. తల్లి దండ్రులకు విధేయురాలై యుండాలి.*

8. వివాహానికి తగిన వయసు వచ్చినదైయుండాలి.

*9. తల్లిదండ్రులకు లోబడి వారిని ప్రేమించినట్టే అత్తమమలను చూసుకోవాలి అనే విషయంపై అవగాహన ఉండాలి.*

10. వివాహానంతరం తల్లిదండ్రులను విడచి భర్తతోనే జీవించాలి అనే విషయాన్ని గ్రహించినదై యుండాలి.

*11. దైవభక్తిగల స్త్రీ అయివుండాలి.*

12. లోబడే మనస్తత్వమును అలవర్చుకున్నదై యుండాలి.

వివాహము కావలిసిన పురుషుని అర్హతలు

💐🙏🏼💐🙏🏼💐🙏🏼💐🙏🏼💐🙏🏼💐

*వివాహము కావలసిన పురుషుని అర్హతలు*

💐🙏🏼💐🙏🏼💐🙏🏼💐🙏🏼💐🙏🏼💐

*_1. కుటుంబమును పోషించగల పని (ఉద్యోగం/వ్యాపారం) చేస్తున్న వాడై యుండాలి._*

2. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలిగిన వాడై యుండాలి.

*_3. మానసిక పరిపక్వత గలవాడై యుండాలి._*

4. తల్లిదండ్రులకు విధేయుడైయుండాలి.

*_5. భార్యను ఎన్నుకునే విషయంలో స్వతంత్ర నిర్ణయం తీసుకోగలిగిన వాడై యుండాలి._*

6. కుటుంబములో భాద్యత గలవాడై యుండాలి.

*_7. భార్యను సంరక్షించగల సామర్థ్యం గలవాడై యుండాలి._*

8. వివాహానికి తగిన వయస్సు వచ్చిన వాడై యుండాలి.

*_9. సంసారం చేయగలిగిన పురుషుడై యుండాలి._*

10. వైవాహిక జీవితం పట్ల కనీస అవగాహన ఉండాలి.

*11. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై యుండాలి.*

💐🙏🏼👨🏻‍💼💐🙏🏼👨🏻‍💼💐🙏🏼👨🏻‍💼💐🙏🏼

Sunday, 28 April 2019

ఏడాత్మలు

*Seven is the number of the Holy Spirit.*

*This does not mean that there are seven Holy Spirits*

*The seven Spirits are the seven-fold aspects of the Holy Spirit*

*1. wisdom (జ్ఞానము)*
*2. understanding (వివేకము)*
*3.knowledge (తెలివి)*
*4  counsel (ఆలోచన)*
*5. might or power (బలము లేదా శక్తి)*
*6. the fear of the Lord (దేవుని యందలి భయము)*
*7. judgement in the form of discernment, not judgement for sin (విమర్శ లేదా తీర్పు తీర్చు)*

💐🙏💐🙏💐🙏💐🙏💐

Friday, 26 April 2019

సర్వాధికారము పొందిన క్రీస్తు

*యేసుక్రీస్తు వారికి సర్వాధికారం ఇయ్యబడింది కదా..*
*ఏ ఏ విషయాల్లో అధికారం ఇవ్వబడింది..?*

*జవాబు*

💐 *యేసు ముృత్యుంజయుడై తిరిగి లేచి, ఆరోహణుడై పరలోకం చేరుకున్న తరువాత పట్టాభిషేకం సమయంలో క్రీస్తు పొందిన ఆధిక్యతలు, అధికారాలు* 💐

*1. క్రీస్తును రాజుగా దేవుడు పట్టాభిషేకం చేయుట (అపో2:36)*

*2. క్రీస్తును తన కుమారునిగా దేవుడు ప్రకటించుట (హెబ్రి1:1-5)*

*3. భూరాజులు, అధిపతులందరిపై క్రీస్తుకు అధికారం ఇవ్వబడుట (ప్రక1:5-6)*

*4. మరణంపై, పాతాళలోకం పై క్రీస్తుకు అధికారం ఇవ్వబడుట*
*(అపో2:31,ప్రక1:18)*

*5. పరలోకంలో దూతలమీదను, అధికారులమీదను, శక్తులమీదను, అధికారం పొందుట (1పేతు3:22)*

*6. దేవుడు దావీదుతో చేసిన నిబంధన పూర్తిగా నెరవేరుట (ప్రక3:7)*

*7. దేవుడు తన కుడిపార్శమున క్రీస్తును కూర్చుండబెట్టుకొనుట (ఎఫె1:20-21)*

*8. సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరచుట (1కొరిం15:27-28)*

*9. దేవుని ప్రజలపై క్రీస్తు ఏలుబడి చేసే అధికారం (హెబ్రి12:22-24)*

*10. క్రీస్తును - సంఘానికి శిరస్సుగా నియమించుట (ఎఫె1:22)*

దేవుడు కాలలపై అధిపతి

*ప్రశ్న:- కాలాలు మీద అధిపతి ఎవరు దేవుడా ? యేసుక్రీస్తా ?*

*జవాబు:-*

👉 *అపో 1: 7*
కాలములు, సమయంలు తండ్రి తనస్వాధీనంలో ఉంచుకున్నాడు

👉 *దాని 2:20-21*
దేవుడు కాలములు, సమయములను మార్చు వాడు

👉 ఏసుక్రీస్తు ని ఎప్పుడు భూలోకం మీదకి పంపాలో నిర్ణయించిన వాడు దేవుడు
*గలతీ 4:4*
*కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తనకుమారుని పంపెను*

👉 *అపో 2: 23* యేసు క్రీస్తు ఎప్పుడు సిలువ వేయబడాలో నిర్ణయించిన వాడు దేవుడు
*దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన యేసుక్రీస్తు..*

👉 *అపో13: 28-33* ఆయనకు ఎప్పుడు పట్టాభిషేకం జరగాలో నిర్ణయించిన వాడు దేవుడు
*దేవుడు యేసును లేపి, పితరులకు చేసిన వాగ్దానమును నెరవేర్చియున్నాడు. మరియు నీవు నా కుమారుడవు. నేడు నిన్ను కని యున్నాను* అనే మాట పట్టాభిషేకం సమయంలో జరిగినది

👉 *మత్తయి 24 :36*
ఆ దినమును గూర్చియు, ఆ గడియను గూర్చియూ  తండ్రిమాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైననూ, పరలోకమందలి దూతలైననూ, కుమారుడైనను ఎరుగరు.
యేసు క్రీస్తు ఎప్పుడు తిరిగి రావాలో నిర్ణయించిన వాడు

*దేవుడు కాబట్టి కాలాల మీద అధిపతి దేవుడు*

క్రీస్తుతో కూడా పాతిపెట్టబడుట

ఆయనతో కూడ ఏమి పాతిపెట్టలి ?

నీ శరీరము నందు వున్న ప్రాచీన స్వభావమును,  పాపమును ఆయనతోకూడ సిలువవేయలి మరియు పాపము విషయమై చనిపోవులి.  ఇది నిజమైన "బాప్తిస్మము".  

కొలొ స్సి 2: 20,21
20 మీరు క్రీస్తుతోకూడ లోకముయొక్క మూలపాఠ ముల విషయమై మృతిపొందినవారైతే లోకములో బ్రదుకు చున్నట్టుగా
21 మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించిచేత పట్టుకొనవద్దు,రుచిచూడవద్దు, ముట్టవద్దు అను విధు లకు మీరు లోబడనేల?  

పాపము అనగా నేమి?
1 యోహాను 3:4
4 పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును; ఆజ్ఞాతిక్రమమే పాపము.
యాకోబు 4:17
17 కాబట్టి మేలైనదిచేయ నెరిగియు ఆలాగు చేయనివానికి పాపము కలుగును.

పాపము విషయమై చనిపోవుట అనగా నేమి?

పాపము నుండి విడిపింపబడుట  మరియు  నీతికి దాసులు అవుట. 

యోహాను సువార్త 8:34
34 అందుకు యేసుపాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

1 కొరింథీ 12:13
13 ఏలాగనగా, యూదులమైనను, గ్రీసుదేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితివిు.మనమందరము ఒక్క ఆత్మను పానము చేసినవారమైతివిు.

మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితివిు.

ఎఫెసీయులకు 4:4
4. “శరీర మొక్కటే”, ఆత్మయు ఒక్కడే; ఆ ప్రకారమే మీ పిలుపువిషయమై యొక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి.

కొలస్సయులకు 3:15
15. క్రీస్తు అను గ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలు చుండ నియ్యుడి; ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి; మరియు కృతజ్ఞులై యుండుడి.

సహోదరులార, క్రీస్తు వారు తన స్వరక్తము ఇచ్చి కట్టిన "నా (క్రీస్తు) సంఘము(శరీరము") లో లేకుడ్డా
నీవు/నేను, బయట సంఘములులో ఉంటే "రక్షణ"లో ఉన్నటా...??
"సంఘము" ఆయన "శరీరము" - ఎఫెసీ 1:23
పరిశుద గ్రంధములో ఒక్క సంఘమును చూడగలము అదే "క్రీస్తు సంఘము" -- రోమ 16:16
మత్తయి 16:18 అపో.కార్య. 2:47; 20:28 రోమా 16:16 ఆలోచన చేయండి!!
► నీవు క్రీస్తు శరీరములోని అవయవమైయున్నావా? లేక
► క్రీస్తు శరీరము కానీ వాటిలో అవయవమైయున్నావో.... పరిక్ష చేసుకో వందనములు!!

ఎఫెసీయులకు 5:23
23. క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడైయున్నాడు.

(రక్షింపబడినవారు)క్రీస్తు సంఘములో యుందురు. ఎందుకనగా సంఘము రక్షణ పొందినవారితో కూడియున్నది.కనుక అంధకార సంబంధమైన పాపము నుండి రక్షింపబడుట మరియు సంఘములోనికి చేర్చబడుట ఈ రెంటికి మధ్య సంబంధము కలుగజేయునది క్రీస్తు రక్తము మాత్రమే. ఒకడు క్రీస్తు సంఘ సభ్యుడు కాకుండా రక్షణపొందుట అసాధ్యము.

1 పేతురు 2:24
24 మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసి కొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి.

రోమా 6:17,18
17 మీరు పాపమునకు దాసులై యుంటిరిగాని యే ఉపదేశక్రమమునకు మీరు అప్పగింపబడితిరో, దానికి హృదయపూర్వకముగా లోబడినవారై,
18 పాపమునుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి; ఇందుకు దేవునికి స్తోత్రము.
కొలొ స్సి3:1-4
1 మీరు క్రీస్తుతోకూడ లేపబడినవారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండియున్నాడు.
2 పైనున్న వాటిమీదనేగాని, భూసంబంధమైనవాటిమీద మనస్సు పెట్టుకొనకుడి;
3 ఏలయనగా మీరు మృతిపొందితిరి, మీ జీవము క్రీస్తుతోకూడ దేవునియందు దాచబడియున్నది.
4 మనకు జీవమై యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతోకూడ మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు.

నీవు పొందిన బాప్తిస్మము దేనిలోనికి ?

"into" అనగా "లోనికి" ఇంగ్లిష్ లో .

రోమా 6:3
3 క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా?

కృప మనకు బోధిస్తుంది

*THE DOCTRINE OF GRACE*-  *కృప యొక్క బోధ* (PART -1)

👉అనర్హులైనవారు పొందేది కృప
👉ఏ యోగ్యత లేనివారికి, తన విశేషమైన కనికరం చొప్పున, ఉచితంగా అనుగ్రహించేది కృప
👉 వాస్తవానికి మన పాపములను బట్టి మనం శిక్ష అనుభవించాలి
👉 కానీ.. క్రీస్తు మనపక్షంగా ఉండి మనం పొందవలసిన శిక్షను ఆయన శిలువలో అనుభవించాడు.
👉కృప ప్రత్యక్షమైనది
(తీతు 2:11)
👉యేసుక్రీస్తు ప్రతీ మనుష్యుని కొరకు మృతిబొందెను.
👉 *చావడానికి పుట్టిన వ్యక్తి యేసు*
వేరే ఉద్దేశ్యం లేదు. అందుకే మనుష్యుడై పుట్టాడు. (మత్త 20:28, యోహా10:11-18, హెబ్రి2:14-15; 1తిమో1:15; లూకా19:10; యోహాను 1:29; హెబ్రి 9:15)
👉  ప్రతీ మనుష్యుని కొరకు కృప ఉద్దేశ్యించబడింది. (హెబ్రి 2:8-9)
👉ఇంతకీ కృప ఏం చేస్తుంది..?

*1. కృప బోధిస్తుంది*
👉 *భక్తిహీనత, దురాశలు విసర్జించాలని,*
👉 *శుభప్రదమైన నిరీక్షణ కలిగి* (ఆయన వస్తాడు, నేను వెళ్తాను, ఆయనతో ఉంటాను)
👉 *స్వస్ధబుద్దితో, నీతితో, భక్తితో బ్రతకాలని బోధిస్తుంది.*
(తీతు 2:11-13)
👉మనుష్యుల సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీద దేవుని కోపం రగులుకొంటుంది (రోమా1:18)
👉దేవుని కోపాన్ని తప్పించుకోవడానికి దేవుని ఏర్పాటు కృప.
👉 *కృపలో ప్రవేశించాలనుకొంటే... భక్తిహీనతను విసర్జించాలి.*
👉లోపాన్ని దిద్దుకొనేది, సరిచేసుకొనేది భక్తి
👉దిద్దుబాటును అసహ్యించుకొనేవాడు భక్తిహీనుడు (కీర్త50:16)
👉తనలోపాన్ని కప్పిపెట్టుకునేవాడు, సమర్ధించుకొనేవాడు భక్తిహీనుడు ex:- ఆదాము పాపాన్ని కప్పి పెట్టుకున్నాడు.
👉దురాశ గర్భం ధరించి పాపమును కంటుంది. (యాకో1:14-15) *పాపమునకు తల్లి దురాశ*

👉 *కృపను అనుభవించాలనుకొనేవారు పాపపు పుట్టుకకు మూలమైన దురాశను విసర్జించాలి*
👉యూదా రాజు యోషీయా 8 సం॥రాలకే రాజై, 31 సం॥రాలపాటూ ఏలి, అనేక సంస్కరణలు, మంచి పనులు చేశాడు. (2దిన 34:1- )
👉అవి పైవేషమునకే కాని, పూర్ణహృదయంతో జరిగించలేదని దేవుడు కొట్టిపడేశాడు (యిర్మి3:6)
👉పై వేషాన్ని దేవుడు అంగీకరించడు.
👉 దురాశతో ఏ పని చేసినా కృపను అనుభవించలేవు

👉 *స్వస్ధబుద్దితో..* - బుద్దికి రోగం వస్తే... కృపను అనుభవించలేవు
👉 *నీతితో.,.*
👉 *భక్తితో...*
👉 దిద్దుబాటును ప్రేమించడం భక్తి, (కీర్త50:16)
👉 దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను ఇబ్బందిలో పరామర్శించడం భక్తి., "ఇబ్బందులలో పరామర్శించి, చేర్చుకోవడమే కానీ వారిపేరున బిసినెస్ చేయటం కాదు."
(యాకో 1:27; యెష58:6-8)
👉 యిహలోక మాలిన్యం అంటకుండా బ్రతకడం భక్తి, యోసేపులా...దానియేలులా...
👉 భోజనం వల్ల మాలిన్యం/అపవిత్రత అంటుకుంటుంది (దాని 1:5-8)
👉ఏవి తినవలసినవి..? ఏవి తినకూడనివి..? list దేవుడు కూడా చెప్పేశాడు (లేవి 11:1- ) రాజులభోజనాలలో...తినకూడనివి...అనే నిర్బంధం ఉండని కారణాన దానియేలు తిన నిరాకరించి మాలిన్యాన్ని తప్పించుకున్నాడు.

కృప ఏం చెయ్యాలి..? నీవు ఏం చెయ్యకూడదో చెప్తుంది...

కృప బోధించిన బోధను...నిర్లక్ష్యపెడితే నీ గతేమౌనో....వర్ణించలేము..


*THE DOCTRINE OF GRACE - కృప యొక్క బోధ (PART -2)*

*1. కృప బోధిస్తుంది*
*2. కృప రక్షిస్తుంది*

👉 మనము విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షించబడుదుము (ఎఫె 2:8; అపో 15:11)
👉 కృప బోధించిన బోధను నీవు అంగీకరిస్తే, అనుసరిస్తే..
కృప నిన్ను రక్షిస్తుంది. (అపో 11:14, 1కొరిం 15:2)
👉 కృప ఉచితమైనది. డబ్బుతో కొనలేనిది. డబ్బు పెట్టి కొనేది కాదు.
👉 ఈలోకంలో డబ్బు పెట్టికొనేవి  అనేకమైనవి ఉన్నాయి.
👉 రోమా పౌరసత్వాన్ని బహుద్రవ్యమిచ్చి సంపాదించుకున్న వ్యక్తులున్నారు (అపో 22:25-28)
👉 రక్షణ డబ్బుతో కొనేది కాదు.
👉 దేవుని రాజ్య పౌరసత్వం డబ్బుతో కొనగలిగేది కాదు.
👉 రక్షింపబడేవారు మాత్రమే దేవునిరాజ్యపౌరులై యుంటారు. ఇది కృప వలన కలిగినది.
👉 నీటిమూలము గానూ ఆత్మమూలము గానూ జన్మించినవారే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. (యోహా 3:5)
👉 *రక్షణ అనేది package*
రక్షణ single item కాదు. వాటిలో కొన్ని చూద్దాం..
👉 నీతిమంతులుగా తీర్చుతుంది. (తీతు 3:6-7)
👉 ఉగ్రత నుండి తప్పిస్తుంది. (రోమా 5:9)
👉 దేవునితో సమాధాన పరుస్తుంది. (రోమా 5:10)
👉 రక్షణ దేవుని వరము (ఎఫె 2:8)
👉 పరిశుద్దులుగా చేస్తుంది. (లూకా 1:76)
👉 రక్షణ పొందినవారు ఆనందము, నిష్కపటమైన హృదయం కలిగియుంటారు (అపో 2:47)
👉 రక్షణ నీకు శిరస్త్రాణముగా ఉపయోగపడుతుంది, (1ధెస్స5:8, ఎఫె 6:17)
👉 రక్షణ అనేది ఒకస్వాస్ధ్యం (హెబ్రి 1:14)
👉 ఆస్వాస్ధ్యం మనకొరకు పరలోకమందు భద్రం చేయబడియున్నది. (1పేతు 1:5)

👉 కృప బోధను అనుసరించి నీవు రక్షించబడ్డావో లేదో. పరిశీలించుకో..
👉ఇది నిత్యత్వానికి సంబంధించిన విషయం. 4 రోజులుండి పోయేది కాదు కృప అంటే..
👉ఇది ఉద్యోగం కాదు. రక్షణకు రిటైర్ మెంట్ ఉండదు
👉నీవు కృపను నిజంగా పొందావా..? కృప బోధను అనుసరించే రక్షణ పొందావా..?

*𒐰పరిశీలించుకో... సమయం ఉన్నప్పుడే సరిచేసుకో..* 🙏



*THE DOCTRINE OF GRACE - కృప యొక్క బోధ (PART -3)*

*1. కృప బోధిస్తుంది*
*2. కృప రక్షిస్తుంది*
*3. కృప హెచ్చిస్తుంది*

👉 *A. పూర్వకాలపు ప్రవక్తలందరి కంటే నిన్ను అధికముగా హెచ్చిస్తుంది.* (1పేతు 1:10)

👉 మరచిపోయిన కలను, కలయొక్క భావంను చెప్పగలిగిన దానియేలు కంటే నీవు గొప్పవాడివిగా హెచ్చిస్తుంది.
👉 యెషయా ప్రవక్త కంటే నీవు గొప్పవాడివిగా చేస్తుంది.
👉 కృప అనుగ్రహించిన భాగ్యం ఇది

👉 *B. దేవదూతల కంటే నిన్ను హెచ్చుగా హెచ్చిస్తుంది.* (1పేతు 1:12)

👉 దేవదూతలు ఈ కార్యములను తొంగిచూడగోరుచున్నారు.
👉 నీవు సామాన్యుడవైనా, దేవదూతలు observe చేసే స్ధాయి నీది.
👉 కృప - దేవదూతలను నీకు పరిచారకులను చేస్తుంది.
👉 కృప - దేవదూతలను నీకు సేవకులుగా appoint చేస్తుంది. (హెబ్రి 1:14)
👉 కృప నిన్ను ఎంతగా హెచ్చిస్తుందో నీవు అర్ధం చేసుకోవాలి.

*C. కాబట్టి కృప నుండి తప్పిపోకూడదు*  (హెబ్రి 12:15)

👉 చేదైన వేరు ఏదీ మొలవనీయకూడదు.
👉 కలవరపడకూడదు
👉తిరిగి అపవిత్రులు కాకూడదు
👉 ఏశావులా మన జేష్జత్వపు హక్కును అమ్మివేసుకోకూడదు.
👉కృపను జాగ్రత్తగా కాపాడుకోవాలి.

*మారుమనస్సు పొందే అవకాశం ఉన్నప్పుడే.. కృపను సద్వినియోగపరచుకో...*


*THE DOCTRINE OF GRACE - కృప యొక్క బోధ (PART -4)*

*1. కృప బోధిస్తుంది*
*2. కృప రక్షిస్తుంది*
*3. కృప హెచ్చిస్తుంది*

*4. కృప నిత్య భద్రతనిస్తుంది*

👉క్రైస్తవులు అన్యదేశాలలో చెదిరిపోయిన పరిస్ధితుల్లో...
👉అగ్ని వంటి మహాశ్రమను ఎదుర్కొనవలసిన విపత్కర పరిస్ధితులలో..
👉ఎదుర్కొనబోయే ఇబ్బందుల విషయంలలో..
👉హింస ప్రారంభమయ్యే రోజులలో...

👉కృప అపరిమితంగా విస్తరించి..
👉కృప అనుగ్రహించే నిత్య భద్రత,
👉కృప చేసే రక్షణా ఏర్పాటు,
👉ప్రతికూల పరిస్ధితుల్లో కూడా అనర్హులైనవారికీ ఎంతో దీవెనకరంగా ఉంటూ..
👉అత్యద్భుతంగా తన పాత్ర పోషిస్తుంది కృప..

1పేతు1:3-5
👉ఆయన కృప మనలను మరలా జన్మింపజేస్తుంది
👉కృప ద్వారా రక్షింపబడిన మనకు స్వాస్ధ్యం ఉన్నది.
👉 ఆ స్వాస్ధ్యం మన పేరుమీద పరలోకమందు భద్రంగా ఉంచబడియున్నది.
👉 కృప - తేజోవాసులైన పరిశుద్దుల స్వాస్ధ్యంలో పాలివారముగా చేస్తుంది(కొల1:9-12)

👉 *తేజోవాసులు 2 రకాలు*

*1. దేవదూతలు* -
వీరు పరలోకనివాసులు,
తేజంలో నివాసం చేస్తారు.
వీరికి స్వాస్ధ్యం ఉండదు.
వీరు దూతలు మాత్రమే.
వీరు కుమారులు కాదు.
సేవకులు మాత్రమే. అనగా కూలివాళ్ళు.
(హెబ్రి 1:7)

*2. విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడినవారు.*
వీరు కుమారులు.
వీరు స్వాస్ధ్య కర్తలు.
ఆస్ధికి వారసులు. తండ్రి ఆస్ధిలో భాగమున్నవారు. హక్కుదారులు. నీవు బిడ్డవైతే నమ్మకముంటుంది. బిడ్డను కాదేమో అనుకునేవారికి నమ్మకముండదు.
వీరు కృప వల్ల తేజోవాసులైనారు,
గొర్రెపిల్లయొక్క జీవగ్రంధమందు పేరు వ్రాయబడినవారు (ప్రక13:8)

👉 ఆత్మ మన స్వాస్ధ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. (ఎఫె 1:3) (Advance payment చేసేశాడు)
👉 ఈ స్వాస్ధ్యంను ఎవరూ occupy చేయలేరు. దోచుకోలేరు. దురాక్రమణకు గురికాదు
👉 ఇపుడు నేను భూనివాసులందరి కంటే ధనవంతుణ్ణి.
👉లోకంలో ఉండేవారికి ఐశ్వర్యం ఉండొచ్చు. కానీ నాకు మహిమైశ్వర్యం ఉంది. (ఎఫె 1:15)
👉 ఇది కృప వలన కలిగినది.
👉 మాటలతో వర్ణించలేనిది కృప. అటువంటి అనుభవాన్ని కలుగజేసేది కృప.
👉అనుమానం వద్దు
(లూకా 12:29)

👉కృప యొక్క జీవితాన్ని అనుభవించకుండా ఏం కృప..?

👉కృప అనుగ్రహించే నిత్యభద్రత నీకుండగా...
దేనిగూర్చి నీ దిగులు..?
దేనికోసం నీ చింత..?
దేనికోసం నీ తాపత్రయం..?

👉 *నీవు భూనివాసివి కాదు. తేజోవాసివి. కృప వలన కలిగిన నిత్య భద్రత ఇది.* 🙏🙏🙏



*THE DOCTRINE OF GRACE - కృప యొక్క బోధ (PART -5)*

*1. కృప బోధిస్తుంది*
*2. కృప రక్షిస్తుంది*
*3. కృప హెచ్చిస్తుంది*
*4. కృప నిత్య భద్రతనిస్తుంది*

*5. కృప విమోచిస్తుంది*

👉విమోచన అనగా విడుదల
👉బంధింపబడిన స్ధితినుండి విడుదల
👉 వెలచెల్లించి విడిపించుట
👉వెలకట్టలేని.. అమూల్యమైన, నిర్ధోషమైన రక్తంతో విడిపించుట

ఇది కృప ద్వారా మాత్రమే సాధ్యమౌతుంది.

విమోచనా మూలాలు 5.
కృప 5 రకాలైన వాటినుండి మనలను విడుదల చేస్తుంది.

*1.ఆయన రక్తం వలన మన అపరాధములనుండి విడుదల* (ఎఫె 1:7)
👉మానవులందరూ పాపులే.
👉పాపము వలన వచ్చు జీతం మరణం
👉ఈ మరణం రెండవ మరణానికి దారితీస్తుంది.
👉రెండవ మరణంలో నీవు చేసిన పాపానికి న్యాయమైన త్రాసుద్వారా శిక్ష ఖరారు చేయబడుతుంది.
👉అమలు చేయబడుతుంది.
👉ఇటువంటి పరిస్ధితుల్లో, నిన్ను శిక్ష నుండి తప్పించి,
👉ఆ శిక్షాభారాన్ని యేసు తనమీద వేసుకొని,
👉మన పాపమునకు పరిహారంగా ఆయనే శిలువలో రక్తం కార్చాడు.
👉తద్వారా మన పాపంనకు ప్రాయశ్చితం చేశాడు. (1యోహా4:9)
👉మన పాపాలకు ఆయన శిక్ష అనుభవించడం ద్వారా మనము ఎన్నడూ పాపం చేయని వ్యక్తిగా తీర్చబడుతున్నాము. 
👉కృప వలన కలిగినది ఇది.

*2. సమస్తమైన దుర్నీతినుండి విమోచిస్తుంది* (తీతు2:14)

*3. అంధకారసంబంధమైన అధికారం నుండి విమోచిస్తుంది* (కొల1:13)
👉అధికార మార్పిడి జరగాలి
👉పాపం నీ జీవితంలో పెత్తనం చేయని పరిస్ధితి రావాలి.
👉ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విడుదలైనా అది విడుదల కాదు.
👉ఫరో తన అధికారం నుండి విడుదల అగుటకు అంగీకరించినా అది విడుదల కాదు,
👉ఎర్రసముద్రం దగ్గర వరకూ వచ్చినా విడుదలైనట్టు కాదు.
👉 ఇశ్రాయేలీయులు ఎర్రసముద్రాన్ని దాటినా.. విడుదలైనట్టు కాదు.
👉 ఎర్రసముద్రం మధ్యలో ఐగుప్తీయులందరూ చనిపోవడం, వారిలో ఒక్కడైననూ బ్రతికి బయటపడక, అందరూ సమూలనాశనం కావడంతో పరిపూర్ణ విడుదల జరిగింది.
👉 ఆ తరువాత ఐగుప్తీయులు ఇక మరలా ఇశ్రాయేలీయుల జోలికి రాలేదు. అది విడుదల
👉 అంధకారసంబంధమైన అధికారం నుండి విడుదల పొందడం అంటే అది.
👉 విమోచన అనే పదానికి అర్ధం తెలియకుండా, అర్ధరహితంగా ఉపయోగించకూడదు.

*4. ధర్మశాస్త్రం నుండి విడుదల* (గల4:5-6)
👉ధర్మశాస్త్రము వలన ఏ మనుష్యుడూ నీతిమంతుడుగా తీర్చబడలేకపోయాడు.
👉క్రొత్తనిబంధన సంబంధులు ధర్మశాస్త్రం నుండి విమోచింపబడినవారు
👉ధర్మశాస్త్రము ఇకమీదట పెత్తనం చేయదు.

*5. ప్రస్తుత దుష్టకాలమునుండి విమోచన* (గల1:4)
👉ప్రస్తుత దుష్టకాల నాగరికత నుండి,
👉ఆచార వ్యవహారముల నుండి,
👉అలవాట్లనుండి,
👉పద్దతులనుండి, విమోచింపబడాలి.
👉వాటి ప్రభావం మనపై ఏమాత్రం పనిచేయకూడదు.
👉క్రైస్తవులు క్రొత్త నాగరికత గలవారు.
👉నవీన స్వభావం ధరించుకొనేవారు.
👉నూతన సృష్టి,

యేసు మరణం ఈ 5 కోణాల్లోనున్న సమస్త కట్టుబాట్ల నుండి విడుదల చేస్తుంది.

కృప వలన జరిగిన కార్యమిది.


*THE DOCTRINE OF GRACE - కృప యొక్క బోధ (PART -6)*

*1. కృప బోధిస్తుంది*
*2. కృప రక్షిస్తుంది*
*3. కృప హెచ్చిస్తుంది*
*4. కృప నిత్య భద్రతనిస్తుంది*
*5. కృప విమోచిస్తుంది*

*6.కృప బలపరుస్తుంది*

👉 క్రీస్తు యేసు నందున్న *కృప చేత బలవంతుడవు కమ్ము* (2తిమో 2:1)

👉కృప ఏ యే విషయాలలో, ఎప్పుడెప్పుడు బలపరుస్తుంది..? ఆలోచిద్దాం..!

👉 పౌలు శరీరంలో ఒకముల్లు..  (2కొరింధి 12:7-10)
👉పౌలు అత్యధికముగా హెచ్చిపోకుండుటకు..
👉 నలగగొట్టుటకు..
👉పౌలు అది తొలగిపోవుటకు ముమ్మారు ప్రార్ధించినా..

*నా కృప నీకు చాలును*

👉బలహీనతలలో బలపరిచే కృప
👉బలహీనతలలో శక్తివంతులుగా చేసే కృప
👉బలహీనతలలో మన అతిశయకారణం కృప
👉ఎప్పుడు బలహీనులమో అప్పుడు బలవంతులను చేసే కృప
👉నిందలలో, ఇబ్బందులలో, హింసలలో, ఉపద్రవాలలో సంతోషానికి కారణమయ్యే కృప (2కొరిం 12:10)

👉 పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించిన దేవుడు..
👉 పౌలు శరీరానికి తగిలిన చేతిగుడ్డలైననూ, నడికట్లైనా రోగులయొద్దకు తెచ్చినపుడు రోగములు వారిని విడిచెను. దయ్యములు కూడా వదలిపోయెను. (అపో 19:11-12)
👉అటువంటి పౌలుతో దేవుడు చెప్పిన మాట *నాకృప నీకు చాలు*

👉సరిపడునంత కృప
👉సమృద్దియైన కృప
👉చాలినంత కృప
👉తృప్తిని కలిగించే కృప
👉బలపరిచే కృప

*కృప మనలను బలపరుస్తుంది* 🙏*


*THE DOCTRINE OF GRACE - కృప యొక్క బోధ (PART -7)*

*1. కృప బోధిస్తుంది*
*2. కృప రక్షిస్తుంది*
*3. కృప హెచ్చిస్తుంది*
*4. కృప నిత్య భద్రతనిస్తుంది*
*5. కృప విమోచిస్తుంది*
*6.కృప బలపరుస్తుంది*

*7. కృప మనలను ధనవంతులను చేస్తుంది*

👉మీరు మన ప్రభువైన *యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా..*ఆయన ధనవంతుడై యుండియూ
*మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావలెనని*.. మీ నిమిత్తము దరిద్రుడాయెను. (2కొరిం8:9)

👉ఈలోక విషయంలో దరిద్రులైన వారిని..
*విశ్వాసవిషయంలో భాగ్యవంతులు గానూ..*
👉తాను వాగ్ధానం చేసిన *రాజ్యమునకు వారసులుగా* చేసెను. (యాకో 2:5)
👉 దేవుని రాజ్య వారసులు ఆస్ధికి వారసులు. వారు పేదవారు కాదు. దేవుని రాజ్యంలో పేదలు ఉండరు.
👉మనము పిల్లలమైతే వారసులము.
మనము దేవుని వారసులం.
క్రీస్తువారసులం. (రోమా 8:17)
*వారసులు పేదలు కారు*

👉 మన తండ్రియింట అనేక నివాసాలు కలవు. *నేనుండు స్ధలములో మీరునూ ఉండులాగున..,*(యోహా 14:2-3)

👉 ఈలోకంలో ధనవంతులైన వారు పరలోకంలో one inch  స్ధలం కొనలేరు.
👉 బంగారు వీధులలో తిరిగే రేంజ్ నీది.
👉 బలం, శక్తి, జ్ఞానం, ధనంతో దేవుని రాజ్యమునకు వారసులు కారు. కాలేరు.
👉కృప నిన్ను ధనవంతులను చేస్తుంది.
👉కృప నిన్ను దేవుని రాజ్యమునకు వారసులను చేస్తుంది.

నీ పాపములు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడేమో జాగ్రత్త

*దేవుడు మనపాపములను తిరిగి జ్ఞాపకం చేసుకొనే అవకాశం ఉంది. జాగ్రత్త*

పాపక్షమాపణ దేవుడు మనకు పెట్టిన భిక్ష

క్రొత్తనిబంధనలో ప్రవేశించినవారికీ మాత్రమే ఈ వాగ్దానం సొంతం అవుతుంది

Hebrews(హెబ్రీయులకు) 8:10,11,12

10.ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటివారితో *నేను చేయబోవు నిబంధన* యేదనగా,వారి మనస్సులో నా ధర్మవిధులను ఉంచెదను వారి హృదయములమీద వాటిని వ్రాయుదును నేను వారికి దేవుడునై యుందును వారు నాకు ప్రజలై యుందురు.
11.వారిలో ఎవడును ప్రభువును తెలిసికొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశముచేయడు వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరును నన్ను తెలిసికొందురు.
12.నేను వారి *దోషముల విషయమై దయగలిగి* *వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసికొననని* ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

నేను *దయ కలిగి* వారి పాపములు జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు దేవుడు
జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు గానీ.. మర్చిపోతాను అనడం లేదు..

ఆ పాపముల జోలికి ఇక నీవు వెళ్ళకూడదు
మరలా రేపకూడదు
దేవునికీ నీ గత పాపములు జ్ఞాపకం చేయకూడదు

నీవు నీ పనులను బట్టి  దేవునికి నీపాపాలు జ్ఞాపకం చేసే అవకాశం ఉంది

అదిరెండురకాలుగా నీవు ఆయనకు జ్ఞాపకం చేయవచ్చు..

*1. నీయెడల అపరాధం చేసినవారిని నీవు క్షమించలేకపోతే...!!??*

Matthew(మత్తయి సువార్త) 18:32,33,34,35

32.అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించిచెడ్డ దాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని;
33. *నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసియుండెను* గదా అని వానితో చెప్పెను.
34.అందుచేత వాని యజమానుడు కోపపడి, తనకు అచ్చియున్నదంతయు చెల్లించు వరకు బాధ పరచువారికి వాని నప్పగించెను.
35.మీలో ప్రతివాడును *తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపనియెడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీయెడల చేయుననెను.*

క్రైస్తవ జీవితం క్షమాభిక్షతో కూడిన జీవితం
క్షమించే గుణం లేనివాడు క్రైస్తవుడు కాలేడు
క్షమించే స్వభావం నీకు లేకపోతే నీవు క్రైస్తవ జీవితం జీవించలేవు

నీవు నీ సహోదరుని క్షమించలేకపోతే.. నీ తండ్రియూ నీ పాపములు క్షమించడు. క్షమించినా నీ క్రియలవలన ఆయనకు తిరిగి జ్ఞాపకం తెచ్చినవాడవగుదువు.

*2, బుద్దిపూర్వకముగా పాపము చేస్తే..??*

Hebrews(హెబ్రీయులకు) 10:26,27

26.మనము *సత్యమునుగూర్చి అనుభవజ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినయెడల పాపములకు బలి యికను ఉండదు* గాని
27.న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును.

దేవుడు పాపాలను నీ పాపాలను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు
నీవు నీ ప్రవర్తనను బట్టి ఆయనకు తిరిగి జ్ఞాపకం చేయకు..

చెబుతారు కానీ చేయరు

*వారు చెప్పుదురే గాని చేయరు. మత్తయి-23:3* """"""""""""""""...